Sunday, 12 July 2026

Blog

నిర్మల్

ఎంపీడీవోను సన్మానించిన మండల విద్యాధికారి

బాసర, జులై 16(తెలంగాణ పున్నమి ప్రతినిధి ): మండల కేంద్రమైన బాసరలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా బాసర ఎంపీడీవో గా దేవేందర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. దీంతో మండల విద్యాధికారి జి. మైసాజి- విద్యావనరుల కేంద్రం సిబ్బంది పూలమాల శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా వనరుల కేంద్రం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

తీన్మార్ మల్లన్న దాడిని ఖండించిన ముధోల్ బిసి నాయకులు

తీన్మార్ మల్లన్న దాడిని ఖండించిన ముధోల్ బిసి నాయకులు ముధోల్, జులై 16తెలంగాణ పున్నమి ప్రతినిధి):మండల కేంద్రంలో కొత్త బస్టాండ్ సమీపంలో బిసి ఐక్యవేదిక ఆధ్వర్యంలో బిసి బిడ్డ అయినా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై జరిగిన దాడిని తీవ్రంగా బుధవారం నాయకులు తీవ్రంగా ఖండించారు .ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న పై దాడి హేమమైన చర్య అని ఇట్లాంటి దాడులు మున్ముందు పునరావృతం కాకుండా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘ నాయకులు రోళ్ల రమేష్, అనిల్, తాటివార్ రమేష్, దశరథ్, కోరిపోతన్న, విట్టల్, లవన్, శ్రీనివాస్ గౌడ్, గడ్డం సుభాష్,అంజి గౌడ్, మోహన్ యాదవ్, యువ న్యాయవాది జుట్టు గజేందర్ తో పాటుబీసీ సంఘం నాయకులు తదితరులున్నారు

ఆంధ్రప్రదేశ్

“నంది. ఉమా శంకర్” ఆణిముత్యం

నంది.ఉమా శంకర్ అందరికీ ఆణిముత్యం అని, రెడ్ క్రాస్ ఎంసీ సభ్యులు కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలమేరకు రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, స్థానిక రెడ్ క్రాస్ ప్రాంగణంలో జరిగిన రక్తదాన శిబిరంలో ముఖ్య అతిధిగా పాల్గొని, శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ శ్రీకాకుళంలో రక్త కొరత కారణంగా, ఎవరికీ రక్తం అందించలేకపోతున్నామని, గిరిజన ఇతర ప్రాంతాలలో తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, లుకేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు పునర్జన్మ ప్రసాదించడానికి రక్తదాతలు ముందుకు వచ్చి స్వచ్ఛంద రక్తదానం చేయటం హర్షణీయమని, రెడ్ క్రాస్ ప్రతినిధి, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ వ్యవస్థాపకులు నంది.ఉమాశంకర్ జన్మదినం సందర్భంగా ఇచ్చిన పిలుపుమేరకు వారి మిత్ర బృందం, బంధువులు, స్వచ్ఛంద సంస్థల సభ్యుల బృందం. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే చిన్నారుల కోరిక మేరకు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించామన్నారు. రెడ్ క్రాస్ చైర్మన్ సూచనలమేరకు, నగరంలో యువతకు, కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలలో రక్తదానంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రం, జ్ఞాపికలు, బంగారుపతకాలని అందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ పీఆర్వో, జాతీయ అవార్డు గ్రహీత పెంకి. చైతన్య, బి. జగదీశ్, హర్ష, రెడ్ క్రాస్ రక్తనిధి మేనేజర్ అయేషాబేగం, ఆఫీస్ మేనేజర్ సతీష్, ట్రైనింగ్ మేనేజర్ జి.రమణ, ఆదిత్య డిగ్రీ కళాశాల కరస్పాండెన్స్ ఎంఎస్. గుప్తా, వీరఘట్టాం శైల పద్మరాజు (వ్యాయామ ఉపాధ్యాయులు) , రక్తదాతలు పాల్గొన్నారు.

జనగాం

వికలాంగుల,వృద్ధుల,వితంతువుల చేయూత పెన్షన్ పెంచాలి

జనగామ జూలై16పున్నమి ప్రతినిధి వికలాంగులకు 6వేలు,వృద్ధులు, వితంతువుల చేయూత పెన్షన్ 4వేల రూపాయలకు పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జనగామ జిల్లా అధ్యక్షుడు గడ్డం సోమరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో వీహెచ్పిఎస్,ఎమ్మార్పీఎస్ సంయుక్త సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెన్షన్ పై ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలన్నారు.

