Friday, 2 October 2026

Tag: జనగామ

జనగాం

డాక్టర్ కల్నల్ బిక్షపతి తో మార్యాదపూర్వకంగా కలిసిన టిఆర్పి జిల్లా నాయకులు

జనగామ, ఆగష్టు 21,పున్నమి జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా నియోజకవర్గ ఇంచార్జ్‌గా, ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించబడిన అనంతరం *డా. కల్నల్ మాచర్ల భిక్షపతి తో తొలిసారి మర్యాదపూర్వకంగా కలిసి జనగామ జిల్లా నాయకులు చిర్ర వీరస్వామి,పాలకుర్తి యాకన్న శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా *అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్* గారి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం, నియోజకవర్గంలో సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడం, ప్రజా సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ, పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లడం వంటి పలు అంశాలపై చర్చించారు. *జనగామ నియోజకవర్గంలో టీఆర్పీ పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని నాయకులు సంకల్పించారు.*

జనగాం

కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ లో పెండింగ్ భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయాలి :రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

పెండింగ్ భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి : —రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ———————————– జనగామ, ఆగష్టు 21,పున్నమి జిల్లా ప్రతినిధి : భూసేకరణ కోసం రూ. 2,800 కోట్లు విడుదలకు ముఖ్యమంత్రి ఆమోదం, కొత్త ఆయకట్టు సృష్టించేలా భూసేకరణ, పునరావాస పనుల్లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్ భూసేకరణపై సమీక్ష నిర్వహించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి* రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల పనులు సజావుగా కొనసాగేందుకు ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం, హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్ భూసేకరణపై *రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి* వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ఈ వీడియో సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో *మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి* మాట్లాడుతూ.. నీటిపారుదల ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తయ్యేందుకు పెండింగ్ భూసేకరణను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పెండింగ్ భూసేకరణ కోసం ప్రభుత్వం వెంటనే రూ. 2,800 కోట్లు విడుదల చేసిందని, ఇందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. కొత్త ఆయకట్టు సృష్టించేందుకు వీలుగా పెండింగ్ భూసేకరణ, పునరావాస పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. భూసేకరణకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నందున ఎక్కడా జాప్యం లేకుండా ప్రక్రియను పూర్తి చేసి, ప్రాజెక్టుల పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నీటిపారుదల శాఖ ఎస్ఈ సీతారాం, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

డ్రాగన్ ఫ్రూట్స్ సాగుతో రైతులు అధిక ఆదాయం పొందేలా ప్రోత్సహించాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

డ్రాగన్ ఫ్రూట్ సాగుతో రైతులు అధిక ఆదాయం పొందేలా ప్రోత్సహించాలి ————————————————————— జనగామ, ఆగష్టు 21,పున్నమి జిల్లా ప్రతినిధి ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్న రైతును అభినందించిన కలెక్టర్ నర్మెట్ట మండలంలోని గుంటూరుపల్లి గ్రామంలో రైతు సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంటను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈ సందర్బంగా మాట్లాడుతూ డ్రాగన్ ఫ్రూట్ సాగుతో రైతులు అధిక ఆదాయం పొందేలా ప్రోత్సహించాలని అన్నారు . జిల్లాలోని నర్మెట్ట మండలం, గుంటూరుపల్లి గ్రామంలో *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* పర్యటించి, *రైతు వెలంగన్ రెడ్డి* సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంటను పరిశీలించారు. రైతు మూడు ఎకరాల విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్‌ను ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్న విధానాన్ని *కలెక్టర్* క్షేత్రస్థాయిలో పరిశీలించి, సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డ్రాగన్ ఫ్రూట్ తోటలో మొక్కల పెరుగుదల, పూత వచ్చే విధానం, పంట దిగుబడి, సాగు ఖర్చులు, మార్కెట్ ధరలు, తదితర అంశాలపై *కలెక్టర్* రైతుతో వివరంగా మాట్లాడారు. పంట సాగుకు ప్రభుత్వం నుంచి అందిన సబ్సిడీ ఎంత, సబ్సిడీ ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను ఏ సైజులో కట్ చేస్తారు, కత్తిరింపు విధానం ద్వారా మొక్కల పెరుగుదలను ఎలా నియంత్రిస్తున్నారు, కలుపు మొక్కలు రాకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అనే అంశాలపై కూడా ఆరా తీశారు. తోటలో ఏర్పాటు చేసిన డ్రిప్‌ ఇరిగేషన్‌ వ్యవస్థ పనితీరును కూడా పరిశీలించి, మొక్కలకు అవసరమైన మేరకు నీటిని అందించే విధానం, నీటి వినియోగ సామర్థ్యం, తదితర వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు. అలాగే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకు పూత ఎలా వస్తుంది, పూత వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు కాయలు కోతకు వస్తాయి, ప్రస్తుతం పంటకు మార్కెట్‌లో లభిస్తున్న ధర ఎంత అనే విషయాలపై *కలెక్టర్* రైతుతో చర్చించారు. ఆర్గానిక్ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ, ఆధునిక సాగు విధానాలను అనుసరిస్తున్న *రైతు వెలంగన్ రెడ్డి* అనుభవాలను *కలెక్టర్* ఆసక్తిగా తెలుసుకున్నారు. తక్కువ నీటి వినియోగంతో సాగు చేయగల, అధిక విలువ కలిగిన ప్రత్యామ్నాయ పంటలను రైతులు స్వీకరించేలా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఉద్యాన పంటలు, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. సాగులో డ్రిప్‌ ఇరిగేషన్‌, సేంద్రియ పద్ధతులు, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ పరిశీలనలో డీఏఓ అంబికా సోనీ, ఇతర సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

రైతులు శాస్త్రియ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంభించాలి –జిల్లా కలెక్టర్

రైతులు శాస్త్రీయ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి –జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ———————————————————– జనగామ, ఆగష్టు 20,పున్నమి జిల్లా ప్రతినిధి : పంటల సాగులో భూసార పరీక్షలు, నీటి వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి, నర్మెట్ట మండలంలోని నర్మెట్ట గ్రామంలో మిర్చి, కందులు, కూరగాయల పంటలను పరిశీలించిన కలెక్టర్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ రైతులు శాస్త్రీయ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని, గురువారం, జిల్లాలోని నర్మెట్ట మండలం, నర్మెట్ట గ్రామంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* పర్యటించి, రైతులు సాగు చేస్తున్న వివిధ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటల సాగు విధానం, నీటి వసతి, డ్రిప్‌ సౌకర్యం, భూసార పరిస్థితులు, తెగుళ్ల నివారణ, పంటల ద్వారా వస్తున్న ఆదాయం, తదితర అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా *రైతు భిక్షపతి* సాగు చేస్తున్న మిర్చి పంటను *కలెక్టర్* పరిశీలించారు. ఒక ఎకరంలో సాగు చేస్తున్న మిర్చి పంటలో డ్రిప్‌ సౌకర్యం, మొక్కల ఎదుగుదల, పంట ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. పంటకు సోకుతున్న తెగుళ్ల వివరాలను రైతును అడిగి తెలుసుకున్న *కలెక్టర్*, తెగుళ్లు, వ్యాధులను ముందుగానే గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. పంటలపై అధికంగా రసాయన మందుల వినియోగం తగ్గించి, సాధ్యమైనంత వరకు ప్రకృతి ఆధారిత, సహజ పద్ధతుల్లో తెగుళ్ల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. నేల ఆరోగ్యం దెబ్బతినకుండా భూమి సారాన్ని కాపాడే విధంగా సేంద్రియ, జీవ ఆధారిత ఇన్‌పుట్‌ల వినియోగాన్ని ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. పంటలకు అవసరమైన పోషకాలు, భూమి స్వభావాన్ని అంచనా వేసేందుకు క్రమం తప్పకుండా భూసార పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. అదే విధంగా రైతు వద్ద ఉన్న బోరు బావుల నీటి లభ్యత, సాగునీటి పరిస్థితి, డ్రిప్‌ ద్వారా నీటి వినియోగం, తదితర వివరాల గురించి *కలెక్టర్* ఆరా తీశారు. తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించేలా సూక్ష్మ నీటిపారుదల విధానాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. పంటల సాగు NRF పథకం కింద చేపడుతున్నారా? లేదా? అనే వివరాలను కూడా అధికారులను, రైతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కూరగాయల పంటలను కూడా *కలెక్టర్* పరిశీలించారు. పంటలకు పెట్టుబడి ఎంత అవుతోంది? దిగుబడి ఎంత వస్తోంది? మార్కెట్‌లో ధరలు ఎలా ఉన్నాయి? పంట ద్వారా రైతుకు లభిస్తున్న ఆదాయం ఎంత? అనే అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం *రైతు వెంకట్ రెడ్డి* సాగు చేస్తున్న మూడు ఎకరాల కందుల పంటను *కలెక్టర్* పరిశీలించారు. పంట ఎదుగుదల, మొక్కల ఆరోగ్యం, నీటి వినియోగం, భూమి పరిస్థితి, తదితర అంశాలను పరిశీలించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంటలపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున భూసార పరీక్షలు నిర్వహించి, నేలలోని పోషకాల స్థాయిని తెలుసుకుని, దానికి అనుగుణంగా ఎరువులు, పోషకాలను వినియోగించాలని సూచించారు. వాతావరణ మార్పులు వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక, సాగు పద్ధతులు, నీటి యాజమాన్యం, తెగుళ్ల నియంత్రణలో శాస్త్రీయ విధానాలను పాటించాలని *కలెక్టర్* పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి అవసరమైన సాంకేతిక సూచనలు, సలహాలు అందించాలని ఆదేశించారు. వ్యవసాయాన్ని లాభసాటి వృత్తిగా మార్చేందుకు పంటల వైవిధ్యీకరణ, నీటి పొదుపు, భూసార పరిరక్షణ, ప్రకృతి ఆధారిత వ్యవసాయ పద్ధతులు, మార్కెట్‌ ఆధారిత సాగుపై రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ పరిశీలనలో డీఏఓ అంబికా సోనీ, ఇతర సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

