Tuesday, 14 July 2026

Blog

E-పేపర్

ఆర్టీసీ స్థలాన్ని “లులూ షాపింగ్ మాల్”కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ 137 ను రద్దు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తాం :- ఇ. యు

ఆర్టీసీ ఆస్తులు కాపాడుకొనేందుకు ఆర్టీసీలోని అన్ని సంఘాలు ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి ప్రజా రవాణా సంస్థ(ఆర్టీసి) ఆస్తులు ప్రైవేటు వ్యాపార వేత్తలకు దారదత్తం చేస్తున్న చర్యలను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలి విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ఏపియస్ ఆర్టీసి గవర్నర్ పేట- 1&2 డిపోలు మరియు పాత బస్సుస్టాండ్ కు సంబందించిన 4.15 ఎకరాల స్థలం విలువ సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఈ స్థలాన్ని లులూ షాపింగ్ మాల్ కు ప్రభుత్వం కట్టబెట్టి దశబ్దాలుగా ప్రజలకు రవాణా సౌకర్యాలు అందిస్తూ అందుబాటులో ఉన్న రెండు డిపోలలోని 200 బస్సులను 1100 మంది ఉద్యోగులను ప్రజలకు దూరం చేస్తూ బడా వ్యాపారవేత్తలకు కు జి. జి.ఓ.యం.యస్. ఓ. నెం. 137 ద్వారా కట్ట బెట్టిన GO ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆది వారం ఆర్.టి.సి ఎంప్లాయీస్ యూనియన్. జిల్లా కార్యదర్శి ఆర్.యస్.రావు ఆధ్వర్యంలో నిశాంతి భవన్.. హాలులో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీట్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న జోనక్ సహాయ కార్యదర్శి వి.దేవసహాయం మాట్లాడుతూ ఈ గవర్నర్ పేట డిపోలకు-1&2 మరియు పాత బస్టాండ్ స్థలాన్ని 1959 లో అప్పటి ప్రభుత్వం నిర్దేశించిన ధర గజం రూ.16/- లతో సుమారు నాలుగు లక్షలు ఆరు వేల రూపాయలకు ఆర్టీసీ యాజమాన్యం కొనుగోలు చేసినది. ఈ స్థలాన్ని ఇప్పటి ప్రభుత్వ పెద్దలు ప్రైవేటు వ్యాపార వేత్తలుకు దారాతత్తం చేసేందుకు తీసుకున్న నిర్ణయాలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసారు ఈ ప్రభుత్వం నవ్యాంద్రప్రదేశ్ అభివృద్ధి చేసే పనిలో బాగంలో “లూలూ షాపింగ్ మాల్” ను నగర శివారు ప్రాంతాలలో ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అలా కాకుండా నగర నడిబొడ్డున నిరంతరం రద్దీగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్న పాత బస్సుస్టాండ్ కు అనుబంధంగా ఉన్న డిపోలలో ఉన్న బస్సులలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య రేపు ఆగష్టు 15 మహిళకు ఉచిత బస్సు పథకం అమలుతో ఆ సంఖ్య రెట్టింపు అవ్వనుంది. ఇటువంటి తరుణంలో ఈ డిపోలను ఇక్కడనుండి తొలగించడంవల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కావున జి.ఓ నెం. 137 తక్షణమే వెనక్కు తీసుకోవాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము గతంలోని ఈ ప్రభుత్వ పెద్దలే 2014 సంవత్సరంలో విజయవాడ సమీపంలో ఆర్టీసీ ట్రైనింగ్ కళాశాల స్థలం 29 ఎకరాలను హెచ్.ఇ.యల్ కంపెనీకి కట్ట బెట్టారు. అందుకు బదులుగా ప్రభుత్వం ఇస్తామన్న స్థలం ఇప్పటివరకు ఒక్క గజం కూడా ఇవ్వలేదని అంతే కాకుండా 2017లో ఇదే గవర్నర్ పేట- 1&2 డిపోలు బఫర్ జోన్ కాలువ గట్టుపై ఉన్నాయని ఇంటర్ నేషనల్ పార్కుగా అభివృద్ధి చేస్తామని దీనిని అప్పట్లో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే అప్పట్లో ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలు కలిసి జేఏసిగా పోరాటం చేసి అడ్డకున్నాయి. అని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని అందరి ఉద్యోగులాగే ఆర్టీసీ ఉద్యోగులుగా కోరుకున్నాము కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన DA బకాయిలను చెలిస్తాము, 12 PRC కమిషన్ వేస్తాము IR కూడా ఇస్తామన్న హామీల అమలు విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాక పోవడంపై ఎంప్లాయిస్ యూనియన్గా తీవ్రముగా ఖండిస్తున్నాము భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాము. ఇప్పటికే అలిపిరి డిపోలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది, ఈ బస్సులను ప్రైయివేట్ ఆపరేటర్ల ద్వారా ప్రవేశపెడుతూ వారికీ ఆర్టీసీ డిపోలను అప్పచెప్పడాని రానున్న కాలంలో మరో 19 డిపోలలో ఇదే విధానం ప్రవేశ పెడుతూ ఆర్టీసీ డిపోలను, స్థలాలను ప్రెయివేట్ ఆపరేటర్లకు కట్టబెట్టాలనే ఆలోచనలను ఎంప్లాయిస్ యూనియన్ గా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. సంస్థను ప్రైవేటీకరణ వైపు నడిపించే ఇటువంటి చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వమే సంస్థకు ఆర్ధిక సహాయం చేసి సంస్థే నేరుగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి నిర్వహిచే విధంగా చర్యలు చెప్పట్టాలని కోరుతున్నాము దశాబ్దాల చరిత్ర గలిగిన ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూడడం చాలా బాధాకరమని ఇ.యు నాయకులు V. దేవసహాయం అన్నారు. ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని కాపాడు కొనేందుకు రాష్ట్ర నాయకత్వం నుండి ఏ పోరాటాలకు పిలుపు వచ్చినా సిద్ధంగా ఉంటామని తెలిపారు ఈ విలేకర్ల సమావేశంలో యూనియన్ నాయకులు జిల్లా కోశాధికారి డి.యన్.యస్.రాయుడు,జిల్లా ప్రచార కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు,డిపో అధ్యక్షులు కొండారెడ్డి,సహాయ కార్యదర్శి జి.యల్.రెడ్డి, సభ్యులు కాశీం,సుధాకర్ లు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ,బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

