Saturday, 11 July 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మున్సిపల్ కార్మికుల అర్ధ నగ్న ప్రదర్శన

ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (citu) ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల, సమ్మెలో భాగంగా 3 రోజు , సర్వోదయ కళాశాల నుండి, అంబేద్కర్ విగ్రహం వీఆర్సీ వరకు అర్ధనగ్న ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ *జిల్లా కార్యదర్శి కె. పెంచల నరసయ్య, నగర గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు* మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులు గత మూడు రోజుల నుండి సమ్మెలో ఉన్న, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడం దారుణం. చాలీచాలని వేతనాలతో ఇంజనీరింగ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక అప్పులు పాలవుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. గత 17 రోజుల సమ్మె ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ చేసిన వారికి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించడం లేదు. అర్ధాంతరంగా ఇళ్లకు పంపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికుల తో చర్చలు జరిపి సమ్మె పరిష్కరించాలని, లేదంటే 17వ తేదీ నుండి సమ్మెను ఉధృతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కొండా ప్రసాద్, మాల కొండయ్య, నరసింహారెడ్డి, లవన్ ఇంజనీరింగ్ కార్మికుల నాయకులు ఎం. శ్రీనివాసులు, కే. బాలు, ముని, మోహన్ కృష్ణ , మారుతి, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఒంటిమిట్టలో ఆగస్టు నుంచి తిరుమల తరహాలో భక్తులకు అన్నదానం

ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో తిరుమల తరహాలో అన్నప్రసాద వితరణకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేస్తుంది ఆగస్టు నుంచి అన్నదానం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన విభాగంలో ఆదేశించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో భక్తులకు మెరుగైన వసతులు తిరుమల తిరుపతి తరహాలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని కోదండ రాముని భక్తులు తెలిపారు

E-పేపర్

మన్నూరులో ఊరి వేసుకొని యువకుడు మృతి

రాజంపేట మండలం మన్నూరులో ఊరి వేసుకొని యువకుడు మృతి మంగళవారం తెల్లవారుజాము న మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు ఫ్యాన్ కు ఊరు వేసుకొని బలవన్మరణం చెందాడు. మృతుడు జయపాల్ నాయక్ (23) ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. రెండు సంవత్సరాలుగా రాజంపేటలో బోర్ పనులు చేసుకుంటున్నట్టు సమాచారం.

తెలంగాణ

మునగాకు తినాలి అనేక రకాల జబ్బులకు దివ్య ఔషధం

డాక్టర్ దూపం పావని పున్నమి ప్రతినిధి దూపం అంజనేయులు జులై 15 అబ్దుల్లాపూర్ మెట్ మండలం రంగారెడ్డి జిల్లా, డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ లో ఫస్ట్ ఇయర్ ఆయుర్వేదిక్ మెడికల్ స్టూడెంట్, బి జె హెచ్ పి ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు దూపం అంజనేయులు ఆయన కుమార్తె, డాక్టర్ దూపం పావని పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. మునగాకులో విటమిన్లు ఎ, సి పుష్కలంగా వున్నాయి.అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి. అసలు 4, 5 వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. ఆయుర్వేదంలో 300లకు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు. మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగాఝ ఉంటాయి. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఎని పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు. కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్‌లో మునగాకును వాడతారు. పాల నుంచి లభించే క్యాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది. పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8 రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు. అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15 రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు. థైరాయిడ్‌ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు. మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుందట. మునగాకుల రసాన్ని పాలలో కలపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి,అలాగే తల్లి పాలు పెరుగుతాయి. గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి. మునగాకు రసం ఒక చెమ్చా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి. మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి. ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే వారికి మునగాకు వరప్రదాయిని. వందగ్రాముల మునగాకులో వుండే పోషక పదార్థాలు, నీరు 75.9 శాతం, పిండి పదార్థాలు 13.4 గ్రా, ఫ్యాట్స్ 17 గ్రాములు, మాంసకృత్తులు 6.7 గ్రా, కాల్షియం 440 మిల్లీ గ్రా, పాస్పరస్ 70 మిల్లీ గ్రా, ఐరన్ 7 మిల్లీ గ్రా, ‘సి’ విటమిన్ 200 మి .గ్రా, ఖనిజ లవణాలు 2.3 శాతం, పీచు పదార్థం 0.9 మి గ్రా, ఎనర్జీ 97 కేలరీలు ఉంటాయి అని ఆమె తెలిపారు.

