Friday, 10 July 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్

బెస్ట్ అవైలబుల్ పథకం కింద 192 మంది విద్యార్థుల ఎంపిక – కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

  బెస్ట్ అవైలబుల్ పథకం కింద 192 మంది విద్యార్థుల ఎంపిక – కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూర్యాపేట: లక్కీ డ్రా ద్వారా షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ పథకం కింద 192 మంది ఎంపికయ్యారని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబుతో కలిసి పాల్గొన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికిగాను 1వ తరగతిలో డే స్కాలర్ కేటగిరీకి 94 మంది, 5వ తరగతి రెసిడెన్షియల్ లో 98 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దయానంద రాణి, డీఈఓ అశోక్, రెసిడెన్షియల్ జిల్లా కోఆర్డినేటర్ సి హెచ్ పద్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.    

Featured ఆంధ్రప్రదేశ్

*పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తో డొక్కా సీతమ్మ క్యాంటీన్ లో అన్నదానం*

    *పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తో డొక్కా సీతమ్మ క్యాంటీన్ లో అన్నదానం* *తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యం లో ప్రతీ మంగళవారం నిర్వహణ* కాకినాడ జిల్లా జగ్గంపేట పున్నమి తెలుగు డైలీ న్యూస్ జూన్ 24: జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట పట్టణం స్థానిక పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో జగ్గంపేట జనసేన ఇంచార్జ్ మరియు తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహిస్తున్నారు.ఈ రోజు అన్నదానం కార్యక్రమం ని జగ్గంపేట నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తలు ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్బంగా జనసేన నాయకులు మాట్లాడుతు జగ్గంపేట జనసేన ఇంచార్జి రమేష్ గారు తన సొంత ఖర్చులతో గత ఎన్నికల అన్నంతరం నుండి నిర్వీరామం గా కొనసాగిస్తున్నారు అని అన్నారు.ఈ కార్యక్రమం లో మాధపు వీరబాబు,కురుమల్ల నాగేశ్వరావు,గంధం శ్రీను,సత్తి సోమరాజు,అంకం ఓం,కనకరాజు,గండికోట శ్రీను,శ్రీమన్నారాయణ,ముత్యాల వెంకట రాజు,డ్రిల్ల్ మాస్టారు ఇతరులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Featured ఆంధ్రప్రదేశ్

*తెనాలిలో యాత్రల పేరుతో ఘరానా మోసం*.

గుంటూరు జిల్లా తెనాలి పున్నమి తెలుగు డైలీ *తెనాలిలో యాత్రల పేరుతో ఘరానా మోసం*. చార్ ధామ్ యాత్ర పేరుతో భక్తులకు టోకరా పెట్టిన ఘటన తెనాలిలో చోటుచేసుకుంది. స్థానిక గంగానమ్మపేటకు చెందిన మణికంఠ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకుడు గురుమూర్తి తమను మోసం చేశాడంటూ బాధితులు మంగళవారం టు టౌన్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసారు. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం చార్ ధామ్ యంత్రాంటూ కరపత్రాలు ద్వారా ప్రచారం నిర్వహించుకున్న గురుమూర్తి పలువురు హిందుభక్తుల ఫోన్ నంబర్లు సేకరించి యాత్రకు ఉపక్రమించేలా ఆకర్షిస్తాడు. ఆధ్యాత్మికచింతన లభిస్తుందనుకున్న భక్తులకు తాము నిర్వహిస్తున్న యాత్ర వివరాల ద్వారా భక్తులను ఆకర్షిస్తాడు. భక్తులకు నమ్మకం కలిగేలా ఢీల్లీ వరకూ ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తాడాని భక్తులు చెప్పారు. యాత్రలో భాగంగా హెలికాఫ్టర్ ఎక్కిస్తానని నమ్మబలుకుతాడన్నారు. ఇలా మోసాలకు పాల్పడటం గురుమూర్తి నైజమని భక్తులు వాపోయారు. ఢీల్లీ నుంచి తమ కుటుంబ సభ్యులు ద్వారా ఫోన్ పే చేయించుకుని తమ గమ్యస్థానాలకు చేరుకున్నట్లు భాదితులు తమ గోడు వెళ్లబుచ్చారు. పలు రాష్ట్రాలనుంచి సుమారు 270 మంది భక్తులు మోసగాడు ట్రాప్ లో చిక్కుకున్నారు. భక్తి/విహారా యాత్రల పేరుతో విదేశీ పర్యటనలకు భక్తులను తీసుకెళ్లేవాడని స్థానికులు తెలిపారు. దాదాపు రూ. 80 లక్షలు వసూళ్లుచేసి తీరా తన భర్త కనిపంచట్లేదంటూ కుటుంభ సభ్యులతో పిర్యాదు చేసినట్లు టు టౌన్ సి.ఐ రాముల నాయక్ తెలిపారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.

