Friday, 10 July 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్

వాలంటీర్లను కట్టడి చేయండి: టిడిపి

వాలంటీర్లను కట్టడి చేయండి: టిడిపి వెంకటాచలం, ఏప్రిల్ 15 (పున్నమి విలేఖరి): నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వలంటీర్లను కట్టడి చేయాలని నెల్లూరు సిటీ టీడీపీ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. గురువారం వెంకటాచలంలో సర్వేపల్లి నియోజకవర్గ ఏఆర్వో దినేష్ కుమార్ ని కలసి వారు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సమస్యాత్మక గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఓటమి భయంతో వైసీపీ నేతలు విచ్చలవిడిగా నగదు పంపిణీ చేస్తున్నారని,వలంటీర్ల వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కమిషన్ ఎన్ని నిబంధనలు విధించినా అధికారులు అమలు చేయలేకపోతున్నారని మండిపడ్డారు. వైసీపీ కరపత్రాలు పంచుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వలంటీర్లపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోకుండా అభ్యంతరాలు తెలిపిన వారిపైనే పోలీసులు కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న వలంటీర్లను కట్టడి చేయందే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే పరిస్థితి లేదన్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ముత్తుకూరు మండలం పొట్టెంపాడులో పోలింగ్ కు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పై సమస్యల పై ఏఆర్వో సానుకూలంగా స్పందించారని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వారు వెల్లడించారు. లేనిపక్షంలో తమ పార్టీ తరపున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు.

Featured

ఆంధ్ర రాష్ట్ర శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి :మంత్రి ఆదిమూలపు సురేష్

మనుబోలు (పున్నమి విలేఖరి )13,ఏప్రిల్ : తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మనుబోలు లో నిర్వహించిన బహిరంగ సభకు పలువురు వైకాపా అగ్రనాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాబోయే ఉప ఎన్నిక ఏకపక్ష మే అన్నారు టిడిపి అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిక్షణం అడ్డు పడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో శాస్వత ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఉండి పోతారని జోస్యం చెప్పారు. అదేవిధంగా టిడిపి రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతుందని తెలిపారు .ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన రెడ్డి నాయకత్వంలో లో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తోంది అన్నారు 29 కోట్లతో బండేపల్లి కాలువ పనులను ప్రారంభించామన్నారు మండల కేంద్రమైన మనుబోలు లో ఈ 20 నెలల కాలంలో 50 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. చంద్రబాబు నాయుడు పొదలకూరు లో ఊరేగి నన్ను జగన్మోహన్ రెడ్డిని తిట్టి వెళ్లిపోయారని అభివృద్ధి సంక్షేమం ఏమి చేశారో చెప్పలేదు అని విమర్శించారు. శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే వృధాయే అన్నారు. దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి గా జగన్ మోహన్ రెడ్డి నిలిచిపోతారు అన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా వైకాపా గెలుపొందుతుందన్నారు. ఉప ఎన్నికల్లో చంద్రబాబుకు 20 శాతం ఓట్లు రానున్నాయని జోస్యం చెప్పారు గురుమూర్తి నీ అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు్ పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ గురుమూర్తి గెలుపుకు గ్రామ గ్రామాల నాయకులు కృషి చేయాలన్నారు 2019 నుండి చంద్రబాబుకు మతిభ్రమించింది అని విమర్శించారు రాబోయే ఉప ఎన్నికల్లో 90 శాతం పోలింగ్ అయ్యేందుకు నాయకులు కృషి చేయాలన్నారు అధికారం చేపట్టిన 20 నెలల కాలంలో 95శాతం హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి లో దశాబ్దాల కాలంగా తమకు సంబంధం ఉందని రైతుల సంక్షేమం కోసం పాటు పడుతున్నారని తెలిపారు గత రెండు సంవత్సరాలుగా సంక్రాంతి వైభవంగా జరుగుతుందంటే జగన్మోహన రెడ్డి పుణ్యమే అని అన్నారు వైకాపా ప్రభుత్వాన్ని గత ఎన్నికల్లో ఆదరించినట్లు తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా గురుమూర్తి కి అత్యధిక మెజార్టీ వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఎమ్మెల్సీ గంగులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అతి సామాన్యుడు కు ఎంపీ టికెట్ ను ప్రసాదించాలని ప్రతి ఒక్కరూ సామాన్యుడైన గురుమూర్తి గెలిపించాలని వేడుకొన్నారు టిడిపి ప్రభుత్వంలో ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో కర్నూల్ మేయర్ రామయ్య భారీగా మనుబోలు మండల వ్యాప్తంగా వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Featured

