Monday, 21 September 2026

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

లింగంపేట లో విషాదం. భార్య భర్తలు మృతి

పున్నమి ప్రతినిధి ఆగస్టు 23 రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు కారు అదుపుతప్పి ప్రమాదానికి గురి కావడంతో హసీనా అక్కడికక్కడే మృతి చెందింది తీవ్రంగా గాయపడిన ఆమె భర్త షాదుల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు దంపతుల మృతితో రుద్రంగిలో విషాదఛాయలు అలుముకున్నాయి

రాజన్న సిరిసిల్ల

సింగారంలో దోమల నివారణ చర్యలు

పున్నమి ప్రతినిధి ఆగస్టు 22 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో ఈరోజు గౌరవ సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో దోమల మందు స్ప్రే మరియు బ్లీచింగ్ మురికి కాలువలలో చల్లడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముత్యాల ప్రమీల బాలరాజ్ వార్డు సభ్యులు అంగన్వాడీ టీచర్స్ ఫీల్డ్ అసిస్టెంట్ మరియు గ్రామ ప్రజలు పంచాయతీ కార్యదర్శి మహ్మద్ అలీ పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

అప్పుల బాధతో యువకుడు మృతి బండ లింగంపల్లి

పున్నమి ప్రతినిధి ఆగస్ట్ 22 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామానికి చెందిన కూతాడి రజినీకాంత్ 25 సంవత్సరాలు అప్పుల భారంతో తీవ్ర మనస్థాపానికి గురై మృతి చెందినట్లు సర్పంచ్ బాలరాజ్ నర్సా గౌడ్ తెలిపారు విదేశాలకు వెళ్లిన సరైన ఉపాధి లభించక ఇటీవల గ్రామానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్థాపానికి గురైన కూతాడి రజనీకాంత్ మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ గ్రామస్తులు కోరారు

రాజన్న సిరిసిల్ల

ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్లో చోరీ

పున్నమి ప్రతినిధి ఆగస్టు 21 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంగొల్లపల్లి గ్రామంలో ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్లో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చోరికి పాల్పడ్డారు షట్టర్ తాళాలు పగలగొట్టి నగదు వస్తువులు ఎత్తుకెళ్లారు శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ యజమాని రాగా చోరీగుర్తించి యజమాని పాతూరి రాజేశ్వర్ రెడ్డి కి సమాచారం అందించారు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు

రాజన్న సిరిసిల్ల

ఎల్లారెడ్డిపేటలో రాజీవ్ గాంధీ జయంతి

పున్నమి ప్రతినిధి ఆగస్టు 20 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఎల్లారెడ్డిపేటలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు సూడిది రాజేందర్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య జిల్లా ఉపాధ్యక్షులు దత్తాత్రేయ గౌడ్ రేవంత్ రెడ్డి మిత్ర మండలి అధ్యక్షులు విజయ రెడ్డి పట్టణ అధ్యక్షులు చిన్ని బాబు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

వీర్నపల్లి మోడల్ స్కూల్ లో పల అంశాలపై ఆరోపణలు

పున్నమి ప్రతిని ధి ఆగస్టు 18 రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వీర్నపల్లి మోడల్ స్కూల్లో పలు అంశాలపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు టీసీ కోసం ఒక్కొక్క విద్యార్థి వద్ద రూ 200 వసూలు చేసినట్లు తెలిపారు అవర్ లీ బేస్డ్ టీచర్ తో టి సి బుక్ అడ్మిషన్ రిజిస్టర్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు అలాగే స్కూల్ ఆవరణలోని చెట్లను తొలగించి వాటిని మిడ్ డే మీల్స్ కార్మికులకు అప్పగించి డబ్బులు వసూలు చేసినట్లు పేర్కొన్నారు అధికారులు విచారణ చేపట్టాలని కోరారు

రాజన్న సిరిసిల్ల

అధ్వానంగా మారిన రహదారి

పున్నమి ప్రతినిధి ఆగస్టు 18 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి బండ లింగంపల్లి నారాయణపూర్ గ్రామాల మధ్య రహదారి పూర్తిగా దెబ్బతింది ఇటీవల కురిసిన వర్షాలకు పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ఉమ్మడి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు

రాజన్న సిరిసిల్ల

పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

పున్నమి ప్రతినిధి ఆగస్టు 18 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బిసి సాధి కారిత సంఘం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా ఆయనకు బీసీ సాధికారి త సంఘం ఘన నివాళులు అర్పిస్తూ పాపన్న పోరాటం కేవలం మొగలు సామ్రాజ్యానికి వ్యతిరేకం కాదు ప్రజలను దోపిడీ చేస్తున్న ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా కూడా సాగింది తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దిశాలి తెలంగాణ తొలి స్వాతంత్ర సమరయోధుడు సమాజ సమానత్వం కోసం ఆయన చేసిన త్యాగాలు చీరస్మరణీయం ఆయన ఆశయాలు మనందరికీ స్ఫూర్తి

రాజన్న సిరిసిల్ల

కమ్యూనిటీ హాలుకు నిధులు మంజూరు చేయాలి

పున్నమి ప్రాతినిధి ఆగస్టు 17 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ నాయకులుఎ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్నను నాయకులు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు సూడిది రాజేందర్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఉడుగుల సురేందర్ మాదాసు బాబు అక్క పెళ్లి సర్పంచ్ డైరెక్టర్ రానా వే నీ లక్ష్మణ్ తదితరులు కమ్యూనిటీ హాల్ నిధుల కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది

రాజన్న సిరిసిల్ల

మత్తడి దూకుతున్న ఎగువ మానేరు

పున్నమి ప్రతినిధి ఆగస్టు 16 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు మత్తడి దూకడం ప్రారంభించింది మత్తడి ప్రవహిస్తున్న ప్రాంతానికి సందర్శకులు వెళ్లవద్దని సిరిసిల్ల డిఎస్పి కత్రోజు నాగేంద్ర చారి ఎల్లారెడ్డిపేట సిఐ వెంకటేష్ హెచ్చరించారు ప్రాజెక్టు పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.