Friday, 10 July 2026

Blog

Featured పిల్లలకు

తనశాంతమె-తనకురక్ష.డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్.

శాంతము గలవారు ఎంతటి కష్టతరమైన కార్యాన్నిసాధించగలరు . శాంతమూర్తులు దయాదాక్ష్యణ్యాలు, జాలీ,సానుభూతి, సేవాభావం, ఉపకారబుధ్ధికలిగిఉంటారు.”కోపమున ఘనత కొంచమైపోవును “అన్నాడు వేమన.”తనకోపమెతనశత్రువు-తనశాంతమె తనకురక్ష” అంటాడు సుమతిశతక కర్త.”శాంతమూ లేక సౌఖ్యములేదు”అంటారు త్యాగయ్య.కలహం,కలత-కల్లోలం-దౌర్జన్యం-భయం-దురాశ- ఇవన్ని మనిషికి నెమ్మదిలేకుండాచేస్తాయి.నిరాశ,నిస్పుహ,ఆవహింపబడి నరకప్రాయమైన జీవితం లభిస్తుంది.శాంతమూర్తిఅయినవారు సమాజపరంగా ఎంతోగౌరవింపబడతారు. శాంతమె జనులను జయము నొందించును శాంతముననె గురుని జాడతెలియు శాంత భావ మహిమ చర్చింప లేమయా విశ్వదాభిరామ వినురవేమ! శాంతమూర్తిఅయిన బుధ్ధుడు దేశాటనచేస్తూ అడవిమార్గన వెళుతూ,దారిలోని ఒచెరువు గట్టున ఉన్న చెట్టునీడలో ధ్యానంచేస్తూ కూర్చున్నాడు.అదేబాటన గుర్రంపైవెళుతున్న ఆదేశరాజు, ధ్యానంలోఉన్నబుద్ధునిచూసి “ఏయ్ దొంగసన్యాసి కళ్లుతెరువు పనికి సోమరులై తేరగాదొరికే తిండి తింటూ బ్రతికేవాళ్లు సమాజానికి చీడపురుగులు నీలానేనుఉంటే ఇన్ని భయంకరయుధ్ధాలు చేసేవాడినా ఇంతసువిశాల రాజ్యంస్ధాపించేవాడినా”అంటూ పలుదుర్బాషలాడాడు. కళ్లుతెరిచిన బుద్దుడు”కూర్చోండి మహారాజా నన్ను తిట్టి అలసిపోయారు. ఈచల్లని నీరుతాగి సేదతీరండి”అన్నాడు .రాజుకు కోపంపోయింది నేను ఇంతగా తిట్టినా ఇతను యింత శాంతంగా ఎలా ఉండగలిగాడు అనుకున్నాడు. అదిగమనించినబుద్దుడు చిరునవ్వుతో”నాయనా ఇంతకుమునుపు కొందరు తీపిపదార్ధాలు తీసుకువచ్చి నన్ను స్వీకరించమన్నారు.నేను తిరస్కరించాను.వాటినివారే తిరిగితీసుకువెళ్లారు.ఇప్పుడు అలనా నే నీతిట్లను నేను స్వీకరించడంలేదు”అన్నాడు.చేతులు జోడించిన మహారాజు “అయ్యనన్నుమీశిష్యుడిగా స్వీకరించండి.కోపము,ఆశ,అసూయ,భయం మొదలైనగుణాలు అశాంతికి గురిచేస్తాయి.సంతృప్తి,శాంతి,ప్రేమ ఆనందాన్నికలిగిస్తాయి అనితెలుసుకున్నాను.అన్నాడు .ప్రేమగా అతన్ని ఆశీర్వదించాడుబుధ్ధుడు.రాజుమనసు మారింది రక్తపాతాలుజరిపిన వాడు శాంతమూర్తిగామారిపోయాడు.బాలలు ఆరాజు ఎవరోతెలుసా? అతనే ‘అశోకచక్రవర్తి’ బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్.  

