Friday, 10 July 2026

Blog

Featured

గుండె పోటుతో మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి

(పున్నమి ప్రతినిధి, నెల్లూరు ) ఆంద్ర పద్రేశ్‌ పరిశ్రమలు. ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి (50) ఆకస్మికంగా మృతి చెందారు. గుండె పోటు రావడంతో హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఆయన మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వారం రోజుల పాటు దుబాయ్‌ ఎక్స్‌ పోలో పాల్గొని ఇండియా వచ్చారు. గౌతంరెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం మండలం బ్రాహ్మణపల్లి గ్రామం. 2014 ఎన్నికల్లో రాజకీయ ఆరంగేట్రం చేసి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయ న మృతి పట్ల పలువురు మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.

Featured

రైతులకు యంత్ర పరికరాలు పంపిణీ

(పున్నమి ప్రతినిధి, నెల్లూరు ) సబ్సిడీపై పలు రైతు గ్రూపులకు కలెక్టరేట్‌లో యంత్రపరికరాలను పంపిణీ చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కెవిఎన్‌ చక్రధర్‌బాబు, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, వి.వరప్రసాద్‌, కిలివేటి సంజీవయ్య, డీసీసీబీ ఛైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వ్యవసాయ సలహా మండలి జిల్లా ఛైర్మన్‌ దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డిల ఆధ్వర్యంలో వరి కోత యంత్రాలతో పాటు ఇతర యంత్రాలను రైతులకు అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ చక్రధర్‌బాబు మాట్లాడుతూ జిల్లాలో 270 రైతు గ్రూపులకు 2445 యంత్రాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. యంత్ర సేవా పథకం కింద ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.6.09 కోట్లు సబ్సిడీ రూపంలో వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ హరేందిర ప్రసాద్‌, వ్యవసాయ శాఖ జేడీ ఆనందకుమారి తదితరులు పాల్గొన్నారు

Featured

సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం తగదు

(పున్నమి ప్రతినిధి, నెల్లూరు) ప్రజలు తమ సమస్యలపై స్పందన కార్యక్రమంలో ఇస్తున్న అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా కలెక్టర్‌ కెవిఎన్‌ చక్రధర్‌బాబు సూచించారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయం నుంచి జిల్లాలోని అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ చక్రధర్‌బాబు మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే సమస్యలపై ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఫించన్‌లు, ఇళ్ళ పట్టాలు వంటి సమస్యలను సకాలంలో పరిష్కరించాలన్నారు. జగనన్న ఇళ్లకు సంబంధించి పురోగతి వేగంగా ఉండాలన్నారు. ఓటీఎస్‌ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. నగదు చెల్లించిన వారికి సత్వరమే రిజిస్ట్రేషన్‌ చేయాలన్నారు. జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమాన్ని పర్యవేక్షించి ప్రతి ఇంటికి చెత్త బుట్టలను అందించాలన్నారు. ఈనెల 22న అమలు కానున్న జగనన్న తోడు, పీఎం స్వానిధి పథకాలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్‌లో జేసీలు హరేందిర ప్రసాద్‌, గణేష్‌ కుమార్‌, జేసీ (ఆసరా) రోజ్‌మాండ్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ దినేష్‌ కుమార్‌, హౌసింగ్‌ పీడీ వేణుగోపాల్‌రావు, ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Featured

ఆలయ అభివృద్దికి కృషి చేయండి ` ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి.

