Friday, 10 July 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్ బిజినెస్

ఉద్యోగ ఇంటర్‌వ్యూలో కష్టమైన ప్రశ్నలు , కొన్ని జవాబులు

ఉద్యోగ ఇంటర్‌వ్యూలో కష్టమైన ప్రశ్నలు , కొన్ని జవాబులు ఈ వారం ఆర్టికల్‌, ఉద్యోగ వేట లో ఉన్న మహిళలు, పురుషుల కోసం. యువత, ఫ్రెషర్స్ ‌మరియు అనుభవం ఉన్న ఉద్యోగాభ్యర్ధుల కోసం. సో మిత్రులారా, మీరు ఉద్యోగం వేటలో, అప్లికేషన్‌ ‌పెట్టు కున్నారు. వారు ఇంటర్‌ ‌వ్యూకి పిలిచారు. మొదటి రౌండు ఫిల్టరింగు, ఫంక్షనల్‌ ‌రౌండు, హెచ్చార్‌ ‌రౌండు ఇంటర్‌ ‌వ్యూలు అయి పోయాయి. వారు అడిగే అడ్డమైన ప్రశ్నలకు జవాబులు చెప్పారు. జనాభా ఎక్కువా, ఉద్యోగాలు తక్కువా ఉన్న మన భారత దేశంలో, అడిగేవాడికి (కంపెనీ వారికి) చెప్పేవాడు/చెప్పే ఆమె (అభ్యర్ధి(ని) లోకువ! ‘‘ఇంకో 5 ఏళ్ళ తరువాత నువ్వు ఫ్యూచర్‌లో ఎక్కడుంటావు, నీ ప్రణాళిక ప్రకారం ‘‘రేపేమి జరుగుతుందో ఎవరికి ఎరుక? కరోనా వచ్చి , మనని ఈ చొప్పదంటు ప్రశ్న అడిగిన హెచ్చార్‌ ‌మేనేజర్‌ ఉం‌టాడో, పోతాడో, నాలుగో రౌండులో మనకి కొత్త మొహం తగులుతుందో తెలియదు ! 5 ఏళ్ళ తరువాత మనం ఎక్కడుంటామట? ఇప్పుడు మీరివ్వబోయే ఉద్యోగం సరిగా చేయగలనా? లేదా? అది నిర్ధారించుకోండి? – అని చెప్పాలి అనిపిస్తుంది. అవసరం మనది కనుక నోటికి కుట్లేసుకుంటాము! ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు, మీ పంచ వర్ష ప్రణాళికలు ఏవైనా గానీ, బయట పెట్టే అవసరం లేదు! ‘‘ఈ కోవిడ్‌ ‌వచ్చాక రేపు ఏమి జరుగుతుందో తెలియదు. నేను అంత దూరం ఆలోచించ లేదు. ప్రస్తుతం ఈ ఉద్యోగానికి వచ్చాను. ఎంపిక అయితే బాగా చేయాలని ఉంది. ‘‘అంత వరకే చెప్పండి. ప్రస్తుతం ఈ ప్రపంచం ఉన్న పరిస్థితిలో ఈ సమాధానం ఓకే. మరొక పిచ్చి ప్రశ్న అడుగుతారు. మీ బలాలు ఏమిటి? ‘‘అని చెప్పవచ్చు. ‘‘మీ బలహీనతలు ఏమిటి?’’ అని కూడా అడుగుతారు !! ఏమి చెబుతాం? బలహీనత అని తెలిస్తే అది బలహీనత లాగ ఉండి పోదు కదా? దానిని ఇంప్రూవ్‌ ‌చేసుకునేందుకు ప్రయత్నిస్తాం. ‘‘నా బలహీనతలు ఏమిటో నాకంటే, నన్ను గమనించే ఇతరులకే బాగా తెలుస్తాయి. నాకు సహోద్యోగులు ఎవరైనా ఫీడ్‌ ‌బ్యాక్‌ ఇస్తే, తప్పని సరిగా దానిని స్వీకరించి సరి చేసుకుంటాను’’ అని చెప్ప వచ్చు. ‘‘అలాంటి సందర్భం ఇది వరలో ఎప్పుడైనా వచ్చిందా?’’ అని ప్రశ్నిస్తే, మీకు అటువంటిది జరిగిన సందర్భం షేర్‌ ‌చేసుకోచ్చు. ఉదాహరణకి ‘‘ నాకు బిగ్‌ ‌డాటా మీద అంత అనుభవం లేదు. మెరుగు పరుచుకొమ్మని చెప్పారు. అకాడమీలో చిన్న కోర్సులో చేరాను. ‘‘అనో లేదా పది మందిలో మాట్లాడేటప్పుడు నెర్వస్‌గా ఉన్నావు’’ అని చెప్పారు. ప్రాక్టీసు చేస్తున్నాను అనో, చెప్పవచ్చు. దాని వల్ల వచ్చే ఉద్యోగం రాకుండా పోదు. ఇది కొంచెం క్లిష్టమైన ప్రశ్న. ‘మీ బలహీనతలు ఏమిటి?’ అనేది. అవి లేని మనుషులు, ఉద్యోగులూ, ఉండరు. ‘నాకు బలహీనతలు లేవు’ అని చెప్పలేము! అలా అని ‘‘నన్ను ఇంటర్‌వ్యూ చేసే వారు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తే నాకు భలే కోపం!’ అని నిజాలూ చెప్ప లేము ! కాస్త గడుసుగా దాట వేయాల్సిన ప్రశ్న. నీ కెంత జీతం కావాలి? – అస్సలు కమిట్‌ ‌కాకండి . ‘‘ఈ ఉద్యోగానికి, మీ కంపెనీ పేరుకీ, ఈ పొజిషన్‌కీ, నా నుంచి మీరు ఆశించే పనికీ, నా అనుభవానికీ- తగినంత జీతం ఇస్తారనే భావిస్తాను. ఒక వేళ మీరు నన్ను సెలెక్ట్ ‌చేసుకుంటే – ఎంత ఇస్తారో మీరే ఆఫర్‌ ఇవ్వండి ! ‘‘ అని అది వాళ్ళ మీదే తోయండి. వారు ఇచ్చేది చాలక పోతే మరి కాస్త ఇమ్మని అడగవచ్చు. కాని మీ అంతట మీరు ‘నాకు ఇంత కావాలి’అని కమిట్‌ ‌కాకండి. రెండు విధాలుగా నష్ట పోవచ్చు! ఒక వేళ మీరు అడిగినది, వారు ఇవ్వదలుచుకున్న దానికన్నా ఎక్కువ అయితే, వారు మీకు ఆఫర్‌ ఇవ్వక పోవచ్చు. ఒక వేళ వారు ఇవ్వదలుచుకున్నది, మీరు అడిగిన దానికన్నా ఎక్కువ అయితే, మీకు ఉద్యోగం వస్తుంది కాని, మీరు నష్టపోవచ్చు! కాబట్టి మీరు కమిట్‌ ‌కాకండి! ఈ విధంగా, ఉద్యోగం కోసం జరిగే ఇంటర్‌ ‌వ్యూలలో అడిగే చిక్కు ప్రశ్నలని, చొప్పదంటు ప్రశ్నలని తెలివిగా ఎదుర్కోండి, అవసరం అయితే, దాటెయ్యండి. ఉద్యోగం వేటలో మీకు విజయం కలగాలని కోరుకుంటూ…