స్క్రోలింగ్ పున్నమి : 17-08-2035, 3PM. పశ్చిమమధ్య,వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర,దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఎల్లుండి మధ్యాహ్నానికి దక్షిణఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం దీని ప్రభావంతో రెండు రోజులు కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి మత్స్యకారులు వేటకు వెళ్లరాదు ప్రఖర్ జైన్,ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ

తిరుపతి

శ్రీ కాళహస్తి హైవే బ్రిడ్జ్ పై ప్రమాదం

లారీ ఢీకొని వ్యక్తి కి గాయాలైన ఘటన శ్రీకాళహస్తి పట్టణం ఊరందూరు బ్రిడ్జ్ హైవే పై జరిగింది.విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన 108 సిబ్బంది ఆ వ్యక్తిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొని వచ్చారు.ఇతని డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా ఇతను సూళ్లూరుపేట వ్యక్తని ఇతని పేరు గిరీష్ అని గుర్తించడం జరిగింది.వివరాలు తెలియాల్సి ఉంది.

యాదాద్రి భువనగిరి

మారెమ్మ తల్లికి బోనం సమర్పించిన 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు పున్నమి ప్రతినిధి భువనగిరి పట్టణ 23వ వార్డు ఇందిరా నగర్ లో ఘనంగా శ్రావణమాసం చివరివారం సందర్భంగా గ్రామ దేవతలైన మారెమ్మ తల్లి పోచమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి అమ్మవార్లకు ఘనంగా బోనాల పండుగ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ 23 వ వార్డు మాజీ కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ పాల్గొని అమ్మవార్లకు బోనాలు సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ ప్రజలు రైతులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవార్లను వేడుకోవడం జరిగింది…

అన్నమయ్య

వర్షాల కారణంగా నీటి కుంటగా మారిన చిట్వేల్ బ్రాహ్మణ వీధి

చిట్వేలి ఆగస్టు ( పున్నమి ప్రతినిధి) చిట్వేల్ పట్టణంలోని బ్రాహ్మణ వీధి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపై నుంచి పారిన వర్షపు నీరు బ్రాహ్మణ వీధిలో చేరి నీటి కుంటలాగా మారింది. దాంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించడం కష్టసాధ్యమైంది. చిన్నారులు, వృద్ధులు మరింత ఇబ్బందులు పడుతున్నారు.స్థానిక ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాని పరిస్థితి నెలకొంది. రోడ్డు మరమ్మతులు, నీరు వెళ్లే డ్రైనేజీ సదుపాయం లేకపోవడంతో ఇలాంటి సమస్యలు తరచుగా ఎదురవుతున్నాయి. అందువల్ల సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, సమస్యను పరిష్కరించి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

