Friday, 28 August 2026

Tag: తెలంగాణ జనగాం స్టేషన్గన్పూర్ సముద్రాల రాఖీ పౌర్ణమి

జనగాం

స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల బస్టండ్‌లో మానవత్వం పరిమళించింది.. అనాథ వృద్ధుడికి రాఖీ కట్టి అక్కగా అండగా నిలిచిన కట్ల పద్మ!

స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామానికి చెందిన కట్ల పద్మ అనే మహిళ రాఖీ పండుగ సందర్భంగా చూపిన ఆప్యాయత అందరినీ కంటతడి పెట్టించింది. సముద్రాల బస్టండ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా నిరాశ్రయుడిగా, అనాథలా తలదాచుకుంటున్న ఓ వృద్ధుడి వద్దకు ఆమె వెళ్లారు. పండుగ రోజు ఎవరూ లేక ఒంటరిగా ఉన్న ఆ నిస్సహాయుడి చేతికి రాఖీ కట్టి, తోబుట్టువులా భరోసా కల్పించారు. సమాజంలో తోటి మనిషిని ఆదరించాలనే గొప్ప చాటుతూ, ఈ వైనం స్థానికంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ మంచి మనసున్న మహిళను గ్రామస్థులు అభినందిస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.