Friday, 10 July 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

‌మధుమేహాన్ని అదుపు చేసే కాకర

‌మధుమేహాన్ని అదుపు చేసే కాకర కాకరకాయ పేరు వినగానే మనకు చేదు గుర్తుకొస్తుంది. కాకరకాయ, కాకర ఆకు రసం, కాకర కాయ రసం ఇలా కాకరకాయకు సంబంధించిన అన్నిటిలోనూ ఔషధగుణాలున్నాయి. కాకరకాయ రసంలో హైపోగ్లసమిన్‌ ‌పదార్ధం ఇన్సులిన్‌ ‌స్థాయిలలో తేడాలు రాకుండా నియంత్రిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. కాకర గింజలలో రక్తంలోని గ్లూకోజ్‌ను తగ్గించే చారంటిన్‌ అనే ఇన్సులిన్‌ను పోలిన పదార్ధం ఉంటుంది. కాకరలో ఫాస్పరస్‌ ‌హైపర్‌టెన్షన్‌ని అదుపులో ఉంచుతుంది. కాకరను తరచూ తినడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది. కాకర ఆకు రసాన్ని గాయలపై రాస్తే పుండ్లు త్వరగా తగ్గుతాయి. చర్మవ్యాధులకు, క్రిమి రోగాలకూ కాకర రసం బాగా పని చేస్తుంది. కాకరలో అధికంగా ఉండే పీచు జీర్ణ పక్రియను మెరుగుపరుస్తుంది. శరీరానికి అత్యావశ్యక పోషకాలైన ఫొలేట్‌, ‌మెగ్నీషియం, పొటాషియం, జింక్‌ ‌కూడా లభిస్తాయి. కాకరలోని మొమొకార్డిసిన్‌ ‌యాంటీ వైరస్‌గా పనిచేస్తుంది. కాకరలో థయామిన్‌, ‌రెబోఫ్లావిన్‌, ‌విటమిన్‌ ‌బి6, పాంథోనిక్‌ ‌యాసిడ్‌, ఇనుము, ఫాస్పరస్‌లు పుష్కలంగా లభిస్తాయి. కాకరలో సోడియం, శాతం తక్కువగా ఉంటాయి. కనీసం 15 రోజులకొకమారైనా స్పూను కాకర రసం తాగితే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ పిల్లలకు