Featured ఆంధ్రప్రదేశ్ సక్సెస్ స్టోరీస్

‌ప్రతివారికి ఓ సామాజిక విలువ ఉంటుంది

‌ప్రతివారికి ఓ సామాజిక విలువ ఉంటుంది ప్రకృతి ప్రకారం అయితే మన పుట్టుకకు ఒక ప్రయోజనం, సార్థకత, అంటూ ఏమీ లేవు. మనం పుట్టినా పుట్టక పోయినా ఈ ప్రకృతికి వచ్చిన నష్టం ఏమీ లేదు. దాని పాటికి అది సాగి పోతూ ఉంటుంది. కోటాను కోట్ల జీవరాసులు ఈ నేల మీద పుడుతూ వుంటాయి, గిట్టుతూ ఉంటాయి. ప్రకృతి నియ మాలను తు.చ. తప్పకుండా వాటి పని అవి నిర్వర్తించి నిష్క్రమిస్తాయి. ఆ కోణంలో చూసిన ప్పుడు మనిషి జీవితం కూడా ఒక పురుగు, ఒక పక్షి, ఒక జంతువు లాంటిదే. మానవ జాతి కూడా మరో జీవ జాతి లాంటిదే. ప్రకృతిని పక్కన పెట్టి మనం మన దృష్టితో చూసుకున్నప్పుడు మన పుట్టుక ఇతర జీవ జాతుల మాదిరి సాధా సీదాగా ఉండదు. మనిషి తల్లి కడుపులో పడింది మొదలు తన ప్రమేయం లేకుండా అనేక అంశాలు పుట్ట బోయే బిడ్డ చుట్టూ అల్లుకొని ఉంటాయి. కుటుంబ నేపథ్యం, సామాజిక స్థాయి, ఆర్థిక స్థితిగతులు, వారసత్వపు కళాచారాలు (సంస్కృతి) మొదలయిన ఆపాదింపులతో పుట్టే సమయానికి బిడ్డలకు తెలియకుండానే ఒక సామాజిక ‘‘విలువ’తో పుడ తారు. మిగతా జీవుల పుట్టుకలకు మనిషి పుట్టుకకు తేడా ఇదే. ఈ విలువ ఒక్కొక్క బిడ్డకు ఒక రకంగా ఉంటుంది. ఒక బిడ్డ పుట్టుక కోసం ఆ జాతి మొత్తం (రాజకీయ వారసత్వం కోసం) ఎదురు చూడవచ్చు. తల్లిదండ్రుల సామాజిక ప్రాధాన్య తను బట్టి ఒక బిడ్డ పుట్టుక ఒక ప్రపంచ వార్త కావచ్చు. అలాంటి మరో బిడ్డ తల్లికి అవసరం లేకుండా పుట్టి కుప్పతొట్టి పాలు కావచ్చు. ఈ రెండు పుట్టుకలు ప్రకృతికి ఒకటే. కానీ ఒక పుట్టుక అత్యంత విలువగా, మరొకటి పనికిరాని పుట్టుకగా సమాం పరిగణిస్తుంది. అంటే ప్రకృతికి భిన్నంగా సమాజం ఉం టుంది. సమాజం అంటే ఏమిటి? సమాజం అంటే ‘తను’ కాక మిగిలిన జనం. అంటే కుటుంబం, చుట్టాలు, ఇరుగు, పొరుగూ, ఊరు, ప్రాంతం, దేశం, ఖండం వెరసి మొత్తం నేలపై ఉన్న మానవ జాతి. పుట్టుక, చావుల నడుమ కొంత కాలం బతుకు వెళ్ళదీయాలి. మిగతా జీవులు అయితే ప్రకృతిలో వెళ్ళదీస్తాయి. మానవుడు మాత్రం ప్రకృతితోపాటు తనలాంటి వ్యక్తుతో నిండి ఉన్న సమాజంలో నెట్టుకు రావాలి. సమాజంలో మనిషి ఒంటరి కాదు. మనుషుల మధ్య సంబంధాలు తప్పని సరి. ఇవి లేని మనిషిని భూమ్మీద ఊహించలేము. సంబంధాలు అనేక రకాలు. సంబంధాలు అంటే ‘తన’కు ఇతరుల పట్ల వున్న ‘పట్టింపు’ (శీఅవతీఅ) అలాగే తన పట్ల ‘ఇతరులు’ పట్టింపు. ఇద్దరి వ్యక్తుల మధ్య సంబంధాలు సజావుగా ఉన్నాయా లేవా అనేది ఇరు వైపుల నుండి ఒకరి పట్ల ఒకరికి ఉండే పరస్పర ‘పట్టింపు’ ఆధారంగా ఉంటాయి. పట్టింపు అనేది ఏ రూపంలో అయినా ఉం డవచ్చు. మచ్చుకు కొన్ని పట్టింపులు- ఇష్టం, ప్రేమ, అభిమానం, బాధ్యత, గౌరవం, చీదర, వ్యతిరేకత, ఈసడింపు, పగ, శత్రుత్వం, సంఘీ భావం ఇలా ఏదైనా కావొచ్చు. మన పట్ల ఎదుటి వారి ప్రవర్తనను బట్టి ఈ ‘అనిపింపులు’ (ఖీవవశ్రీఱఅస్త్ర) పుడతాయి. అలాగే మన ప్రవర్తన వల్ల ఎదుటి వారిలో ఈ తరహా అనిపింపులు పుడతాయి. ఒక వ్యక్తి పట్ల ఏదో ఒక అనిపింపు మాత్రమే ఉండాలనేం లేదు. ఒకటి కంటే ఎక్కువ అనిపింపుల కలగాపులపుగా ఉండ వచ్చు. మచ్చుకు- తండ్రిగా కొడుకు పట్ల బాధ్యత, కొడుకు చెడు చేష్టాల వల్ల వ్యతిరేక అనిపింపు. ఒక వ్యక్తి పట్ల మనకు ఉండే ఈ అనిపింపుల కలయికలతో ఏర్పడే ‘ఉమ్మడి అనిపింపు’ (శీఎఎశీఅ ఖీవవశ్రీఱఅస్త్ర) ను బట్టి ఎదుటి వ్యక్తికి మన మనసులో ఒక ‘‘మానవ విలువ’’  ను ఆపాదిస్తాము. ఒక వ్యక్తి ఎదుటి వారిని కొలవటానికి సరిగ్గా ఈ విలువనే ఉపయోగిస్తాడు. ఇది సదరు వ్యక్తిపట్ల తను ఏర్పాటు చేసుకున్న నిజమైన విలువ. దీన్ని బైటకు వెళ్ళబెట్టి వచ్చు లేకపోనూ వచ్చు. మానవ సంబంధాలు ఈ విలువ మీదే ఆధారపడి ఉంటాయి. ఇతరులతో మనకు ఉన్న మానవ సంబంధాలు రెండు రకాలుగా ఏర్పడతాయి. మొదటిది ‘కుటుంబ’ నేపథ్యం. ఇందులో సహజంగా సంక్రమించే రక్త సం బంధాలు, సామాజికంగా(పెళ్ళిళ్ళ ద్వారా) కలుపుకున్న చుట్టిరికాలు ఉంటాయి. రెండోది ‘పరిచయ’ నేపథ్యంలో ఏర్పడే ఇరుగూ పొరుగు, స్నేహి తులు, సహ ఉద్యోగులు తదితరులు. ఈ రెండు రకాల వ్యక్తులతో మనకు నేరుగా పరిచయం, సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఇవి కాక మూడో రకం బంధ వ్యాలు కూడా ఉంటాయి కానీ అవి నేరుగా వుండవు. కేవలం ఒకే వైపు ఆరాధన, ఇష్టం ఉంటాయి. మచ్చుకు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులుకు ఉండే అభిమానులు. ఎలా ఏర్పడినా మానవ సం•ం ధాలను విస్మరించి ఏ మనిషినీ ఊహిం చ లేము. ప్రకృతి పరంగా మనకు ఏ విలువ లేక పోయినా సమాజ పరంగా ప్రతి వారికి ‘సామాజిక విలువ’ అనేది ఉండి తీరుతుంది. మనం ఆ విలువ తోనే ఇతరులను కొలుస్తాము. మనల్ని ఇతరులు కొలుస్తారు. ఈ విలువ ముందు చెప్పినట్టు పుట్టుకతో రావచ్చు లేదా పుట్టాక సంపాదించుకోవచ్చు. – డా।।శ్రీనివాస తేజ

