భూపతిపాలెం ప్రాజెక్టు ఉన్న సాగునీరు అందక రైతులు ఆందోళన
భూపతి పాలెం ప్రాజెక్టు రైతుల సాగునీటి సమస్యపై అత్యవసర సమావేశానికి హాజరైన రైతులు గంగవరం మండలం, గంగవరం, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 17 గంగవరం మండలంలో ఎంపీడీవో ఆఫీస్ నందు ఎంపీపీ పలాల కృష్ణారెడ్డి అధ్యక్షతన రైతుల అత్యవసర సమావేశం భూపతి పాలెం ప్రాజెక్టుపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు ఒకవైపు వర్షాలు కురకపోవడంలో రైతులు జీవనాధారం మరియు పంటల సాగు పూర్తిగా ప్రాజెక్టు సాగునీటి వైపే ఆధారపడి ఉంది ప్రాజెక్టు ఉన్నప్పటికీ సాగునీరు అందకపోవడం వల్ల రైతుల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఈ సమస్యను సమగ్రంగా చర్చించి సాగునీరు అందించేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి పాటు సమస్య పరిష్కారం కోసం భవిష్యత్తు కార్యవర్గ రూపొందించేందుకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగినది ఈ కార్యక్రమం ఉద్దేశించి గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షులు లోత రామారావు మాట్లాడుతూ భూపతిపాలెం ప్రాజెక్టు నుండి సూరంపాలెం ప్రాజెక్టుకు రావలసిన నీరు రావడం లేదు దీనికి సంబంధించి ఎక్కడెక్కడ లీకేజీ ఉన్నాయి ఎన్ని ఎకరాలకు నీరు అందవలసి ఉంది ఎంతమంది రైతులు నష్టపోతున్నారు దీని గురించి ప్రతి గ్రామానికి వెళ్లి రైతులతో చర్చించి అధికారులు దృష్టికి తీసుకెళ్దామని తెలియపరిచారు ఈ కార్యక్రమానికి ఎంపీపీ పలాల కృష్ణారెడ్డి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోత రామారావు జిల్లా అధ్యక్షులు ఇ సిరిమల్లె రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు బి కిరణ్ మండల అధ్యక్షులు తీగల శ్రీనివాస్ లయ కన్వీనర్ యాట్ల సరస్వతి కో కన్వీనర్ రాజారెడ్డి పిసా అధ్యక్షులు కార్యదర్శులు గిరిజన సంఘ నాయకులు గిరిజన రైతులు తదితరులు పాల్గొన్నారు


