(పున్నమి ప్రతినిధి) కార్యకర్తల నివాసాలకు వెళ్ల వారి కష్ట సుఖాలను తెలుసుకునేందుకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేపట్టిన జగనన్న మాట ` కార్యకర్తల ఇళ్లకి కోటంరెడ్డి బాట గురువారం 37వ డివిజన్‌లో 59వ రోజు సాగింది. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డివిజన్‌లోని క్రాంతినగర్, రాంనగర్, మిలటరీ కాలనీ ప్రాంతాల్లో స్వయంగా కార్యకర్తల ఇళ్లకు వెళ్ళి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీలో పనిచేసే కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యకర్తలకు అండగా తానున్నానంటూ వారికి భరోసా ఇచ్చారు. కార్యకర్తల ఇళ్లకి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకు రావాలన్నారు.
(పున్నమి పత్రినిధి, బుచ్చి) వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈనెల 23వ తేదిన వేలం పాట నిర్వహించనున్నట్లు ఎస్‌ఈబీ సీఐ సూర్యనారాయణ తెలిపారు. వాహనాల వేలంకు సంబంధించిన వివరాలను ఆయన విలేకరులకు వివరించారు. బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్ పరిధిలో పట్టుబడిన 14 వాహనాలు, ఆత్మకూరులో పట్టుబడిన 15 వాహనాలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదిన బుచ్చి ఎస్‌ఈబీ కార్యాలయంలో ఈ వేలం నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల వారు వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. వేలం పాటలో పాల్గొనే వారు పది శాతం రుసుమును చెల్లించడంతో పాటు ఆధార్, పాన్‌కార్డు దృవీకరణ పత్రాలు అందచేయాల్సి ఉంటుందన్నారు. ఇదే పద్ధతిని జిల్లా అంతా ఆచరిస్తే బాగుంటుందని జిల్లా పజ్రలు కోరుకుంటున్నారు.
నెల్లూరు జిల్లా ముస్లింలంతా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఎల్లప్పుడు రుణపడి ఉంటామని ముస్లిం నాయకులు సయ్యద్ సమీ అన్నారు. ఆధునిక భారత దేశంలో ఎక్కడా కట్టనటువంటి విధంగా ఈ ఈద్గా నిర్మాణం చేపడుతున్నామన్నారు.నగరంలోని బారాషాహీద్ దర్గాలో నిర్మాణంలో ఉన్న ఈద్గా పనులను మార్చి 25 నాటికి పూర్తి చేస్తామని అన్నారు. ఆరోజు రూరల్ శాశసన సబ్యలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి చేతుల మీదుగా ముస్లిం జాతికి అంకితమిచ్చే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఆధునిక భారత దేశంలో ఇలాంటి ఈద్గాని ఎక్కడా కట్టలేదన్నారు. ఈ ఘనత కేవలం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ ఈద్గాని ముస్లిం జాతికి అంకితం చేసే కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పీఠాధిపతులను పిలుస్తామని తెలిపారు. ఈ ఈద్గా నిర్మాణానికి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎంతో కృషి చేశారని ప్రసంశించారు.
*సచిన్ దత్తత గ్రామం పుట్టంరాజువారి ఖండ్రిగలో తాగునీటి సమస్య పరిష్కరించండి .సచిన్ దత్తత గ్రామం పుట్టంరాజువారి కండ్రిక లో తాగునీటి సమస్య వెంటాడుతుంది. గత ఏడాది కురిసిన భారీ వర్షాలు, వరదలకు అక్టోబర్ మాసంలో గ్రామానికి తాగునీరు సరఫరా చేసే పైపులైన్లు ధ్వంసమయ్యాయి. అప్పటి నుంచి తాగునీటి సౌకర్యం లేక పుట్టంరాజువారి కండ్రిక వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే సమస్యలను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం లేదు . దీంతో కొమ్మనేటూరు ఎంపిటిసి గడ్డం సహదేవ్ సమస్యను ఎంపీ గురుమూర్తి దృష్టికి తీసుకు వచ్చారు. కొమ్మనేటూరు పంచాయతీ పరిధిలో ఓ పరిశ్రమ ప్రారంభానికి వచ్చిన ఎంపీ గురుమూర్తి సమస్యను వివరించారు. సుమారు 130 గడప ఉన్న గ్రామంలో ఆరు నెలలుగా తాగునీరు సరఫరా చేయడం లేదని చెప్పారు. దీంతో ఎంపీ గురుమూర్తి సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించి తాగునీరు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి ఈ సందర్భంగా ఆదేశించారు. దీంతో క్కొమ్మనేటూరు ఎమ్ పి టి సి గడ్డం సహదేవ తో సహా గ్రామస్తులు ఎంపీ గురుమూర్తి కి కృతజ్ఞతలు చెప్పారు.
అర్థనగ్నం తో 10వ రోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించిన వీఆర్ఏలు.. మర్రిపాడు ఫిబ్రవరి 17 (పున్నమి విలేకరి ) మర్రిపాడు మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట తమ సమస్యలను తీర్చాలని గత 10 రోజుల నుండి దీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో గురువారం వారి యొక్క దీక్షని వినూత్నంగా నిర్వహించడం జరిగింది. గురువారం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట అర్ధనగ్నం రిలే నిరాహార దీక్షలో మర్రిపాడు మండల గ్రామ రెవిన్యూ సహాయకులు పాల్గొన్నారు. మండల రెవెన్యూ వీఆర్ఏ లకు కనీస వేతనం 21000 గా ఇవ్వాలని, నామిని లను వీఆర్ఏలు గా నియమించాలని, దశలవారీగా వీఆర్ఏల ఆందోళనలను జయప్రదం చేయాలని గ్రామ రెవెన్యూ సహాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు మూలి వెంగయ్య మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకులకు కనీస వేతనం 21000ఇవ్వాలని, డిఎ తో కలిపి వేతనం చెల్లించాలని నామినీలను విఆర్ఏలు గా నియమించాలని , అర్హులకు ప్రమోషన్ ఇవ్వాలని, 65 సంవత్సరాలు దాటిన చనిపోయిన వీఆర్ఏ కుటుంబంలో కంపాస్నెట్ గ్రౌండ్ కింద కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రధాన డిమాండ్స్ తో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో లో మండల వీఆర్ఏల అధ్యక్షులు ఓబులేసు ఉపాధ్యక్షులు నానాజీ తదితరులు పాల్గొన్నారు.
*మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి రాజ్యసభ పదవి ఇవ్వాలని నియోజకవర్గం ప్రజల విజ్ఞప్తి మర్రిపాడు :పీబ్రవరి 17(పున్నమి విలేకరి ) వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైసీపీని స్థాపించినప్పుడు ఆయన వెంట నడిచిన ఏకైక రాజకీయ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి . ఆయన అప్పటికే కాంగ్రెస్ ఎంపీగా గెలిచి ఉన్నారు. జగన్ పార్టీ పెట్టిన సందర్భంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ తో ఎవరు వెళ్లకుండా కట్టడిచేసేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే రాజమోహన్ రెడ్డి ధైర్యంగా అటు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఇటు రాష్ట్రంలోని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని దిక్కరించి జగన్ మోహన్ రెడ్డి తో నేను సైతం అని ముందడుగు వేశారు. తాను కోట్లాది రూపాయలు పెట్టి చేసిన కాంట్రాక్ట్ బిల్లులు వస్తాయా రావా అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి జగన్ వెంట నడిచారు. జగన్మోహన్ రెడ్డి కోరిందే తడవుగా ఎంపీ పదవికి రాజీనామా చేసి నెల్లూరు ఎంపీగా వైసిపిఅభ్యర్థిగా బరిలో నిలిచి మరోసారి నెల్లూరు ఎంపీగాగెలిచారు .రాజమోహన్ రెడ్డిని ఆ ఉప ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అత్యంత సంపన్నుడైన మాజీ కేంద్రమంత్రి టి.సుబ్బిరామి రెడ్డిని మేకపాటి పై పోటీకి దించింది. తెలుగుదేశం పార్టీ మరో ప్రముఖ వ్యాపారవేత్త ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ని పోటీ చేయించింది. కాంగ్రెస్, టిడిపి అభ్యర్థుల జన ప్రవాహాన్ని తట్టుకొని మేకపాటి ఎంపీ గా నెల్లూరు నుండి ఘన విజయం సాధించారు. అనంతరం 2014లో మరోసారి నెల్లూరు ఎంపీ అప్పటి టిడిపి అభ్యర్థి ఆదాల పై పోటీ చేసి మేకపాటి నెల్లూరు నుండి వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు . జగన్మోహన్ రెడ్డికి ఎవరు లేనిసమయాలలో పార్టీకి పెద్దదిక్కుగా రాష్ట్రంలో పార్టీ ప్రతిష్టకు ఎంతో కృషి చేశారు.మేకపాటి వర్గం జగన్మోహన్ రెడ్డి ని నమ్ముకుని ఆయన వెంటనడిచిన సీనియర్ రాజకీయ నేతకు 2019 లో జగన్ మోహన్ రెడ్డి ఎంపీ టికెట్ ఇవ్వలేదు ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత టీడీపీ నుంచి వైసీపీ లోకి వచ్చిన ఆదాలకు ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చినారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా మేకపాటి ఈరోజు కూడా ఎక్కడా తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయలేదు వైఎస్ఆర్ కుటుంబానికి వైసీపీకి విధేయుడు అని ప్రకటించారు.రాజమోహన్ రెడ్డి తమ్ముడు చంద్ర శేఖర్రెడ్డికి ఉదయగిరి ఎమ్మెల్యే టికెట్ తనయుడు అప్పటి ఆత్మకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డి కి టికెట్ ఇచ్చిన వైసిపి ఒకే ఇంట్లో మూడు టికెట్లు అని అందుకే మేకపాటి ని పక్కన పెట్టారని ప్రచారం జరిగింది. ఎన్నికల అనంతరం మేకపాటికి రాజ్యసభ సీటు ఇస్తారని రాజకీయ వర్గాలు భావించాయి వచ్చే జూన్ లో నాలుగు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి నాలుగు సీ ట్లలో వైసిపి ఏ విజయం సాధిస్తుందో,అయితే సీనియర్ రాజకీయవేత్తగా ఆయన మేకపాటి రాజ్యసభకు తీసుకువస్తే తన ప్రాధాన్యత తగ్గుతుందని ప్రస్తుత రాజ్యసభ విజయసాయిరెడ్డి మేకపాటికి సీటు రాకుండా చేసేందుకు బీదా మస్తాన్ రావు అనే టిడిపి నాయకుడిని వైసీపీలో చేర్పించారు.వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు ఆయన వెంట నడిచిన ఏకైక రాజకీయ నాయకుడు మేకపాటి రజమోహన్ రెడ్డి కుటుంబం ఆప్పటికే కాంగ్రెస్ ఎంపీగా గెలిచి ఉన్నారు. జగన్ పార్టీ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం జగన్తో ఎవరిని వెళ్లకుండా కట్టడిచేసింది. అయితే రాజమోహన్ రెడ్డి ధైర్యంగా అటు ఢిల్లీలోని కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ధిక్కరించి జగన్ మోహన్ రెడ్డి తోచేరారు. తాను కోట్లాది రూపాయలు పెట్టి చేసిన కాంట్రాస్ట్ బిల్లులు కూడా పక్కన పెట్టి జగన్ వెంట నడిచారు. జగన్మోహన్ రెడ్డి కోరిందే బీద కు రాజ్యసభ సీటు హామీ ఇచ్చి పార్టీ మార్చినట్లు ఒప్పందం కుదిరిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరుజిల్లా నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. రాజమోహన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే రెండు సీట్లు రెడ్డిసామాజిక వర్గానికి ఇచ్చారని నానుడి ఉంటుందని అందువల్ల బీసీలు అయిన భీదకు అవకాశం ఇవ్వాలని విజయసాయిరెడ్డి జగన్మోహనెడ్డిని ఒప్పించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నంత మాత్రానరాజమోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని ఎక్కడైనా ఉన్నదా అనే నిన్న మొన్న పార్టీలో చేరిన టిడిపి నాయకుడికి రాజమోహన్ రెడ్డికి అంటి పెట్టడం ఏమిటని జిల్లాలో వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మేకపాటి తనయుడికి మంత్రి పదవి ఇచ్చి ఉన్నదని వారి తమ్ముడు ఉదయగిరి ఎమ్మెల్యే గా ఉన్నారని రాజమోహన్ రెడ్డికి పదవి ఎందుకని కొందరు చేస్తున్న వాదానిలోఎంత మాత్రం సమంజసం అని పార్టీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.రాజమోహన్ రెడ్డి 1985లో ని ఉదయగిరి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో ఒంగోలు ఎంపీ గాగెలిచారు 2004లోనరసరావుపేట ఎంపీ గా గెలిచారు. ఇంతటి సుదీర్ఘ రాజకీయ నేపధ్యం పాలన అనుభవం కలిగిన రాజమోహన్ రెడ్డి మర్రిపాడుమండలం ఆయన స్వగ్రామం మండలంలోని బ్రాహ్మణపల్లి మేకపాటి వెంకీ రెడ్డి ప్రధమ సంతానమైన రాజమోహరెడ్డి దేశంలోనే ప్రతిష్టాత్మకమైన వరంగల్ ఆర్ ఈ సి లో ఎంటెక్ చేశారు. కాంట్రాక్టు రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ పిలుపుమేరకురాజకీయాలలోప్రవేశించి 1985లో ఉదయగిరి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. సౌమ్యుడు వివాద రహితుడు. తానుఅభిమానించే వారి పట్లవిధేయత చూపే మంచి లక్షణాలు కలిగి ఉన్న మేకపాటికి రాజ్యసభ సీటు ఇచ్చి ఆయన సేవలను వైసీపీ వినియోగించుకోవాలని జిల్లాలోని ఆ పార్టీ కార్యకర్తలు,ఆత్మకూరు నియోజక వర్గ ప్రజలు సొంతమండల మర్రిపాడు ప్రజలు జగన్మోహన్ రెడ్డిఅభిమానులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు.
104సేవలు సద్వినియోగం సేసుకోండి. డాక్టర్ ప్. వి. కిషోర్ మర్రిపాడు :పీబ్రవరి 15(పున్నమివిలేకరి ) మర్రిపాడు మండలం బ్రహ్మణపల్లి గ్రామ సచివాలయం నందు 104 వాహనం రావడం జరిగింది. ఈ కార్యక్రమం లో దీర్ఘకాలిక జబ్బులు ఉన్నటువంటి షుగర్,బిపి,అలర్జీ,ఆస్తమా థైరాయిడ్ ఉన్నటువంటి వారికీ డాక్టర్ జి.బాలాజీ అశోక్ గారుపరీక్షలు జరిపి ఒక నెలకు సరిపడా మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.మొబైల్ మెడికల్ క్లినిక్ ప్రోగ్రాం ని ఉద్దేశించి డాక్టర్ జి బాలాజీ అశోక్ మాట్లాడుతూ ప్రతిఒక్క గర్భవతి కి ECG తీయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు అందించు సలహాలు,సూచనలు, పాటిస్తూ పౌష్టి కాహారం తీసుకొంటు వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ ఎస్.కె ఖాజామోహిద్దీన్ హెచ్ వి సంపూర్ణమ్మ,MLHP రజిని,సచివాలయ ఏ ఎన్ యం.యం.లావణ్య,ఆశ,అనిత,DEO ప్రసన్న,పైలట్,ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.
*25 ఏళ్లలీజు ముసుగులో దేశంలోనే పర్యావరణహితమైన ప్రాజెక్టుగా పేరుపొందిన థర్మల్ ప్లాంటును అదానీ పరంచేస్తే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం.* *ఈ పవర్ ప్లాంట్ పరిస్థితిపై ఏనాడైనా విద్యుత్ శాఖ మంత్రి ఒక్క గంటైనా సమీక్ష చేశారా?* *థర్మల్ పవర్ ప్లాంటుకు ఆస్ట్రేలియా నుంచి 4లక్షల టన్నుల మట్టిబొగ్గు సరఫరా చేసింది అరబిందో కంపెనీ వారికి చెందిన నాలెడ్జ్ కంపెనీ కాదా?* *మట్టితో కూడిన బొగ్గుని సరఫరా చేసిన కంపెనీపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు?* *ఆ కంపెనీనుంచి బొగ్గు సరఫరా చేసుకోవాలని చెప్పిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?* *సీఎం ఆదేశాలతో విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ అంతాతానై వ్యవహరిస్తున్నారు* *సీఎం మెప్పు కోసం షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ యాజమాన్యం చెప్పిందల్లా వింటూ శ్రీకాంత్ విద్యుత్ రంగాన్ని నాశనం చేస్తున్నారు* *షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ యాజమాన్యం షాడో విద్యుత్ మంత్రిగా వ్యవహరిస్తోంది* *అమరావతిలో మీడియాతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి* 2400 మెగావాట్ల సామర్థ్యంతో శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్) ను చేపట్టారు తొలి యూనిట్ 800మెగావాట్ల సామర్థ్యంతో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలైతే, రెండో యూనిట్ 800మెగావాట్ల సామర్థ్యంతో టీడీపీ హయాంలో చంద్రబాబునాయుడు ప్రారంభించారు కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ దేశంలోనే తొలి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ లో, తొలిరెండుదశల్లో 1600యూనిట్ల చొప్పున థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. మూడో యూనిట్ పనులు 97శాతం వరకు పూర్తయ్యాయి. 1200 ఎకరాల్లో రూ.21వేల కోట్ల పెట్టుబడితో గత ప్రభుత్వాలు, సీఎంలు, ఎంతో ప్రతిష్టాత్మకమైన థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుచేస్తే, ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ పరం చేస్తామని చెప్పడం అన్యాయం అదానీ సంస్థకు కృష్ణపట్నం పోర్టును అప్పగించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు థర్మల్ పవర్ స్టేషన్ కూడా ధారాధత్తం చేయడానికి సిద్ధమయ్యారు. 400 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా పనిచేస్తుండగా, 1200 మంది పరోక్షంగా దానిపై ఆధారపడి జీవిస్తున్నారు. కనస్ట్రక్షన్ ఉద్యోగులతో కలిపి దాదాపు 3వేలమంది బతుకులు ప్రాజెక్టుపై ఆధారపడిఉన్నాయి. ఇంతటి కీలక పవర్ ప్రాజెక్ట్ ని ప్రైవేట్ పరం చేసే హక్కు, ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు? విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న వారు, దానితో సరిసమానమైన కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ ను ఎలా ప్రైవీటీకరిస్తారు బొగ్గు నిల్వలు సరిపడా నిల్వచేసుకోకుండా, థర్మల్ ప్లాంట్ నిర్వహించలేమని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటు. కేంద్ర ప్రభుత్వం 10 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు థర్మల్ పవర్ ప్లాంట్లలో పెట్టుకోవాలని రాష్ట్రాలకు చెబితే, ఏపీ ప్రభుత్వం రెండు, మూడు రోజుల నిల్వలు కూడా ఉంచలేని స్థితిలో ఎందుకుంది బొగ్గు నిల్వలకు ప్రభుత్వం ఏటా రుసుము చెల్లించాలి. అది చేయలేకనే బొగ్గు నిల్వ చేసుకోలేకపోతున్నారా? కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ను అదానీ పరంచేయడానికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బంది కాదా? 2020 జనవరిలో ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న 4 లక్షల టన్నుల బొగ్గు మట్టితో కూడి ఉందని, దాంతో విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదని అప్పట్లోనే కార్మికులంతా ధర్నాకు దిగారు. అయినా వినిపించుకోకుండా ఆ బొగ్గుని విద్యుత్ వినియోగానికి వాడారు. ఉద్యోగులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలపడంతో పెడుతున్నారని లక్ష టన్నులు మాత్రమే వినియోగించలేదు. ఎర్రమట్టి కలిసిన లక్ష టన్నుల బొగ్గు ఇప్పటికీ అలానే నిల్వఉంది. దాన్ని సగం ధరకు కూడా ఈప్రభుత్వం అమ్మలేకపోయింది. ఆస్ట్రేలియా నుంచి ఆనాడు దిగుమతి అయిన బొగ్గు నాలెడ్జ్ కంపెనీ నుంచి వచ్చింది. ఆ నాలెడ్జ్ కంపెనీ విజయసాయిరెడ్డికి చెందిన అరబిందో పరిశ్రమకు చెందినది. సీఎం తన బంధువులకు మేలు చేయడం కోసం ఆఖరికి థర్మల్ ప్లాంట్ నే మూతపడేసేందుకు దిగజారాడు. దాని విలువ సుమారు రూ.700 కోట్లు, ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంటుపై ఒక గంట పాటు సమీక్ష చేసే స్థితిలోకూడా విద్యుత్ శాఖ మంత్రి లేరా? విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ సీఎం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ, అంతాతానై వ్యవహరిస్తున్నాడు. ఆఖరికి ట్రాన్స్ ఫార్మర్లు కావాలన్నా శ్రీకాంత్ అనుమతి కావాల్సిందే. ఒక రెడ్డి గారికి చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ పెత్తనం సాగుతోంది సదరు కంపెనీ యజమాని సిఫార్సుతో మూడు ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్ విభాగాలకు రిటైరైన వ్యక్తులను తీసుకొచ్చి, పదవులు కట్టబెట్టారు. విజయవాడలోని సీపీడీసీఎల్ సీఎండీ పద్మా జనార్థన్ రెడ్డి వైసీపీ నేత బంధువు కాదా? ట్రాన్స్ ఫార్మర్లు, మీటర్లు, ఫ్యూజులు సహా అన్నీ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ నుంచే వస్తున్నాయి. వెయ్యి రూపాయలుండే సింగిల్ ఫేజ్ మీటరును షిర్డీసాయినుంచి రూ.1500లకు పవర్ జనరేషన్ కంపెనీలు కొనాలా? రూ.1,30,000 విలువైన ట్రాన్స్ ఫార్మర్ ని , రూ.1,75,000లకు కొనాలా? రూ.10వేల విలువైన ఫీజ్ సెట్ బాక్స్ స్థానంలో టెక్నాలజీపేరుతో ఎంసీబీ బాక్స్ లని పెట్టారు. దాన్ని రూ.30వేలకు కొంటున్నారు. ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉన్నాయి. వీటన్నింటినీ ముందు సీపీడీసీఎల్ ఎండీ పద్మాజనార్థన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తారు ఆ తరువాత రాష్ట్రమంతా అమలయ్యేలా చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో షాడో ఎలక్ట్రిసిటీ మంత్రిగా షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ యాజమాన్యం వ్యవహరిస్తోంది. రాష్ట్ర విద్యుత్ రంగం సర్వనాశనమయ్యేలా వారు ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అంతా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు చేసేటప్పుడు, ఇక ప్రభుత్వం దేనికుందని ప్రశ్నిస్తున్నాం? సీలేరులోని హైడ్రోపవర్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ కు కూడా రివర్స్ టెండర్లు పిలవండి. ఎవరు తక్కువధరకు హైడ్రోపవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తిచేసి, ఎన్ని సంవత్సరాలకు పవర్ ఉత్పత్తిచేస్తారో ఆలోచించి టెండర్లు పిలవండి. పెట్టుబడి పెట్టలేని ప్రభుత్వం థర్మ ల్ పవర్ స్టేషన్లను ప్రైవేట్ పరం చేసుకుంటూపోతే, చివరకు రాష్ట్రం చీకట్లలో మగ్గడంఖాయం. పోలవరంలోని హైడల్ పవర్ ప్రాజెక్ట్ నవయుగకంపెనీకి వస్తే, దాన్ని రద్దుచేసి ఈ ముఖ్యమంత్రి రివర్స్ టెండర్లు పిలిచాడు. నవయుగ కంపెనీ పెట్టుబడులు పెట్టాక, ప్రభుత్వం రూ.500కోట్లు వెచ్చించాక, ఆ.