Friday, 2 October 2026
  • Home  
  • ప్రజల నిరీక్షణకు ఫలితం రోడ్డుకు రూ.50 లక్షలు నిధులు.. PGRS ఆర్జీకి స్పందించిన ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు గారు.. హర్షం వ్యక్తం చేసిన కాకర సురేష్ కుమార్
- విశాఖపట్నం

ప్రజల నిరీక్షణకు ఫలితం రోడ్డుకు రూ.50 లక్షలు నిధులు.. PGRS ఆర్జీకి స్పందించిన ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు గారు.. హర్షం వ్యక్తం చేసిన కాకర సురేష్ కుమార్

విశాఖపట్నం జిల్లా, ఆనందపురం మండలం (పున్నమి ప్రతినిధి): సెప్టెంబర్ 28:: ప్రజల సమస్యపై చేసిన విజ్ఞప్తికి స్పందన లభించడంతో వెల్లంకి ఎన్టీఆర్ కాలనీ వాసుల్లో ఆశలు చిగురించాయి. రోడ్డు నిర్మాణం కోసం రూ.50 లక్షల నిధులు మంజూరు కావడంపై భీమిలి నియోజకవర్గ ఐటీడీపీ ఉపాధ్యక్షులు కాకర సురేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు, సంబంధిత అధికారులకు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. PGRS అర్జీతో కదిలిన అధికార యంత్రాంగం వెల్లంకి ఎన్టీఆర్ కాలనీ నుంచి భీమిలి–నర్సీపట్నం, బొడ్డపాలెం రహదారికి సంబంధించిన రోడ్డు నిర్మాణ అత్యవసర పరిస్థితులను వివరిస్తూ 2026 జూన్ 4న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) ద్వారా అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ అర్జీపై అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి ఉన్నతాధికారులకు నివేదించారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో రూ.50 లక్షల నిధులు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రత్యేక శ్రద్ధతో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టుకు రూ.50 లక్షల నిధుల మంజూరు ప్రక్రియ పూర్తయిందని కాకర సురేష్ కుమార్ తెలిపారు. నిధుల అందుబాటును బట్టి త్వరలోనే పనులు ప్రారంభించి, నిబంధనల ప్రకారం నాణ్యతతో రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులకు పరిష్కారం దిశగా ముందడుగు రోడ్డు నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజల రాకపోకలకు ఎంతో సౌకర్యం కలగడంతో పాటు, ప్రయాణ ఇబ్బందులు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులకు సహకరించిన నాయకులు, అధికారులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. భీమిలి నియోజకవర్గ సీనియర్ నాయకులు చిక్కాల విజయబాబు, ఆనందపురం మాజీ మండల అధ్యక్షుడు కాకర వెంకటరమణ, మాజీ సర్పంచ్ ఉప్పాడ లక్ష్మణరావు, మండల కార్యదర్శి సాడి ముత్యాలరెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులకు కాకర సురేష్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వినతులు, సమన్వయం, అధికారుల స్పందన కీలకమని.. ఈ నిధుల మంజూరు రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమం చేసిందని ఆయన పేర్కొన్నారు.

విశాఖపట్నం జిల్లా, ఆనందపురం మండలం (పున్నమి ప్రతినిధి): సెప్టెంబర్ 28::

ప్రజల సమస్యపై చేసిన విజ్ఞప్తికి స్పందన లభించడంతో వెల్లంకి ఎన్టీఆర్ కాలనీ వాసుల్లో ఆశలు చిగురించాయి. రోడ్డు నిర్మాణం కోసం రూ.50 లక్షల నిధులు మంజూరు కావడంపై భీమిలి నియోజకవర్గ ఐటీడీపీ ఉపాధ్యక్షులు కాకర సురేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు, సంబంధిత అధికారులకు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

PGRS అర్జీతో కదిలిన అధికార యంత్రాంగం

వెల్లంకి ఎన్టీఆర్ కాలనీ నుంచి భీమిలి–నర్సీపట్నం, బొడ్డపాలెం రహదారికి సంబంధించిన రోడ్డు నిర్మాణ అత్యవసర పరిస్థితులను వివరిస్తూ 2026 జూన్ 4న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) ద్వారా అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ అర్జీపై అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించి ఉన్నతాధికారులకు నివేదించారు.

ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో రూ.50 లక్షల నిధులు

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రత్యేక శ్రద్ధతో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టుకు రూ.50 లక్షల నిధుల మంజూరు ప్రక్రియ పూర్తయిందని కాకర సురేష్ కుమార్ తెలిపారు. నిధుల అందుబాటును బట్టి త్వరలోనే పనులు ప్రారంభించి, నిబంధనల ప్రకారం నాణ్యతతో రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు.

ప్రజల ఇబ్బందులకు పరిష్కారం దిశగా ముందడుగు

రోడ్డు నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజల రాకపోకలకు ఎంతో సౌకర్యం కలగడంతో పాటు, ప్రయాణ ఇబ్బందులు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులకు సహకరించిన నాయకులు, అధికారులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

భీమిలి నియోజకవర్గ సీనియర్ నాయకులు చిక్కాల విజయబాబు, ఆనందపురం మాజీ మండల అధ్యక్షుడు కాకర వెంకటరమణ, మాజీ సర్పంచ్ ఉప్పాడ లక్ష్మణరావు, మండల కార్యదర్శి సాడి ముత్యాలరెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులకు కాకర సురేష్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి వినతులు, సమన్వయం, అధికారుల స్పందన కీలకమని.. ఈ నిధుల మంజూరు రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమం చేసిందని ఆయన పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.