#227175
*రాఖీ పండుగ సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీక — కాంగ్రెస్ నాయకుడు బత్తుల అంజి గారు* ది 28 08 26 ములకలపల్లి ములకలపల్లి మండల కేంద్రం లో అంజి గారి నివాసం లో రాఖీ పండుగ సందర్భంగా అందరికీ కాంగ్రెస్ నాయకుడు బత్తుల అంజి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.రాఖీ పండుగ భారతీయ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని అన్నారు. సోదరి తన సోదరుడి క్షేమం, ఆరోగ్యం, సుఖసంతోషాల కోసం రాఖీ కట్టి తన సోదరిని జీవితాంతం కాపాడుకుంటానని భరోసా ఇవ్వడం ఈ పండుగ ప్రత్యేకత అని తెలిపారు. రాఖీ కేవలం అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న బంధానికే పరిమితం కాకుండా, ప్రేమ, ఆప్యాయత, విశ్వాసం, రక్షణకు ప్రతీక అని *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ నాయకుడు బత్తుల అంజి గారు* పేర్కొన్నారు. సమాజంలో మహిళలకు గౌరవం, భద్రత కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.ఈ రాఖీపండుగసందర్భంగా ప్రతి ఇంటా ఆనందం, ఐక్యత, సంతోషం వెల్లివిరియాలని,సోదరి –సోదరీమణుల అనుబంధం మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ మరోసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎంపిటిసి లు తాటి తులసి సున్నం సునీత మరియు పలువురు మహిళలు *అంజి గారికీ* రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు Uploaded Video:

