Tuesday, 14 July 2026

Blog

ఖమ్మం

పాపన్న గౌడ్ జయంతి.. నివాళులు అర్పించిన ధనియాకుల

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా ఖమ్మం టూ టౌన్ బిజెపి అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ నివాళులు అర్పించారు

ఆంధ్రప్రదేశ్

వరుస సెలవులతో సందడిగా ఆగస్టు నెల – ఈరోజు కూడా భారీ వర్షం సెలవు

శ్రీకాకుళం, ఆగస్టు 18:ఆగస్టు నెల ప్రారంభం నుంచే ప్రజలకు వరుసగా పండుగలతో పాటు ఆదివారాలు కలిసిపోవడంతో సెలవుల సందడి నెలకొంది. ఈ క్రమంలో ఇప్పుడు భారీ వర్షాల కారణంగా మరో సెలవు జోడైందని చెప్పాలి.ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం, 9న రక్షా బంధన్, 10న ఆదివారం రావడంతో మూడు రోజుల వరుస సెలవులు లభించాయి. వెంటనే 15న స్వాతంత్ర్య దినోత్సవం, 17న ఆదివారం, 16న కృష్ణాష్టమి కారణంగా మరిన్ని సెలవులు వచ్చాయి. ఇక ఈరోజు కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో విద్యార్థులకు అదనపు విశ్రాంతి లభించింది. ఈనెల 27న వినాయక చవితి, ముందు రోజు ఆదివారం రావడంతో నెలాఖరులో కూడా వరుస సెలవులు లభించనున్నాయి.ఈ వరుస సెలవులతో విద్యార్థులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు అందరూ ఉత్సాహంగా గడుపుతున్నారు. రైతాంగం కూడా వర్షాల కారణంగా పంటల పెరుగుదలపై ఆశలు పెంచుకుంది. మొత్తానికి ఈ ఆగస్టు నెల పండుగలు, ఆదివారాలు, వర్షాలతో ఆనందోత్సవ మాసంగా మారింది. 🌸🌧️🇮🇳🐘

ఆంధ్రప్రదేశ్

ఏపీలో పేదలకు ఇళ్ళు.. రూపాయికే ఇంటి ప్లాన్!

అమరావతి : ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి : ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే పేద, మధ్యతరగతి ప్రజలకు కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది. 50 చదరపు మీటర్లలోపు స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే రూపాయికే ఇంటిప్లాన్ లభించనుంది. కొత్త నిబంధనల ప్రకారం లబ్ధిదారులు వారి పరిధిలోని కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా ప్లాన్ పొందుతారు. దీనివల్ల లబ్దిదారులకు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు మిగులుతుంది.

ఆంధ్రప్రదేశ్

కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పేరుతో పరీక్ష

ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి : విద్యార్థులకు సైన్స్ పై ఆసక్తి పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పేరుతో పరీక్ష నిర్వహించి ఉపకార వేతనాలు అందిస్తోంది. ఆన్ లైన్ లో నిర్వహించే ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 6వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొనేందుకు అర్హులని, సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఆంధ్రప్రదేశ్

భారీ వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవు

శ్రీకాకుళం, ఆగస్టు 18:జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా సోమవారం (ఆగస్టు 18) జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ఒక రోజు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున, ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ నిర్ణయాన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.అలాగే, భారీ వర్షాల కారణంగా ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా సురక్షితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు

E-పేపర్

ఓట్ చోరీపై రాహుల్‌ ఆరోపణలకు సీఈసీ కౌంటర్

ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి : ఓట్ చోరీపై రాహుల్‌ ఆరోపణలకు సీఈసీ కౌంటర్ ఆరోపణలపై ఏడు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలి అఫిడవిట్ ఇవ్వకపోతే దేశానికి రాహుల్ క్షమాపణ చెప్పాలి మహారాష్ట్రలో ఓట్లు పెరిగాయన్నది నిజమైతే.. సరైన సమయంలో రాహుల్ ఎందుకు అభ్యంతరం తెలపలేదు నకిలీ ఓట్లపై ఒక్క ఆధారం కూడా ఇవ్వలేదు-ఈసీ ఎన్నికలు ముగిసిన 8 నెలలకు ఆరోపణలు చేయడమేంటి పదేపదే చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజం కావు-ఈసీ.

భక్తి

గోమాత

జై గోమాత గోవధ జరుగుతూ ఉంటే హిందూ జాతి మనుగడ ఉండదు హిందూ ధర్మం నిలబడాలంటే గోమాత తప్పనిసరి. గోమాత లేని హిందువులు ఊహించటం చాలా కష్టం. మన సనాతన ధర్మానికి మూలమే గోమాత. “యతో గావః తతో ధర్మః” అనగాఎక్కడైతే గోమాతలు ఉంటాయో, అక్కడ ధర్మం ఉంటుంది. గోమాత అనేది సర్వదేవతల సమాహారం. గోసేవ, గోరక్షణ వలన ధర్మం నిలుస్తుంది. వేదాలు, యజ్ఞాలు, పూజావిధానాలు అన్నీ గోమాతకు అనుసంధానమై ఉన్నాయి. గోమాత సమాజానికి పాలు, పోషణ, ఎరువు, ఇంధనం ఇస్తుంది. గోమాత ఉన్నచోట ఆరోగ్యం, సంపద, శాంతి, సమృద్ధి నిలుస్తాయి. అందువల్ల గోమాతను కాపాడటం = సమాజ ధర్మాన్ని కాపాడటం. మహాభారతం, వేదాలు, పురాణాలు అన్నిటిలో గోమాతను ధర్మస్థాపనలో ప్రధానంగా పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు కూడా గోపాలక రూపంలో ధర్మరక్షణ కోసం గోమాతను కాపాడాడు. గోమాతను రక్షించని హిందువు, తనను తాను రక్షించుకోలేడు.” గోసేవ ద్వారా అహింస, దానం, యజ్ఞ, భక్తి, యోగం అన్నీ సాధ్యమవుతాయి. గోమాత కాపాడని హిందువు, తన స్వీయ మూలాలను కత్తిరించుకున్నట్టే అవుతుంది. గోమాత రక్షణ లేకుండా హిందూ ధర్మం “నిర్జీవ శరీరం”లాగా మారుతుంది. క్రమంగా ఆచారాలు, సంస్కారాలు, ఆధ్యాత్మిక శక్తి క్షీణించి, హిందూ ధర్మం రూపం మాత్రమే ఉండి, సారాంశం కోల్పోయే ప్రమాదం ఉంది. గోమాత రక్షణ లేకపోతే ధర్మ స్థాపనకు అవరోధం ఏర్పడుతుంది. ఫలితంగా హిందూ సమాజం బలహీనమై, ఇతర మతాల ప్రభావానికి సులభంగా గురయ్యే అవకాశం ఉంటుంది. హిందువులు ఇతర మతాల్లోకి వెళ్ళడానికి ముఖ్యమైన కారణం గో ధర్మాన్ని మనం కాపాడు కోలేకపోవటం వల్లనే జరుగుతున్నది. గోరక్ష జగద్రక్ష ధర్మస్య జయోస్తు

ఖమ్మం

నేడు భారీ నుండి అతి భారీ వర్షాలు రెడ్ అలెర్ట్

ఖమ్మం ఆగష్టు ఖమ్మం పున్నమి దిన పత్రిక స్టాఫ్ రిపోర్టర్ నేడు భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి అని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలియ జేసినది. ములుగు, జయ శంకర భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో భారీ వర్షాలు పడతాయి అని అలాగే భూపాలపల్లి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి అని ఈ జిల్లా కి రెడ్ అలెర్ట్ జారిచేసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నడవపల్లి సచివాలయంలో ఘనంగా79వస్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఆగస్టు 15 కాట్రేనికోన ది 15-08-2025 న కాట్రేని కోన మండలం నడవపల్లి పంచాయతీ కార్యాలయం నందు 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు సర్పంచ్ అధ్యక్షతన వైభవం గా జరిగినది. ముందుగా సర్పంచ్ శ్రీమతి దొమ్మటి పల్లవి జండా ఎగరవేసినారు. జండా వందనం అనంతరం పంచాయతీ సెక్రటరీ ఏ సురేష్ మాట్లాడుతూ గ్రామం పరిశుభ్రత, ప్లాస్టిక్ నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.విద్యార్థులకు పెన్నలు పంపిణి చేసినారు, ఈ కార్యక్రమంలో పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ ఏ భారతి ,ముఖ్య అధితులు గా గ్రామ టీడీపీ ప్రెసిడెంట్ గువ్వాల సత్తిబాబు పంచాయతీ ఐదో వార్డ్ నెంబర్ గ్రంధి నానాజీ,( డా. బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , బిజెపి ట్రెజరర్ ). గ్రామ కమిటీ సెక్రటరీ పెమ్మాడి నాగమల్లేశ్వరరావు బూత్ ఇన్చార్జిలు మట్టపర్తి సాయి గుత్తులసూరిబాబు యూనిట్ ఇంచార్జ్ పాకలపాటి త్రినాధ్ వర్మ గ్రామ కమిటీ సభ్యులు పోలవరపు వెంకటరమణ మోటిపల్లి నాని అల్లూరి సోమరాజు గారు గెద్దాట సోమేశ్ డివివి సత్యనారాయణ పంచాయితీ సిబ్బంది సచివాలయం సిబ్బంది అంగన్వాడి సిబ్బంది ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలెర్ట్…///

పున్నమి న్యూస్ ఆగస్ట్ 17 :// దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని, ఈ నెల 19న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం డైరెక్టర్ భారతి తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. విశాఖ, అనకాపల్లి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.