సెప్టెంబర్ 17 నుండి తిన్మార్ మల్లన్న పాదయాత్ర

తెలంగాణ రాజ్యాధికార పార్టీ – ముఖ్య సమావేశం –కట్ల సదానందం, టి ఆర్ పి జనగామ అధ్యక్షులు —————————— జనగామ, ఆగష్టు 19, పున్నమి జిల్లా ప్రతినిధి: ఈ రోజు సాయంత్రం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మరియు ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్‌లతో ముఖ్య సమావేశం జరిగిందని టి ఆర్ పి జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం తెలిపారు. సమావేశం ప్రధాన ఉద్దేశ్యం వివరాలు, సెప్టెంబర్ 17వ తేదీ నుంచి తీన్మార్ మల్లన్న గారి పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులందరూ పూర్తి స్థాయిలో సిద్ధమై, పార్టీని మరింత బలోపేతం చేస్తూ దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని మల్లన్న దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ప్రధానంగా సూచించిన అంశాలు : 1. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల నియామకం ప్రతి నియోజకవర్గానికి సమర్థవంతమైన ఇన్‌చార్జ్‌లను ఎంపిక చేసి, పార్టీ కార్యక్రమాలను మరింత చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలి. 2. ప్రతి సమస్యపై సోషల్ మీడియా వేదికగా పోరాటం ప్రజా సమస్యలను గుర్తించి, ప్రతి జిల్లా అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు మరియు పార్టీ నాయకులు ఆయా సమస్యలపై నిరంతరం సోషల్ మీడియాలో మాట్లాడాలి. ప్రతి ప్రజా సమస్యను పార్టీ తరఫున బలంగా టేకప్ చేయాలి. 3.పాదయాత్ర వాలంటీర్ల నమోదు సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే పాదయాత్రను విజయవంతం చేసేందుకు అవసరమైన వాలంటీర్లను తక్షణమే గుర్తించి, నమోదు ప్రక్రియను ఆగస్టు 31వ తేదీలోపు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 4.పార్టీ సభ్యత్వ కార్యక్రమం తెలంగాణ రాజ్యాధికార పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి, ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గ స్థాయిలో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలి. 5.మండల అధ్యక్షుల నియామకం రాష్ట్రంలోని అన్ని మండలాలకు అధ్యక్షుల నియామక ప్రక్రియను ఆగస్టు 31వ తేదీలోపు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. GEN-Z తో మల్లన్న* ” కార్యక్రమం ప్రతి జిల్లాలో *“GEN-Z తో మల్లన్న”* కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, GEN-Z ని పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. మల్లన్న పిలుపు: “సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే పాదయాత్రతో తెలంగాణలో రాజ్యాధికార సాధన కోసం పార్టీ శ్రేణులందరం మరింత ఐక్యంగా, క్రమశిక్షణతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి” అని తీన్మార్ మల్లన్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