‌తెలివైన పనివాడు

‌తెలివైన పనివాడు అమరావతి నగరంలో రామయ్య అనే రైతు ఉండేవాడు.అతనికి పండ్లతోటలు,వ్యవసాయ భూములు, పశువులు ఉండేవి. అతని వద్ద చాలా మంది పని వాళ్లు ఉన్నా,తన పనులన్ని చూడగలిగిన నమ్మకమై వ్యక్తి కోసం ప్రయత్నిస్తూ,సాటి రైతులవద్ద ఈవిషయం చెప్పాడు.ఆరైతులు పంపగా, ముగ్గురు యువకులువచ్చారు.వారిని రోజుకు ఒకరి వంతున రమ్మని చెప్పి,మొదటిరోజున వచ్చినయువకుడిని ‘నాయనా పొరుగున ఉన్న ‘తాడేపల్లి’గ్రామంలో చొక్కరాతి రంగయ్య గారి వద్ద నేను కొన్ని ఆవులు కొన్నాను.ఇవిగో డబ్బులు బస్‌ ‌లోవెళ్లి వారి ఇంట్లో ఉన్న ఒక ఆవును తొలుకురా,మార్గంలో భోజనంచేయి ‘అన్నాడు రామయ్య.డబ్బుల అందుకున్నఆయువకుడు బయలుదేరివెళ్లి ,తిరిగి ఆవుతో రాత్రికి అమరావతి చేరాడు.’ఏంనాయనా ఇంత ఆలస్యం అయిందేం?’అన్నాడు రామయ్య.’అయ్య ఈ ఆవు నాకు కొత్త,నేను ఆఊరి మార్గానికి కొత్త,ఆవు దారి పొడవునా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది’అన్నాడు.’సరే ఇవిగో ఈరోజు పనిచేసిన డబ్బులు, నేను కబురు పెట్టినపుడు పనికి వద్దువుగాని వెళ్లిరా!’అనిసాగనంపాడు.మరుదినం వచ్చిన యువకుడిని కూడా మోదటి రోజు యువకునికి చెప్పినట్లే చెప్పి,డబ్బు ఇచ్చి పంపించాడు.ఆయువకుడు తాడేపల్లినుండి ఆవును తోలుకుని అమరావతికి రాత్రికి వచ్చాడు.ఆవు శరీరంపై విపరీతమైన దెబ్బల వలన ఏర్పడిన వాతలు కనిపించాయి రామయ్యకు.’నాయనా ఆవును ఇంతగా ఎందుకు కొట్టావు?’అన్నాడు రామయ్య.’కొట్టక పోతేమాట వినే రకంకాదు ఈఆవు ఎంత ఏడిపించిందో దారిపొడవునా ,మీకేంతెలుసు’ అన్నాడు ఆయువకుడు.’సరే ఇదిగో ఈరోజు పనిచేసిన డబ్బులు,నేను నీకు కబురుపెడతాను అప్పుడు వచ్చి పనిలో చేరుదువుగాని వెళ్లిరా!,అని ఆయువకుని సాగనంపాడు రామయ్య.మూడవరొజు వచ్చిన యువకుడికి రామయ్య డబ్బులు అందిస్తూ,గతంలో ఆఇద్దరి యువకులకు చెప్పినట్లే చెప్పి,నీపేరేమిటి నాయనా అన్నాడు.’అయ్య నాపేరు శివయ్య, ఈవేసవి ఎండలో ప్రయాణమంటే ఆవు ఇబ్బంది పడుతుంది.నేను రాత్రికి తాడేపల్లి చేరి, వేకువనే బయలుదేరి ఎండ ముదరక ముందే మన ఊరు చేరుకుంటాను’అన్నాడు మూడవరోజు యువకుడు.అతనిమాటలు నచ్చిన రామయ్య ‘నీయిష్టం అలాగే వెళ్లిరా’అన్నడు.మరదినం ఉదయం తెల్లవారిన కొద్ది సేపటికే శివయ్య ఆవును తొలుకు వచ్చిపశువుల పాకలో కట్టివేస్తు’తలపై ఉన్న పచ్చిగడ్డి మూట ఆవు ముందువేసి, అక్కడి పనివారితో’ నాలుగు బానల వేడినీళ్లతో ఆవును రుద్దితూ పోయండి అప్పుడు కాని దానికి ప్రయాణ బడలిక పోదు’ అన్నాడు. ఇదంతా గమనిస్తున్నరామయ్య’ఆవుకు వేడినీళ్లస్నానమా? అయినా నువ్వు ఇంత ఉదయాన్నే ఎలారాగలిగావు’అన్నాడు.’అయ్యా ఆవు కూడా ప్రాణం ఉంటుంది దాని శరీరం ఇన్ని మైళ్లు నడచి అలసి పోయి ఉంటుంది. వేడినీళ్లుతో కడిగితే చాలావరకు శరీర నొప్పులు తగ్గుతాయి. ఇంత ఉదయాన్నే ఎలా రాగలిగాను అంటే,నిన్న సాయంత్రమే, పచ్చిగడ్డికోసి మోపుకట్టి పెట్టుకున్నాను.తొలికోడికూతకే మన ఊరు బయలుదేరి,కొద్ది కొద్దిగా ఆవుకు తలపై ఉన్న పచ్చగడ్డి అందించసాగాను, నేను అందించిన పచ్చగడ్డి పరకలు తింటూ నావేనుక రాసాగింది,నేను వేగంగా నడవడంతో ఆవువేగంగానన్నుఅనుసరించింది’అన్నాడు.శివయ్య తెలివైన పనివాడే,పశువులు కూడా ప్రాణులే అన్న శివయ్యలాంటి పనివాడే తనకు కావలసింది అనుకున్న రామయ్య’ మన ఇంట్లోకి వెళ్లు,అమ్మభోజనం పెడుతుంది తిని,మీఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకొ ఈరోజుకు,రేపటినుండి పనిలొనిరా!ఇదిగోనీ పిల్లలకు ఏదైనా తీసుకువెళ్లు, అని డబ్బులు అందించాడు రామయ్య. వినయంగా తలఊపాడు శివయ్య. డా.బెల్లంకొండ నాగేశ్వరరావు, చెన్నై

