Sunday, 12 July 2026

Blog

నాగర్‌కర్నూల్

కలెక్టర్ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం ఎన్.పిఆర్.డి. దివ్యాంగుల సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మీసాల కురుమయ్య మాట్లాడుతూ, వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం గురువారం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నామని, ఈ ముట్టడిలో జిల్లాలోని వికలాంగుల అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ మండల కార్యదర్శి మాణిక్యం, గౌరవ అధ్యక్షుడు తిరుపతయ్య, నాయకులు ధర్మయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

జనగాం

జనగామ జిల్లాలో పసికందు కలకలం

జనగామ జూలై 16 పున్నమి జిల్లా ప్రతినిధి(పసునూరి దేవేందర్) జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో రోడ్డు పై వదిలి వెళ్ళిన పసికందు సంఘటన కలకలం స్పృష్టించింది.బుధవారం తెల్లవారు జామున పసిపాప ఏడుపు వినిపిస్తుండటంతో లేసి చూసిన గ్రామస్తులకు అప్పుడే పుట్టిన మగ శిశువు ను రోడ్డు పై వదిలిపెట్టినట్లు గుర్తుంచారు.దీంతో రోడ్డు పై వదిలేసిన వ్యక్తులు పారిపోయినట్లు భావించిన గ్రామస్తులు రఘునాథపల్లి పోలీసులకు సమాచారం అందించారు.ఎస్సై దూది మెట్ల నరేష్ యాదవ్ వెంటనే అక్కడికి చేరుకుని శిసువును అస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తెలంగాణ పెద్దపల్లి

రైతులకు యూరియా కొరత లేకుండా సరఫరా చేయాలి: సీపీఐ

*రైతులకు యూరియా కొరతను నివారించి, సరఫరా చేయాలి* *జూలై 17 న సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి* *సీపీఐ పూర్వ జిల్లా కార్యదర్శి గౌతం గోవర్ధన్* ముత్తారం, జులై 15, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో ఉన్న రైతులకు యూరియా కొరత తీవ్రంగా ఉందని, కొరతను నివారించి సరపరా చేయాలని సీపీఐ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతం గోవర్ధన్ ప్రభుత్వ అధికారులను కోరారు. మంగళవారం ముత్తారం మండల సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వర్షా కాలం ప్రారంభమై రైతులు తమ వ్యవసాయ అవసరాలకు సరిపడా యూరియా దొరకక అనేక ఇబ్బందులు పడుతున్నారని, మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న రైతులకు సరిపడా యూరియాను అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) పెద్దపల్లి జిల్లా మహాసభలు జూలై 17 న జిల్లా కేంద్రంలోని ఎస్ .ఎన్ గార్డెన్ లో జరుగుతాయని ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఆయన అన్నారు. సీపీఐ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ మహాసభలు నిర్వహించి నూతన నాయకత్వాన్ని ఎన్నుకుని భవిష్యత్తు పోరాట కార్యక్రమాలు చేపట్టాలని సీపీఐ జాతీయ సమితి నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 17 న జరిగే జిల్లా మహాసభల్లో ముత్తారం మండల సీపీఐ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ మహాసభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరౌతారని ఆయన అన్నారు. ముత్తారం మండల సీపీఐ కార్యదర్శి కామ్రేడ్ గాదె సమ్మయ్య అద్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ నాయకులు అల్లం ఓదేలు, గుండ విజయ్ కుమార్, రేగుంట మహేశ్, గంధం రాజయ్య, ముంజ సతీష్, సి.హెచ్. రాజ్ కుమార్, ఎం.చంద్రమౌళి, నల్లి శంకర్, జి.గంగయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.

జయశంకర్ భూపాలపల్లి తెలంగాణ

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పీఆర్టియు ముందంజ

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పిఆర్టియు ముందంజ కాటారం, జులై 16, పున్నమి ప్రతినిధి: ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రెండవ రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉపాధ్యాయ సంఘం నాయకులు నిర్వహించారు. మంగళవారం కాటారం మండల కేంద్రంలోని ధన్వాడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. మండలంలోని వివిధ పాఠశాలల్లో 38 మంది ఉపాధ్యాయులను పీఆర్టియు సంఘం సభ్యులుగా చేర్చుకున్నామని, కాటారం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఏ రవీందర్, ఏ, తిరుపతి, తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పీఆర్టీయూ ముందంజలో ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మండల అసోసియేట్ అధ్యక్షులు ఎస్ సతీష్, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

బెల్తారోడా గ్రామ పెద్దలు శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు ,