కంపెనీ టెండర్లు రద్దు చేశారు. టెండర్ల రద్దుతో ప్రభుత్వానికి వచ్చిన రూ.300 కోట్ల నష్టాన్ని ఎవరు బరిస్తారు? ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మట్టిబొగ్గు కారణంగా వచ్చిన రూ.700 కోట్లు, విద్యుత్ ఉత్పత్తి నిలిచిన కారణంగా వాటిల్లిన వేల కోట్ల నష్టాన్ని ఎవరు బరిస్తారు ఇలా అనేక పాపాలు ఈ ప్రభుత్వ నిర్వాకంతో జరగలేదా? ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తిచేయాలంటే 0.5శాతం ఉద్యోగులు కావాలి. కానీ కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్లో 0.2కంటే తక్కువమంది ఉద్యోగులే ఉత్పత్తిచేస్తున్నారు. కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ దేశానికే మోడల్. అలాంటి కంపెనీని అదానీ పరంచేస్తామంటే ఊరుకోం..తాడోపేడో తేల్చుకోవడానికే సిద్ధంగా ఉన్నాం 25 ఏళ్లపాటు లీజు అని పైకిచెబుతూ థర్మల్ పవర్ స్టేషన్ ని అదానీ సంస్థ పరం చేయాలనిచూస్తే ఊరుకునేదిలేదని హెచ్చరిస్తున్నాం. 25 ఏళ్ల తర్వాత థర్మల్ ప్లాంట్ మొత్తం తుక్కుతుక్కుఅయితే అప్పుడుఎవరు బాధ్యత తీసుకుం టారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం, ఎన్నో ఏళ్లుగా రాష్ట్రానికి మేలుచేస్తున్న కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంటును ఎలా ప్రైవేట్ పరంచేస్తుంది?
ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నెల్లూరు నూతన సంవత్సరం సందర్భంగా 2022 నూతన క్యాలెండర్ ను జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ మరియు జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు చేతుల మీదుగా గురువారం ఉదయం 11 గంటలకు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్ష కార్యదర్శి లక్కాకుల పెంచలయ్య భోగ్యం రమేష్ బాబు జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్ కుమార్ అనిల్ శ్రీధర్ శీను కరం తుల్లా దేవ ప్రసన్న కుమార్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు జిల్లా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
శ్రీ సాయి సత్సంగం నిలయం కోటా సునీల్ కుమార్, జర్నలిస్టుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గూడూరు లోని శ్రీ సాయి సత్సంగం నిలయంలో మహామృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం, రుద్ర హోమం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి హోమం, ఆయుష్షు హోమం, దుర్గా త్రిశతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్. విజయ్ కృష్ణ రెడ్డి హాజరై ప్రసంగించారు. జర్నలిస్టుల కోసం విక్రమసింహపురి యూనివర్సిటీ లో అందిస్తున్న కోర్సులను వివరించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్, జర్నలిస్ట్ ఫ్రెండ్స్ నాగరాజు, పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం సుమారు 110 మంది జర్నలిస్టులకు రైస్ బ్యాగ్, నిత్యవసర వస్తువులను విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్టర్ విజయ్ కృష్ణా రెడ్డి అందజేశారు.. ఈ సందర్భంగా సాయి సత్సంగం నిలయం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ విక్రమ సింహపురి యూనివర్సిటీ లో జర్నలిజం కోర్స్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ ఇస్తున్న సబ్సిడీ పోను మిగిలిన ఫీజును తాను అందజేస్తామని ప్రకటించారు.
పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం. రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.