ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్ సూచించారు. బిజినేపల్లి మండలం మహాదేవునిపేటలో రైతు బాలపీరుకి చెందిన మినుము పంట చేనును ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. పంట యాజమాన్య పద్ధతులు, దిగుబడి వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు. తక్కువ నీటి వినియోగంతో లాభసాటి దిగుబడులు ఇచ్చే ఆరుతడి పంటల సాగుపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఏఓ చంద్రశేఖర్, ఏడీఏ పూర్ణచంద్రారెడ్డి, ఎంఏఓ కమల్ కుమార్, ఏఈఓలు, రైతులు ఉన్నారు

NGKL: ఎల్నినో నేపథ్యంలో ఆరుతడి పంటలే శ్రేయస్కరం: ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్