న్యాయస్థానం ఆదేశాల మేరకు ఒక్కొక్కరి కి రూ.10,000 చొప్పున జరిమానా.
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు కొనసాగింపు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ
తిరుపతి ఆగష్టు 04 ( పున్నమి ప్రతినిధి)
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు, తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ కొండయ్య పర్యవేక్షణలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ క్రమశిక్షణ పెంపే లక్ష్యంగా తిరుపతి నగరంలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రజల ప్రాణాలకు ప్రమాదకరం గా వ్యవహరించిన 25 మంది వాహనదారు లను గుర్తించి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని గౌరవ ప్రథమ స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, తిరుపతి ముందు హాజరుపరచగా, న్యాయమూర్తి ధనలక్ష్మి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.2,50,000 జరిమానా విధించారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని, అలాంటి నిర్లక్ష్య వైఖరి వాహనదారుడితో పాటు ఇతర రోడ్డు వినియోగదారుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తుందని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతా యని తెలిపారు.ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్. మాట్లాడుతూ, “మద్యం సేవించి వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమైన నేరం. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా అనేక విలువైన ప్రాణాలు కోల్పోతున్నాం. ప్రతి వాహనదారు డు తన కుటుంబం, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించి మద్యం సేవించిన అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం నడపకూడదు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత. ప్రజల ప్రాణాల రక్షణే తిరుపతి జిల్లా పోలీసు శాఖ ప్రధాన లక్ష్యం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు నిరంతరం కొనసాగుతాయి” అని స్పష్టం చేశారు.తిరుపతి జిల్లా పోలీసు శాఖ ప్రజల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, ఇతర ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు జిల్లా వ్యాప్తంగా నిరంతరం కొనసాగిస్తు న్నట్లు పోలీసు శాఖ వెల్లడించింది.