జనగాం

మున్సిపాలిటీ ఆదాయం వనరులను పెంపొందించాలి :జిల్లా కలెక్టర్

మున్సిపాలిటీ ఆదాయ వనరులను పెంపొందించాలి -జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ———————— జనగామ, ఆగష్టు 19,పున్నమి జిల్లా ప్రతినిధి : జనగామ మున్సిపాలిటీ సమగ్ర సమీక్ష సమావేశం లో జనగామ జిల్లా కలెక్టర్ మాడట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు అందించాలి, వార్డుల వారీగా పారిశుద్ధ్య రూట్ మ్యాప్ రూపొందించి, ఆన్‌లైన్‌లో పొందుపరచాలి, పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి, అనుమతి లేని నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు, నిబంధనలకు అనుగుణంగా భవన నిర్మాణాలు జరిగేలా పర్యవేక్షించాలి, లైసెన్సులు, ఇంటి నిర్మాణ అనుమతులు నిర్ణీత సమయంలో జారీ చేయాలి, వార్డుల వారీగా స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లను రూట్ల ప్రకారం కేటాయించాలి సిబ్బంది సమయపాలనతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి, సమష్టిగా మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలి, ప్రజలు పన్నులు సకాలంలో చెల్లించి, మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి, జనగామ మున్సిపాలిటీపై సమగ్ర సమీక్ష, జనగామ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంతో పాటు మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించి, అమలు చేయాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జనగామ మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ విభాగాల పనితీరుపై మున్సిపల్ అధికారులతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* సమావేశం నిర్వహించి, సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని వివిధ విభాగాల వారీగా చేపడుతున్న కార్యక్రమాలు, ఆదాయ వనరులు, పన్నుల వసూళ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటి నిర్మాణ అనుమతులు, ట్రేడ్ లైసెన్సులు, జనన–మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, సిబ్బంది విధుల నిర్వహణ, తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి ఉన్న ఆదాయ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో పాటు కొత్త ఆదాయ వనరులను అన్వేషించాలని సూచించారు. ఇంటి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్సులు, తదితర పన్నుల వసూళ్లలో మరింత పురోగతి సాధించాలని, బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మున్సిపాలిటీ ఆర్థికంగా బలోపేతం అయ్యేలా పక్కా కార్యాచరణ రూపొందించాలన్నారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని *కలెక్టర్* స్పష్టం చేశారు. పారిశుద్ధ్య పనులను పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేసి, వార్డుల వారీగా రూట్ మ్యాప్ రూపొందించి, మున్సిపాలిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇళ్ల సంఖ్య, జనాభా నిష్పత్తికి అనుగుణంగా పారిశుద్ధ్య సిబ్బందిని కేటాయించి, వారి పనితీరును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వార్డుల వారీగా స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లను రూట్ల ప్రకారం కేటాయించి, చెత్త సేకరణలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దుకాణాదారులు, వ్యాపార సంస్థల నిర్వాహకులు చెత్తను రోడ్లపై వేయకుండా చెత్తబుట్టల్లోనే వేయించేలా అవగాహన కల్పించాలని, పారిశుద్ధ్య నిబంధనలను ఉల్లంఘించే వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. జనగామ పట్టణ స్వచ్ఛత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరాదని అధికారులకు స్పష్టం చేశారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి, సిబ్బంది సమయపాలన పాటిస్తూ, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని *కలెక్టర్* సూచించారు. సిబ్బంది పనితీరు, బాధ్యతలు, వార్డుల వారీగా చేపట్టే కార్యకలాపాల పూర్తి ప్రక్రియను మ్యాపింగ్ చేసి, ఆన్‌లైన్‌లో పొందుపరచాలని ఆదేశించారు. వార్డు అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో సమష్టిగా, నిబద్ధతతో పనిచేస్తేనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన జవాన్లకు అవసరమైన చోట శానిటరీ ఇన్‌స్పెక్టర్ల అదనపు బాధ్యతలు అప్పగించి, పారిశుద్ధ్య వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సూచించారు. ఇంటి నిర్మాణ అనుమతుల జారీ విషయంలో ప్రభుత్వ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ సూచించారు. నిర్ణీత గడువులోగా అర్హులైన దరఖాస్తుదారులకు అనుమతులు జారీ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా (లేదా) లోపాలు ఉన్న దరఖాస్తులను నిబంధనల ప్రకారం తిరస్కరించాలన్నారు. అనుమతి లేని నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని, అనుమతులకు అనుగుణంగానే భవన నిర్మాణాలు చేపట్టేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని, ప్రజలకు అవసరమైన సేవలను నిర్ణీత సమయంలో అందించాలని సూచించారు. ట్రేడ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో మరింత పురోగతి సాధించాలని, నిబంధనలకు అనుగుణంగా లైసెన్సులను జారీ చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రకటనలపై వసూలు చేసే అడ్వర్టైజ్‌మెంట్ చార్జీలను నిబంధనల ప్రకారం పునఃసమీక్షించి, అవసరమైన మేరకు రీ-షెడ్యూల్ చేయాలని సూచించారు. టెండర్లు, రీ-టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి, నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమగ్రంగా సేకరించి, విభాగాల వారీగా వివరాలను మున్సిపల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు అవసరమైన సమాచారం సులభంగా అందేలా పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు తమ ఇంటి పన్ను, నీటి పన్ను, తదితర పన్నులను సకాలంలో చెల్లించి, మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పని చేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ శాఖ మేనేజర్ ప్రభాకర్, డీఈ రాజ్‌కుమార్, వార్డు అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