(పున్నమి పత్రినిధి, విడవలూరు) నూతనంగా ఎన్నికైన ఛైర్మన్‌ సభ్యులు రామతీర్థంలో వెలసియున్న కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాభివృద్ధికి కృషి చేయాలని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోరారు. రామతీర్థంలోని రామలింగేశ్వరస్వామి ఆలయ పాలక మండలి సభ్యుల పమ్రాణస్వీకారం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జొన్నవాడ దేవస్థాన ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన రోజే పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు రూ.5.5 కోట్ల విరాళాలను దాతల నుంచి తీసుకొచ్చారన్నారు. దాతల సహకారం చాలా అవసరమన్నారు. అవసరమైతే తాను వచ్చి విరాళాలు సేకరిస్తానన్నారు. అనంతరం పాలక మండలి ఛైర్మన్‌గా నాటారు చంద్రయ్య, సభ్యులుగా రమేష్‌, పసుపులేటి సుబ్బారావు, కటారి మల్లీశ్వరి, వెంకటశేషమ్మ, నాగమణి, వేణుగోపాల్‌, శ్రీకాంత్‌శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఆప్కాఫ్‌ ఛైర్మన్‌ కొండూరు అనీల్‌ బాబు, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ వీరి చలపతిరావు, డీఎల్‌డీఏ ఛైర్మన్‌ గొల్లపల్లి విజయ్‌కుమార్‌, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయితీ ఛైర్‌ పర్సన్‌ సుప్రజ, పుట్టా సుబ్రమణ్యంనాయుడు, జడ్పీటీసీ తుమ్మల లక్ష్మయ్య, ఎంపీపీ భవానమ్మ, సర్పంచ్‌ సుప్రజ, ఎంపీటీసీ రమణమ్మ ఆవుల వాసు పాల్గొన్నారు.

Featured

సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలి

(పున్నమి ప్రతినిధి, బుచ్చి) సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఛైర్‌ పర్సన్‌ మోర్ల సుప్రజ పేర్కొన్నారు. స్థానిక అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులు వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు తెలియచేయాలన్నారు. ఆరోగ్య సిబ్బంది ఫీవర్‌ సర్వేను తప్పక చేపట్టాలని సూచించారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కౌన్సిలర్లు పమ్రీలమ్మ, షాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.wig shop cheap wigs online cheap wigs online cheap dildos cheap dildos wig shop cheap wigs online proshop nfl proshop nfl wig shop fiitg jerseys cheap wigs online wig shop cheap dildos cheap wigs online

Featured

నారా పాదయాత్ర చేయబోతున్నారా……? ` నియోజకవ్గాలకు వెళ్తేనే పార్టీపై పట్టు సాధిస్తారంటున్న నేతలు

మరో రెండేళ్లలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో బలమైన నేతగా ఎదిగేందుకు మాజీ మంత్రి నారా లోకేష్‌ త్వరలో కార్యాచరణ రూపొందించుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే నారా లోకేష్‌ పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసి విజయం సాధించడంతో అదే పందాలో లోకేష్‌ కూడా నడిచే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ సారి సీఎం జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో లోకేష్‌ ఈ నిర్ణయం తీసుకున్నారేమోనన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ పాదయాత్ర చేయడంతో 175 నియోజకవర్గాల్లోని కార్యకర్తలు, నాయకులుతో సమావేశాలు నిర్వహించి ఈ సారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది నాయకులు మాత్రం పాదయాత్ర కన్నా స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు , ప్రజలతో కలిసి పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలి అనేదానిపై చర్చిస్తే మంచి ఫలితాలు ఉంటాయనే భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు పార్టీ నేతలతో ఎలా కలిసిపోయారో అలాగే లోకేష్‌ కూడా పార్టీ పై పట్టు సాధించాలంటే పార్టీ నేతలు, నాయకులతో కలిసి పోవాలని పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయా…? లేదా..? అన్న విషయాన్ని పక్కన పెడితే పార్టీ నాయకులతో లోకేష్‌ కలిసి పోతే రాజకీయంగా అనుభవంతో పాటు పార్టీపై పూర్తి పట్టు సాధించుకోవచ్చని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. లోకేష్‌ పార్టీలో తిరుగులేని నేతగా ఎదగాలంటే తండ్రి చాటు బిడ్డలా కాకుండా తనకంటూ ఓ పత్య్రేకమైన మార్క్‌ను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికే చందబ్రాబు రాజకీయ వారసురడిగా ఎదిగిన లోకేష్‌ నియోజకవర్గాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితిని తెలుసుకోగలలిగితే రాజకీయంగా అనుభవం కూడా వస్తుందన్నది కొందరు నేతల అభిప్రాయం. పాదయాత్రతో లోకేష్‌ తిరుగులేని నేతగా ఎదగడం సాధ్యపడదంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా లోకేష్‌ పాదయాత్ర చేస్తాడా… లేదా.. అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Featured