జయశంకర్ భూపాలపల్లి తెలంగాణ

ఇందిరా మహిళా శక్తి సంబురాలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

కాటారం, జులై 14, పున్నమి ప్రతినిధి: మహిళా శ్వశక్తి సంఘాలు క్రియాశీలకంగా పనిచేసి ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం మంథని నియోజకవర్గ పరిదిలోని కాటారం, మహాదేవ పూర్, మహా ముత్తారం, పలిమెల, మల్హర్ మండలాల పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ఫ్ ఆధ్వర్యంలో వడ్డీలేని రుణాలు, బాంక్ లింకేజీ, ప్రమాద భీమా, రుణ భీమా, మహిళా సంఘాలు ద్వారా నడుపుతున్న ఆర్టీసీ బస్సుకు అద్దె చెల్లింపులు, ఇందిరా మహిళా శక్తి సంబురాలు కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేసేందుకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ విద్యుత్ కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు ఇస్తున్నామని తెలిపారు. సోలార్ విద్యుత్ ను రెడ్ కో సంస్థ ద్వారా తిరిగి ప్రభుత్వం కోనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ ప్రాంతంలో లభ్యమయ్యే అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. మహిళా సంఘాలు ద్వారా దాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ప్రభుత్వ ఉద్దేశ్యం, లక్ష్యం మహిళల ఆర్థికాభివృద్ధి ద్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు. 36,34,751 లక్షల రూపాయలు ప్రమాద భీమా, రుణ భీమా 30 లక్షలు, బ్యాంకు లింకేజీ 10.30 కోట్లు, 69.03 లక్షలు వడ్డీలేని రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. డివిజన్ లో మొత్తం 3161 మహిళా సంఘాలలో 32070 మంది సభ్యులున్నారని తెలిపారు.మహిళలు తలచుకుంటే చేయలేనిది ఏమి ఉండదని ఇంట్లో వంట నుండి పిల్లల విద్యాబ్యాసం వరకు అన్నింటిలో మహిళలు ముందుంటారని తెలిపారు. గత 10 సంవత్సరాల కాలంలో మహిళలలకు పైసా కూడా వడ్డీలేని రుణాలు ఇవ్వలేదని తెలిపారు. అవసరాన్ని బట్టి రుణాలు, వనరులు సమకూర్చి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసి వ్యాపార వేత్తలుగా తయారు చేయనున్నట్లు తెలిపారు. మీ శక్తి, యుక్తి కి వాణిజ్య, వ్యాపార, ఉపాధి అవకాశాలు కల్పనకు ప్రభుత్వం గొప్ప ఆలోచనలతో ముందుకు పోతున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా కోటి రూపాయలతో సోలార్ విద్యుత్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా ప్రభుత్వానికి విద్యుత్ విక్రంయించి సంఘాల సభ్యులకు ఆదాయం సమకూర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. వారం రోజుల్లో మండలానికి 100 మంది మహిళలకు కుట్టు మిషన్లులో శిక్షణా కార్యక్రమాలు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని డీఆర్డీవోను ఆదేశించారు. మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుందని అన్నారు. 200 లోపు ఉచిత విద్యుత్తు, 500లకు గ్యాస్, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రైతులకు రుణమాఫీ, 9 రోజులలో 9 వేల కోట్లు రైతు భరోసా, రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలు ద్వారా ఇందిరామహిళా శక్తి క్యాన్టీన్లు, వడ్డీలే ని రుణాలు, దాన్యం కొనుగోలు కేంద్రాలు, యూనిఫామ్స్ కుట్టించే పనులు, గణపురం, మహాదేవ పూర్ లో మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులు ఇస్తూ ఆర్థికాభివృద్ధి కి కృషి చేస్తున్నట్లు వివరించారు. మహిళా సాధికారితకు టీము వర్కుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న 6 రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షలు చొప్పున 30 లక్షలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్ అయితా ప్రకాష్ రెడ్డి, స్థానికసంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఆర్డీఓ బాలకృష్ణ, 5 మండలాల సింగిల్ విండో చైర్మన్లు, సమ్మక్క సారక్క జిల్లా మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు శ్రీలత, కార్యదర్శి రజిత తదితరులు పాల్గొన్నారు.