Featured

ఆపస్ ఆత్మీయ సన్మాన సమావేశం

అనంతసాగరం మండలం స్థానిక జె జె ఎన్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ( ఏపీ యు ఎస్) ఆధ్వర్యంలో ప్రమోషన్ పొందిన బదిలీ అయిన ఉపాధ్యాయులకు ఆత్మీయంగా సన్మాన సమావేశం నిర్వహించడమైనది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి పి సి వి రాఘవరెడ్డి ఉపాధ్యాయ సేవలో ఆపస్ అనంతసాగరం మండల శాఖ ఎనలేని సేవ చేస్తున్నది తెలియజేశారు. సన్మాన ఉత్సవంలో ప్రమోషన్ పొందిన బదిలీ అయిన ఉపాధ్యాయులు, మహిళాఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆపస్ సీనియర్ కార్యకర్త చల్లా. సుధారాణి గారు మహిళా కార్యకర్తలు తరుపున ఆనందం వ్యక్తం చేస్తూ ఆపస్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు చంద్రగిరి. శ్రీనివాసులు ఆర్ .వెంకటరమణా రెడ్డి, వి .రామకృష్ణ రెడ్డి అధ్యక్షులు మైలి. వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి డి .వెంకు రెడ్డి, పి. శింబు కృష్ణ, ఎం .వెంకటయ్య బి. వెంకటేశ్వర్లు. ఏఎస్ పేట. మర్రిపాడు, ఆత్మకూరు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

Featured

అవార్డ్ ఎన్.జి.ఓ వారిచే మాస్కుల పంపిణీ

అనంతసాగరం మండలం: అనంతసాగరం పోలీస్ స్టేషన్ నందు అవార్డ్ ఎన్.జి.ఓ వారి ఆధ్యంరంలో రిలయన్స్ ఫౌండేషన్ వారిచే 70 మాస్కులు ఎస్సై ప్రభాకర్ గారికి స్టేషన్ సిబ్బందికి పంపిణీీ చేయడం జరిగినది. తమ సిబ్బందికిి మాస్కులు పంపిణీీ చేసి నందుకు ఎస్ఐ గారు కృతజ్ఞతలు తెలిపేరు. ఈ కార్యక్రమంలో అవార్డ్ ఎన్ .జి. వో స్టాఫ్ డి.శరత్ బాబు.కె.వాసు హాజరయ్యరు.

Featured ఆంధ్రప్రదేశ్

శ్రీసిటీ గ్రామాల ప్రగతిపై సర్వే నివేదిక విడుదల  – లాంఛనంగా విడుదల చేసిన ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్