Featured ఆంధ్రప్రదేశ్ సాహితీ

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి అమరజీవి పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు నగరంలో జన్మించారు. వీరి పూర్వీకులది నెల్లూరు, శానిటరి ఇంజనీరింగ్‌ ‌చదివి, ముంబై రైల్వేలో ఉద్యోగం చేశారు. భార్య, తల్లి చనిపోగా విరక్తితో ఉద్యోగం వదిలి, దేశసేవలో మునిగారు. గాంధీజీ అభిమానిగా ఆశ్రమ జీవితం కొన్నాళ్ళు గడిపారు. 1930 ఉప్పు సత్యాగ్రహం, 1942 క్విట్‌ ఇం‌డియా ఉద్యమాల్లో జైలు కెళ్ళారు. దళితులకు ఆలయ ప్రవేశం కోసం ఆలుపెరగని పోరాటం చేశారు. మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న తెలుగు ప్రాంతాలను విడదీసి, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని ప్రజలు కోరుతుండే వారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు వారి కోర్కెను పట్టించుకోలేదు. పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్‌ 19‌న మద్రాసులో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. 58 రోజుల దీక్ష ఆనంతరం 1952 డిసెంబర్‌ 15‌న పొట్టి శ్రీరాములు కన్నుమూశారు. తదనంతరం పరిణామాలతో 1953 నవంబర్‌ 1‌న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆ తరువాత హైదరాబాద్‌తో కలిసిన తెలంగాణ ప్రాంతాన్ని కలిసి ఆంధప్రదేశ్‌గా ఏర్పడింది. తెలుగు వారికి పొట్టి శ్రీరాములు త్యాగం గుర్తుండి పోతుంది.

Featured ఆంధ్రప్రదేశ్ బిజినెస్

‌నేడు ‌ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

‌నేడు ‌ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి నిద్రించేంత వరకు మనం ఎన్నో రకాల వస్తువులు, సేవలు ఉపయోగిస్తుంటాం. తమనం వాటికి వినియోగదారులం. తల్లి గర్భంలో ఊపిరి పోసుకున్నప్పటి నుంచి సమాధిలో నిదురించే జీవిత కాలమంతా ప్రతి మనిషి వినియోగదారుడే! గతంలో ‘కొనుగోలు దారుడా జాగ్రత్త!’ అనే హెచ్చరిక ఉండేది. అమ్మేవారు ఏమిచ్చినా జాగ్రత్తగా కొనవలసిన బాధ్యత వినియోగదారునిపై బాధ్యతగా ఏకపక్షంగా ఉండేది. 1962 మార్చి 15న ఆనాటి అమెరికా అధ్యక్షుడైన జాన్‌ ఎఫ్‌.‌కెనడీ ఆ దేశ పార్లమెంట్‌లో వినియోగ దారుల హక్కులను ప్రకటించారు. తదనంతరం వినియోగదారుల చట్టం అమెరికాలో తయారైంది. ఆ మార్చి 15వ తేదిని ‘ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం’గా 1983 నుంచి పాటిస్తున్నారు. ‘కన్సూమర్‌ ఇన్టర్నేషనల్‌’ ‌పేరిట ఉన్న వినియోగదారుల సంఘాల ప్రపంచ స్థాయి ఫెడరేషన్‌ ‌వారు వినియోగదారుల హక్కుల ప్రచారం నిర్వహిస్తున్నారు. భారతదేశంలో వినియోగదారుల పరిరక్షణ చట్టం, 1986 అమలులో వుంది. ఈ చట్టం క్రింద జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో జిల్లా ఫోరముల, రాష్ట్ర, జాతీయ కమిషను ఏర్పాటు చేయబడి వినియోగదారుల ఫిర్యాదుల్ని విచారించి పరిష్కరిస్తున్నాయి.