Featured ఆంధ్రప్రదేశ్

కరోనా రెండవ దశ కట్టడికై ఈ చర్యలు చేపట్టాలి

‌ప్రభుత్వాన్ని కోరిన ప్రజా ఆరోగ్య వేదిక గత సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా విజ్పింబించి , మన రాష్ట్రాన్ని కూడా కుదిపేసిన కరోనా మహమ్మారిని మరియు దాని వల్ల సంభవించిన మరణాలను ప్రభుత్వం సమర్ధవంతంగా సకాలంలో తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలో కరోనా మొదటి దశని కట్టడి చేయగలిగామని ప్రజా ఆరోగ్య వేదిక తెలియచేస్తున్నది. ఇప్పుడు మళ్ళీ కరోనా రెండవ దశ తీవ్ర రూపం దాల్చుతుంది. ప్రస్తుతం రెండవ దశ కరోనా సంఖ్యలో మనదేశం ప్రపంచం లో మూడవ స్థానంలో ఉంది. అనేక రాష్ట్రాలలో తీవ్ర రూపం దాల్చి రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో పరిస్థితులు విషమించడం వల్ల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చోట్ల మళ్ళీ లాక్డవున్లు మరియు కఠిన మైన కట్టడి చర్యలు ఇప్పటికే తీసకుంటున్నాయి. మనరాష్ట్రంలో కూడా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నందువల్ల కరోనా రెండవ దశ కట్టడికై ఈ క్రింది చర్యలు వెంటనే చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌ ‌రెడ్డికి ప్రజా ఆరోగ్య వేదిక విజ్ఞప్తి చేయుచున్నది. 1. టెస్ట్, ‌ట్రేస్‌ ‌మరియు ట్రీట్‌ (‌టిటిటి) కార్యక్రమాన్ని మళ్ళీ పూర్తిగా అమలు చేయాలి. టెస్టుల సంఖ్యని పెంచాలి. 2. కాంటాక్ట్ ‌సోర్సు వ్యక్తులను గుర్తించాలి. 3.వ్యాధి గ్రస్తులకు ప్రభుత్వ అ ఆధ్వర్యంలో పూర్తి వైద్యం అందించాలి. 4.కోవిడ్‌ ఆసుపత్రుల సంఖ్యను పెంచి తగినంత మంది వైద్యులు మరియు వైద్యేతర సిబ్బందిని నియమించాలి. 5. మందులు, పిపిఈ కిట్లు, లేబరేటరీలు లాంటి మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. 6. ప్రజలందరితో, వ్యాక్సిన్‌ ‌తీసుకున్న వారితో సహా ఎస్‌ఎంఎస్‌ (‌భౌతిక దూరం, మాస్కులు వాడటం మరియు చేతులు సానిటైజ్‌ ‌చేసుకోవడం) విధానాన్ని కచ్చితంగా అమలు చేయించాలి. 6. ‌ప్రజలందరితో, వ్యాక్సిన్‌ ‌తీసుకున్న వారితో సహా ఎస్‌ఎంఎస్‌ (‌భౌతిక దూరం, మాస్కులు వాడటం మరియు చేతులు సానిటైజ్‌ ‌చేసుకోవడం) విధానాన్ని కచ్చితంగా అమలు చేయించాలి. దీని అమలు కోసం ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. 7.కాలేజీ, స్కూళ్ళ యాజమాన్యాల వైఫల్యం మరియు విధానం సరిగా అమలు చేయక పోవడం వల్ల కరోనా వ్యాధి పెరుగుదలకు పాఠశాలలు మరియు కళాశాలలు కేంద్రంగా మారుతున్నాయి. కనుక ఎస్‌ఎంఎస్‌ ‌విధానం సరిగా అమలు చేయని యాజమాన్యాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అవసరమైతే తాత్కాలికంగా స్కూళ్ళు కాలేజీల నిర్వహణను నిలుపుదల చేయాలి. 8.బారులు, మధ్యం దుకాణాలు, మాల్స్, ‌బజారులు, పబ్లిక్‌ ‌మరియు ప్రయివేట వాహనాలలో ప్రయాణీకుల పట్ల, బస్‌ ‌స్టేషన్‌, ‌రైల్వే స్టేషన్‌ ‌ప్రాంగణాల వద్ద కోవిడ్‌ ‌కట్టడి ప్రోటోకాల్‌ అమలు చేయాలి. అమలు చేయని వారిపై చర్యలు తీసుకోవాలి 9. కరోనా వ్యాక్సిన్‌ ‌ప్రజలందరికీ ఉచితంగా అందించాలి. 10. కరోనా వ్యాక్సిన్‌ ‌వేయించుకోవడానికి ప్రజలు భయ పడుతున్న కారణంగా ప్రజలందరూ వేయించుకునే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలి. 11. గ్రామస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం వైద్యుల పర్యవేక్షణ లేకుండానే జరుగుతుంది. అలా కాకుండా ప్రాథమిక వైద్య సదుపాయాలతో, అంబులెన్స్ అం‌దుబాటులో, వైద్యుల ఆధ్వర్యంలోనే కరోనా వ్యాక్సిన్‌ ‌నేషన్‌ ‌జరిగే విధంగా చూడాలి. 12. కరోనా మొదటి దశలో వైద్య సేవలు అందించిన డాక్టర్లు మరియు వైద్య సిబ్బందిని మళ్లీ విధుల్లోకి తీసుకుని కరోనా వైద్యాన్ని ప్రజలకు అందించే విధంగా చూడాలి.

