Wednesday, 19 August 2026
  • Home  
  • అయ్యప్ప ఆలయ కుంభాభిషేకానికి కొట్టే సాయి ప్రసాద్‌కు ఆహ్వానం
- తిరుపతి

అయ్యప్ప ఆలయ కుంభాభిషేకానికి కొట్టే సాయి ప్రసాద్‌కు ఆహ్వానం

శ్రీ కాళహస్తి, ఆగస్టు 19, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని నంది హిల్స్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన, మహా కుంభాభిషేక మహోత్సవాలు ఈనెల 26, 27, 28 తేదీలలో అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ పవిత్ర ఆధ్యాత్మిక వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేయాల్సిందిగా కోరుతూ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్‌ను ఉత్సవ కమిటీ ప్రతినిధులు బుధవారం నాడు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో విశాలాంధ్ర కోటి, శ్రీ అర్ధనారీశ్వర స్వామి దేవాలయ చైర్మన్ సునీత తదితరులు పాల్గొని కొట్టే సాయి ప్రసాద్‌కు మహోత్సవ అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు. శబరిమల సాంప్రదాయాల ప్రకారం అత్యంత నిష్ఠతో జరిగే ఈ విగ్రహ ప్రతిష్ఠాపన, కుంభాభిషేక ముగింపు పూజా కార్యక్రమాలకు విచ్చేసి విజయవంతం చేయాలని సాదరంగా అభ్యర్థించారు. దీనిపై దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ సానుకూలంగా స్పందిస్తూ.. ఈ మహా కుంభాభిషేక మహోత్సవానికి తాను తప్పక హాజరై అయ్యప్ప స్వామి వారి దివ్య ఆశీస్సులు పొందుతాన్నారు. నియోజకవర్గ పరిధిలో ఇటువంటి మహోన్నత ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ పవిత్ర విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న ప్రజలు, అయ్యప్ప స్వాములు, భక్తులు, మరియు ఆధ్యాత్మికవేత్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేడుకలను మహా విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.