Featured

మంచాల పల్లి గ్రామంలో వైసిపి శ్రేణుల సంబరాలు

అనంతసాగరం మండలం: మంచాల పల్లి గ్రామంలో వైసిపి పార్టీకి చెందిన చెందిన నాయకులు రాజా రెడ్డి, కొమ్మూరి ఈశ్వరమ్మ, ఎస్ రాజారెడ్డి,కె. లక్ష్మయ్య, డి. వెంకటేశ్వర్లు,డి. మేజర్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలతో, అభిమానులతో కలిసి రాష్ట్ర పంచాయతీ ఎలక్షన్లలో మున్సిపల్ ‌ఎలక్షన్లలో వైయస్సార్ సిపి పార్టీ విజయదుందుభి మోగించడం తో ఆనందంలో కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గా వై ఎస్ ఆర్ సి పి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఏ పార్టీ గెలిచిన చరిత్ర లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు ప్రవేశపెట్టిన పథకాలే ఇంతటి ఘన విజయానికి కారణమని గతంలో నాయకులు మాటలకే పరిమితం అయ్యే వారని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు ప్రజలకు సక్రమంగా అందేవి కాదని ప్రస్తుత ముఖ్యమంత్రి మాట తప్పని మడమ తిప్పని మహా నాయకుడని ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకు వచ్చాడని, ఇంకా మరెన్నో పథకాలు తీసుకువస్తానని ప్రజలు నమ్మరు కాబట్టే ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చారని, వాలంటీర్ వ్యవస్థ సచివాలయం ద్వారా ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేలా చేస్తున్నారని కొనియాడారు.

Featured ఆంధ్రప్రదేశ్ బిజినెస్

ఇల్లు చల్లగా ఉండాలంటే..

ఇల్లు చల్లగా ఉండాలంటే.. (‌పున్నమి ప్రతినిధి) : చూస్తుండగానే ఎండలు మొదలయ్యాయి. శివరాత్రి తర్వాత పూర్తి స్థాయిలో ఎండలు మండిపోయే అవకాశం ఉంది. సమ్మర్‌ ‌లో ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అందుకే దానికోసం ఇంటిని చల్లగా ఉండేలా చూసుకోవాలి. అదెలాగంటే.. వేసవిలో ఇంటి కూలింగ్‌ ‌కోసం ఏసీ, కూలర్ల వాడకం ఎలాగూ ఉంటుంది. వాటితో పాటు మరికొన్ని టిప్స్ ‌ద్వారా సహజంగానే ఇంటి వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవచ్చు. మొక్కలతో.. మొక్కలు, చెట్లు ఉన్న ఇంటి వాతావరణం ఆటోమేటిక్‌ ‌గా చల్లగా మారిపోతుంది. చెట్లు ఎక్కువగా ఉన్న పరిసర ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల కంటే రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అందుకే ఇంటి చుట్టూ మొక్కలు పెంచడం వల్ల వేడి తగ్గించుకోవచ్చు. ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉంటే అదంతా చెట్లతో నింపడం మంచిది. అలాగే ఇంటి పైకప్పుపై చిన్నపాటి తోటను పెంచడం వల్ల ఎంతో ప్రయోజనం. దీనినే రూఫ్‌ ‌టాప్‌ ‌గార్డెన్‌ అం‌టారు. అపార్టుమెంట్లు అయితే బాల్కనీలో కుండీలు పెట్టుకుని.. వాటిలోనూ మొక్కలు పెంచొచ్చు. పరదాల చల్లగా.. కిటికీలు, తలుపులకు నారతో చేసిన చాపలను వాడటం వల్ల ఇంట్లోకి వేడి గాలి రాకుండా చూసుకోవచ్చు. వాటిని తరచూ నీటితో తడుపుతూ ఉంటే ఇంకా చల్లగా ఉంటుంది. తెరచాపలే కాకుండా కూలర్లలో వినియోగించే గడ్డి చాపలు, మ్యాట్లు కూడా మార్కెట్లో లభిస్తాయి. అవి నీటిని ఎక్కువ సేపు పట్టి ఉంచుతాయి. ఇంట్లో చల్లదనాన్ని కలిగించే కొత్త తరహా పాలిమర్‌ ‌లు కూడా ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. ఇవి సూర్యరశ్మిని చాలా వరకు తగ్గిస్తాయి మరికొన్ని.. వేసవిలో పగటిపూట ఓవర్‌ ‌హెడ్‌ ‌ట్యాంకులో నీరు లేకుండా చూసుకోవాలి. తగినంత నీరు టబ్బుల్లో, బక్కెట్లలో నీళ్లు నిల్వ చేసుకుని బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం లాంటి పనులకు వాడుకోవాలి. లేదంటే వేడెక్కిన నీటివల్ల కప్పు, గోడల్లోని పైపుల ద్వారా గదులన్నీ వేడెక్కుతాయి. వేసవిలో టీవీ, కంప్యూటర్‌, ‌ఫ్రిజ్‌, ‌వాషింగ్‌మెషిన్‌, ‌వ్యాక్యూమ్‌ ‌క్లీనర్‌, ‌హీటర్ల వినియోగాన్ని వీలున్న మేరకు పరిమితం చేసుకోవాలి. లేకుంటే వాటిని వాడుతున్నంతసేపూ వేడి వెలువడుతూనే ఉంటుంది. దీంతో ఇంట్లో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇంట్లో ఎక్కువ వేడి ఉత్పత్తి అయ్యేది వంట గదిలోనే. వంట గదిలోని వేడి బయటికి వెళ్లిపోయేలా వెంటిలేటర్‌ ఏర్పాటు చేసుకోవాలి. ఈ వెంటిలేటర్ల కు ఎగ్జాస్టింగ్‌ ‌ఫ్యాన్లు అమర్చుకోవాలి. ఒక -ట్రేలో ఐస్‌ ‌ముక్కలు వేసి, ఫ్యాన్‌ ‌కింద పెడితే గదిలో చల్లదనం పరచుకుంటుంది. లేదా టబ్బులో చల్లని నీరుపోసి, గది మూలల్లో పెట్టినా గది చల్లబడుతుంది. ఇంటి గోడల పక్కన పెద్ద పెద్ద రాళ్లు , సిమెంట్‌ ‌నిర్మాణాల వంటివి అనవసరంగా ఉంటే వాటిని తొలగించాలి. ఎందుకంటే అవి ఎండను రిఫ్లెక్ట్ ‌చేసి, వేడిని పెంచుతాయి.