శ్రీసిటీ గ్రామాల ప్రగతిపై సర్వే నివేదిక విడుదల  – లాంఛనంగా విడుదల చేసిన ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర   శ్రీసిటీ, మార్చి 29, 2021:   శ్రీసిటీ పరిధి గ్రామాల ఆర్ధిక-సామాజిక ప్రగతిపై శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ బృందం నిర్వహించిన సర్వే నివేదిక విడుదల కార్యక్రమం సోమవారం శ్రీసిటీలో జరిగింది. స్థానిక బిజినెస్ సెంటర్ లో ఏర్పాటుచేసిన స్థానిక విలేకర్ల సమావేశంలో ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.రాజారెడ్డి లాంఛనంగా దీనిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరెడ్డి, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ప్రముఖ రచయత ఎం.భూమన్, సీనియర్ పాత్రికేయులు, సాహితీవేత్త ఉమామహేశ్వరరావ్ ముఖ్యఅతిదులుగా పాల్గొన్నారు.   ఈ సందర్భంగా కె.రాజారెడ్డి మాట్లాడుతూ, నేడు ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీసిటీ అభివృద్ధిని నేరుగా వీక్షించానని, అభివృద్ధి అబ్బురపరిచేలా ఉందన్నారు. ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో శ్రీసిటీ పరిసర గ్రామాల ప్రగతిపై చేసిన సర్వే వాస్తవ దృక్పథానికి చాలా దగ్గరగా ఉందన్న ఆయన, నివేదికలోని పలు ప్రధానాంశాలను చదివి వినిపించారు.    ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరెడ్డి  మాట్లాడుతూ, ఏ సంస్థ అభివృద్దికైనా సర్వేలు, గణాంకాలు చాలా అవసరమన్నారు. ఈ కోవలో శ్రీసిటీ చొరవ ప్రశంసనీయమన్నారు. శ్రీసిటీ పరిధి గ్రామాల అభివృద్ధికి కట్టుబడి నిష్పక్షపాత సర్వేలు చేయించి, అందుకు అనుగుణంగా తమ పనితీరును మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతున్నందుకు శ్రీసిటీ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. శ్రీసిటీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే పలు గ్రామాభివృద్ధి  చేపడుతోందన్న ఆయన, మరింత మెరుగైన అభివృద్ధికి పలు సూచనలు చేశారు.   శ్రీసిటీ భూసేకరణ సమయంలో పలు అనుమానాలతో  శ్రీసిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పలు కథనాలు వ్రాసానని, నేడు నా ఆలోచనలు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. విదేశీ ప్రరిశ్రమలతో దేశానికే తలమానికంగా అబ్బుర పరిచే అభివృద్ధి శ్రీసిటీ సొంతమైందని, ఇది ఎవరూ కాదనలేని సత్యమని వ్యాఖ్యానించారు. శ్రీసిటీ ఎన్నో పర్యావరణ హిత చర్యలు తీసుకుంటున్నా, పర్యావరణ సమతుల్యం దిశగా కొంత భూమిలో సేంద్రియ వ్యవసాయం చేసే ఆలోచన చేయాలని సూచన చేశారు.    వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి తలమానికం శ్రీసిటీ అంటూ భూమన్ అభివర్ణించారు. రాయలసీమ అభివృద్ధికి శ్రీసిటీ లాంటి ప్రాజెక్ట్ జిల్లాకు ఒకటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. 28 దేశాల పరిశ్రమలు ఇక్కడ కొలువుతీరడం వెనుక శ్రీసిటీ యాజమాన్యం శ్రమ, కృషిని ఆయన అభినందించారు. శ్రీసిటీ పరిధి గ్రామాలపై ఎస్వీ యూనివర్సిటీ బృందం చేసిన సర్వే ఎంతో ఆసక్తికరంగా, వాస్తవికతకు చాలా దగ్గరగా ఉందన్న ఆయన, ఇదే రీతిలో శ్రీసిటీ బయట ఇతర ప్రాంతాల అభివృద్ధిపై కూడా శ్రీసిటీ ప్రభావాన్ని సర్వే చేయాలని సూచించారు.    సర్వే నివేదిక చాలా సంతృప్తికరంగా ఉందని, అలాగే పలువురు ప్రముఖులు దీని విడుదల కార్యక్రమానికి విచ్చేయడం, వారి అభిప్రాయాలను వెలిబుచ్చడం ఆనందంగా ఉందన్నారు. నివేదిక సూచనల మేరకు మరింత చిత్తశుద్ధితో పరిసర గ్రామాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.    కాగా, ఎస్వీ యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో 3 నెలల క్రితం శ్రీసిటీ 18 గ్రామాలలో ఈ సర్వే నిర్వహించారు. సర్వే నివేదిక ప్రధానాంశాల మేరకు గ్రామాలలో కేవలం ఒక్క శాతం వారికి మాత్రమే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇంకా కల్పించబడలేదని తెలిపారు. గత పదేండ్లలో ఇక్కడ ప్రజల ఆదాయం రెండింతలకు మించి ఉందన్నారు. ఆర్ సీ సీ ఇండ్ల నిర్మాణాలు గణనీయంగా పెరిగాయన్నారు. క్రైమ్ రేట్ చాలా తగ్గిందని పేర్కొన్నారు. పరిసమాల్లో మహిళలకు వేధింపుల శాతం సున్నాగా తెలిపారు. గృహ హింస బాగా తగ్గుముఖం పట్టిందని అన్నారు. నీరు, గాలి నాణ్యత పెరిగాయన్నారు. విద్య, వైద్యం, రోడ్డు సౌకర్యాలు మెరుగయ్యాయని పేర్కొన్నారు. 