Featured

అనంత సాగరంలోకరోనా సెకండ్ వేవ్ పై అవగాహన ర్యాలీ

అనంతసాగరం మండలం: గ్రామంలోని ఉన్నత పాఠశాల హెచ్ఎం లక్ష్మీ ప్రసన్న గారు విద్యార్థినీ విద్యార్థులతో కలిసి కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో ప్రజలను జాగృతం చేసే ఈ విధంగా ర్యాలీ నిర్వహించారు .ఈ సందర్భంగా హెచ్ఎం లక్ష్మీ ప్రసన్న గారు మాట్లాడుతూ రెండో విడత కరోనా విజృంభిస్తుండడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలోని అన్నీ వీధులను విద్యార్థినీ విద్యార్థులతో కలిసి కోవిద్ 19 గురించి జాగ్రత్తలు వివరిస్తూ మాస్కు తప్పని సరిగా ధరించాలని, శానిటైజర్ లు వాడాలని వ్యక్తిగత దూరం పాటించాలని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నినాదాలు చేస్తూ గ్రామమంతా ర్యాలీగా ప్రచారం చేయడం జరిగింది అనంతరం తమ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థులకు 60 మందికి covid 19 పరీక్షలు చేయించడం జరిగిందని తెలిపారు. పిల్లలు అందరు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించి రావాలని ఆరోగ్యంగా ఉండాలని కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలలో కరోనా వ్యాక్సిన్ పై గల అభిప్రాయాలను అనుమానాలను తొలగిపోయేలా పిల్లలకు వివరించి వారి ద్వారా కరోనా వ్యాక్సిన్ తమ తల్లిదండ్రులు చుట్టుపక్కల వారు 45 సంవత్సరాలు పైబడిన వారు తీసుకునేలా వివరించాలని చెప్పారు .గత పది రోజుల నుంచి కూడా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం లో భాగంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వాటిలో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం కూడా చేయడం జరిగిందని తెలిపారు.

Featured ఆంధ్రప్రదేశ్ పిల్లలకు

‌ప్రతి దానికి సమయం ఉంటుంది

అనగనగా ఓ కుర్రవాడు. అతనికి ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా సంపాదించాలని తెగ కోరికగా ఉండేది. తన దాహాన్ని తీర్చేందుకు తగిన గురువు ఎక్కడ దొరుకుతారా అని, ఎదురుచూస్తూ ఉండేవాడు. ఇక ఎలాగైనా సరే… ఓ గొప్ప గురువు దగ్గరకి వెళ్లి అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించాలని బయల్దేరాడు. కుర్రవాడు అలా బయల్దేరాడో లేదో… అతని ఊరి చివరే ఒక పెద్దాయన కనిపించాడు. వెంటనే ఆయన దగ్గరకి వెళ్లి ‘నేను ఓ గొప్ప గురువు దగ్గర శిష్యరికం చేయాలనుకుంటున్నాను. మీకు అలాంటి గురువు ఎవరన్నా ఉంటే చెప్పగలరా!’ అని అడిగాడు. ‘ఓ దానిదేం భాగ్యం! నాకు తెలిసిన కొందరి పేర్లు చెబుతాను. వారి శిష్యరికంలో నీకు లాభం లభిస్తుందేమో చూద్దాం,’ అంటూ కొన్ని పేర్లు చెప్పాడు. పెద్దాయన చెప్పిన మాటలను అనుసరించి కుర్రవాడు ఆయా గురువులను వెతుక్కుంటూ బయల్దేరాడు. కానీ అదేం విచిత్రమో! ఎవ్వరి దగ్గరా తనకి కావాల్సిన జ్ఞానం లభించలేదు. అతని జ్ఞాన దాహం చల్లారలేదు. అలా ఒకరి తర్వాత ఒకరిని వెతుక్కుంటూ, గాలిపటంలా దేశమంతా తిరుగుతూ తన యాత్రలను సాగించాడు. ఎక్కడా అతనికి తగిన బోధ లభించలేదు. అలా ఒకటి కాదు రెండు కాదు పదేళ్లు గడిచిపోయాయి. అతని ప్పుడు కుర్రవాడు కాదు, యువకుడు! చివరికి నిరాశగా కాళ్లీడ్చు కుంటూ తన ఊరివైపు బయల్దే రాడు. యువకుడు ఊళ్లోకి అడుగుపెడుతుండగానే అతనికి ఒకప్పుడు తారసపడిన పెద్దాయన కనిపించాడు. కానీ ఎందుకనో ఆ పెద్దాయన మొహం చూడగానే ఆయన గొప్ప జ్ఞానిలా తోచాడు. ఆయన దగ్గరకి వెళ్లి మాట్లాడుతున్న కొద్దీ… తను ఇన్నాళ్లుగా వెతుకుతున్న గురువు ఆయనే అనిపించింది. ‘నేను పదేళ్ల క్రితం గురువుని వెతుక్కుంటూ మీ దగ్గరకి వచ్చినప్పుడే… మీరు నన్ను శిష్యుడిగా ఎందుకు స్వీకరించలేదు! నా జీవితంలో పదేళ్లు వెతుకులాటలో వ్యర్థం కాకుండా ఉండేవి కదా!’ అంటూ నిష్టూరమాడాడు యువకుడు. యువకుని మాటలకు పెద్దాయన చిరునవ్వులు చిందిస్తూ…. ‘నువ్వు పదేళ్ల క్రితం చూసినప్పటికీ, ఇప్పటికీ నేను పెద్దగా మారలేదు. మారింది నువ్వే! ప్రపంచమంతా తిరుగుతూ తిరుగుతూ నువ్వు అన్ని రకాల వ్యక్తులనూ చూశావు. ఏ మనిషి ఎలాంటివారు అని బేరీజు వేయగలిగే విలువైన నైపుణ్యాన్ని సాధించగలిగావు. ఆ నైపుణ్యంతోనే ఇప్పుడు నన్ను గుర్తించగలిగావు. అందుకే ఈ పదేళ్లు నాశనం కానేకాదు. ఏ విషయం మీదైనా ఆసక్తి ఉంటే సరిపోదు. దాన్ని నెరవేర్చుకోగలిగే నైపుణ్యం కూడా సాధించాలి. అప్పుడే నీ లక్ష్యాన్ని సాధించగలిగే అర్హత ఏర్పడుతుంది,’ అంటూ యువకుడిని తన శిష్యునిగా స్వీకరించాడు.