భవననిర్మాణ కార్మికునికి ఆర్ధిక చేయుత:పులి చెంచయ్య

భవననిర్మాణ కార్మికునికి ఆర్ధిక చేయుత. గతవారం నెల్లూరు . వెంకటేశ్వరపురం లో బిల్డింగ్ కి పెయింటింగ్ వేస్తూ ప్రమాదవశాత్తు రెండవ అంతుస్తు నుండి క్రింద పడి తీవ్రంగా గాయపడిన రాచగిరి చెంచయ్య యొక్క ధీనస్ధితిని తెలుసుకుని వారి కుటుంబానికి రెండు నెలల సరిపడా నిత్యావసర సరుకులు మరియు 1000/- రూపాయలు వారి నివాసం ఆయిన ధీన్ ధయాళ్ నగర్ కు వెళ్లి ఇవ్వడం జరిగింది. మరియు వారి ఇద్దరు పిల్లలను (బడి మానేసారు) గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చేర్పిస్తామని పులి చెంచయ్య SC/ST గజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పేర్కొన్నారు.అలాగే ఈ సంఘటన వాట్సాప్ లో చూసి వెంటనే స్పందించిన పోచరెడ్డి సురేష్ మరియు సింగపూర్ కమ్యూనిటి అసిస్టెన్స్ గ్రూపు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు అరవ రత్నం(CI excise) . మల్లికార్జున గారు . స్ధానిక భవననిర్మాణ కార్మిక సంఘం నాయకులు సర్తాజ్ . రఫీ . దస్తగిరి. మరియరాజు. ఆవుల ప్రణీత్ స్ధానిక మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

2021-22 రాష్ట్ర జీడీపీలో కనీసం 4 శాతం బడ్జెట్ ఆరోగ్యంపై కేటాయించాలని మనవి :ప్రజారోగ్య వేదిక

