ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్)
ఏదులాపురం మున్సిపాలిటీలోని 22, 23వ వార్డులైన సాయిగణేష్‌నగర్, ఇందిరమ్మ కాలనీల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్జి రెడ్డి జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్, మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌తో కలిసి శుక్రవారం మార్నింగ్ వాక్ నిర్వహించారు.
ఈసందర్భముగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్పా రెడ్డి మాట్లాడుతు పార్కుల అభివృద్ధి, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తీగల సమస్యలను పరిశీలించి, యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో శాశ్వత డ్రైనేజీ, తుమ్మ చెట్ల తొలగింపు, తాగునీటి సరఫరా మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పార్కుల పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏదులాపురం సమగ్ర అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.100 కోట్లు మంజూరు చేశారని, రాష్ట్రంలోనే నంబర్‌వన్ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని శ్రీనివాస్తె రెడ్డి లిపారు.