Featured ఆంధ్రప్రదేశ్

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు మంచాలు, బియ్యం అందజేత

గత కొద్ది రోజుల క్రితం గంగపట్నం గిరిజన కాలనీలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే ఈరోజు ఉదయం పులి చెంచయ్య ITDA (APO) మరియు సింగపూర్ కమ్యూనిటి అసిస్టిన్సి గ్రూపు మరియు రమణ USA పోచరెడ్డి సంపత్ రెడ్డి మరియు వారి కుమారుడు సురేష్ ( సింగపూర్) H.ఎజ్జు మల్లికార్జున గారు రామకృష్ణ. పి.శ్రీకాంత్ పరుచూరు స్వర్ణలత మరియు శ్రీధర్ వారి ఆర్ధిక సహయం తో బాధిత కుటుంబాలకు మంచాలు . బియ్యం మరియు దుప్పట్లు. బట్టలు అందజేయాడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్ధానిక నాయకులు జనార్దన్ రెడ్డి సర్పంచ్ నిరంజన్ వేణుగోపాల్ రెడ్డి . ఫణీంద్ర నాయుడు. వాలంటీర్ భాస్కర్ గిరిజన నాయకులు శేషయ్య. సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ బిజినెస్

మన పనిలో పరమార్ధం కనుక్కోవడం

(పున్నమి ప్రతినిధి) : ఇప్పుడున్న కరోనా కష్ట కాలంలో, పనిలో ఉత్సాహం తెచ్చుకోవడం చాలా కష్టం అయి పోయింది! ఉద్యోగంలో ఉన్న వారికి (అది ప్రభుత్వోద్యోగం అయితే తప్ప!) అది ఎంత కాలం ఉంటుందో తెలియదు. వ్యాపారం నడిపే వాళ్ళ పరిస్థితీ, అంతకు మెరుగ్గా ఏమీ లేదు! కనుగోలు దారులు తగ్గి పోయారు. సరుకు నిలవలు పెరిగి పోయాయి. సరుకు తీసుకున్న వాళ్ళు సమయానికి డబ్బు చెల్లించడం లేదు. మార్కెట్‌ ‌లో డబ్బులు లేవు. వ్యాపారం లాభ సాటిగా సాగినా సాగక పోయినా, జి ఎస్టి 18 శాతం కట్టక తప్పదు.ఇలా! ఇలాంటి సమయంలో మన దైనందిక జీవితంలో ఉత్సా హం కొని తెచ్చుకుని పని చేయటం కష్టమే కానీ, అవసరం! మన పనిలో నాణ్యత తగ్గినా, మన ఉత్పాదక శక్తి తగ్గినా, దాని వల్ల మనకి కలిగే రిస్కు అధికం! మనని ఉత్సాహపరిచే పరిస్థితులు బయట లేనప్పుడు, మనకి మనం మోటివేట్‌ ‌చేసుకోవడంలో చిన్న చిట్కాలు, ఈ వారం చూద్దాం. చాలా మందిని అడిగాము . ‘‘మీ పనిలో ఏమి చూసి మోటివేట్‌ అవుతారు ? ‘‘ అని . ‘‘ ఆర్ధిక అవసరాలు, కుటుంబం నడుపుకోవడం కోసం, ఖర్చులు, అప్పులు, ఇఎమ్మైలు ‘‘ ఇలా చెప్పుకొచ్చారు . ఇవి అవసరాలే కానీ, ఇవి మనిషి కి ఉత్సాహం కలిగించ లేవు ! ఎలా కలగజేసుకోవాలో చూద్దాం . ప్రపంచంలో ఎన్నో పనులు ఉండగా, ఇప్పుడు మీరు చేస్తున్న పని ఎందుకు ఎంచుకున్నారో ( కొన్ని సంవత్సరాల క్రిందట ) గుర్తు తెచ్చుకోండి! మరియు, మీరు చేసే పని చక్కగా చేయ గలిగితే, దాని వల్ల, మీరే కాక, ఇంకా ఎవరెవరు లాభపడతారో ఆలోచించండి. ఒక వేళ మీరు సేల్స్‌లో ఉంటే, మీరు చేసే సేల్స్ ‌వల్ల కంపెనీ లాభాల