ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 10 (పున్నమి ప్రతినిధి). ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మనుబోలు మండల యాక్ట్ రిపోర్టర్ వాకా రమేష్ ఉత్తరక్రియలకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగలో జరిగిన కార్యక్రమంలో రమేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రమేష్ కుమార్తె, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. జర్నలిస్టుగా ఎంతో ఉత్సాహంగా పనిచేసే రమేష్ చిన్నవయస్సులోనే మృతి చెందడం బాధాకరమన్నారు. రమేష్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సోమిరెడ్డి పేర్కొన్నారు.

యాక్ట్ రిపోర్టర్ రమేష్‌కు సోమిరెడ్డి నివాళి