Featured పిల్లలకు

గణహీనుని విద్య అనవసరం :డా.బెల్లంకొండనాగేశ్వరరావు. చెన్నై.

గణహీనుని విద్య అనవసరం తనయింటి అరుగు పైచేరిన బాలలకు మిఠాయిలు పంచి ‘బాలలు సమాజానికి వినియోగపడని విద్య,ధనం,జీవితం అనవసరం. కోటిరూపాయలు సంపాదించి దాచుకోవడం వలన దాచిన వారే ఆనందించ గలుగుతారు.ఆధనంతోఒసంస్ధ స్ధాపించి పదిమంది బ్రతుకుతెరువు చూపించడంలో గొప్పతనంఉంది.సేవాగుణాన్ని సాటి ఈజగత్తులో మరేది లేదు.పద్యకథచెపుతానువినండి… హీనుడెన్ని విద్యలభ్యసించిన గాని ఘనుడు కాడు హీనజనుడు గాని పరిమళములు మోయ గార్దభము గజమౌనే విశ్వదాభిరామ వినుర వేమ! గుణహీనుడు ఎన్నిచదువులు చదివినా అనవసరం! పరిమళ ద్రవ్యాల మూటలు మోపున కట్టుకుని మోసినంత మాత్రాన గాడిద-గజరాజు కాలేదుకదా! పూర్వం అమరావతి అనేఊరిలో శివయ్య అనే అతను తనఅంతా శ్రమించి నీటి పైనడవగలిగే విద్యనేర్చుకున్నాడు. అదిప్రదర్మిస్తూ వచ్చినధనం తో పొట్టనింపుకుంటూ జీవిస్తూ, దేశాటన చేస్తూ ఓనగరం చేరుకున్నాడు. అక్కడ ఉన్న నదిలో తన విద్యప్రదర్మించి అందరిని యాచనచేస్తూచివరిగా ఒచెట్టుక్రింద స్వామిజి వద్దకు వచ్చాడు.ధ్యానంలోఉన్నస్వామిజి కళ్ళు తెరచి చూసేదాకాఆగి ‘స్వామి నేనుఅరవైసంవత్సరాలు శ్రమించి నీటిపైనడిచే విద్య అభ్యసించాను’అన్నాడు గర్వంగా.స్వామి చిరునవ్వుతో ‘నాయనా కొద్దిపాటి ధనం ఇస్తే పడవ లో సురక్షితంగా ఆవలి ఒడ్డుకు చేరుకోవచ్చు,నువ్యు ఇలా నదిలో నీటిపై నడవడం ఎంతప్రమాదమో ఆలోచించావా నీవిద్యప్రదర్మించేసమయంలో మొసలి వంటి జలచరాల వలన ప్రమాదం పొంచిఉంది.ఈవిద్యకోసం అరవైసంవత్సరాల జీవితం త్యాగం చేయాలా? ఇంతాచేసినేర్చినవిద్య నీకు ఎందుకు వినియోగపడు తుందియాచనకా? మనిషి జీవితం చాలా గొప్పది, నీతి, నిజాయితి, నిర్బయంగా,ఉన్నతంగా, ఆనందమయమైన జీవితం అనుభవించాలి,ఆసంతోషకరమైన జీవితంలో కొంతసమయ ం సమాజ సేవకు వినియోగించాలి. మనషి జీవిత లక్ష్యం అది, తెగిన గాలిపటంలా వెళుతూ లక్ష్యంలేని జీవితం అనుభవిస్తూ నువ్వు ఏంసాధించావు?’ అన్నాడు స్వామి.‘మన్నించండి స్వామి చెప్పే వారు లేక నా జీవితా సమయాన్ని అనవసరంగా నాశనం చేసుకున్నాను. శేషజీవితం సమయాన్ని సమాజ హితానికి వినియోగిస్తాను’ అన్నాడుశివయ్య. ‘నిజమే పెద్దలే పిల్లల అభిరుచి మేరకు వారి జీవిత గమనం, లక్ష్యం, నిర్దేశించాలి’ అన్నాడు స్వామి. ‘కథబాగుంది తాతయ్య’ అన్నారు పిల్లలు.’ బాలలు ఆస్వామి పేరు రామక్రిష్ణ పరమహంస’ అన్నాడు తాతయ్య. డా.బెల్లంకొండనాగేశ్వరరావు. చెన్నై.