బాట పట్ట వచ్చు . కొన్ని ఉద్యోగాలు, జీతాలూ, జీవితాలూ నిలబడవచ్చు. ఇదే విధంగా మీరు కష్టమర్‌ ‌సర్వీసులలో ఉన్నా, అకౌంటింగ్‌లో ఉన్నా, మీ పని చక్కగా కరెక్టుగా జరిగితే, దాని వల్ల ఎవరెవరికి లాభమో ఆలోచించండి ! ‘‘ ఓహ్‌! ‌మన పని ఇంత ముఖ్యమా? ఇంతమందికి ఉపయోగమా అనిపించి, మన ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. కొత్త ఉత్సాహం వస్తుంది. మీరు గత 15 ఏళ్ళుగా పని చేస్తూ, రిపీట్‌గా అదే పని చేస్తూ కొంత ఆసక్తి సన్నగిల్లుతోంది అనుకోండి. మీ సంస్థలో చేరిన కొంత మంది జూనియర్‌లకి కోచింగ్‌ ఇవ్వండి . వారి పనిలో పూనుకుని సహాయం చెయ్యండి . మీ అనుభవాలు పంచుకోండి. ఆ రోజు చిన్న తప్పు చేసి బాస్‌తో తిట్లు తిని మనసు చిన్న బుచ్చుకున్న జూనియర్‌ ‌సహోద్యోగిని టీకి తీసుకు వెళ్ళి ఉత్సాహ పరచండి, ఓదార్చండి . కెరీర్‌లో ఎవరైనా, తమ పై అధికారితో అక్షింతలు వేయించుకోని ఉగ్యోగి (ని) అసలు ఉండరని చెప్పండి. ఇది అంతా కామన్‌ అని చెప్పండి. పనిలో వారి నైపుణ్యం పెంచడంలో సీనియర్‌గా మీ వంతు పాత్ర నిర్వహించండి. కెరీర్‌ ‌మొదటి లొ మనకి పని నేర్పించిన వారిని మనము మరిచి పోలేము! ఇతరులకు సహాయం చెయ్యడం వల్ల మనకి పనిలో పరమార్ధం కనిపిస్తుంది. ప్రపంచంతో కనెక్ట్ ‌కాకుండా ఉండ లేము. కానీ, మనం చూసే, చదివే వార్తలు, సోషల్‌ ‌మీడియాలో చదివే పాక్షిక వాస్తవాలు, అర్ధ సత్యాలు, అనవసర వాగ్యుద్ధాలు, ఇవన్నీ మన మనసు మీద నెగెటివ్‌ ‌ప్రభావం చూపించకుండా జాగ్రత్త పడండి. మీ పనికి సంబంధిన కొత్త కొత్త కోర్సులు, సర్టిఫికేషన్‌ ‌లు ఏమైనా చేయగలరేమో ఆలోచించండి. ఇప్పుడు యూడెమీ, అప్‌ ‌గ్రాడ్‌లాంటి సైట్‌ల వల్ల, వారం, 2 వారాల కోర్సులు కూడా లభ్యం . ఈ మధ్యనే నా పనికి అనగా ఉద్యోగుల ట్రెయినింగ్‌కి , సంబంధించి యూడెమీలో ఒక వారం కోర్సు తీసుకున్నాను . రూ 800 మాత్రమే కట్టి . ఆ కోర్సులో నాకు సగం తెలిసిన విషయాలే అయినా, మరొక సగం పూర్తిగా కొత్త విషయాలు ! మీకు వీలున్న సమయంలోనే అధ్యయనం చేసేలా ఆన్‌ ‌లైన్‌ ‌కోర్సులను డిజైన్‌ ‌చేస్తున్నారు. మరియు, మీ కంపెనీ మీటింగు లలో చురుకుగా పాల్గొనండి. మీ అనుభవాన్ని ఉపయోగించి, మీ కంపెనీలో ఆదాయం మరికొంత ఎలా పెంచాలో, ఖర్చు మరి కొంత ఎలా తగ్గించాలో, కష్టమర్‌లని మరింతగా శాటిస్‌ ‌చేయడానికి ఇంకా ఏమేమి చేయ వచ్చో మీ యాజమాన్యానికి సూచించండి. ఇలా, నాకు తట్టని మరెన్నో ఆలోచనలు మీకు కూడా తట్ట వచ్చు . ఆలోచించండి. ఇప్పుడున్న కష్ట కాలంలో, దైనందిక పని జీవితం లో ఉతాహంగా పని చేయడం, మన పనిలో పరమార్ధం చూడడం, మన అందరికీ అవసరం.