ఆంధ్రప్రదేశ్

పేదల కడుపు నింపడం కనీస బాధ్యత

అన్నదానం మహాదానమని రెండవ పట్టణ ఎస్ఐ సంతోష్ మంగళవారం అన్నారు. స్థానిక గొంటి వీధి నైట్ షెల్టర్ లో, నిస్సహాయులకు, పెదపాడుకు చెందిన బొట్టా సాయి కుమార్, లయన్స్ క్లబ్ సభ్యులు పొడుగు చరణ్ రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమా శంకర్, సేవకులు ఉర్లాం శివతేజ పట్నాయక్ తదితర బృందం ప్రతినిత్యం ఇక్కడ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, సోమవారం రాత్రి అల్పాహారాన్ని నేను అందించటం ఆనందంగా ఉందన్నారు. అన్న సేవకు మించిన సేవ, ఇంకేముంటుందని, పేదవారి కడుపునింపటం గొప్పవిషయమన్నారు. పేదల కడుపునింపటం, కనీస బాధ్యతని ఉన్నదానిలో కొంతభాగం సేవలకు వినియోగించాలన్నారు. అనంతరం షెల్టర్ లో ఉండే నిస్సహాయుల వివరాలను అడిగి, తెలుసుకుని, వరిసర ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే నూతనంగా షెల్టర్ బాధ్యతను తీసుకున్న చేయూత మేమున్నాం అధ్యక్షురాలు వైశ్యరాజు వెంకటలక్ష్మికు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పలు పత్రికలలో ఇక్కడ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను చూస్తున్నామని, మన కుటుంబంలో జరిగే వేడుకలను, వేదికగా నైట్ షెల్టర్ ను తీసుకుంటే, వీరి ఆకలి తీర్చినవారమౌతామని, నేను కూడా వీరితో భాగమౌతానన్నారు. ఈ కార్యక్రమంలో నైట్ షెల్టర్ నివాసకులు, నేటి దాతలు పెదపాడుకు చెందిన బొట్టా సాయి కుమార్, లయన్స్ క్లబ్ సభ్యులు పొడుగు చరణ్, రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమా శంకర్, సేవకులు ఉర్లాం శివతేజ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

గురువారం కలెక్టర్ కార్యాలయం ముట్టడి

నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని జిల్లాలోని వికలాంగులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎన్.పిఆర్.డి. వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మీసాల కుర్మయ్య విజ్ఞప్తి చేశారు. నాగర్ కర్నూల్ పట్టణంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వికలాంగులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లు పెంచాలని, పెండింగ్ పెన్షన్లను మంజూరు చేయాలని, వికలాంగుల కార్పొరేషన్ ను బలోపేతం చేయాలని మూసివేసిన టీసీపీసీ సెంటర్లను ప్రారంభించాలని కోరుతూ గురువారం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ మండల కార్యదర్శి మాణిక్యం, గౌరవ అధ్యక్షుడు తిరుపతయ్య, ధర్మయ్య, సురేష్ పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

ఇసుక అక్రమ రవాణా ఆపాలి

నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం ‌ డిండి చింతపల్లి వాగు నుంచి అనుమతులు ఉన్నాయన్న సాకుతో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని బిజెపి మండల అధ్యక్షుడు గున్నా ఆనంద్ రెడ్డి బుధవారం ఆరోపించారు. వంగూర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, రోజు 20 ట్రాక్టర్ల ఇసుక రవాణాకు అనుమతి తీసుకుని రోజు 200 ట్రాక్టర్ల అక్రమంగా రవాణా చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుకను ఇవ్వడం లేదన్నారు. కేవలం నాయకుల లాభం కోసమే అధికారులు ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇసుక పర్మిషన్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ ఇసుక రవాణా ఆపకపోతే బిజెపి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సిలువేరు సైదులు, చింత కుంట్ల సైదులు, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి

వంగూర్ మండలం ‌ డిండి చింతపల్లి వాగు నుంచి అనుమతులు ఉన్నాయన్న సాకుతో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని బిజెపి మండల అధ్యక్షుడు గున్నా ఆనంద్ రెడ్డి బుధవారం ఆరోపించారు. వంగూర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, రోజు 20 ట్రాక్టర్ల ఇసుక రవాణాకు అనుమతి తీసుకుని రోజు 200 ట్రాక్టర్ల అక్రమంగా రవాణా చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుకను ఇవ్వడం లేదన్నారు. కేవలం నాయకుల లాభం కోసమే అధికారులు ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇసుక పర్మిషన్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ ఇసుక రవాణా ఆపకపోతే బిజెపి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సిలువేరు సైదులు, ఇంత కుంట్ల సైదులు, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి

రామారెడ్డి మండలంలో స్కూల్ తండా లో పెద్దపులి హల్చల్

సమస్త గ్రామ ప్రజలకు అటవీశాఖ తరుపున తెలియజేయినది ఏమనగా,మాచారెడ్డి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పులి సంచరిస్తున్నది వాస్తవం, కావున మీ యొక్క పశువులను ఇంటి వద్దనే కట్టి వేసుకోవాలని ఒంటరిగా అడవి ప్రాంతానికి వెళ్లకూడదు, సాయంత్రం 4 గంటల తర్వాత ఎవరు ఫారెస్ట్ లోకి వెళ్లకూడదు.ఒకవేళ పశువులను ఏమైనా గాయపరిచిన చంపేసిన సంబంధిత అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని ఇవ్వాలని, ఆఫీసు ను సంప్రదించాలని కోరుతున్నాం మరియు ఎలాంటి విష ప్రయోగాలకు పాల్పడవద్దని, సవివరంగా తెలియజేస్తున్నాము ఒకవేళ ఇలాంటి నేరాలకు పాల్పడిన ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షలు అమలు అవుతుంది. కావున అందరూ బాధ్యతగా వ్యవహరించగలరని మనవి.

నాగర్‌కర్నూల్

కలెక్టర్ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం ఎన్.పిఆర్.డి. దివ్యాంగుల సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మీసాల కురుమయ్య మాట్లాడుతూ, వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం గురువారం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నామని, ఈ ముట్టడిలో జిల్లాలోని వికలాంగుల అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ మండల కార్యదర్శి మాణిక్యం, గౌరవ అధ్యక్షుడు తిరుపతయ్య, నాయకులు ధర్మయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.