Featured ఆంధ్రప్రదేశ్

ప్రేమ పేరుతో హత్యలు – సమాజం ఎటుపోతుంది?

  ప్రేమ పేరుతో హత్యలు – సమాజం ఎటుపోతుంది? ప్రేమను అవమానించేలా మారుతున్న సంఘటనలు మన మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. మైనర్లు హత్యలు చేస్తూ మూడేళ్ళ శిక్షతో తప్పించుకుంటున్నారు. తల్లిదండ్రుల పెంపకంలో, టెక్నాలజీ వినియోగంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మానవతా విలువలు తప్పిపోతున్న ఈ యుగంలో, చదువులో వ్యక్తిత్వాన్ని, ప్రేమలో బాధ్యతను నేర్పే సమయం ఇది. చట్టాలు కఠినతరం కావాలి. మౌనం మూలంగా మరిన్ని వార్తలు కాదు… మార్పు కావాలి. మనం మేల్కొంటే సమాజం బాగుపడుతుంది. 🖋️ RAM LOKA 📞 +91 9618111703 | @RamLokaOfficial

Featured ఆంధ్రప్రదేశ్

*శ్రీకాళహస్తి బీసీ హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆగ్రహం*

*శ్రీకాళహస్తి బీసీ హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆగ్రహం* శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలుర బీసీ హాస్టల్‌లో కలుషిత ఆహారం కారణంగా పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో సుమారు 16 మంది విద్యార్థులు అనారోగ్యానికి లోనై శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ కి తరలించబడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే డిల్లీలో ఉన్న ఎంపీ గురుమూర్తి చరవాణి ద్వారా స్థానిక ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. అనంతరం జిల్లా బీసి సంక్షేమ శాఖ అధికారితో మాట్లాడిన ఎంపీ విద్యార్దులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలకు అందించే ఆహారం విషయంలో నిర్లక్ష్య ధోరణి సహించారనిదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలసిన భాద్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. విద్యార్థులకు ప్రభుత్వ వసతి గృహాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

పారిశుద్ధ్య పనులు పరిశీలించిన కమిషనర్ షేక్ ఫజులుల్లా*

*పారిశుద్ధ్య పనులు పరిశీలించిన కమిషనర్ షేక్ ఫజుపారిశుద్ధ్య పనులు పరిశీలించిన కమిషనర్ షేక్ ఫజులుల్లా* నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని కరెంట్ ఆఫీస్ సెంటర్లో బుధవారం జరుగుతున్న పారిశుద్ధ్య పనులను నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా పరిశీలించారు. ప్రతి నిత్యం ఉదయం 5 గంటలకే మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా మున్సిపాలిటీలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ పారిశుధ్య కార్మికుల చేపడుతున్న పనులను పరిశీలించి, పారిశుద్ధ్యన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.పట్టణ ప్రజలు పారిశుద్ధ్యన్ని మెరుగుపరిచేందుకు మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించాలని కోరారు.తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి తమ ఇళ్ల వద్దకు వచ్చే పరిస్థితి కార్మికులకు అందించాలని సూచించారు. చెత్తాచెదారాలను డ్రైనేజీ కాలవల్లో వేయకూడదన్నారు.పట్టణ ప్రజలు అవగాహన లేకుండా డ్రైనేజీ కాలవల్లో చెత్తను వేయడం వల్ల మురుగునీరు పారే వీలు లేకుండా పోతుంది అన్నారు. పట్టణంలో పారిశుద్ధ్యన్ని మెరుగుపరిచేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఆయన వెంట సచివాల సిబ్బంది పెంచల రెడ్డి, తదితరులు ఉన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

