Friday, 4 September 2026

Tag: ములకలపల్లి

BHADRADRI

#227175

🐟 *ములకలపల్లి సంతలో చేపలు కొంటున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు* ములకలపల్లి మండల పర్యటనలో భాగంగా గౌరవ అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ జారే ఆదినారాయణ గారు,ములకలపల్లి స్థానిక సంతను సందర్శించారు. ఈ సందర్భంగా సంతలోని వ్యాపారులు, ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానికంగా విక్రయిస్తున్న చేపలను స్వయంగా కొనుగోలు చేశారు. సాధారణ ప్రజలతో కలిసిమెలిసి, స్థానిక మార్కెట్‌లో సామాన్యుడిలా వ్యవహరించిన ఎమ్మెల్యే గారి తీరు అక్కడి ప్రజలను ఆకట్టుకుంది. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకుంటూ.. స్థానిక వ్యాపారులకు, ప్రజలకు అండగా నిలవడమే ప్రజా ప్రతినిధిగా తన బాధ్యత అనే విధంగా ఎమ్మెల్యే గారి పర్యటన కొనసాగింది. ప్రజలతో మమేకమై.. ప్రజల మనిషిగా నిలుస్తున్న మన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు. ❤️🙏🫶 ఈ కార్యక్రమంలో పాల్గొన్నజిల్లా నాయకులు బత్తుల అంజి గారు,MD జహీరుద్దీన్ గారు, అశ్వారావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాలకుర్తి సుమిత్ గారు,సోయం నాగరాజు ములకలపల్లి కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్, తదితరులు పాల్గొన్నారు….. Uploaded Video:

BHADRADRI

#227175

కామ పిశాచి చేతిలో ఆదివాసీ బిడ్డ దారుణ హత్య నిందితుడిని కఠినంగా శిక్షించాలి – శిరీష కుటుంబానికి రూ.కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి తిమ్మంపేట ఆదివాసీ JAC కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ తిమ్మంపేట, ములకలపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హైదరాబాద్‌ పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివాసీ యువతి, నర్సు శిరీష దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తిమ్మంపేట ఆదివాసీ JAC కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. విధులు ముగించుకుని విశ్రాంతి తీసుకుంటున్న శిరీషపై నిందితుడు సైనాఉల్లా దాడి చేసి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం మృతదేహంపై కూడా అత్యాచారానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిజాలు వెలుగులోకి తీసుకురావాలని JAC డిమాండ్ చేసింది. ఆదివాసీ బిడ్డకు జరిగిన ఈ దారుణంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. నిందితుడికి చట్టప్రకారం అత్యంత కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. ఆస్పత్రుల్లో పనిచేసే మహిళా సిబ్బందికి పూర్తి భద్రత కల్పచాలి . ఆదివాసీ యువతికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. JAC ప్రధాన డిమాండ్లు • నిందితుడిని కఠినంగా శిక్షించాలి. • శిరీష కుటుంబానికి రూ.1 కోటి పరిహారం ఇవ్వాలి. • కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. • శిరీష కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలి. • మహిళా ఉద్యోగులకు, ముఖ్యంగా ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి భద్రత కల్పించాలి. ఆదివాసీ బిడ్డకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు. శిరీష కుటుంబానికి న్యాయం చేయాలి – నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఈ కార్యక్రమంలో JAC కమిటీ నాయకులు తుర్రం శ్రీనివాస్, మడకం సతీష్, సోడే కేశవరావు, రవ్వ నరేష్, గడ్డం సామేలు, సోయం రాజు, కొండ్రు మధు, కొండ్రు నాగరాజు, సోయం మహేష్ తదితరులు, మహిళలు పాల్గొన్నారు. Uploaded Video:

BHADRADRI

*ఊకే శిరీష అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు*

ములకలపల్లి మండల కేంద్రంలో చౌటిగూడెం గ్రామానికి చెందిన ఊకే శిరీష మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆమె అంత్యక్రియల్లో *గౌరవ అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ జారే ఆదినారాయణ గారు* పాల్గొని పాడె మోశారు. శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి బాధలో తాను కూడా భాగస్వామినని తెలియజేస్తూ వారికి ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధుల అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఒక కుటుంబానికి తీరని లోటు ఏర్పడిన ఈ విషాద సమయంలో ఎమ్మెల్యే గారు స్వయంగా అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోయడం మానవత్వానికి, ప్రజల పట్ల ఆయనకున్న బాధ్యతకు నిదర్శనం. ఊకే శిరీష ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 🙏🕯️ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆదివాసి నాయకులు,JAC మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, గ్రామ నాయకులు,అభిమానులు, తదితరులు పాల్గొన్నారు…… ఇట్లు సోయం నాగరాజు ములకలపల్లి కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ Uploaded Video:

BHADRADRI

#227175

ఈరోజు భగత్ సింగ్ నగర్ గ్రామంలో మాల మహానాడు మండల అధ్యక్షులు *మోట రవి గారి* ఆధ్వర్యంలో యూత్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ అధ్యక్షులుగా *కొక్కెర గడ్డ సతీష్ గారు* ఉపాధ్యక్షులుగా *గుమ్మడి రణదేవ్ గారు* సెక్రటరీగా *మోటా ప్రభాకర్ గారు* మరియు జాయింట్ సెక్రటరీ *నల్లబల్లి వెంకటేశ్వర్లు గారు* కోశాధికారిగా *తాళ్ల పవన్ గారు* మరియు *కొండేటి ప్రవీణ్ గారిని* ఎన్నుకోవడం జరిగింది. వీరితో పాటు మరికొంత మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది

BHADRADRI

#227175

జగన్నాధపురంలో గ్రోమోర్ కేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్ రైతులకు అందుబాటులోకి వ్యవసాయ ఉత్పత్తులు ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రోమోర్ కేంద్రాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ కుంజా వినోద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గ్రోమోర్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుంజా వినోద్ మాట్లాడుతూ జగన్నాధపురం గ్రామంలో గ్రోమోర్ కేంద్రం అందుబాటులోకి రావడం రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు. గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, వ్యవసాయానికి సంబంధించిన ఇతర ఉత్పత్తులు అందుబాటులో ఉండే అవకాశం కలుగుతుందన్నారు. రైతులు వ్యవసాయ పనుల సమయంలో అవసరమైన సామగ్రి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపారు. రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు అందించడంతో పాటు, పంటల సాగులో అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తూ గ్రోమోర్ కేంద్రం రైతులకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని మెరుగైన దిగుబడులు సాధించాలని సర్పంచ్ సూచించారు. అనంతరం గ్రోమోర్ నిర్వాహకులు సర్పంచ్ కుంజా వినోద్‌తో పాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కణితి సత్యనారాయణ,  రైతులు అడపా నాగేశ్వర రావు, ఎనుగంటి రాము, పిడియాలా బుజ్జి, వేముల మురళి,మరియు సీతాయిగూడెం మాజీ సర్పంచ్ కారం సుదీర్ లను మర్యాదపూర్వకంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో కోరమండల్ ఇంటర్ నేషనల్ మన ‘గ్రోమోర్ ‘ యాజమాన్యం తెలంగాణ ఎన్ ఎస్ ఓ హెడ్  క్రిష్ణయ్య ,    ఏ ఎం ఎం మార్కెటింగ్ మేనేజర్ బాలకిషన్, ఆర్ ఎ సి లక్ష్మణ్, రైతులు, అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.