Tuesday, 18 August 2026
  • Home  
  • హర్ ఘర్ తిరంగా ర్యాలీ విజయవంతం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

హర్ ఘర్ తిరంగా ర్యాలీ విజయవంతం

)ముమ్మిడివరం: దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటిచెప్పే ఉద్దేశంతో నిర్వహించిన “హర్ ఘర్ తిరంగా”* ర్యాలీ ముమ్మిడివరంలో బిజెపి టౌన్ మండలం అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది . తారా జూనియర్ కళాశాల విద్యార్థులు మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. తారా జూనియర్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో జాతీయ జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొని దేశభక్తి నినాదాలతో ప్రజల్లో స్ఫూర్తిని నింపారు. ర్యాలీ ద్వారా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, *“తిరంగా కేవలం ఒక జెండా మాత్రమే కాదు, అది మన దేశ గౌరవం, ఐక్యత, త్యాగాలకు ప్రతీక. ప్రతి భారతీయుడిలో దేశభక్తి భావనను మరింత బలోపేతం చేయడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం లక్ష్యం”* అని అన్నారు. తారా జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తల సమన్వయం వల్ల ర్యాలీ విజయవంతంగా నిర్వహించబడిందని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ర్యాలీలో తారా జూనియర్ కాలేజీ విద్యార్థులతో పాటు జిల్లా బిజెపి కోశాధికారి గ్రంధి సూర్యనారాయణ గుప్త (నానాజీ), ముమ్మిడివరం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గొల్లకోటి వెంకటరెడ్డి, హర్ ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్ గనిశెట్టి వెంకటేశ్వరరావు (బాబీ మాస్టర్) ముమ్మిడివరం టౌన్ ప్రధాన కార్యదర్శులు జనిపెళ్ళ శ్రీనివాసరావు, కొప్పిశెట్టి బాల వెంకట కిషోర్, కార్యదర్శులు దొమ్మేటి బాలరాజు, బసవ శ్రీహరి బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యల దుర్గారావు, బిజెపి సీనియర్ లీడర్ తటవర్తి నాగరాజు రావు, బిజెపి కార్యకర్తలు దoగుడుబియ్యం శ్రీనివాసరావు, ఉoదుర్తి శివ బాలయోగి, తదితరులు పాల్గొన్నారు.

)ముమ్మిడివరం: దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటిచెప్పే ఉద్దేశంతో నిర్వహించిన “హర్ ఘర్ తిరంగా”* ర్యాలీ ముమ్మిడివరంలో బిజెపి టౌన్ మండలం అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది .
తారా జూనియర్ కళాశాల విద్యార్థులు మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది.

తారా జూనియర్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో జాతీయ జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొని దేశభక్తి నినాదాలతో ప్రజల్లో స్ఫూర్తిని నింపారు. ర్యాలీ ద్వారా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, *“తిరంగా కేవలం ఒక జెండా మాత్రమే కాదు, అది మన దేశ గౌరవం, ఐక్యత, త్యాగాలకు ప్రతీక. ప్రతి భారతీయుడిలో దేశభక్తి భావనను మరింత బలోపేతం చేయడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం లక్ష్యం”* అని అన్నారు.

తారా జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తల సమన్వయం వల్ల ర్యాలీ విజయవంతంగా నిర్వహించబడిందని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ర్యాలీలో తారా జూనియర్ కాలేజీ విద్యార్థులతో పాటు జిల్లా బిజెపి కోశాధికారి గ్రంధి సూర్యనారాయణ గుప్త (నానాజీ), ముమ్మిడివరం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గొల్లకోటి వెంకటరెడ్డి, హర్ ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్ గనిశెట్టి వెంకటేశ్వరరావు (బాబీ మాస్టర్) ముమ్మిడివరం టౌన్ ప్రధాన కార్యదర్శులు జనిపెళ్ళ శ్రీనివాసరావు, కొప్పిశెట్టి బాల వెంకట కిషోర్, కార్యదర్శులు దొమ్మేటి బాలరాజు, బసవ శ్రీహరి బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యల దుర్గారావు, బిజెపి సీనియర్ లీడర్ తటవర్తి నాగరాజు రావు, బిజెపి కార్యకర్తలు దoగుడుబియ్యం శ్రీనివాసరావు, ఉoదుర్తి శివ బాలయోగి, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.