జయశంకర్ భూపాలపల్లి తెలంగాణ

మహా ముత్తారం:పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

మహా ముత్తారం, జులై 14, పున్నమి ప్రతినిధి: ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలంలో సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.1.20 కోటి వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని, అలాగే 73.50 లక్షలతో నిర్మించిన సహకార గోదాము, కార్యాలయ నూతన భవనాన్ని ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆధునిక సదుపాయాలతో రూపొందిన ఈ భవనాలు మండల పరిపాలనకు, వ్యవసాయ సహకార సేవలకి ఎంతో ఉపయోగకరంగా నిలవనున్నాయని మంత్రి తెలిపారు. అంతకు ముందు అటవీశాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం కార్యక్రమంలో మంత్రివర్యులు పాల్గొని మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళా శక్తి కుట్టు కేంద్రాన్ని పరిశీలించారు. మహిళలకు టైలరింగ్ లో మెలకువలు నేర్పేందుకు అనుభవజ్ఞులతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాలలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపిడిఓ శ్రీనివాస రావు, సహకార అధికారి వాలియా నాయక్, వ్యవసాయ శాఖ ఏడీఏ బాబు, పిఏసీఎస్ వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి, సిఈఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన టిడిపి మహిళా నాయకురాలు దాసరిరాజు వాణి..

ప్రభుత్వాస్పత్రిలో పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన రాజంపేట పార్లమెంట్ టిడిపి మహిళా నాయకురాలు దాసరిరాజు వాణి.. నిన్న రాత్రి లారీ బోల్తా పడి.. ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరం రోజూవారీ కూలీ పనుల చేసుకునే వారు, విధి లేని పరిస్థితిల్లో ఆ లారీపై ప్రయాణించడం దురదృష్టకరం.. ఈ ప్రమాదంలో 5 గురు మహిళలు, 4 గురు మగవారు చనిపోయారు.. మరో 5 మందికి గాయాలయ్యాయి… ఇక్కడ స్థానికంగా 4 గురు అడ్మిట్ కాగా, 4 గురిని కడప రిమ్స్ కు రిఫర్ చేయడం, ఒకరిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు తెలిపారు.. ఇటువంటి ప్రమాదకర ప్రయాణాలు మంచిది కాదని, ప్రభుత్వాలు చెబుతున్నా, వారి బతుకు తెరువు కోసం.. ప్రయాణం చేసిన పరిస్థితి.. చనిపోయిన వాళ్లంతా దాదాపుగా ఒకే కుటుంబానికి చెందిన దగ్గర బంధువులునే విషయం.. మనస్సును మరింత కలసివేచిందన్నారు.. గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన రాజంపేట పార్లమెంట్ టిడిపి మహిళా నాయకురాలు దాసరిరాజు వాణి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆసుపత్రి అధికారులను కలిసి మాట్లాడిన మహిళా నాయకురాలు వాణి భవిష్యత్తులో ఇటువంటి దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకోకూడదనే కోరుకుంటున్నామన్నారు… ఈ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలనే విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేసిన వాణి.. బాధిత కుటుంబాలను వీలైనంత మేరకు ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ తరపున బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

గండిపోచమ్మ అమ్మవారికి ఆషాఢమాస శాకాంబరీ అలంకరణ

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం లోని కుమారదేవం గ్రామంలో వేంచేసి యున్న మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారికి ఆషాఢమాస శాకాంబరీ అలంకరణను తాళ్లపూడి కూరగాయల వర్తక సంగం వారు చేయించారు, ప్రతీ సంవత్సరం ఈ వర్తక సంగం వారు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేయిస్తారు, దేవస్థానం పూజారి, ఆసాది, గుమస్తా మరియూ ఆసాది కుటుంబ సభ్యులు,మహిళలు అలంకరణ చేయడానికి ముందుకు వచ్చి అన్నివిధాలా సహాయం చేసారు.

