విశాఖపట్నం, ఆగస్టు 2 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వీడ్కోలు పలికారు. విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తిరుగు ప్రయాణమవుతున్న సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి వీడ్కోలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.