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి దివ్య సముఖమునకు _______________________________ ఆర్యాా ! విషయం:  2021-22 రాష్ట్ర జీడీపీలో కనీసం 4 శాతం బడ్జెట్ ఆరోగ్యంపై కేటాయించాలని విజ్ఞప్తి. ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రజలందరికీ ఏప్రిల్ 7 పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తుంది.  ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ  “ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం”. (Building a fairer, healthy world)అనే నినాదాన్ని ప్రకటించింది. కావున ప్రజలు మరిియు ప్రభుత్వాలు దీనిలో భాగస్వామ్యం కావాలని ప్రజా ఆరోగ్య వేదిక కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ క్రింది సూచనలను చేస్తుంది. 1. రాష్ట్ర జీ.డీ.పీ లో కనీసంగా నాలుగు శాతాన్ని ఆరోగ్య రంగానికి కేటాయించాలి. 2. వ్యాప్తి చెందుతున్న రెండవ దశ కోవిడ్ రోగులకు మొదటిిి దశలో లాగానేేేే ప్రభుత్వ వైద్యులు మరియు  ఆరోగ్య సిబ్బంది నియామకాలను చేయడం, ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేయడం, లేబరేటరీ ల సంఖ్యను పెంచడం, మందుల సేకరణ లాంటి కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. 3.కోవిడ్ వారియర్స్ కు పి. పి. ఈ కిట్లను మరియుుుు మాస్కులను  అందుబాటులో ఉంచాలి. 4.అన్ని జిల్లాలలో  నాన్ కోవిడ్ సేవలను యధాతధంగా నిర్వహించే ప్రణాళికను అమలు చేయాలి. 5. వ్యాక్సినేషన్  కార్యక్రమాన్ని వికేంద్రీకరించి సచివాలయ స్థాయికి తీసుకెళ్లి  నిర్వహించడాన్ని అభినందిస్తున్నాము. ప్రతి కేంద్రంలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రజలు కనీసం 30   నిమిషాలు విశ్రమించే ఏర్పాట్లుు తోపాటు వ్యాక్సిన్ తీసుకున్నవారిని పర్యవేక్షించేందుకు తప్పనిసరిగా వైద్యుని అందుబాటులో ఉంచాలి. 6. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎవరికైనా అత్యవసర సమస్యలు వస్తే వారిని వెంటనే ఆసుపత్రికిి తరలించేందుకుు అవసరమైన  రవాణా సౌకర్యం అందుబాటులో ఉంచాలి. 7. వ్యాక్సినేషన్   సెంటర్లలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత లేకుంండా చూడాలి. 8.జాతీయ ఇమ్యునైజేషన్ లో భాగంగా చిన్న పిల్లలకు షెడ్యూల్ టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని యధావిధిగా అన్ని జిల్లాలలో జరిగేే  విధంగా చర్యలు చేపట్టాలి. 9. కరోనా మొదటి దశలో ప్రభుత్వం స్పందించిన తీరుగానే ఇప్పుడు రెండవ దశలో కూడా వ్యాప్తి చెందుతున్న కరోనా కట్టడికి అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రులను కూడా ఉపయోగించుకొని సేవలను కొనసాగించాలిి. 10. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నాణ్యమైన సరుకులను సకాలంలో ఇవ్వడం జరగాలి. 11. కరోనా మొదటి దశలో సేవలందించి, మంచి అనుభవం గడించిన కాంట్రాక్ట్ సిబ్బందిని  మరలా ఉద్యోగాల లోకి తీసుకోవాలిి. 12. వ్యాక్సినేషన్   చేయించుకున్న  వారిలో  వ్యాక్సిన్ ఫలితాలు మరియు సమస్యల సమాచారాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పడు విడుదల చేసి ప్రజలలో కరోనా వ్యాక్సిన్ పట్ల విశ్వాసం పెంచాలిి. 12.  టెస్ట్, ట్రేస్ మరియుు  ట్రీట్  విధానాన్ని విస్తృతం చేయాలి.అలాగే టెస్టుల సంఖ్యను పెంచాలి. మరియు ఎస్ .ఎం .ఎస్ అవసరం పట్ల, భౌతిక దూరం పాటించడం, మాస్క్ వేయించడం, సబ్బుతో చేతులు కడగడం లాంటి  కరోోన నివారణ మార్గాలపై అవగాహన పెంచడం పై మరింత ప్రచారం చేయాలి . డాక్టర్ ఎం.వి . రమణయ్య రాష్ట్ర అధ్యక్షులు ప్రజారోగ్య వేదిక టి కామేశ్వరరావు రాష్ట్ర ప్రధాాన కార్యదర్శి ప్రజారోగ్య వేదిక

Featured

మనుబోలు లో ఘనంగా భాజపా ఆవిర్భావ దినోత్సవం

మనుబోలు( పున్నమి విలేఖరి)6,ఏప్రియల్ :భారతీయ జనతా పార్టీ 38 వఆవిర్భావ దినోత్సవ వేడుకలను మనుబోలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల శాఖ అధ్యక్షుడు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి ,జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు ఆద్వర్యంలో మనుబోలు బైపాస్ కూడలి నందు బిజెపి రాష్ట్ర నాయకురాలు బైరెడ్డి శబరి బిజెపి జెండాను ఆవిష్కరించారు . అనంతరం నాయకులు మాట్లాడుతూ శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ ఏ ఉద్దేశంతో పార్టీని స్థాపించారో ఆయన ఆశయాలకు అనుగుణంగానే నేడు భారత ప్రధాని నేరంద్రమోడీ ముందుకు తీసుకెళ్లుతున్నట్లు పేర్కొన్నారు. దేశం కోసం ధర్మ కోసం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నట్లు వివరించారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి నేడు దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతుండటంతో పాటు ప్రపంఛంలోనే అతి ఎక్కువ సభ్యత్వం కల్గిన అతి పెద్ద పార్టీగా బిజెపి కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో నూతనంగా దేశ పరిపాలన రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, అమలు చేసిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి వెళ్లి నాయకులు ప్రజలందరికీ తెలియజేయాలని అన్నారు .ఈ కార్యక్రమంలో నాయకులు వీర ప్రతాప్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు .

Featured

నవరత్నాలు పేదలపాలిట వజ్రాలు వైకాపా: ఎంపిటిసి అభ్యర్థి సుధాకర్ రెడ్డి

నవరత్నాలు పేదల పట్లవజ్రాలు:ఎంపిటిసి అభ్యర్థి అల్లంపాటి సుధాకర్ రెడ్డి అనంతసాగరం మండలం: అనసాగరం గ్రామపంచాయతీ సెగ్మెంట్ బిట్_2 వైకాపా ఎంపీటీసీ అభ్యర్థి అల్లం పాటి సుధాకర్ రెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పంచాయతీలోని ఇంటి ఇంటికి వెళ్ళి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నవరత్నాలు పేదల పట్ల వజ్రాలని, ప్రజలు కష్టాలు తెలిసిన నాయకుడు మన ప్రియతమ నాయకుడు సియం వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారని కొనియాడారు.

Featured

రైతు ఉత్పత్తి దారుల శ్రేయస్సే నాబార్డు లక్ష్యం :నాబార్డ్ ఏజీఎం రవి సింగ్

అనంతసాగరం మండలం: రైతు ఉత్పత్తి దారుల సంఘం యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో నాబార్డ్ ఏజీఎం రవి సింగ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని సమీక్ష సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు ఉత్పత్తి దారుల సంఘాలు వాటాధనాన్ని ఎక్కువ పెంచుకుని ని షేర్ క్యాపిటల్ మెరుగుపరుచుకోవాలని సూచించారు. వ్యవసాయానికి కావలసిన యంత్ర పరికరాలు, పనిముట్లు ,విత్తనాలు మరియు ఎరువులు సస్యరక్షణ మందులు ఎఫ్ పి ఓ ల ద్వారా తెచ్చుకుంటే ఆర్థిక భారం తగ్గుతుంది. ఎఫ్ బి ఓ లకు నాబార్డు ద్వారా ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని రైతులకు భూసార పరీక్షలు చేయిస్తామని రైతులకు కావలసిన ప్రాసెసింగ్ యూనిట్లు శీతల గిడ్డంగులు గోదాములు మౌలిక వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నాబార్డు వారు రైతు ఎఫ్ బి ఓ లకు బ్యాంకుల నుండి హార్టికల్చర్ అగ్రికల్చర్ తదితర శాఖల నుండి వచ్చే నిధులను ఇప్పించగలరని తెలిపారు. నాబార్డు ద్వారా కొన్ని స్కీములు 70 శాతం మరియు 50 శాతంలతో సహాయం చేయగలరు అని చెప్పినారు. ఈ సమావేశంలో అవార్డ్ ఎన్జీవో డైరెక్టర్ ఎం రమణ గారు మాట్లాడుతూ అనంతసాగరం రైతు ఉత్పత్తిదారుల సంఘం నిర్వహణకు నాబార్డు వారి ఆర్థిక సహాయంతో మరియు సంఘం యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క సహకారంతో ఎఫ్ పి ఓ అన్ని విధాల ముందుకు తీసుకుపోగలమని మరియు ఎఫ్ డి ఓ లోని రైతులకు అవసరమయ్యే అన్ని ప్రయోజనాలను చేకూర్చాలని భరోసా ఇచ్చారు. ఎఫ్ బి ఓ యొక్క అధ్యక్షులు “అక్కల రెడ్డి అంకిరెడ్డి” గారు మాట్లాడుతూ వెనుకబడిన మా ప్రాంతమునకు నాబార్డు వారి సహాయంతో అవార్డు ఎన్జీవో వారు సంఘాన్ని ఏర్పాటు చేసి మా యొక్క అభివృద్ధికి దోహదపడుతుంది అందుకు ధన్యవాదాలు తెలియజేశారు .ఈ ఎస్ పి ఓ కు ముఖ్యంగా పండించే పంటలకు బొప్పాయి మిర్చి నిమ్మ మరియు తదితర పంటలను నిల్వ ఉంచుటకు కోల్డ్ స్టోరేజ్ లు మరియు సరుకు రవాణాకు వాహనమును మరియు పండించిన పంటకు గిట్టుబాటు ధర మరియు దళారీ వ్యవస్థ నుండి కాపాడాలని కోరారు ఈ సమావేశంలో శాఖమూరి సుబ్బారావు గారు ,నర్రా వెంకట్రామయ్య, రామానుజుల రెడ్డి , పెంచల్ రెడ్డి, తదితర బి ఓ డి ఎస్ పాల్గొన్నారు. మరియు ఎఫ్ పి ఓ సి ఈ ఓ డి.శరత్ బాబు, అవార్డ్ ఎన్జీవో స్టాఫ్ కె వాసు మరియు స్థానిక ఎన్జీవో కె. రమణయ్య తదితర రైతులు పాల్గొన్నారు.

