బుచ్చిరెడ్డిపాలెం ఫిబ్రవరి 22 ( పున్నమి విలేఖరి ) మండలంలోని పాత మినగల్లు ఇసుక రీచ్ నుండి నిత్యం టిప్పర్లు తిరుగుతుండడంతో గ్రామ శివారులో పంట కాలవపై ఉన్న బ్రిడ్జి సిదిలావస్తకు చేరింది. ఓ ఇసుక టిప్పర్ బ్రిడ్జి మీద నుండి వెలుతుండగా హటాత్తుగా బ్రిడ్జి కూలిపోయింది. అదృష్టవశాత్తు టిప్పర్ బ్రిడ్జి దాటగానే ఈ బ్రిడ్జి కూలడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ బ్రిడ్జి కూలడంతో కాలువ అవతల రోజూ పొలం పనులకు వెళ్లే ప్రజలంతా అవస్తపాడాల్సిన పరిస్తితి ఏర్పడింది. దీంతో కాలువ అవతలకు వెళ్లాలంటే చుట్టూతిరిగి వెళ్లాలని గ్రామంలోని పలువురు ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జాప్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులుగా.. మళ్లీ పున్నమరాజు, యుగంధర్ రెడ్డిలు ఎన్నిక *విజయవాడ: అనంతపురం ఫిబ్రవరి 21 జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(జాప్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులుగా మళ్లీ తిరిగి పున్నమరాజు, యుగంధర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు విజయవాడలో ని జాప్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నాడు అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులుగా పున్నమరాజు, యుగంధర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అనంతపురం జిల్లాకు చెందిన కొత్తపల్లి అనిల్ కుమార్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించి ఉపాధ్యక్ష పదవిని లభించేలా చొరవ చూపిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు పున్నమరాజు, యుగందర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర స్థాయి నాయకత్వం సూచనల మేరకు అనంతపురం జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలతో పాటు ప్రధానంగా పెండింగ్ లో ఉన్న అక్రిడేషన్ల సమస్య పరిష్కారానికి కృషి చేయడమే గాకుండా ఈ విషయంలో అర్హులయిన ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగేందుకు పోరాడుతానని హామీ ఇచ్చారు.
(పున్నమి ప్రతినిధి) : వ్యాపారంలో కానీ, పర్సనల్ లైఫ్‌లో కానీ, ఉద్యోగంలో కానీ, మనం ఫలానా పని చేసి పెట్టమనో, ఫలానా పనిలో సాయం కావాలి అనో ఎవరినో అడుగుతాం. అది సోమవారం. ‘హా, బుధవారానికల్ల పని ఖతం ‘(ఎవరు ఖతం? మనమా? పని కాక పోతే మనం ఖతం!) అని హామీ ఇస్తారు. బుధవారం నాడు అటువైపు నుంచి ఉలుకూ పలుకూ ఉండదు. ఫోన్ ఉండదు. చడీ చప్పుడూ ఉండదు. అప్పడు మనం వారికి గుర్తు చేయాలి. మెయిల్ రూపంలోనో, ఒక ఫోన్ కాల్ చేసో, లేదా అటు వైపు వెళ్ళినప్పుడు పలకరించడమో, లేదా ఒక ఫోన్ మెసెజి ద్వారా నో. దీనినే మనం ఫాలో అప్ అంటాము. వ్యక్తిగత జీవితంలోనూ, పనిలోనూ, వ్యాపారంలోనూ ఫాలో అప్ అవసరం! అయితే, అది ఎంతో కళాత్మకంగా ఉండాలి. పట్టి పీడించడంలా ఉండ కూడదు! అది ఎలానో మనం ఈ వారం చూద్దాం. ఒక వేళ మీరు సేల్స్‌లో ఉన్నారు అనుకోండి. మీ కష్టమరు ‘వచ్చే వారం చూద్దాంలే!’ అంటారు. ‘వచ్చే నెల’ అంటారు. ఆ టైంలో ఫోన్ చేస్తే రెస్‌పాన్స్ ఉండదు. ఒక మిత్రునికి ఒక పనిలో సాయం అడుగుతారు. ‘ఆ శాఖలో నా క్లాస్‌మేటు ఉన్నాడు! చిటికలో పని అయిపోతుంది! అంటాడు. ఆ బుధవారం రానే వస్తుంది, ఇతని నుంచి సౌండు ఉండదు! ‘నాన్నా ! శుక్రవారం కల్లా ఆన్‌లైన్‌లో నా ఫీజు కట్టాలి’ అని అమ్మాయి అంటుంది. శుక్రవారం వస్తుంది, పని వత్తిడిలో తండ్రి మరిచిపోతాడు. నాన్నకు గుర్తు చెయ్యాలంటే భయం! ఎలా? ఫాలో అప్ చెయ్యకుండా ఆపలేము. కానీ అది వారిని ఇబ్బంది పెట్టకూడదు. ఇలా ప్రయత్నించడి. (1) మనకు ఒక వ్యక్తి 4 రోజులలో మీ పని అయి పోతుంది అని చెప్పారు అనుకోండి. ‘‘అయితే ఒక సారి శుక్రవారం మీకు గుర్తు చేస్తాను సర్. ఫోన్ ద్వారా కానీ, మెసేజి ఇచ్చి కానీ’’ అని ముందరే అనుమతి తీసుకోండి. (2) ఫాలో అప్‌కి ఫోన్ చేసినప్పుడు, నేరుగా విషయంలోకి రండి. సున్నితంగా. ‘‘మీకు గుర్తు చెయ్యడానికి ఫోన్ చేసాను సర్ / మేడం’’ అనకండి. ఇగో దెబ్బ తినవచ్చు . (3) ఫోన్ వారు లిఫ్ట్ చెయ్యక పోతే, బిజీగా ఉన్నారు అని అర్ధం చేసుకుని ఒక మెసేజి పెట్టండి. ఇమెయిల్ అయినా ఫరవా లేదు. (4) మనకి బిజినెస్ ఇస్తానన్న వ్యక్తి లేక సాయం చేస్తాను అన్న వ్యక్తి, ఆ మాట మీద నిలబడ వచ్చు, లేదా నిలబెట్టుకోలేక పోవచ్చు. కానీ మనం అడిగే విధానం మాత్రం పాజిటివ్‌గా ధ్వనించాలి !! ఉదాహరణకి ‘‘ మొన్న మనం అనుకున్నాం కద సార్? పెండింగ్ పేమెంటు విషయం పూర్తి చేద్దామని? ఈ రోజు చేసేద్దామా?’’ అని అడగండి.! (5) ఇలా మాత్రం అడగకండి ! ‘‘మొన్న సోమవారం కలిసినప్పుడు, ఈ రోజు చెక్కు ఇస్తాము అన్నారు! ఈరోజైనా కుదురుతుందా లేదా?’’ ఇలా! సందేహిస్తున్నట్లు అడగకండి! మరింత టైం తీసుకుంటారు. (6) ఫోన్‌లో అయితే, మీ కంఠం ఆహ్లాదకరంగా ఉండేటట్టు చూసుకోండి (మనసులో మండిపోతున్నా సరే!). (7) కొన్ని సందర్భాలలో డెడ్ లైన్‌కి ముందరే ఫాలో అప్ మంచిది. అది ఆ పని ఎంత కీలకమైనది? దాని ప్రాధాన్యాన్ని బట్టి ఉంటుంది. ఉదా:ఒక వ్యక్తి మీకు ‘గురువారం సాయంత్రానికల్లా పని అయిపోతుంది’ అని హామీ ఇచ్చారు అనుకోండి. అతను మహా బిజీగా ఉండి మరచి పోవచ్చు. బుధవారం ప్రొద్దున్నే ఫోన్ చేసి, చాకచక్యంగా, లౌక్యంగా ‘ మేడం / సార్ ! ఈ హోదాలో మీరు చాలా బిజీగా ఉంటారు అని నాకు తెలుసు. అందుకే కొంచెం గుర్తు చేయడానికి! రేపూ సాయంత్రానికల్లా మన పని అవుతుందన్నారు కదా? ఆ విషయం’! అని గుర్తు చేయండి. అవతలి వ్యక్తి మీకంటే వయసులోనూ, అధికారం లోనూ పైన ఉంటే, ఈ పని చాలా జాగ్రత్త గా చేయాలి! పని కాదు అని తెలిసిన తరువాత : ఇంత ప్రయత్నం చేసినా, ఒక్కోసారి మనం అనుకున్న పని కాదు. అలాంటప్పుడు ఇక ఆ వ్యక్తి ని ఫాలో అప్ చెయ్యడం వదిలేయాలి . ఆ వ్యక్తి వల్ల కాదు. ఇబ్బంది పెట్ట వద్దు ! ఒక్కో సారి మన విషయం లో కూడా అలా జరగ వచ్చు . మనం ఎవరికో ఏదో సహాయం చేస్తాము అని మనసుతో ప్రామిస్ చేస్తాము . కానీ ఆ తరువాత మన పరిస్థుతులు అనుకూలంగా లేక పోవచ్చు ! ఇవి వ్యాపారంలో సహజం ! (8) పని కాకపోయినా వారితో సత్సంబంధాలు చెడగొట్టుకోకండి. ఈ రోజు కాకపోతే, భవిష్యత్తులో ఉపయోగ పడగలరు . ‘‘ ఫర్వాలేదు సార్, నేను అర్ధం చేసుకోగలను. గుడ్‌డే ‘అని విష్ చేసి ఫోన్ పెట్టేయండి
