బిజెపి మండల అధ్యక్షులు జడపల్లి మహేష్
కొండాపురం మండల బీసీ బాలుర హాస్టల్‌ను మండల బిజెపి అధ్యక్షులు జడపల్లి మహేష్ గారు సందర్శించి, విద్యార్థులతో మరియు వారి పేరెంట్స్ తో కలిసి భోజనం చేశారు. అనంతరం హాస్టల్‌లోని సమస్యలను పరిశీలించి ఆయన మాట్లాడారు.
మౌలిక వసతులు కొరత హాస్టల్‌లో సరైన టాయిలెట్ సౌకర్యాలు, చుట్టూ భద్రతనిచ్చే ప్రహరీ గోడ, విద్యార్థులకు సరిపడా గదులు లేకపోవడం విచారకరం.
అధికారుల దృష్టికి సమస్యలు: విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, తగిన నిధులు మంజూరయ్యేలా ఒత్తిడి తెస్తాం.
బిజెపి హామీ: పేద, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు మెరుగైన వసతులు అందించడమే లక్ష్యంగా, హాస్టల్ అభివృద్ధికి బిజెపి నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.