Featured Others

అభివృద్ధి, శాంతి కోసం క్రీడల అంతర్జాతీయ దినోత్సవం

అభివృద్ధి, శాంతి కోసం క్రీడల అంతర్జాతీయ దినోత్సవం ఐక్యరాజ్య సమితి 2013లో ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 6‌వ తేదిని అభివృద్ధి శాంతి కోసం క్రీడల అంతర్జాతీయ దినోత్సవం నిర్వహించాలని తీర్మానించింది. 2014లో తొలి ఏడాది ఆ దినోత్సవం యూనెస్కో మార్గదర్శకత్వంలో విజయవంతమైంది. క్రీడలకు పోటీలుగా, శారీరక వ్యాయమంగా, వినోదంగా ఎంతో చరిత్ర వుంది. క్రీడలు మానవ హక్కులలో భాగం కాబట్టి వాటిని అందరికి అందుబాటులోకి తీసుకురావాలి. ప్రభుత్వాల మధ్య అతిస్వల్ప ఖర్చుతో మానవ సంబంధాలు, వివక్ష నిర్మూలన, అభివృద్ధి, శాంతి స్థాపన ప్రయత్నాలకు క్రీడలు దోహదపడుతున్నాయి. ఈ సందర్భముగా ప్రభుత్వాలు మానసిక, శారీరక, సామాజిక అభివృద్ధికి దోహదపడే క్రీడల్ని అన్ని స్థాయిల్లో ప్రోత్సహించాలి.

Featured

ఘనంగా బిజెపి జిల్లా నాయకులు బోలా జన్మదిన వేడుకలు

మనుబోలు (పున్నమి విలేఖరి)1,ఏప్రిల్: నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కాగితాల పూర్ గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు బోలా శ్రీనివాసులు 47 జన్మ దినాన్ని పురస్కరించుకొని మనుబోలు శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి ఆలయం వద్ద జిల్లా బిజెపి నేత బోల శ్రీనువాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలను నాటారు. జిల్లా బిజెపి నేత బోలా శ్రీనివాసులు జన్మదిన సందర్భంగా బిజెపి నాయకులు ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి ఎదిగిన బోలాను పలువురు బీజేపీ నేతలు అభినందించడం విశేషం .మండల వ్యాప్తంగా బిజెపి నాయకులు జిల్లా బిజెపి నేత పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బిజెపి నాయకులు మాట్లాడుతూ బోలా శ్రీనివాసులు వివాదరహితుడిగా అని మంచి మనిషి అని అందరినీ పార్టీలో కలుపుకొని పోయేవ్యక్తి అని దాదాపు 30 సంవత్సరాల నుంచి బిజెపి పార్టీలో పనిచేస్తూ బిజెపి పార్టీ అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని అన్నారు దేశభక్తి భారతీయ సంస్కృతి పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకుఅనేక పదవులు నిర్వహించారని భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని అని తెలిపారు . ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి,ప్రతాప్, చల్ల లక్ష్మయ్య, ఆంజనేయులు కృష్ణారెడ్డి ,పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Featured

ఉచిత పంటల భీమ అతెన్టికేషన్ పూర్తి

అనంతసాగరం మండలం: సచివాలయం 1గ్రామ ఉద్యాన సహాయకురాలు మై మున్నీసా గారు గత ఏడాది ఖరీఫ్ 2020సీజన్లో ఉచిత పంటల బీమా కింద వేరుశనగ, సజ్జలు, వరి పంటలు వేసిన రైతుల చేత అతెన్టీకేషన్ వేయించడం జరిగింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.