గుర్తు తెలియని వాహనం ఢీకొని గేదె మృతి
పున్నమి: హయత్ నగర్ మండలం: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గేదె మృతి చెందిన ఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 2:54 గంటలకు డయల్-112 ద్వారా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సూర్యవంశి కాలనీ కమాన్ ఎదురుగా ఉన్న సర్వీస్ రోడ్డుకు చేరుకున్నారు. అక్కడ గేదె మృతి చెంది ఉండగా, మెడ, మూతి భాగాల్లో తీవ్ర గాయాలు, రక్తస్రావం ఉన్నట్లు గుర్తించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతోనే గేదె మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై హయత్‌నగర్ పోలీసులు Cr.No.1450/2026, U/s 325 BNS కింద కేసు నమోదు చేశారు. వెటర్నరీ డాక్టర్ ద్వారా మృతి చెందిన గేదెకు పోస్టుమార్టం నిర్వహించారు. అయితే గేదె యజమాని వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదు. యజమాని లేదా ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు.