హెచ్ పీవీ వాక్సిన్ లక్ష్యాలను నిర్దేశిత గడువులో లోగా సాధించాలి -జిల్లా కలెక్టర్

*హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా సాధించాలి– జిల్లా కలెక్టర్‌ సందీప్ కుమార్ ఝా ————————————————- జనగామ, ఆగష్టు 18,పున్నమి జిల్లా ప్రతినిధి : హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌కు సంబంధించి జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను సత్వరమే పూర్తి చేయాలని *జిల్లా కలెక్టర్‌ సందీప్ కుమార్ ఝా* అధికారులను ఆదేశించారు. మంగళవారం, జిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి సంబంధిత అధికారులతో *జిల్లా కలెక్టర్‌ సందీప్ కుమార్ ఝా* గూగుల్‌ మీట్‌ ద్వారా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌, ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్‌* మాట్లాడుతూ.. జిల్లాకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌కు (5,674) మంది లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటివరకు (2,466) మందికి టీకాలు అందించినట్లు తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని సత్వరమే పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. 14 నుంచి 15 సంవత్సరాల వయసులోపు పిల్లలందరికీ హెచ్‌పీవీ టీకా అందేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీ పాఠశాలల్లో చదువుతున్న అర్హత కలిగిన పిల్లలకు టీకాలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. హెచ్‌పీవీ టీకా ప్రాముఖ్యత, దాని వల్ల కలిగే ప్రయోజనాలపై పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని *కలెక్టర్‌* సూచించారు. తల్లిదండ్రుల సమ్మతితో టీకాలు అందించాలని, ఎక్కడైనా అవసరం ఉంటే ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, వ్యాక్సినేషన్‌ లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. ప్రతిరోజు వ్యాక్సినేషన్‌ పురోగతిని ఆన్‌లైన్‌ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు. లక్ష్య సాధనలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా విద్యా శాఖ అధికారుల సహకారంతో పాఠశాలల వారీగా అర్హులైన పిల్లలను గుర్తించి, వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని సూచించారు. ఈ నెలాఖరులోగా జిల్లాకు నిర్దేశించిన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హెచ్‌పీవీ (హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌) వ్యాక్సిన్‌ సురక్షితమైన, సమర్థవంతమైన టీకా అని, హెచ్‌పీవీతో సంబంధం ఉన్న వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని *కలెక్టర్‌* పేర్కొన్నారు. ప్రజల్లో అపోహలు లేకుండా టీకాపై సరైన అవగాహన కల్పించాలన్నారు. *ఎన్‌సీడీ స్క్రీనింగ్‌పై ప్రత్యేక దృష్టి* జిల్లాలో అసంక్రమిత వ్యాధుల (NCD – Non-Communicable Diseases) నియంత్రణలో భాగంగా ప్రజలకు విస్తృతంగా స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని *కలెక్టర్‌* ఆదేశించారు. గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు వంటి అసంక్రమిత వ్యాధులను ముందస్తుగా గుర్తించేందుకు ప్రతి ఒక్కరికీ అవసరమైన పరీక్షలు నిర్వహించాలని సూచించారు. స్క్రీనింగ్‌లో వ్యాధులు గుర్తించిన వారికి తదుపరి వైద్య సేవలు అందించడంతో పాటు, అవసరమైన మందులను సకాలంలో సరఫరా చేయాలని తెలిపారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వాణి శ్రీ, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్‌, ఇతర సంబంధిత వైద్యాధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జనగాం

