Sunday, 16 August 2026
  • Home  
  • భారత్ @ 80తో శ్రిష్టి వరల్డ్ స్కూల్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
- విశాఖపట్నం

భారత్ @ 80తో శ్రిష్టి వరల్డ్ స్కూల్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

విశాఖ గాజువాక (పున్నమి ప్రతినిధి): ఉక్కునగరం సెక్టార్-11లోని శ్రిష్టి వరల్డ్ స్కూల్‌లో “భారత్ @ 80 – One Decade, One Sapling, One Growing Nation” థీమ్‌తో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. RINL విశాఖ స్టీల్ ప్లాంట్ జీఎం రవి చంద్ర బాబు ముఖ్య అతిథిగా, పాఠశాల డైరెక్టర్ పి. సుశీలా రాణి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. మేఘన కంభం విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. భారత్ @ 80 థీమ్‌లో భాగంగా దేశం సాధించిన ఎనిమిది దశాబ్దాల ప్రగతిని ప్రతిబింబించేలా డెకేడ్ వాల్స్ ఏర్పాటు చేసి, ప్రతి దశాబ్దానికి ప్రతీకగా మొక్కలు నాటారు. విద్యార్థులతో రూపొందించిన భారీ “80” ఆకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 900 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, శాస్త్రీయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆర్మీ, నేవీ ఎన్‌సీసీ క్యాడెట్ల మార్చ్‌పాస్ట్ క్రమశిక్షణను చాటింది. 8, 9 తరగతుల విద్యార్థులు త్రివర్ణ పతాకాలతో సెక్టార్-11 కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి “నా భారత్.. నా బాధ్యత” అంటూ నినదించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, దేశభక్తి, క్రమశిక్షణతో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం అభినందించింది.

విశాఖ గాజువాక (పున్నమి ప్రతినిధి): ఉక్కునగరం సెక్టార్-11లోని శ్రిష్టి వరల్డ్ స్కూల్‌లో “భారత్ @ 80 – One Decade, One Sapling, One Growing Nation” థీమ్‌తో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. RINL విశాఖ స్టీల్ ప్లాంట్ జీఎం రవి చంద్ర బాబు ముఖ్య అతిథిగా, పాఠశాల డైరెక్టర్ పి. సుశీలా రాణి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. మేఘన కంభం విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.

భారత్ @ 80 థీమ్‌లో భాగంగా దేశం సాధించిన ఎనిమిది దశాబ్దాల ప్రగతిని ప్రతిబింబించేలా డెకేడ్ వాల్స్ ఏర్పాటు చేసి, ప్రతి దశాబ్దానికి ప్రతీకగా మొక్కలు నాటారు. విద్యార్థులతో రూపొందించిన భారీ “80” ఆకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

900 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, శాస్త్రీయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆర్మీ, నేవీ ఎన్‌సీసీ క్యాడెట్ల మార్చ్‌పాస్ట్ క్రమశిక్షణను చాటింది. 8, 9 తరగతుల విద్యార్థులు త్రివర్ణ పతాకాలతో సెక్టార్-11 కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి “నా భారత్.. నా బాధ్యత” అంటూ నినదించారు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, దేశభక్తి, క్రమశిక్షణతో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం అభినందించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.