ముథోల్, సెప్టెంబర్ 10 (పున్నమి ప్రథినిది ):మండల కేంద్రమైన ముథోల్‌లో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, పేదలు, రైతుల హక్కుల కోసం చాకలి ఐలమ్మ సాగించిన పోరాటాన్ని నాయకులు గుర్తు చేసుకున్నారు. ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్న యాదవ్, బీజేపీ మండల అధ్యక్షుడు కోరిపోతన్న, మదన్మోరే, రజక సంఘం ప్రతినిధులు నర్సయ్య, గంగాధర్, నారాయణ, జగన్నాథ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.