Featured ఆంధ్రప్రదేశ్ భక్తి

భక్తులు గుడి గడపకు ముందుగా ఎందుకు నమస్కరిస్తారు

సాధారణంగా ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద గర్భగుడిలోకి వెళ్లే ముందు ఉండే గడపలు రాయితో తయారు చేసి ఉంటారు. ఈ గడపకు ప్రతి భక్తుడూ నమస్కరిస్తుంటాడు. వాస్తవానికి ఇళ్లకు చెక్కతో తయారు చేసిన గడప ఉంటుంది. ఆలయాలకు అయితే రాయితో తయారు చేసిన గడప ఉంటుంది. ఆలయాలకు రాతితోనే ఎందుకు గడపను తయారు చేస్తారు. ఆ ఆలయ గడపకు ఎందుకు నమస్కరించాలి అని శీశీశ్రీ అమరేంద్ర స్వామి వారిని అడుగగా.. ఈ క్రింది విధంగా సెలవిచ్చారు. రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతం గానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయము గానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రి గానూ అవతరించారు. ఆ భక్తుల కోసం, వారి కోరిక ప్రకారం భగవంతుడు కూడా ఆ కొండలమీదే వెలిశాడని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ పర్వత రాళ్ళ నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలయ గర్భగుడులకు గడపగా పెట్టారని శాస్త్రాలు చెపుతున్నాయి. ఆ గడప నిత్యం దైవాన్ని దర్శిస్తూ ఉంటుంది. అలా అది ఎంతో పుణ్యం చేసుకుంది. అందుకే ఆ గడప రాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ, కొండ రాయిగా మారిన భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని వేడుకుంటూ గడపకు నమస్కరిస్తారని వేద పండితులు చెబుతారు. అందుకే ఆలయంలోని ప్రధాన గడప తొక్కకూడదని… కేవలం కుడి కాలు ముందు పెట్టి దాటాలని పెద్దలు సూచిస్తున్నారు.

Featured

దేశ ప్రగతి బి.జె.పి తోనే సాధ్యం

మనుబోలు (పున్నమి విలేఖరి)21, మార్చి:త్వరలో జరగనున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని భాజపా నాయకులు కోరినారు కుడితపల్లి గ్రామం నందు ప్రతి గడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వివరించి త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ప్రజలను కోరినారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లోని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు కరోన లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి పేదవాడికి నిత్యవసర సరుకులు అందజేసిందని అన్నారు కావున ప్రజలందరూ త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని అన్నారు .ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు మాధవి ,స్వాతి, శిల్ప జ్యోతి ,ధనలక్ష్మి ,జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు మండల అధ్యక్షుడు ఒడూరు శ్రీనివాసులు రెడ్డి నాయకులు కృష్ణారెడ్డి ,శేఖర్ ,వెంకయ్య సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

Featured

ప్రాణం తీసిన ఈత సరదా

అనంతసాగరం మండలం చిలకమర్రి గ్రామ సమీపంలో సోమశిల ఉత్తర కాలువ వద్ద మృత్యువాత పడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. సోమశిల ఎస్ఐ సి వి సుబ్బారావు గారి కథనం సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్దామని వచ్చిన వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ కు చెందిన కంబాల రవిశంకర్ (42) వైఎస్ఆర్ జిల్లా గోపవరం లో ఎం ఈ ఓ కార్యాలయం నందు కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సెలవు రోజు కావడంతో సరదాగా స్నేహితులు విష్ణు, వినోద్ కలిసి చిలకమర్రి సమీపంలో ఉన్న ఉత్తర కాలువలో ఈతకు దిగాడు. ప్రవాహం అధికంగా ఉండటంతో రవిశంకర్ , విష్ణు వినోద్ లు కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు అతికష్టం మీద వారిని వెలుపలికి తీశారు. వారిని వెలుపలికి తీసే లోపే అపస్మారక స్థితికి చేరుకున్నారు. రవిశంకర్ అప్పటికే మృత్యువాత పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఇరువురిని ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Featured విశాఖపట్నం

మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం తేవాలి –  నాయకులు శ్రీమతి మెహరున్నిసా,శ్రీమతి పుష్ప,శ్రీమతి రజిని