Featured

అనంతసాగరం తాసిల్దార్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అనంతసాగరం మండలం: అనంతసాగరం మండల తాసిల్దార్ ఎ.పద్మావతి గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొనిస్థానిక తాసిల్దార్ కార్యాలయం నందు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరిపారు. మహిళలు మహిళలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్త్రీలను దేవతలుగా పూజించడం కాదు స్త్రీలను గౌరవించాలని,స్త్రీలను పురుషులతో సమానంగా చూస్తున్నాం అనేది మాటల్లో కాకుండా కార్యరూపం దాల్చే లా చేయాలని మహిళలు ఆర్థికంగా సామాజికంగా పురోగతి చెందేలా పాటుపడాలని, మహిళల అభివృద్ధికి తోడ్పడాలని, అదే మహిళలకు ఇచ్చే నిజమైన గౌరవం అని తెలిపారు. స్త్రీని ఒక వస్తువుల ఒక యంత్రంలా చూడకుండా వాళ్లు కూడా సమాజంలో భాగమేనని గుర్తించాలి. చాలామంది మహిళలను వారికి నోటికొచ్చినట్టు దుర్భాషలాడుతూ ఉంటారు మహిళలను కించపరిచేలా మాట్లాడటం మానుకోవాలని,ఈ సమాజం మహిళకు ఇచ్చే గౌరవం ఎలా ఉందంటే ఒక వ్యక్తి చేతకాని పని చేస్తుంటే ఆ వ్యక్తి పసుపు రాసుకుని గాజులు తొడుక్కొని చీర కట్టుకోమని నిందిస్తారు అంటే మహిళలు అంత చేతకాని వారిలా వాళ్లు చూడడం చూపించడం సరికాదన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితేనే ఇటువంటి మహిళా దినోత్సవాలకు వీలువ ఉంటుందని తెలిపారు. ఇకనైనా మహిళలకు తగిన గౌరవం స్వేచ్ఛ ఇవ్వాలని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.