గ్రామ గ్రామానికి విస్తరింప చేస్తున్న పోస్టల్ డిజిటల్ సేవ పోస్టల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపిన సూపర్నెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ నెల్లూరు :కె.వెంకటేశ్వర్లు అనంతసాగరం మండలం: అనంతసాగరం గ్రామంలో డిజిటల్ సేవా మేళాను ప్రారంభించిన ఎస్ పీ కే వెంకటేశ్వర్లు గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రజలకు ఉపయోగకరమైన ఎన్నో పథకాలను ప్రారంభించిందని ఈ పథకాలను ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని నూతనంగా డిజిటల్ సేవా మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఢాక్ పే యు పి ఐ ఆధారిత సేవలు కూడా ప్రారంభించిందని మీ ఇంటి ముందుకే మీ బ్యాంకు అనే వినూత్న సేవలను కూడా తీసుకు వచ్చిందని ఈ పథకం ద్వారా ఏ బ్యాంకు నుండి అయినా మీ ఇంటి వద్ద నుండి ఆధార్ ఎనేబుల్ సర్వీస్ ద్వారా వంద రూపాయల నుండి రోజుకు పది వేలు తీసుకునే సౌలభ్యం ఉందని ఇంకా 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అనే వినూత్న పథకంతీసుకువచ్చిందని ఈ అకౌంట్ ద్వారా అత్యధిక వడ్డీ పొందే అవకాశం ఉందని 11 ఏళ్ళ పైబడిన ఆడపిల్లలకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఉందని దీనికి కూడా అధిక వడ్డీ లభిస్తుందని ఇన్కమ్ టాక్స్ రాయితీ కూడా లభిస్తుందని తెలిపారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ కేవలం 70 రూపాయలు రుసుముతో ఆధార్ వేలిముద్రలు ద్వారా మా పోస్ట్ మాన్ మీ ఇంటి దగ్గరికి వచ్చి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ అనేది కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. ఇంకా ఆధార్ సేవలు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ఈ సేవలు కూడా ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ఎన్నో పథకాలను ప్రజలకు అందిస్తోందని ఈ పథకాలను కూడా ప్రజలు ఉపయోగించుకుని లబ్ది పొందాలని చెప్పారు. 1995 లో గ్రామీణ తపాలా బీమా ప్రారంభించిందని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అతి తక్కువ ప్రీమియంతో అందిస్తుందని ఈ టీ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమానికి ఆత్మకూరు ఏ ఎస్. పి .ఎస్ ఆర్ కే హెచ్. ప్రసాద్ ,అనంతసాగరం ఎస్.పి. ఎం.