  విశాఖపట్నం, 21 మార్చి: కోవిడ్ మహమ్మారి తరువాత ఏర్పడిన దురదృష్టకర పరిస్థితులు వల్ల ఆదాయం కోల్పోయి అధిక వడ్డీలకు అప్పులు చేసి , అప్పులు తీర్చే మార్గం లేక అత్యంత దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్న బడుగు బలహీన దళిత వలస కుటుంబాల నుండి మహిళలు, వారి పిల్లలు అక్రమ రవాణాకు గురికాకుండా నిరోధించేందుకు వెంటనే కేంద్ర ప్రభుత్వ సమగ్ర అక్రమ రవాణా చట్టం రూపొందించి పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందే విధంగా చూడాలి అని అక్రమ రవాణా బాధితులతో ఏర్పాటైన రాష్ట్ర సమాఖ్య విముక్తి డిమాండ్ చేస్తుంది. ఆదివారం ఉదయం విశాఖ ప్రెస్ క్లబ్ లో విముక్తి రాష్ట్ర నాయకులు శ్రీమతి మెహరున్నిసా,శ్రీమతి పుష్ప,శ్రీమతి రజిని విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్ప్ కార్యదర్శి నిమ్మరాజు రామ్మోహన్ పాల్గొన్నారు . ఈ సమావేశంలో విముక్తి రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి మెహరున్నిసా మాట్లాడుతూ రాష్ట్రంలోని సుమారు 250 మంది అక్రమ రవాణా బాధితులు, సెక్స్ వర్కర్లతో 2018 లో “విముక్తి ” అనే సమాఖ్య ప్రారంబించారు అన్నారు . కోవిడ్ అనంతరం రాష్ట్రంలో అక్రమ రవాణా పెరిిగిందని అంటూ, కోవిడ్ అనంతరం ఉపాధి లేకపోవటంతో ఎన్నో కుటుంబాలు తమ పిల్లలని బాండెడ్ కూలీలుగా , ఇండ్లలో చాకిరి కోసం తరలి వెళ్తున్నారని ఫలితంగా వీరిపై నియంత్రణ నిఘా లేనందున వీరు అక్రమ రవాణాకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు..శ్రీమతి రజిని విముక్తి కో కన్వీనర్ మాట్లాడుతూ మనదేశంలో 2019 లో 2080 మంది అక్రమ రవాణా కు గురైనారని , అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 356 మంది(15.19%) అక్రమ రవాణా కు గురైనారు. ఈ 350 మంది లో 245 మంది వ్యభిచారం కోసం , 14 మంది బాలికలు బలవంతపు పెళ్లి కోసం , 31 మంది ఇండ్లలో పని, ఫ్యాక్టరీలలో పనికోసం మరో 60 మంది వివిధ ఇతర కారణాలు కోసం అక్రమ రవాణా కు గురి కావడం జరిగిందన్నారు. ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి మన రాష్ట్రంలో సుమారు1500 మంది అక్రమ రవాణా నుండి విడిపించటం జరిగిందని(2014 నుంచి 2019) వరకు కానీ వీరిలో ఇద్దరు మాత్రమే బాధితుల నష్టపరిహారం పథకం క్రింద నష్టపరిహారం అందుకున్నారు, మరి మిగిలిన బాధితులకు పరిహారం అందలేదు అని శ్రీమతి పుష్ప ఆందోళన వ్యక్ఘం చేశారు. క్రింద ప్రభుత్వం 2018లో అక్రమ రవాణా (నిరోధం, రక్షించడం మరియు పునరావాసం ) నిరోధక బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టి ఆమోదం పొందింది . కానీ రాజ్యసభలో ఆమోదం పొందక పోవడం వల్ల ఆ బిల్లు రద్దు అయ్యింది . కనుక వెంటనే సమగ్రంగా అన్ని రకాల అక్రమ రవాణా నిరోధిస్తూ బిల్ ను ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలో ప్రవేశ పెట్టాలని విముక్తి డిమాండ్ చేస్తుంది అని అన్నారు. ఆ బిల్లులో అక్రమ రవాణా బాధితులకు 1.కమ్యూనిటీ పునరావాసం కల్పించాలి కానీ షెల్టర్ హోమ్ లు వద్దు. 2.అక్రమ రవాణా బాధితులకు మానసిక ఆరోగ్య చికిత్సలు , సేవలు అందేలా చూడాలి. 3.