శిశు మహిళా సమృద్ధి యాప్ రూపాకల్పన స్వయంగా రూపొందించి, ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

*అంగన్‌వాడీ సేవలను మరింత బలోపేతం చేసేందుకు ‘శిశు మహిళా సమృద్ధి’ యాప్‌* *వినూత్న ఆలోచనతో ‘శిశు మహిళా సమృద్ధి’ యాప్‌ రూపకల్పన:జిల్లా కలెక్టర్ ————————————— *జనగామ జిల్లాలోనే తొలిసారిగా ‘శిశు మహిళా సమృద్ధి’ యాప్‌* *అంగన్‌వాడీ కార్యకలాపాల పర్యవేక్షణకు సరికొత్త యాప్‌* *వినూత్న ఆలోచనకు కార్యరూపం.. స్వయంగా యాప్‌ ను రూపొందించి, ప్రారంభించిన కలెక్టర్* *లబ్ధిదారుల హాజరు, పోషకాహార సరఫరా, సిబ్బంది హాజరు, సెలవుల దరఖాస్తుకు ఒకే వేదిక* *అంగన్‌వాడీ సిబ్బందిపై రిజిస్టర్లు, పునరావృత నివేదికల భారం తగ్గింపు* *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* మంగళవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అంగన్‌వాడీ సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అందించేందుకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు సంబంధించి జనగామ జిల్లాలోనే మొదటిసారిగా వినూత్న ఆలోచనకు కార్యరూపంగా ‘శిశు మహిళా సమృద్ధి’ మొబైల్ యాప్‌ను *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* తానే స్వయంగా రూపొందించి, ప్రారంభించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతిరోజూ నిర్వహించే కార్యకలాపాలను ఒకే సరళమైన వేదికపైకి తీసుకురావడం ఈ యాప్‌ ప్రధాన ఉద్దేశమని *కలెక్టర్* తెలిపారు. దీని ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగడంతో పాటు, అంగన్‌వాడీ సిబ్బందిపై ఉన్న పునరావృత రిజిస్టర్ల నిర్వహణ, నివేదికల భారం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. ఒకసారి నమోదు చేసిన సమాచారం అన్ని స్థాయిల కార్యాలయాలకు అందుబాటులోకి రావడంతో ఒకే సమాచారాన్ని పలుమార్లు రిజిస్టర్లలో నమోదు చేయడం, పునరావృతంగా నివేదికలు సమర్పించడం వంటి ప్రక్రియలు గణనీయంగా తగ్గుతాయని *కలెక్టర్* తెలిపారు. తద్వారా అంగన్‌వాడీ సిబ్బంది తమ సమయాన్ని ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించడంపై కేంద్రీకరించేందుకు అవకాశం కలుగుతుందని స్పష్టం చేశారు. *యాప్‌ ప్రధానంగా నాలుగు అంశాలపై ఆధారపడి పనిచేస్తుంది* *లబ్ధిదారుల హాజరు నమోదు:* ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో హాజరయ్యే చిన్నారులు, గర్భిణులు, బాలింతల వివరాలను రోజువారీగా రియల్‌టైమ్‌లో యాప్‌లో నమోదు చేయవచ్చు. దీంతో ప్రతి కేంద్రంలో సేవల పరిధి, లబ్ధిదారుల హాజరు పరిస్థితి వెంటనే ఉన్నతాధికారులకు అందుబాటులో ఉంటుంది. వరుసగా గైర్హాజరవుతున్న చిన్నారుల కుటుంబాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు కూడా ఇది దోహదపడుతుంది. *పోషకాహార సరఫరా నిర్వహణ:* అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న పోషకాహార పదార్థాల ప్రారంభ నిల్వ, వినియోగం, అందిన సరఫరా, మిగిలిన నిల్వ వివరాలను యాప్‌లోనే నమోదు చేయవచ్చు. దీంతో అవసరమైన సరఫరాను ముందుగానే అంచనా వేసి, ఏ కేంద్రంలోనూ పోషకాహార పదార్థాల కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. *తక్షణ పనితీరు పర్యవేక్షణ:* అంగన్‌వాడీ కేంద్రాల్లో రోజువారీగా నిర్వహించే కార్యకలాపాల వివరాలు అదే రోజు సెక్టార్, ప్రాజెక్టు, జిల్లా స్థాయి అధికారులకు అందుబాటులోకి వస్తాయి. దీంతో మంచి పనితీరు కనబరుస్తున్న కేంద్రాలను వెంటనే గుర్తించడంతో పాటు, అదనపు సహాయం అవసరమైన కేంద్రాలకు తగిన సహకారం అందించేందుకు అవకాశం కలుగుతుంది. *సెలవుల దరఖాస్తు సౌకర్యం:* అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు తమ మొబైల్‌ ఫోన్ల నుంచే సెలవుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా విధానాలకు అనుగుణంగా సంబంధిత అధికారులు సెలవులను ఆమోదిస్తారు. దీంతో సెలవుల కోసం సెక్టార్ లేదా ప్రాజెక్టు కార్యాలయాలకు సిబ్బంది స్వయంగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. అంగన్‌వాడీ సిబ్బంది మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఫొటో, లొకేషన్‌తో హాజరు నమోదు చేయవచ్చు. నెట్‌వర్క్‌ సదుపాయం సరిగా లేని ప్రాంతాల్లో కూడా నమోదు చేసిన వివరాలు సేవ్‌ అవుతాయి. తిరిగి నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆ వివరాలు స్వయంచాలకంగా సంబంధిత వ్యవస్థకు చేరుతాయి. దీంతో సిగ్నల్‌ సమస్యల కారణంగా సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా హాజరు, ఇతర వివరాల నమోదు కొనసాగుతుంది. అంతకుముందు యాప్‌ వినియోగంపై అవగాహన కల్పించేందుకు *అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా సంక్షేమ అధికారి బెన్షాలోం* ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, సూపర్‌వైజర్లు, శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారులు శిక్షణలో పాల్గొని, యాప్‌ వినియోగం, హాజరు నమోదు, పోషకాహార నిల్వల నిర్వహణ, సెలవుల దరఖాస్తు, తదితర అంశాలపై అవగాహన పొందారు.