జయశంకర్ భూపాలపల్లి తెలంగాణ

ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను మారుస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబు

ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను మారుస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబు మహాదేవ్ పూర్, జులై 14, పున్నమి ప్రతినిధి: ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చి దిద్దాలనే లక్ష్యంతో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం మహదేవ్ పూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో గివ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సౌజన్యంతో పాఠశాలల విద్యార్థులకు షూస్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదటగా పాఠశాల ఆవరణలో అటవీ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడ్ ప్రమోషన్ చైర్మెన్ అయిత ప్రకాష్ రెడ్డి తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం 650 మంది విద్యార్థిని, విద్యార్థులకు పాఠశాల షూస్, స్పోర్ట్స్ షూస్ లను పంపిణీ చేశారు. ఖేల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వ్యవస్థను మెరుగు పరిచేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తుందని తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ కు ప్రాతినిధ్యం వహిస్తూ గ్రామీణ స్థాయి నుండి పాఠశాలలను బలోపేతం చేసేందుకు అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించారని, ప్రతి నియోజకవర్గానికి మోడల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెస్ లను నిర్మిస్తున్నారని, టీచర్ల కొరత లేకుండా నోటిఫికేషన్ వేసి టీచర్ పోస్టులు భర్తీ చేశారని తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ లు , పుస్తకాలు అందిస్తూ నూతన డైట్ మెనూ ను తీసుకు వచ్చి నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని పాఠశాలకు డ్యూయల్ డెస్క్ లను పంపిణీ చేశామని తెలిపారు.మహదేవ్ పూర్ ప్రభుత్వ పాఠశాలకు మంచి చరిత్ర కలిగి ఉందని ఈ పాఠశాల ఒక పైలెట్ ప్రాజెక్ట్ గా తీసుకుని సి.ఎస్.ఆర్ నిధులు సుమారు 15 కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని త్వరలోనే శంకుస్థాపన చేస్తామని అన్నారు. మహదేవ్ పూర్ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ విద్యార్థులను సొంత పిల్లలుగా భావించి మెరుగైన విద్యను అందిస్తున్నారని అభినందించారు. ఇప్పటికే ప్రైవేట్ పాఠశాల నుండి సుమారు 245 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరడం గొప్ప విషయం అని హర్షం వ్యక్తం చేశారు.విద్యార్థులు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గమనించాలని రాబోయే రోజుల్లో గొప్ప స్థాయిలో ఎదిగి ప్రభుత్వానికి, గ్రామానికి తల్లి దండ్రులకు మంచి పేరు తేవాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు చాలా చురుకుగా విద్యను అభ్యసిస్తున్నారని ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యార్థుల సౌకర్యార్ధం అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. అంతేకాకుండా బాలికల కోసం మొట్టమొదటి సారిగా మహాదేవ్ పూర్ పాఠశాలలో సానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. విద్యార్థులు చక్కగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్,అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ,విద్యాశాఖ అధికారి రాజేందర్, గివ్ ఫౌండేషన్ ప్రతినిధులు అరుణ్, తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

నియోజిక వర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తా MLA గండ్ర

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో రేగొండ గణపురం మండలాల్లో పర్యటించి గండ్ర సత్యనారాయణ రావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపనలు చేశారు రేగొండ మండలం జూబ్లీనగర్ గ్రామం నుండి పరకాల వరకు బస్ ప్రారంభించగా అంతరం గణపురం మండలం లోని పాలుగ్రామాల్లో cc రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభించారు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ భూపాలపల్లి నియోజక వర్గాన్ని అభివృద్ది పథంలో నడిపించడమే తనధ్యేయమని అనునిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో తాను పాలుపంచుకుంట అని చెప్పారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.