అక్రమ రవాణా బాధితులకు నైపుణ్య అభివృద్ధి శిక్షణలు అందించాలి. 4.అక్రమ రవాణా బాధితులు సమాజంలో వివక్షత,చిన్న చూపు,పునరావాసం బాధ్యతలు గ్రామపంచాయతీ నుండి జిల్లా స్థాయి అధికారులు బాధ్యత వహించాలి,అందులో విఫలం అయితే ఆ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి . 5. 100% ట్రాఫికర్స్ కు కఠిన శిక్షలు పడే విధంగా చూడాలి. 6. ఈ కేసులు విచారణకు ఫాస్ట్ట్రాక్ కోర్టులు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి మా వినతి తో కూడిన డిమాండ్స్: 1. అన్ని రకాల అక్రమ రవాణాను నిరోధిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం లేదా బిల్లు తీసుకొని రావాలి. 2. అన్ని రకాల అక్రమ రవాణాలను బిల్లులో లేదా కొత్త చట్టంలో చేర్చాలి. 3. అక్రమ రవాణ కేసుల దర్యాప్తులో అంతర్రాష్ట్ర సమన్వయం ఉండాలి. 4. రెస్క్యూ చేసిన తరువాత బాధితులను బలవంతంగా షెల్టర్ హోమ్ లకు పంపించ కూడదు. 5. కమ్యూనిటీ పునరావాసం మరియు మానసిక ఆరోగ్యానికి సంబంధించి బిల్లులో నిబంధనలు ఉండాలి. షెల్టర్ హోమ్ లో కౌన్సిలింగ్ ఉపయోగపడదు 6.15 రోజుల్లోనే మద్యంతర నష్టపరిహారం ఇవ్వాలి, బాధితులకు పూర్తి మరియు తక్షణ బాధితుల నష్ట పరిహారం అందించాలి. 7. అక్రమ రవాణా దారులకు ఒక సంవత్సరంలోపు వెంటనే శిక్ష పడాలి. 8. అక్రమ రవాణా దారులకు మరణ శిక్ష లేదా జీవిత ఖైదు విధించాలి. 9. మైనర్ తో లైంగిక సంబంధం పెట్టుకున్న ప్రతి వారికి కఠినంగా శిక్షలు పడే విధంగా చూడాలి. 10. కోర్టులు (వేగవంతమైన విచారణ ద్వారా తీర్పు త్వరగా ఉండాలి మరియు అక్రమ రవాణా కేసుల్లో అప్పీలు చేయకూడదు). 11. బాధితులకు వ్యక్తిగతమైన, చట్టపరమైన ప్రాతినిధ్యం ఉండాలి. 12. అన్ని ఐ పి సి 370, 372, 373 లను అమలు చేయడానికి నిబంధన ఉండాలి నిబంధనలు అమలు చేయాలి. 13. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా ( వేధింపులు) జరిగితే ఆయా అధికారులకు శిక్ష విధించాలి. 14. ప్రత్యేక పునరావాస నిధి ఉండాలి. 15. బాధిత మహిళల పిల్లలకు సంస్థాగత /జిల్లా స్థాయి లో విద్యా సౌకర్యం కల్పించాలి. 16. శిక్షణ మరియు నైపుణ్య అభివృద్ధి కల్పించాలి. 17. రెస్క్యూ చేయబడిన బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. ఉపాధి విషయంలో సహాయం అందించాలి. 18. ఎం ఎం ఆర్ ఈ జి ఏ (MNREGA) కింద 200 రోజుల పని ఉండాలి.వేతనాలు సమయానికి అందించాలి. 19.బాధితులకు ప్రభుత్వ పథకాలు, ఇతర సహాయ సహకారాలు అందించాలి. 20.ప్రభుత్వం షెడ్యూల్ చేసిన తేదీ మరియు సమయానికి సమాధానం ఇవ్వాలి. ఆర్టీఐ స్పందన , జవాబుదారీతనం కట్టుబడి ఉండాలి. 21. బాధితులకు పారిశుద్ధ్య హక్కు, విద్యా , సామాజిక హక్కులతో సహా వలస సేవలు అందించాలి. 2020 సంవత్సరం మానవత్వ చరిత్రలో సెక్స్ వర్కర్లకు ఒక చెత్త సంవత్సరంగా ఉండనియ్యండి . కానీ రానున్న 2021 సంవత్సరాన్ని అయినా “మానవత్వ హక్కుల సంవత్సరంగా ” చేద్దాం. విముక్తి సభ్యులుగా ….మేము మన సమాజానికి మరియు మన దేశానికి ప్రతిజ్ఞ చేస్తున్నాము ……”మానవత్వం కోసం చేసే పోరాటంలో , సెక్స్ వర్కర్లుగా మేము అన్ని చెడు, స్వార్థ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అందరితో కలిసి పనిచేస్తాము”..