జనగాం

సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు

*సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన టీఆర్పీ నాయకులు* ——————————————— జనగామ, ఆగష్టు 18,పున్నమి జిల్లా ప్రతినిధి : *సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన టీఆర్పీ నాయకులు* *మా వీరుడి పోరాటం* – *మా జాతి ఆరాటం*! *పాపన్న గౌడ్ చూపిన బాటలో… బీసీల* *రాజ్యాధికారం కోసం టీఆర్పీ పోరాటం.* తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నియోజకవర్గ ఇంచార్జి డా. కల్నల్ మాచర్ల బిక్షపతి ముఖ్య అతిథిగా హాజరై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని SC, ST, BC, మైనారిటీ ప్రజలు గుర్తుచేసుకోవాలి. ఎవరి ముందు గులాంగిరీ చేయకుండా, ఎవరి పెత్తనానికీ తలవంచకుండా మన హక్కుల కోసం, మన ఆత్మగౌరవం కోసం, మన భవిష్యత్తు కోసం ఐక్యంగా, ధైర్యంగా ప్రజల పక్షాన నిలబడాలి. పాపన్న గౌడ్ పోరాటం నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకం. 375 ఏళ్లు గడిచినా ఆయన పేరు చరిత్రలో చెరిగిపోకుండా చిరస్థాయిగా నిలిచిందంటే, అది ఆయన పోరాట పటిమకు, ప్రజల కోసం చేసిన త్యాగాలకు నిదర్శనం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కేవలం ఒక యోధుడు మాత్రమే కాకుండా, అణగారిన బహుజన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప ప్రజా నాయకుడని కొనియాడారు. గోల్కొండ కోటపై పాపన్న గౌడ్ సాధించిన ఆధిపత్యం ఆయన ధైర్యసాహసాలకు, పోరాట పటిమకు ప్రతీకగా నిలిచిందన్నారు. జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ మాట్లాడుతూ, కిలాషపురంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గీత కార్మిక కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగి, తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆనాటి సామ్రాజ్యవాద పాలనకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. తనతో పాటు 12 మంది స్నేహితులను కలుపుకుని ప్రారంభమైన ఉద్యమాన్ని విస్తరించి, కుమ్మరి, మంగలి, సకలి, దూదేకుల తదితర బహుజన వర్గాలను ఏకం చేసి సుమారు 1,200 మంది సైన్యాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. పాపన్న గౌడ్ వరంగల్ కోట నుంచి గోల్కొండ వరకు తన ప్రభావాన్ని విస్తరించి, బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. ఆయన చూపిన ధైర్యం, సమానత్వం, స్వాభిమానం, సామాజిక న్యాయం వంటి విలువలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. కిలాషపుర గ్రామ ముద్దుబిడ్డగా చరిత్రలో నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన త్యాగాలను స్మరించుకుంటూ టీఆర్పీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన కనకరాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్లు సీసా శ్రీధర్ గౌడ్, జిట్టబోయిన నరేష్, మైనారిటీ సెల్ అధ్యక్షులు యాకుబ్ పాషా, జిల్లా నాయకులు అంజద్ పాషాతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జనగాం