ప్రవీణ్ చైతన్య మరియు పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి వెంకటాచలం,ఫిబ్రవరి 15 (పున్నమి విలేఖరి): ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన వెంకటాచలం మండలంలోని చెముడుగుంట చెరువు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బుజబుజ నెల్లూరుకు చెందిన షేక్ మస్తాన్ కుమారుడు షేక్ సలీమ్ (13), పార్లపల్లి శ్రీనివాసులు రెడ్డి కుమారుడు వెంకట సాయి (14), మోపూరు రాజా కుమారుడు రాజేష్ (13) ఆదివారం సెలవు కావడంతో చెముడుగుంట హైవే ని ఆనుకొని ఉన్న చెరువు వద్దకు ఈతకు వెళ్లారు. సరదాగా ఈతకోసం దిగిన చిన్నారులు ఒకరి తర్వాత ఒకరు మునిగిపోవడంతో మృతి చెందారు. పొద్దుబోయినా ఇంటికి పిల్లలు రాకపోయేసరికి తల్లిదండ్రులు, సమీప బంధువులు చుట్టుపక్కల ప్రాంతాలు గాలించారు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో చెముడుగుంట పంచాయతీ నక్క కాలనీ చెరువు గట్టుపైన ఉన్న చిన్నారుల సైకిళ్ళు, బట్టలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ సీఐ రామకృష్ణ, వెంకటాచలం ఎస్ఐ కరీముల్లా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి కావడంతో ఎంత సేపు గాలించినా ఆచూకీ కానరాలేదు. సోమవారం ఉదయం మరోసారి గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పుడూ తమ కళ్ల ముందే ఆడుతూ పాడుతూ తిరిగే పిల్లలను ఒక్కసారిగా మృతదేహాలుగా చూసిన తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
బుచ్చిరెడ్డిపాలెము ఫిబ్రవరి 12 ( పున్నమి విలేఖరి ) ప్రముఖ పుణ్యక్షేత్రం జొన్నవాడలో వెలసిఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవార్లు శుక్రవారం ప్రత్యేక పుష్పాలంకరణలో వెండి నందివాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. నెల్లూరు వాస్తవ్యులు రామిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి ధర్మపత్ని శ్రీమతి ఈశ్వరమ్మ మరియు వారి కుటుంబసభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అనంతరం ఉభయకర్తలను శ్రీవార్ల శేష వస్త్రములతో సత్కరించారు. అధిక సంఖ్యలో భక్తులు గ్రామోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. ఈకార్యక్రమంలో చీమల రమేష్ బాబు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు, అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి, దేవస్థాన సూపరింటెండెంట్ వి గిరికృష్ణ పాల్గొన్నారు.
(పున్నమి ప్రతినిధి) : క్రితం వారం, కరోనా ప్యాండమిక్ సమయంలో ఉద్యోగులకు ఇవ్వ దగిన శెలవుల గురించి చర్చించుకున్నాం. ఉద్యోగుల ఆరోగ్యం అనేది, ఉద్యోగులకే కాక, సంస్థాగతంగా కంపెనీలకు కూడా చాలా ముఖ్యం. చాలా సంస్థలలో మధ్య వయసు ఉద్యోగులు ఉంటారు. సీనియర్ హోదాలోనో, కీలకమైన పొజిషన్ లలోనో ఉంటారు. స్త్రీలు కానీ, పురుషులు కానీ, వారి వయసు ఒక 45 దాటి ఉంటుంది అనుకోండి. చాలా మంది మీకు చెప్ప లేని, చెప్పని, చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలతో సతమతమౌతూ, ఎలాగోలా ఉద్యోగంలో విధులు నిర్వహిస్తూ, బండి ఈడుస్తూ ఉంటారు. పెద్ద సంస్థలు అయితే, ఆరోగ్య బీమా ఇస్తాయి. చిన్న కంపెనీలు అవి కూడా ఇవ్వలేవు. అలా అని వారికి వైట్ రేషన్ కార్డు కూడా ఉండదు. ఆరోగ్యశ్రీకి కూడా అర్హులు కారు. ఇటువంటి, ప్రభుత్వం నుంచో, కంపెనీ నుంచో సమాజం నుంచో ఎలాంటి సపోర్టూ లేని మధ్య తరగతి ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు వస్తే. ఇటీవలి ఒక సర్వే ప్రకారం, 45 దాటిన ఉద్యోగు లలో, 60 శాతం మంది ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధ పడుతూ ఉంటారట! అలాంటి పరిస్థితులలో, మేనేజర్‌గా, లేక ఒక పై అధికారిగా మీరేమి చేయగలరో ఈ వారం కొన్ని సూచనలు. (1) అందరూ వారి ఆరోగ్య సమస్యలను పై అధికారులతో పంచుకోవడానికి ఇష్టపడరు. వారిని బలవంతం చెయ్యవద్దు. వారు ఎంత చెబితే, అంత వినండి. మీ సంస్థ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లభిస్తాయో వారికి చెప్పండి. కొన్ని కంపెనీలకి కొన్ని ఆసుపత్రుల వారు, లేక డాక్టర్‌లు తెలిసి ఉంటారు. కంపెని ద్వారా వెళితే, కొంత డిస్కౌంటుతో ఆరోగ్య పరీక్షలు చేయడమో, హాస్పిటల్ ఫీజు కొంత తగ్గించడమో చేస్తారు. అలాంటి అవకాశం మీ దగ్గర ఉంటే వారికి చెప్పండి. అతడి / ఆమె ఆరోగ్య సమస్యకి సంబంధించి మీకు బాగా తెలిసిన పేరున్న డాక్టర్ ఉంటే, వారి రిఫరెన్సు ఇవ్వండి. (2) శెలవు ఇవ్వలేకపోతే, ఇంటి దగ్గర నుంచి పని చేసే అవకాశం ఉందేమో చూసి, అలాంటి పని కల్పించండి. (3) వారు మార్కెటింగ్, సేల్స్ లాంటి ఫీల్డ్ వర్క్‌లో ఉంటే, ఆరోగ్య కారణాల వల్ల తాత్కాలికంగా తిరగ లేక పోతే, ఆఫీసులో కూర్చుని, టెలి మార్కెటింగ్, లేదా పేమెంటు ఫాలోఅప్ లాంటి పనులు అప్పగించవచ్చు. (4) పూర్తి 8 గంటలు పని చేయలేకపోతే, రోజుకు ఒక నాలుగైదు గంటలు పని చేయగ్లరేమో అడగండి వారు కోలుకునే దాకా. ఆరోగ్య సమస్య నుంచి బయట పడగలగడం అనేది ఒక మైండ్‌గేం. ‘‘ నాకు కంపెనీ సపోర్టు ఉంది. మా పై అధికారి సపోర్టు ఉంది’’ అనే భావంతో వారు త్వరగా కోలుకోగలుగుతారు. మందులు వారి శరీరం పై బాగా పని చేస్తాయి. ఇక మీరు చెయ్య కూడనివి !! ఒక ఉద్యోగి (ని) మీ దగ్గర ఆరోగ్య సమస్యలు ఏకరువు పెట్టుకున్నప్పుడు, మీకు ఏమి చెయ్యాలో తెలియక పోతే, లేదా మీ అధికార పరిధుల గురించి క్లారిటీ లేక పోతే, మీ పై అధికారులను సంప్రదించండి. మీ పై సూపర్ వైజర్‌లకి తెలియకుండా, మీరు ఎలాంటి హామీలు ఇవ్వవద్దు, కంపెనీ తరఫున! వారు చెబుతున్నారు కదా అని, వారి దగ్గర మీ ఆరోగ్య సమస్యలు ఏకరువు పెట్టకండి ! అది వారికి ఏ విధంగానూ సహాయం చెయ్యదు! ఇవి చేయకూడనివి. వయసు రావడం, ఆరోగ్య సమస్యలు ఉండడం సహజం. కానీ, గత 20 సంవత్సరాలుగా మీ దగ్గర పని చేసే ఉద్యోగిని ఇలాంటి సమయాలలో ఎలాగోలా కాపాడుకోలేక పోతే, కంపెనీకి ఉపయోగ పడే దశాబ్దాల నైపుణ్యాన్ని, అనుభవాన్నీ కోల్పోతాం. దాని ప్రభావం వ్యాపారం మీద కూడా ఉంటుంది. వ్యాపారంలో లాభాపేక్షని, టార్గెట్ లని, కొంత ఉద్యోగుల సంక్షేమాన్నీ బ్యాలన్సు చేయడం, వ్యాపారస్థులకు ఒక ఛాలెంజ్! మీ మీ వ్యాపారాలలో మీరు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ.
