Thursday, 10 September 2026
  • Home  
  • డీజే నిర్వాహకులకు ఎస్సై బిట్ల పెర్సిస్ సూచనలు
- నిర్మల్

డీజే నిర్వాహకులకు ఎస్సై బిట్ల పెర్సిస్ సూచనలు

గణేశ్ ఉత్సవాల్లో పరిమిత శబ్దంతో డీజేలు నిర్వహించాలి ముథోల్, సెప్టెంబర్ 10 (పున్నమి ప్రతినిధి ): రానున్న గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యులు, చిన్నారులతో కలిసి ఆనందంగా జరుపుకునేలా డీజే నిర్వాహకులు నిబంధనలు పాటించాలని ముథోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ సూచించారు. ఈ మేరకు డీజే నిర్వాహకులను మండల కేంద్రమైన ముథోల్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పలు సూచనలు చేశారు. మహారాష్ట్రకు చెందిన అధిక శబ్దం చేసే డీజే వ్యవస్థలను ప్రోత్సహించవద్దని డీజేల్లో అధిక సంఖ్యలో ప్రెషర్ మిడ్‌లు ఏర్పాటు చేసి శబ్ద తీవ్రతను పెంచవద్దని సూచించారు. అధిక శబ్దం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తి, ఆనందంతో పాటు ప్రజల ఆరోగ్యం, ప్రశాంతతకు ప్రాధాన్యం ఇస్తూ గణేశ్ ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. పోలీసుల సూచనలు, నిబంధనలకు అనుగుణంగా డీజేలను నిర్వహించి ఉత్సవాలను సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు.

గణేశ్ ఉత్సవాల్లో పరిమిత శబ్దంతో డీజేలు నిర్వహించాలి

ముథోల్, సెప్టెంబర్ 10 (పున్నమి ప్రతినిధి ):

రానున్న గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యులు, చిన్నారులతో కలిసి ఆనందంగా జరుపుకునేలా డీజే నిర్వాహకులు నిబంధనలు పాటించాలని ముథోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ సూచించారు. ఈ మేరకు డీజే నిర్వాహకులను మండల కేంద్రమైన ముథోల్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పలు సూచనలు చేశారు. మహారాష్ట్రకు చెందిన అధిక శబ్దం చేసే డీజే వ్యవస్థలను ప్రోత్సహించవద్దని డీజేల్లో అధిక సంఖ్యలో ప్రెషర్ మిడ్‌లు ఏర్పాటు చేసి శబ్ద తీవ్రతను పెంచవద్దని సూచించారు. అధిక శబ్దం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తి, ఆనందంతో పాటు ప్రజల ఆరోగ్యం, ప్రశాంతతకు ప్రాధాన్యం ఇస్తూ గణేశ్ ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. పోలీసుల సూచనలు, నిబంధనలకు అనుగుణంగా డీజేలను నిర్వహించి ఉత్సవాలను సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.