ఉచితంగా లక్షల రూపాయల వైద్యం – కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా సేవలు

ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి : సూపర్‌ స్పెషాలిటీ సేవలను ఉచితంగా అందిస్తోన్న ప్రభుత్వాసుపత్రులు – క్యాన్సర్‌కు రోబోటిక్‌ సర్జరీలు, డయాబెటిక్‌ రెటినోపతికి ఉచిత చికిత్స తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రభుత్వాసుపత్రులు ఆధునిక పరికరాలతో, సూపర్‌ స్పెషాలిటీ సేవలతో మంచి వైద్యం అందిస్తామని భరోసా ఇస్తున్నాయి. దాదాపు ఉచితంగా అందే ఈ సేవలు. సామాన్యులకు వరంగా మారుతున్నాయి. ఎవరైనా, ఏ రాష్ట్రం వారైనా వీటిని వినియోగించుకోవచ్చు. ఏపీలో పలు జిల్లాల్లో సైతం: గుంటూరులోని జీజీహెచ్‌లో ప్లాస్టిక్‌ సర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, కార్డియాలజీ, సీటీవీఎస్ వంటి 11 సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు, ఒంగోలు జీజీహెచ్‌లో 7 విభాగాలలో వైద్యసేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ప్లాస్టిక్‌ సర్జరీ, పీడియాట్రిక్స్‌ సర్జరీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నియోనాటాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, సర్జికల్, మెడికల్‌ ఆంకాలజీ విభాగాల్లో రోగులకు పైసా ఖర్చు లేకుండా మంచి వైద్య సేవలు అందుతున్నాయి. కర్నూలు జీజీహెచ్‌లోని కార్డియో థొరాసిక్‌ విభాగంలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేస్తున్నారు. విజయవాడలోని బోధనాసుపత్రిలో ప్లాస్టిక్‌ సర్జరీ వైద్య సేవలు ప్రతి సోమ, గురువారాల్లో అందిస్తారు. న్యూరో సర్జరీ విభాగంలో నెలకు 70 నుంచి 80 వరకు సర్జరీలు జరుగుతుంటాయి. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు అనుబంధంగా ఉన్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో గత రెండేళ్లుగా క్యాన్సర్, మూత్రపిండాల శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన ములుగు ప్రభుత్వ బోధనాసుపత్రిలో ఆంకాలజీ సేవలు ప్రవేశపెట్టారు. విశాఖ, గుంటూరు, కర్నూలు, విజయవాడ, తిరుపతిలో మధుమేహానికి సమగ్ర వైద్య సదుపాయాలు ఉన్నాయి. ఖర్చు లేకుండా డయాలసిస్‌ సేవలు: కిడ్నీలు విఫలమైతే డయాలసిస్‌ తప్పనిసరిగా చేయించుకోవాలి. వారానికి 3-5 సార్లు డయాలసిస్‌ చేయించుకోవాల్సిందే. కొందరికి ప్రతి రోజూ అవసరమవుతుంది. ప్రైవేటులో ఒక్కో డయాలసిస్‌ సేవకు వేలల్లో వసూలు చేస్తారు. కానీ హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియాలో కిడ్నీ రోగులకు ఈ సేవలు పూర్తి ఉచితంగా అందిస్తుండటం గమనార్హం. ఒకవేళ ఆరోగ్యశ్రీ ఉన్నట్లయితే నిమ్స్‌లో సైతం డయాలసిస్‌ సేవలను ఉచితంగా చేస్తారు. విజయవాడలో బోధనాసుపత్రిలో కిడ్నీ, యూరాలజీ, వైద్య సేవలను సోమ, గురువారాలలో అందిస్తారు. కర్నూలులోని నెఫ్రాలజీ విభాగంలో ప్రతి నెలా 150 మందికి ఆధునిక వైద్యం ఉచితంగా అందుతోంది.

