- రెడ్ క్రాస్ ఎంసీ సభ్యులు కళ్యాణ్ చక్రవర్తి
- జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు రక్తదానంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం
(శ్రీకాకుళం టౌన్ – )
నంది.ఉమా శంకర్ అందరికీ ఆణిముత్యం అని, రెడ్ క్రాస్ ఎంసీ సభ్యులు కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలమేరకు రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, స్థానిక రెడ్ క్రాస్ ప్రాంగణంలో జరిగిన రక్తదాన శిబిరంలో ముఖ్య అతిధిగా పాల్గొని, శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ శ్రీకాకుళంలో రక్త కొరత కారణంగా, ఎవరికీ రక్తం అందించలేకపోతున్నామని, గిరిజన ఇతర ప్రాంతాలలో తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, లుకేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు పునర్జన్మ ప్రసాదించడానికి రక్తదాతలు ముందుకు వచ్చి స్వచ్ఛంద రక్తదానం చేయటం హర్షణీయమని, రెడ్ క్రాస్ ప్రతినిధి, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ వ్యవస్థాపకులు నంది.ఉమాశంకర్ జన్మదినం సందర్భంగా ఇచ్చిన పిలుపుమేరకు వారి మిత్ర బృందం, బంధువులు, స్వచ్ఛంద సంస్థల సభ్యుల బృందం. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే చిన్నారుల కోరిక మేరకు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించామన్నారు. రెడ్ క్రాస్ చైర్మన్ సూచనలమేరకు, నగరంలో యువతకు, కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలలో రక్తదానంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రం, జ్ఞాపికలు, బంగారుపతకాలని అందించారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ పీఆర్వో, జాతీయ అవార్డు గ్రహీత పెంకి. చైతన్య, బి. జగదీశ్, హర్ష, రెడ్ క్రాస్ రక్తనిధి మేనేజర్ అయేషాబేగం, ఆఫీస్ మేనేజర్ సతీష్, ట్రైనింగ్ మేనేజర్ జి.రమణ, ఆదిత్య డిగ్రీ కళాశాల కరస్పాండెన్స్ ఎంఎస్. గుప్తా, వీరఘట్టాం శైల పద్మరాజు (వ్యాయామ ఉపాధ్యాయులు) , రక్తదాతలు పాల్గొన్నారు.


