Wednesday, 16 September 2026

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

లోన్ చార్జీల పేరుతో అదనపు వసూళ్లు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఎల్లారెడ్డిపేటలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా స్వయం సహాయక సంఘాలకు సాయం సహకార సమృద్ధి ఋణాల మంజూరులో లోన్ చార్జీల పేరుతో అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనిపై సంబంధిత అధికారులు దృష్టి సారించి వసూళ్లపై స్పష్టత ఇవ్వడంతో పాటు వాస్తవాలను పరిశీలించాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు

రాజన్న సిరిసిల్ల

వినాయకుడి ఆశీస్సులతో సుఖ సంతోషాలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని భీమేశ్వరాలయంలో ప్రతిష్టించిన వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ అధికారులు ఆలయ ఈవో వేద పండితులు బ్రాహ్మణుల సమక్షంలో సాంప్రదాయ బద్ధంగా పూజలు జరిగాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే అది శ్రీనివాస్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు బ్యారేజీలు ప్రాజెక్టులు నిండాలని రైతులు సాగుచేసిన పంటలు సమృద్ధిగా పండాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు

రాజన్న సిరిసిల్ల

భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న సాంప్రదాయం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో గణపతి ఉత్సవాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది 1946 లో సమాజ సేవా సంఘం ఆధ్వర్యంలో చిలుక సిద్ధిరం గణపయ్య ను విగ్రహాన్ని ప్రతిష్టించి ఉత్సవాలు ప్రారంభించినట్లు సమాచారం అప్పటి నుంచి గణపతి ఉత్సవాల పరంపర 80 ఏళ్లుగా కొనసాగుతుంది ప్రస్తుతం గాంధీ చౌక్ లోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏటా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు

రాజన్న సిరిసిల్ల

మహిళలకు కుట్టు మిషన్ల పథకం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ప్రభుత్వం బిసి మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకానికి దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది అర్హులైన మహిళలు సంబంధిత ప్రభుత్వ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 పట్టణాల్లో రెండు లక్షల రూపాయల లోపు ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డ్ ఆదాయం కుల దృవపత్రాలు సమర్పించాలి తొలి విడుదలో ఎంపికైన వారికి కుట్టు మిషన్ల పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు

రాజన్న సిరిసిల్ల

చిన్న పొదుపుతో మంచి ఆర్థిక భరోసా

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా ఆడపిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సుకన్య సమృద్ధి యోజన ఉపయోగకరమైన పొదుపు పథకంగా నిలుస్తుంది కూతురు పుట్టిన తర్వాత ఖాతా తెరిచి ఏడాదికి కనీసం 250 రూపాయలు నుంచి గరిష్టంగా 1,50,000 వరకు జమ చేయవచ్చు 15 ఏండ్లు డిపాజిట్ చేయాలి ఖాతా 21 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది పెట్టుబడిపై వడ్డీ మొత్తాన్ని నిబంధనల ప్రకారం పన్ను ప్రయోజనం లభిస్తుంది

రాజన్న సిరిసిల్ల

కళాకారుల నైపుణ్యానికి ప్రతి క గా సిల్వర్ వినాయకుడు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని రామ్ లాల్ మండపంలో ఏర్పాటు చేసిన సిల్వర్ గణేషుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సుమారు 11 అడుగుల ఎత్తులో 2016 సిల్వర్ ప్రతిమలతో నాందేడ్ కు చెందిన కళాకారులు సిద్ధం చేసినట్లు మండపనిర్వాకులు అనంతుల అఖిల్ తెలిపారు విగ్రహం తయారీకి సుమారు రూ. రెండు లక్షల 50 వేల రూపాయలు ఖర్చయినట్లు తెలిపారు

రాజన్న సిరిసిల్ల

BRS నేతల ప్రత్యేక పూజలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని బి ఆర్ ఎస్ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి BRS జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి తో పాటు ప్రజాపతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి ఎస్పి మహేష్ బి గీతే పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు విఘ్నేశ్వరుడు అందరికీ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజించాలని సూచించారు

రాజన్న సిరిసిల్ల

కలెక్టరేట్ లో మట్టి వినాయకుడి ప్రతిష్ట

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వినాయక చవితి సందర్భంగా సోమవారం మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమంలో ఆర్డీవో శ్రీధర్ బాబు ఏవో రామ్ రెడ్డి కలెక్టరేట్ పర్యవేక్షకులు రామచంద్రం శ్రీకాంత్ డి డబ్ల్యూ లక్ష్మీ రాజo డివైస్ ఓ రాందాస్ వేములవాడ తాసిల్దార్ జయంత్ విదేశాలకు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు వినాయకుడు ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాల ను తొలగించి ఆనందం ఐశ్వర్యం ఆరోగ్యం ప్రసాదించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రార్థించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వ్యవసాయం గాడిన పడి పంటలతో రైతుల కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.