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కారించాలి :జిల్లా కలెక్టర్

*ప్ర‌జావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి -జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా* ————————– జనగామ, ఆగష్టు 17,పున్నమి ప్రతినిధి : ప్ర‌జావాణిలో వివిధ స‌మ‌స్య‌లతో వచ్చే ప్ర‌జ‌ల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని *జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా* అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వ‌హించిన ప్ర‌జావాణిలో *అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో క‌లిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా *(259)* అర్జీలను *క‌లెక్ట‌ర్* స్వీక‌రించారు. వచ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను సంబంధిత శాఖ‌ల అధికారుల‌కు కేటాయిస్తూ, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై తగిన చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని, పెండింగ్ లో లేకుండా దరఖాస్తులను ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని ఆదేశించారు. *ఈరోజు ప్రజావాణికి వచ్చిన కొన్నింటి దరఖాస్తుల వివరాలిలా ఉన్నాయి* జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ కు చెందిన నల్ల సుజాత, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఆర్థిక సహాయం కొరకు మనవి చేస్తూ ద‌రఖాస్తు చేసుకున్నారు. ఇటిక్యాలపల్లి గ్రామం, బచ్చన్నపేట మండలానికి చెందిన సుంకె రాములమ్మ, తన పది గుంటల భూమికి సర్వే నిర్ణయించి, హద్దు రాళ్లు పాతించారని, కానీ తన భూమి పక్కన ఉన్న వారు వాటిని తీసేయడం జరిగిందని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ద‌ర‌ఖాస్తు చేసియున్నారు. పెద్దమడ్డూర్ గ్రామం, దేవరుప్పుల మండలానికి చెందిన గనుపాక సునీత, తాను నిరుపేద కుటుంబానికి చెందినదని, ఈ మేరకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించగలరని ప్రార్థిస్తూ ఆర్జీ ద్వారా కోరారు. పాలకుర్తి గ్రామం, పాలకుర్తి మండలానికి చెందిన మామిండ్ల రాణి, తాము పేదవారమని, రేషన్ కార్డులో వచ్చే బియ్యం మాత్రమే తమకు ఆధారమని, కావున రేషన్ కార్డులో తమ పేర్లను యాడ్ చేయగలరని, రేషన్ కార్డు మంజూరు చేయాలని విన‌తిప‌త్రం స‌మ‌ర్పించ‌నైన‌ది. మీదికొండ గ్రామం, ఘనపూర్ (స్టేషన్) మండలానికి చెందిన గాదెర ఎల్లయ్య, తాము నిరుపేద కుటుంబం అని, రోజూ వారి కూలి పని చేసుకుంటామని, పంట రుణం మాఫీ కాలేదని, ఈ మేరకు పంట రుణం మాఫీ చేయుట కోసం దరఖాస్తును స‌మ‌ర్పించినారు. ఈ ప్ర‌జావాణిలో డీఆర్డీఓ భాస్కర్, సీపీఓ చిన కోట్యా నాయక్, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృ నాయక్, వివిధ శాఖ‌ల జిల్లా అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.