మనుబోలు (పున్నమి విలేకరి)11,ఫిబ్రవరి :మనుబోలు మండలంలో గురువారం రెండో రోజు నామినేషన్లు ప్రక్రియ జోరుగా సాగింది మండలం లోని కట్టువవల్లిలో వైకాపా బలపరచిన అభ్యర్థి ఎస్ భారతమ్మ నామినేషన్ ను గుండాల ఆదినారాయణ జానకిరెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ వేశారు. అదేవిధంగా కొలనుకుదురు టీడీపీ బలపరచిన అభ్యర్థి కసిరెడ్డి సునీల్ రెడ్డి నామినేషన్ వేశారు. అక్కంపేట వైకాపా బలపరచిన ఆభ్యర్ధి జాంబవతమ్మ కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ దాఖలు చేశారు. వీరంపల్లిలో వైకాపా బలపరచిన అభ్యర్థి సుధాకర్ జెట్టి సురేంద్ర ఆధ్వర్యంలో నామినేషన్ వేశారు.కొమ్మలపూడి లో రఘరామయ్య టీడీపీ బలపరచిన అభ్యర్థి గా శేషురెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ దాఖలు చేశారు. మానిటెరింగ్ అధీకారి సమాచారం మేరకు మూడుగంటల సమయానికి 30సర్పంచ్ అభ్యర్థులు. 172 వార్డుమెంబర్లకు నామినేషన్ లు దాఖలయ్యాయి. ఇదిలా వుండగా జట్లకొండూరు నామినేషన్ కేంద్రాన్ని ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ తనిఖీ చేసి ఆర్వోలకు పలుసూచనలు సలహాలు చేశారు. ఎస్ఐ ముత్యాలరావు ఆధ్వర్యంలో గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ నాగరాజు ఆర్డీవో తోపాటు వున్నారు.
అనంతసాగరం గ్రామంలో ముమ్మరంగా కొనసాగుతున్న వైసిపి ప్రచారం అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని అఖండ మెజారిటీతో గెలిపించాలని బట్రెడ్డి జనార్దన్ రెడ్డి గారు సర్పంచ్ అభ్యర్థి బొర్రాశోభ గారితో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ ఆత్మీయ నాయకుడి తో కలిసి అభిమానులు, కార్యకర్తలు అడుగులు కలపడంతో జనసంద్రంగా మారిన వీధులు.ప్రతి ఇంటికి పెన్నా నీటిని అందిస్తామని ఇప్పటికే 36 లక్షలు ఫండ్ శాంక్షన్ అయిందని ఎలక్షన్ కోడ్ కారణంగా పనులు ఆపేసి ఉన్నామని కోడ్ ముగిసిన వెంటనే ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామమంతా పరిశుభ్రంగా ఉంచేందుకు తడి చెత్త పొడి చెత్త వేరు చేసేందుకు గ్రామంలోని చెత్తను సేకరించేందుకు పారిశుద్ధ్య కార్మికులను నియమించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని , సిమెంట్ రోడ్లు లేని ప్రతి వీధికి సిమెంట్ రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు.
బుచ్చిరెడ్డిపాలెము ఫిబ్రవరి 10 ( పున్నమి విలేకరి ) మండలంలోని మినగల్లు గ్రామ పంచాయతీ సర్పంచి స్థానానికి వైసిపి మహిళ అభ్యర్థిగా అల్లం నిర్మలమ్మ మరియు 12 మంది వార్డ్ మెంబర్ లు పంచేడు గ్రామ సచివాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి మినగల్లు గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ లు అభ్యర్థులుగా ప్రకటించినందుకు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కి, మండల నాయకులు సురా శ్రీనివాసులు రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్, వార్డ్ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిచి చూపిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెము మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం. రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.