డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతి కార్యాలయం వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కమిషనర్ పి.రవివర్మ మహాత్మాగాంధీ మరియు డా.బి.ఆర్.అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాల అలంకరణ చేసి జాతీయ జెండాకు వందనం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రవి వర్మ మాట్లాడుతూ ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాల పలితమే ఈ రోజు మనం స్వేచ్చగా జీవిస్తున్నామని, యువత భారతదేశ అభివృద్ధి లో ముఖ్యభూమిక పోషించాలని కోరారు. మున్సిపల్ అన్ని శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తాడి నరసింహారావు, వీళ్ళ వీరాస్వామి నాయుడు, నడింపల్లి శ్రీను రాజు,మేనేజర్ ఇంచార్జ్ కె.వదన్, ఎ.ఇ. కె.శ్రీనివాసు, టి.పి.ఓ బి.రాజేష్ బాబు, జే.ఎ.ఓ కె.రామకృష్ణ, షరాఫ్ యు.వి.రమణ, అడ్మిన్ పి.శ్రీనివాస్, కె.రవిశంకర్, జాగు సతిబాబు, శీలం బొబ్బిలి, కూటమి నాయకులు, స్వర్ణ వార్డు సిబ్బంది, నగర పంచాయతి మరియు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల ప్రాణ త్యాగాల ఫలితమే నేటి మన స్వాతంత్రం