బుచ్చి పట్టణ అభివృద్ధికి సహకరిస్తా: నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

బుచ్చి పట్టణ అభివృద్ధికి సహకరిస్తా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుచ్చి పట్టణ అభివృద్ధికి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి కృషి చేస్తానని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుచ్చి మున్సిపల్ చైర్ పర్సన్ సుప్రజ తోపాటు వార్డు కౌన్సిలర్లు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని శుక్రవారం సాయంత్రం ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుచ్చి మండలం తో తనకు మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాలతోపాటు బుచ్చి పట్టణ అభివృద్ధికి నిధులను సైతం అందజేస్తామన్నారు. కొత్తగా గెలిచిన కౌన్సిలర్లు వారి వార్డుల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా బుచ్చి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఎంపీ ఆదాలను గజమాలతో సత్కరించారు. జొన్నవాడ దేవస్థానం చైర్మన్ పుట్ట సుబ్రమణ్యం నాయుడు, విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, సయ్యద్ ఫయాజుద్దీన్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Featured

విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

(పున్నమి ప్రతినిధి, నెల్లూరు ) ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారావు సూచించారు. గురువారం నగరంలోని బీవీఎస్‌ గర్ల్స్‌ హైస్కూల్లో విద్యార్థినులకు మహిళా రక్షణ చట్టాలపై శ్రీరామరాజు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యకమ్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం కొన్ని చట్టాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. మహిళలు ఆపద సమయంలో ఈ చట్టాల ద్వారా రక్షణ పొందవచ్చన్నారు. ప్రతి ఒక్క మహిళ తమ సెల్‌ఫోన్‌లో ఈ చట్టాలకు సంబంధించిన యాప్‌ల అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విద్యార్థినులకు బ్యాడ్‌ టచ్‌, గుడ్‌టచ్‌, ఈవ్‌టీజింగ్‌, దిశ యాప్‌ తదితరాలపై అవగాహన ఎంతో అవసరమన్నారు. అనంతరం దిశ యాప్‌ గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు.

Featured

వేదగిరి దేవస్థాన ఛైర్మన్‌గా వేమిరెడ్డి

(పున్నమి ప్రతినిధి,నెల్లూరు) ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వేదగిరి లక్ష్మినరసింహస్వామి దేవస్థాన ఛైర్మన్‌గా వేమిరెడ్డి సురేంద్రరెడ్డి నియమితులైనట్లు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కార్యాలయం నేడొక ప్రకటనలో పేర్కొంది. సభ్యులుగా అల్లూరు దినేష్‌కుమార్‌, పామూరు మల్లిఖార్జున్‌రెడ్డి, నెట్టెం రఘురామయ్య, రాపూరు అంజయ్య, వినుకోటి ప్రసన్న లక్ష్మి, జయమ్మ, సుంకర మస్తానమ్మ, లక్ష్మమ్మను నియమించినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.

Featured

అధిక మోతాదులో పురుగు మందులు వాడొద్దు

(పున్నమి ప్రతినిధి, విడవలూరు ) రబీ సాగులో అధిక మోతాదులో ఎరువులు,పురుగు మందులు వినియోగించవద్దని, అధికారుల సూచనల మేరకు వాడాలని ఏఓ వెంకటకృష్ణయ్య సూచించారు. గురువారం మండలంలోని వావిళ్ల గ్రామంలో పోలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ రైతులు అధికారుల సూచనల మేరకు పురుగు మందులు, ఎరువులను వాడడం ద్వారా పంట దిగుబడి బాగుటుందన్నారు. అంతేకాకుండా పెట్టుబడులను కూడా తగ్గించుకోవచ్చన్నారు. తగిన మోతాదుల్లో ఎరువులను, పురుగు మందులను వాడినట్లతే మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులను, పురుగు మందులను రైతులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.wig shop cheap wigs online cheap wigs online cheap dildos cheap dildos wig shop cheap wigs online proshop nfl proshop nfl wig shop fiitg jerseys cheap wigs online wig shop cheap dildos cheap wigs online

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.