డ్రాగన్ ఫ్రూట్ సాగుతో రైతులు అధిక ఆదాయం పొందేలా ప్రోత్సహించాలి
—————————————————————
జనగామ, ఆగష్టు 21,పున్నమి జిల్లా ప్రతినిధి
ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్న రైతును అభినందించిన కలెక్టర్
నర్మెట్ట మండలంలోని గుంటూరుపల్లి గ్రామంలో రైతు సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంటను పరిశీలించిన
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఈ సందర్బంగా మాట్లాడుతూ
డ్రాగన్ ఫ్రూట్ సాగుతో రైతులు అధిక ఆదాయం పొందేలా ప్రోత్సహించాలని అన్నారు .
జిల్లాలోని నర్మెట్ట మండలం, గుంటూరుపల్లి గ్రామంలో *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* పర్యటించి, *రైతు వెలంగన్ రెడ్డి* సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంటను పరిశీలించారు.
రైతు మూడు ఎకరాల విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్‌ను ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్న విధానాన్ని *కలెక్టర్* క్షేత్రస్థాయిలో పరిశీలించి, సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా డ్రాగన్ ఫ్రూట్ తోటలో మొక్కల పెరుగుదల, పూత వచ్చే విధానం, పంట దిగుబడి, సాగు ఖర్చులు, మార్కెట్ ధరలు, తదితర అంశాలపై *కలెక్టర్* రైతుతో వివరంగా మాట్లాడారు.
పంట సాగుకు ప్రభుత్వం నుంచి అందిన సబ్సిడీ ఎంత, సబ్సిడీ ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను ఏ సైజులో కట్ చేస్తారు, కత్తిరింపు విధానం ద్వారా మొక్కల పెరుగుదలను ఎలా నియంత్రిస్తున్నారు, కలుపు మొక్కలు రాకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అనే అంశాలపై కూడా ఆరా తీశారు.
తోటలో ఏర్పాటు చేసిన డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ పనితీరును కూడా పరిశీలించి, మొక్కలకు అవసరమైన మేరకు నీటిని అందించే విధానం, నీటి వినియోగ సామర్థ్యం, తదితర వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు.
అలాగే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకు పూత ఎలా వస్తుంది, పూత వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు కాయలు కోతకు వస్తాయి, ప్రస్తుతం పంటకు మార్కెట్లో లభిస్తున్న ధర ఎంత అనే విషయాలపై *కలెక్టర్* రైతుతో చర్చించారు.
ఆర్గానిక్ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ, ఆధునిక సాగు విధానాలను అనుసరిస్తున్న *రైతు వెలంగన్ రెడ్డి* అనుభవాలను *కలెక్టర్* ఆసక్తిగా తెలుసుకున్నారు.
తక్కువ నీటి వినియోగంతో సాగు చేయగల, అధిక విలువ కలిగిన ప్రత్యామ్నాయ పంటలను రైతులు స్వీకరించేలా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.
రైతులు సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న ఉద్యాన పంటలు, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
సాగులో డ్రిప్ ఇరిగేషన్, సేంద్రియ పద్ధతులు, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
ఈ పరిశీలనలో డీఏఓ అంబికా సోనీ, ఇతర సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