మల్లయ్య గూడెం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం 

మల్లయ్య గూడెం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం   పున్నమి ప్రతినిధి జూన్ 25     ఏలూరు జిల్లా చింతలపూడి మండలం మల్లాయగూడెం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా వరినారు మడిలో మరియు వెదజల్లిన వరి విధానంలో సస్యరక్షణ చర్యలు గురించి క్లుప్తంగా రైతులకి సూచనలు ఇవ్వడం జరిగింది. వారి నారు బడిలో వచ్చే తెగులు గురించి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. అలాగే ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించే విధానంలో భాగంగా అందరూ ప్రకృతి వ్యవసాయం చేయాలని ప్రస్తుతం నారిమడిలో ముందస్తుగా నివారణ చర్యలు పచ్చ పురుగు నివారణకు నిమాస్త్రం తయారుచేసి రైతుల సమక్షంలో డెమో చూపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టే రైతు సంక్షేమ పథకాలు గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లయ్య గూడెం గ్రామ సర్పంచ్ చీకటి కవిత రమేష్ చింతలపూడి మండల వ్యవసాయ అధికారి కోటగిరి మురళీకృష్ణ మరియు డిఎంఎంటి వర్మ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది

Featured ఆంధ్రప్రదేశ్

నంద్యాల డిపో నుండి అరుణాచలం కు స్పెషల్ బస్

నంద్యాల డిపో నుండి అరుణాచలం కు స్పెషల్ బస్ నంద్యాల 25/06/2025 పున్నమి రిపోర్టర్ నంద్యాల డిపో నందు గత రెండు సంవ్సతరాల నుండి ప్రతి నెల పౌర్ణమి రోజులలో అరుణాచలం కి సూపర్ లగ్జరీ (2+2) స్పెషల్ బస్సు నడుపబడుచున్నది. జూలై నెల కూడా అనగా 10.07.25 వ తేదిన ఉదయం 07:30 గం., అరుణాచలం కు బస్సు నడపడం జరుగుతుంది. అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడినది . రానుపోను చార్జి రిజర్వేషన్ తో కలిపి 1750 రూపాయలు అగును. నంద్యాల పట్టణ మరియు చుట్టూ ప్రక్కల గ్రామ ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగపరుచుకోవలసిందిగా డిపో మేనేజర్ ఏ. గంగాధర రావు తెలుపటం అయినది.

Featured ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు మానసిక ఒత్తిడిలో నవ్వకుండా ఉండేందుకు చింతలపూడి పోలీసులు అవగాహన కార్యక్రమం

విద్యార్థులకు మానసిక ఒత్తిడిలో నవ్వకుండా ఉండేందుకు చింతలపూడి పోలీసులు అవగాహన కార్యక్రమం పున్నమి ప్రతినిధి జూన్ 25 ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గర్ల్స్ జూనియర్ కాలేజీ చింతలపూడిలో ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో సిఐ క్రాంతికుమార్ ఎస్సైసతీష్ కుమార్ పాల్గొని విద్యార్థులకు పలు ముఖ్య అంశాలపై విలువైన సూచనలు అవగాహన కలిగించారు ముఖ్యంగా విద్యా భారం కుటుంబవంతుడులు పంట సమస్యలతో మానసిక ఒత్తిడి కి లోనవ్వకుండా ఉండటానికి విద్యార్థులు తీసుకువలసిన జాగ్రత్తలపై మార్గదర్శనం యువతతో పెరుగుతున్న సైబర్ నేరాలు సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు వ్యక్తిగత సమాచారం రక్షణ ఆన్లైన్ మోసాలపై హెచ్చరికలు బాలల రక్షణ కోసం ఉన్న పిఓసిఎస్ఓ చట్టం గురించి వివరణ దాని కింద వచ్చే నేరాలు బాధితులు తీసుకోవలసిన చర్యలపై అవగాహన ఈ సందర్భంగా పోలీసు అధికారులు విద్యార్థుల సందేహాలను తొలగిస్తూ వారు మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు అందుబాటులో ఉన్న సహాయక వనరులు హెల్ప్ లైన్ నెంబర్లను తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు నైతిక శైర్యం చట్టాల పట్ల అవగాహన పెంపొందించడంతోపాటు వారు భవిష్యత్తులో బాధ్యతారహితంగా తీరు అనుసరించేందుకు దోహదపడుతుందని అన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.