15 ఏళ్లుగా నిరంతర సేవా ప్రస్థానం… వృక్ష ఫౌండేషన్ స్థాపించి లెక్కకు మిక్కిలి సేవా కార్యక్రమాలు!
విశాఖపట్నం జిల్లా,ఆనందపురం:( పున్నమి ప్రతినిధి ) ఆగస్టు 10 :
సేవ చేయాలంటే పదవి అవసరం లేదు… ప్రజల కోసం ఏదైనా చేయాలనే సంకల్పం ఉంటే చాలు! ఈ స్ఫూర్తితో గత 15 ఏళ్లుగా నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు కాకర సురేష్ కుమార్.
సమాజ సేవే లక్ష్యంగా “వృక్ష ఫౌండేషన్”ను స్థాపించి, దాని ద్వారా లెక్కకు మిక్కిలి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పేదలు, నిరుపేద విద్యార్థులు, ఆపదలో ఉన్న కుటుంబాలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తన వంతు సహాయాన్ని అందిస్తూ మానవత్వానికి ప్రతిరూపంగా నిలుస్తున్నారు.
వృక్ష ఫౌండేషన్… సేవకు వేదిక!
విద్య, వైద్యం, రక్తదానం, పేదలకు సహాయం, విద్యార్థులకు విద్యా సామగ్రి, మోటివేషన్ కార్యక్రమాలు, కెరీర్ గైడెన్స్, ఉచిత వైద్య శిబిరాలు, కంటి వైద్య శిబిరాలు వంటి అనేక సేవా కార్యక్రమాలను వృక్ష ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నారు.
ప్రత్యేకంగా పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పుస్తకాలు, పరీక్ష సామగ్రి, విద్యా సహాయం అందిస్తూ వారి చదువుకు భరోసాగా నిలుస్తున్నారు.
సొంత నిధులతో… ప్రచారానికి దూరంగా!
సేవా కార్యక్రమాల్లో ప్రత్యేకత ఏమిటంటే… ఇతరులపై ఆధారపడకుండా తన సొంత నిధులతోనే అనేక కార్యక్రమాలను నిర్వహించడం.
ప్రచారం కోసం కాకుండా…
ప్రజల కోసం!
పేరుకోసం కాకుండా…
పేదల కోసం!
అవార్డుల కోసం కాకుండా…
ఆపదలో ఉన్నవారి కోసం!
అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నారు.
కోవిడ్ సమయంలోనూ ఆగని సేవా ప్రస్థానం!
కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలోనూ సురేష్ కుమార్ సేవా కార్యక్రమాలను ఆపలేదు. నెలరోజుల పాటు నిరుపేదలు, బాటసారులకు భోజన ఏర్పాట్లు చేయడంతో పాటు అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
అవార్డులు ఎన్నో… లక్ష్యం మాత్రం ఒక్కటే!
15 ఏళ్ల సేవా ప్రస్థానంలో గేమ్ చేంజర్ విన్నర్ అవార్డుతో పాటు ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు.
అయితే అవార్డులను తన లక్ష్యంగా ఎప్పుడూ భావించరు.
“ఒకరి కష్టాన్ని తగ్గించడం…
ఒక విద్యార్థి భవిష్యత్తుకు బాట వేయడం…
ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం…
అదే నాకు నిజమైన అవార్డు!”
అనే నమ్మకంతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
యువతకు ఆదర్శంగా… కొత్త తరహా సేవా నాయకత్వం!
నేటి యువతకు సేవా స్ఫూర్తిని అందిస్తూ, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలనే సందేశాన్ని తన ఆచరణ ద్వారా చూపిస్తున్నారు.
వెల్లంకి గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు కాకర రమణ గారి కుమారుడైన కాకర సురేష్ కుమార్, తండ్రి నుంచి వచ్చిన ప్రజాసేవా స్ఫూర్తిని తనదైన శైలిలో కొనసాగిస్తూ సమాజానికి అండగా నిలుస్తున్నారు.
సేవే శ్వాస… సమాజమే కుటుంబం!
యువతకు ఆదర్శం… కాకర సురేష్ కుమార్
వృక్ష ఫౌండేషన్ ద్వారా లెక్కకు మిక్కిలి సేవా కార్యక్రమాలు…
15 ఏళ్లుగా ప్రజాసేవే పరమావధిగా…
ప్రచారం కోసం కాదు… ప్రజల కోసం!
అవార్డుల కోసం కాదు… ఆపదలో ఉన్నవారి కోసం!
మాటల్లో కాదు… చేతల్లో సేవ!