Featured ఆంధ్రప్రదేశ్

మాస్క్ తప్పనిసరి. లేదా .250 ఫైన్‌ SP లకు డీజీపీ ఆదేశం*

*జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశం* మాస్కు ధరించని వారికి రూ.250 ఫైన్‌ కొవిడ్‌ నియంత్రణకు ప్రత్యేక బృందాలు ఒక్క రోజులో రూ.17 లక్షలు వసూలు అమరావతి, : ‘‘కరోనా తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టండి. మాస్క్‌ లేకుండా బయటికి వచ్చే వారికి జరిమానా విధించండి. వైరస్‌ వ్యాప్తికి కారకులయ్యేవారిని వదిలి పెట్టొద్దు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియ్‌సగా ఉన్నాయి. మనం(పోలీస్‌) కూడా అంతే శ్రద్ధగా పనిచేయాలి’’ అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్ని జిల్లాల ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కొవిడ్‌ విస్తరణ, నియంత్రణ చర్యలపై వరుస సమీక్షలు చేస్తున్న సవాంగ్‌.. ఆదివారం జిల్లాల ఎస్పీలు, విజయవాడ, విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మాస్క్‌లు లేకుండా బయటకు ఎవరొచ్చినా జరిమానా విధించకుండా వదిలి పెట్టొద్దని ఆదేశించారు. ఒకరిద్దరి నిర్లక్ష్యం వల్ల ఎక్కువ మందికి వైరస్‌ వ్యాప్తి చెంది ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని, మాస్క్‌ విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. కాగా, పోలీసులు చేపడుతున్న చర్యలన్నీ ప్రజల కోసమేనని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అతి కొద్ది మంది జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వైరస్‌ వ్యాప్తి పెరుగుతోందన్నారు. ఫంక్షన్లు వాయిదా వేసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా విద్యా సంస్థల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేల మందికి లక్షల్లో ఫైన్‌ కరోనా కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు గట్టి చర్యలు చేపడుతున్నారు. మాస్క్‌ లేకుండా రోడ్లపై తిరుగుతున్న 18,565 మందికి ఒక్క రోజులో రూ.17.34 లక్షల ఫైన్‌ విధించారు. మాస్క్‌ లేని వారికి రూ.250కి తగ్గకుండా జరిమానా విధించారు. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,327 మందికి ఫైన్‌ విధించగా తర్వాతి స్థానంలో ప్రకాశం 2,294, విజయవాడ సిటీ 2,106 చలానాలు రాశారు. అతి తక్కువగా విజయనగరంలో కేవలం 78 మందికి ఫైన్‌ విధించారు.

Featured ఆంధ్రప్రదేశ్

స్వామి అమ్మవార్లను దర్శించుకున్న… దేవాదాయశాఖ విశ్రాంత కమిషనర్

బుచ్చిరెడ్డిపాలెం మార్చి 28 ( పున్నమి విలేఖరి ) బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని జొన్నవాడ గ్రామంలో వెలసివున్న శ్రీ మల్లిఖార్జున స్వామి సమేత కామాక్షితాయి దేవస్థానమునకు దేవాదాయశాఖ విశ్రాంత కమీషనరు ఎన్ ముక్తేశ్వర రావు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారిని స్వాగతించి స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించి అనంతరం వారిని శేష వస్త్రముతో సత్కరించి, తీర్థ ప్రసాదములు అందజేసారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఆగి ఉన్న లారీని ఢీకొన్న టెంపో…. ఏడుగురు దుర్మరణం…..