ఎలూరు

ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి మండలంలో ఎరువుల దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారిని జె. భవాని హెచ్చరించారు. ఆదివారం మండలంలోని ఆగిరిపల్లి, నెక్కలం గొల్లగూడెం, కొత్త ఈదరలోని ఎరువుల దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఎరువులను విక్రయించిన వెంటనే రసీదులు ఇవ్వాలని, ఈపాస్ మిషన్ ద్వారా ఎరువులు విక్రయాలు చేపట్టాలని, స్టాక్ వివరాలు రికార్డులు పొందుపరచాలని ఆదేశించారు. ఏయ్ మండలంలో యూరియాతోపాటు అన్ని ఎరువులు అందుబాటులో ఉన్నాయని. డీలర్లు ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమెతోపాటు తనిఖీలలో వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆదూరుపల్లిలో తన్విక ఫిజియోథెరపీ సెంటర్ ప్రారంభం

చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలం ఆదురుపల్లి గ్రామంలో తన్విక ఫిజియోథెరపీ సెంటర్ ను కలువాయి వైద్యురాలు డాక్టర్ సరళ కుమారి (ఎంబీబీఎస్) ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు, నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ గిరి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సౌకర్యాలు విస్తరించడం అత్యంత అవసరమని,తన్విక ఫిజియోథెరపీ కేంద్రం ద్వారా ప్రజలు మరింత మెరుగైన వైద్యసేవలు పొందగలరని అన్నారు. ఫిజియోథెరపీ చికిత్సలు నేడు అనేక రోగాల నుండి ఉపశమనం కలిగిస్తున్నాయని,ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.గ్రామస్థులు కూడా ఈ కేంద్రం ఏర్పాటును హర్షిస్తూ, ఇంతవరకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది కానీ, ఇప్పుడు సమీపంలోనే ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందుబాటులోకి రావడం తమకు ఎంతో సౌకర్యంగా ఉందని తెలిపారు.ఈ ప్రారంభోత్సవానికి కలువాయి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఓలేటి శ్రీనివాస్ రావు, చేజర్ల సీనియర్ టిడిపి నాయకులు రావిలక్ష్మీ నర్సారెడ్డి, మోదేపల్లి పెంచలనాయుడు, రామానాయుడు,వావిలేరు సర్పంచ్ గోనుగుంట రాంబాబు,చీర్ల వెంకటేశ్వర్లు, శివ,వైసిపి నాయకులు వెంకటరత్నం తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

E-పేపర్

ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం – ముఖ్యఅతిథిగా పాల్గొన్న టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్

ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయుడబ్లుజె) వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా సర్వజన ఆసుపత్రిలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎపియుడబ్ల్యుజె గౌరవాధ్యక్షులు జనార్దన్ రెడ్డి, అధ్యక్ష, కార్యదర్సులు మధుబాబు, ఉస్మాన్ బాషా, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలంబాబు, సీనియర్ పాత్రికేయులు రమణారెడ్డిలతో పాటు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ ఏపీయుడబ్లుజె ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం అభినందనీయమని, జర్నలిస్టులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. 68 సంవత్సరాలు పూర్తి చేసుకుని 69వ ఒడిలోకి వెళుతున్న ఏపీయుడబ్లుజె సంఘానికి అభినందనలు తెలిపారు. ఎందరో సీనియర్ పాత్రికేయులు ఈ సంస్థలో ఉండడం వల్ల సంస్థ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. జర్నలిస్టులకు నంద్యాల ప్రాంతంలో ఇంటి స్థలాలిచ్చే విషయాన్ని మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఎపియుడబ్లుజె నాయకులు మధు, చలం బాబు, జనార్ధన్ రెడ్డి, ఉస్మాన్ బాషాలు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే సంస్థలో పనిచేయడం గర్వకారణమని, విలేకరుల అభివృద్ధికి తోడ్పాటు అందించే సంస్థ ఏపీడబ్ల్యూజే అని పేర్కొన్నారు. ఆగస్టు 17,1957 సంవత్సరంలో ఏపీయుడబ్లుజె ఆవిర్భవించిందని, అప్పటి నుండి ప్రతి ఏటా ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నట్లు వివరించారు. జర్నలిస్టులకు అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు, జర్నలిస్టులకు ఇంటి స్థలాలిచ్చి ఇళ్ళను నిర్మించి ఇవ్వాలని, జర్నలిస్టుల పిల్లలకు విద్యా సంస్థల్లో రాయితీలు ఇవ్వాలని తదితర సంక్షేమ పథకాల కోసం ఎపియుడబ్లుజె పోరాడుతుందని, అలాగే జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తేవాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఫిరోజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎపియుడబ్లుజె నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.