Featured

తప్పు ఎవరిది అధికారులదా కాంట్రాక్టర్ దా

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం: సోమశిల గ్రామంలోని మామిడి చెట్ల హిల్ కాలనీలో వేస్తున్న సిమెంట్ రోడ్డును ఆపివేసిన అధికారి గత 30 సంవత్సరాల ముందు వేసిన రోడ్డు రాళ్లు బయటపడి గుంటలు గుంటలుగా ఉండడంతో రోడ్డు వేస్తామని జె సి బి తో ఉన్న రోడ్డును ధ్వంసం చేసి మరమ్మతులు చేపట్టారు. తీర రోడ్డు పనులు ప్రారంభించగానే రోడ్డు పనులు ఆఫ్ చేయండి అంటూ అధికారులు చెప్పడంతో అక్కడ నివసించే జనాలు అవాక్కయ్యారు. ఇంతకాలానికి మా కాలనీలో సిమెంట్ రోడ్లు వేస్తున్నారని సంతోషపడే లోపే ఉన్న రోడ్లను నాశనం చేసి కొత్త రోడ్డును వేయకుండా ఆపి వేయడం వెనుక మర్మం అధికారులకే తెలియాలని,ఇక్కడ వేసిన రోడ్డు ఏ దొంగలు ఎత్తుకెళ్లారో ఆ అధికారులే చెప్పాలి.ఇక మా నడక ముళ్ళబాటేనా అయ్యా నాయకులారా మా మీద దయ ఉంచి కొత్త రోడ్లు వ్వేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ముసలి ముతకా పిల్ల జల్లా నడవలేక చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి అధికారులు మరియు నాయకులు ఈ రోడ్డు పనులు మరమ్మతులు చేయవలసిందిగా మామిడి చెట్ల కాలా నీ ప్రజలు కోరుకుంటున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.