బుచ్చిరెడ్డిపాలెం మార్చి 28 ( పున్నమి విలేఖరి ) మండలంలో దామరమడుగు వద్ద లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతులు తమిళనాడు వాసులు. చెన్నై నుంచి వచ్చిన వీరంతా ఆధ్యాత్మికయాత్ర ముగించుకుని నెల్లూరుకు పయనమయ్యారు. తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో దామరమడుగు శివారులోకి రాగానే పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆగిఉన్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపో ముందు భాగం నుజ్జునుజ్జవడంతో డ్రైవర్‌ గుర్నాథంతో పాటు, వాహనంలో ముందుకూర్చున్న మరో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన వారిని నెల్లూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరొకరు మృతి చెందారు. 8మంది గాయాలతో బయటపడ్డారు.. ప్రమాదం జరిగిన సమయంలో టెంపోలో 15 మంది ఉన్నారు. సమాచారమందుకున్న సీఐ సురేశ్‌బాబు మరియు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. డ్రైవర్‌ నిద్రమత్తు, పొగ మంచు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Featured

అనంతసాగరం మండలం: అనంతసాగరం ఎస్ఐ ఎన్. ప్రభాకర్ గారు తన సిబ్బందితో కలిసి అనంతసాగరం బస్టాండ్ సెంటర్ నుండి గంగుంట క్రాస్ రోడ్డు వరకు కరోనా పై అవగాహన కోసం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత అధికారుల సూచన మేరకు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండడంతో వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయని దగ్గర్లోని ఆత్మకూరు పట్టణంలో నెల్లూరు పాలెం నందు కూడా ఒక కేసు నమోదు అయిందని రెండవ దశ మొదలవడంతో ప్రజలలో మళ్లీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అలాగే ఈ రోజు నుండి ప్రతి ఒక్కరు కూడా మా మాస్కులు ధరించాలని వాహనాలు నడిపే వారు కూడా తప్పనిసరిగా మాస్కులను ధరించాలని అలా లేనియెడల వారికి ఫైన్ విధించడం జరుగుతుందని తెలిపారు. అనంతసాగరం మండల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాలని వ్యక్తిగత దూరం పాటించాలని శానిటైజర్లు వినియోగించుకోవాలని,2020లో కరోనా కట్టడిలో ప్రజలు ఎలా సహకరించారో అదేవిధంగా ఇప్పుడు కూడా సహకరించి కరోనా మహమ్మారికి దూరంగా ఉండాలని కోరారు.

Featured ఆంధ్రప్రదేశ్

దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ రద్దు చేయాలి

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆద్వర్యంలో ఏపీ జేఏసీ పిలుపు మేరకు వివిధ సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కార్యక్రమానికి సంఘీభావంగా ఈ రోజు మధ్యాహ్నం12.30 నిముషాలకు బోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం జేఏసీ చైర్మన్ సీ హెచ్ వీ ఆర్ సీ శేఖర్ రావు అధ్యక్షతన దర్గామిట్టలోని స్థానిక యన్ జీ ఓ భవనం నందు నిరసన కార్యక్రమంను ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంను ఉద్దేశించి శేఖర్ రావు మాట్లాడుతూ మా ప్రధాన డిమాండ్లు రైతు వ్యతిరేక చట్టాలను నిలుపుదల చేయాలని, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రవేటీకరణను ఆపాలనీ, దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ రద్దు చేయాలనీ, ఉద్యోగాల కల్పన చేస్తూ, కార్మికుల, ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలనీ, మన హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న ఈ పోరాటంలో ఏపీ టీయఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.వెంకటేశ్వరరావు ,జిల్లా యన్ జీ ఓస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి యన్ ఆంజనేయ వర్మ, అసోసియేట్ అధ్యక్షులు యన.గిరిధర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మన్నేపల్లి పెంచలరావు, కోశాధికారి బి.వెంకటేశ్వర్లు,జిల్లా ఉపాధ్యక్షులు జి.రమేష్ బాబు, యల్.పెంచలయ్య, యన్.మధు, సంయుక్త కార్యదర్శులు కే.రాజేంద్రప్రసాద్, ఈ.విజయకుమార్,జి.రామకృష్ణ, నగర అధ్యక్షులు యన్.వెంకటస్వామి, కార్యదర్శి చిలకా రామకృష్ణారెడ్డి,చెంచయ్య, సుబ్బరాయుడు, శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా లోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయడం జరిగినది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.