ఈ రోజు భైంసా టౌన్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తానూర్ మండలంలోని బెల్తారోడా గ్రామస్తులు కృష్ణ టెంపుల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల రూపాయల నిధులను విడుదల చేసిన సందర్భంగా ముధోల్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ భోస్లె నారాయణరావు పటేల్ గారిని గ్రామ పెద్దలు శాలువాతో సత్కరించి ధన్యవాదములు తెలియజేశారు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమం దేవరావు పటేల్ గారు మరియు నాగన్న పటేల్ నారాయన్ పటేల్ చక్రధర్ పటేల్ గోపాల్ రావు పటేల్ సంగారెడ్డి మధు పటేల్ గారు జేడీ రామ్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖలో 691 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీపీఎస్సీ…!!*

*పోస్ట్ పేరు*: 1.ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO)2. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) *ఖాళీలు*: 1.FBO-256 2. ABO-435 *Qualification*:12th పాస్ *వయసు*: 18 -30 SC/ST/EWS/BC:18-35 *అప్లికేషన్ ఫీజు*: SC/ST/BC/Ex-s : Rs.80 Others : Rs.330 *సెలెక్షన్*: 1. ప్రిలిమినరీ పరీక్ష 2. మెయిన్ ఎగ్జామ్ 3. Cpt test 4. Walking టెస్ట్ + PMT 5. మెడికల్ ఎగ్జామ్ *ముఖ్యమైన తేదీలు*: అప్లికేషన్ స్టార్ట్: 16/07/2025 అప్లికేషన్ లాస్ట్: 05/08/2025

తెలంగాణ పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా పి.ఆర్.టి.యు.టి.ఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎంపిక

పెద్దపల్లి జిల్లా పి.ఆర్.టి.యు.టి.ఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎంపిక పెద్దపల్లి, జులై 15, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా నూతన పి.ఆర్.టి.యు.టి.ఎస్ అధ్యక్షుడుగా గండు కృష్ణ మూర్తి, ప్రధాన కార్యదర్శిగా కానుగంటి శ్రీనివాస్ ను ఎంపిక చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పులగం దామోదర రెడ్డి లు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జిల్లా ఆవిర్భావం తర్వాత కూడా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేసిన కానుగంటి శ్రీనివాస్ ను తిరిగి ఆ పదవి కోసం ఎంపిక చేసి, అధ్యక్షుడుగా గండు కృష్ణ మూర్తిని నియామకం చేసినందుకు పి.ఆర్.టి.యు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డికి, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డికి, రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శికి, వివిధ మండల శాఖల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శిలకు, జిల్లా, రాష్ట్ర బాధ్యులు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించిన యం.ఎల్.ఏ ముప్పిడి…

పున్నమి న్యూస్ న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామానికి చెందిన తమ్మిశెట్టి రవితేజ కు రూ. 58000/-, శ్రీరంగం వెంకట లక్ష్మీ రూ. 44319/- అనువారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు కాబడిన చెక్కులను వారి ఇంటివద్దకు వెళ్లి అందజేసిన కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అందించి,వారి యొక్క ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో కుమారదేవం గ్రామ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన,నాయకులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

చిన్నారుని వైద్యానికి లక్షా ఏభై వేలు ఆర్ధికసాయం – ఆపదలో ఉండేవారికి చేయూతనిద్దాం – ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ మార్పు.విజయకుమార్(నరసన్నపేట – )

ఆపదలో ఉండేవారికి చేయూతనిద్దామని ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ మార్పు.విజయకుమార్ శనివారం అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట స్థానిక ఇందిరానగర్ కాలనీలో నివాసముంటున్న నాగరాజు, మీనా దంపతుల కుమారుడు శ్యాంచరణ్ నిరుపేద కుటుంబానికి చెందినవాడని, బ్రతుకుతెరువు కోసం నాగరాజు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా, కుమారుడు కె.శ్యాంచరణ్ కు ఇటీవలే జరిగిన ఆటో ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. చిన్నారుడు ఈదులవలస మోడల్ పాటశాలలో 6 వ తరగతి చదువుతున్నారని, ఆటోలో పాఠశాలకు వెళుతుండగా జరిగిన ప్రమాదంలో కాళ్లు చేతులు, కాలర్ బోన్ విరిగి పోవడంతో, తలకు తీవ్రమైన గాయాలయ్యాయన్నారు. మెరుగైన వైద్యం కోసం, శ్రీకాకుళం కిమ్స్ కు తరలించగా, పరిశీలించిన వైద్యులు, విరిగిన కాళ్ళు, చేతులకు శస్త్ర చికిత్స అవసరమని, బ్రెయిన్ కు రంద్రం ఏర్పడిందని తెలపగా, పేద కుటుంబం కావటంతో, స్పందించిన, ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ మార్పు.విజయకుమార్ స్నేహితులు, దాతలు సహకారంతో లక్షా ఏభై వేల రూపాయల ఆర్ధికసహాయాన్ని, బాధిత కుటుంబ సబ్యులకు అందించి అండగా నిలిచారు. మనసున్న దాతలు, ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కుటుంబానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఉపాధ్యక్షులు ఉర్లం.శివతేజ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.