Tuesday, 14 July 2026

Blog

కుమురం భీమ్ ఆసిఫాబాద్

ఘనంగా భారతీయ జనతా పార్టీ రెబ్బన మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి మల్లేష్ గారి జన్మదిన వేడుకలు

రెబ్బెన మండలంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి మల్లేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ కో కన్వీనర్ కొలిపాక కిరణ్ కుమార్, బీజేపీ జిల్లా కార్యదర్శి కుందారపు బాలకృష్ణ, జిల్లా నాయకులు అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్, గోలెం తిరుపతి, బీజేపీ రెబ్బెన మండల అధ్యక్షులు మల్రాజ్ రాంబాబు, బీజేఎమ్ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇగురపు సంజీవ్, బీజేపీ మండల నాయకులు మండల మధుకర్, పందిర్ల కనకయ్య, ముంజల వెంకన్న గౌడ్, శ్రీనివాస్, అనిల్, ఆవునూరి సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

బ్రహ్మంగారి గుడి ప్రాంగణంలో చెన్నకేశవులు – హర్షవర్ధని రెడ్డమ్మ పెళ్లి మహోత్సవం

చిట్వేల్ మండలం బ్రహ్మంగారి గుడి ప్రాంగణంలో, 17 ఆగష్టు ఆదివారం రోజున కందుల వారి వివాహ వేడుక వైభవంగా జరిగింది. చిట్వేల్ మండలంలోని, కే కందులవారిపల్లి గ్రామానికి చెందిన. చిట్వేల్ మాజీ మండల అధ్యక్షుడు కందుల గుండయ్య నాయుడు గారి కుమార్తె హర్షవర్ధని రెడ్డమ్మ కు చెన్నకేశవులు తో శుభముహూర్తంలో పెళ్లి జరిగింది. సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వేదికను పూలతో, దీపాలతో అలంకరించగా కళ్యాణోత్సవం ఆహ్లాదకరంగా సాగింది. వివాహ వేడుకలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, విశిష్ట అతిథులు పాల్గొని కొత్త జంటను ఆశీర్వదించారు. అనంతరం విందు భోజనంలో పాల్గొన్న అతిథులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొత్త దంపతులకు సుఖసంతోషాలతో నిండిన గృహస్థ జీవితం కలగాలని అందరూ ఆకాంక్షించారు.

నిర్మల్

భారీ వర్షాల నేపథ్యంలో రేపటి ప్రజావాణి రద్దు

నిర్మల్ జిల్లా: ( పున్నమి ప్రతినిధి):- జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రేపు (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వర్షాల కారణంగా జిల్లాలోని పలు మండలాల్లో నీటి ముట్టడి, రహదారుల దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తడంతో సంబంధిత శాఖల అధికారులు అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం వచ్చే సోమవారం యథావిధిగా నిర్వహించబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

నిర్మల్

15 నిముషాల పాటు ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్

నిర్మల్ జిల్లా: ( పున్నమి ప్రతినిధి ) నిర్మల్ పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా ఆదివారం సాయంత్రం నుండి భారీ ట్రాఫిక్ మధ్య పట్టణవాసులు చిక్కుకోక తప్పలేదు. ఆర్టీసీ డిపోలోకి అధికారులు వెళ్లే బస్సుల పరిశీలన నిమిత్తం ఒక్క వాహనాన్ని లోపలికి పంపించే ప్రయత్నం చేశారు. ఒక్కో బస్సు వెనకాల నిలబడిపోవడంతో మొత్తం ట్రాఫిక్ తో నిండిపోయింది. దాదాపు 15 నిమిషాల పాటు ట్రాఫిక్ లోనే అంబులెన్స్ సైతం చిక్కుకుపోయింది. అలా సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు ఫస్ట్ డిపో ఎదురుగా ట్రాఫిక్ భారీగా స్తంభించుకోవడం పట్ల పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు ఆర్టీసీ సిబ్బంది ట్రాఫిక్ అంతరాయాన్ని కలగకుండా చూసేందుకు ప్రయత్నించారు.

నాగర్‌కర్నూల్

మంగనూర్ గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా ఆగస్టు 17:నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మంగనూర్ గ్రామంలో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని చిత్ర పటాన్ని మంగనూర్ గ్రామం లోని వీధుల గుండా అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది శ్రీకృష్ణ భగవానుని భక్తులు,యువకులు, కోలాటాలు వేసి, డీజే పాటలకు నృత్యం చేశారు అనంతరం మంగనూర్ గ్రామం లోని ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామం లోని చిన్నారులు,యువకులు ఉత్సాహంగా ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు.అప్పల మాసయ్య యాదవ్ MA సంస్కృతం బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు , మంగనూర్ గ్రామం ప్రజలు కులాలకు అతీతంగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Video: https://youtu.be/cyhshm8oOmA?si=Qr8t_ZDDRYO7PZXP

ఆంధ్రప్రదేశ్

ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలెర్ట్

ఆగస్టు17 పున్నమి ప్రతినిధి : దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని, ఈ నెల 19న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం డైరెక్టర్ భారతి తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. విశాఖ, అనకాపల్లి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

హైదరాబాద్

బ్రేకింగ్ఎ న్యూస్ : ఎన్ డి ఎ ఉప రాష్ట్ర పతి అభ్యర్థి గా పీ రాధ కృష్ణ

పున్నమి ప్రతినిధి భారతదేశ ఉప రాష్ట్ర పతి ఎన్నిక నేపథ్యంలో అధికార ఎన్ డి ఎ కూటమి అభ్యర్థి గా ప్రస్తుత మహా రాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్న సి పి రాదకృష్ణ ని ఎన్ డి ఎ కూటమి నేతలు ప్రకటించారు. సోమవారం నాడు సీపీ రాధ కృష్ణ నామినేషన్ వేసే అవకాశం ఉంది

ఆంధ్రప్రదేశ్

రెండు,మూడు పథకాలతోనే సంబరాలొద్దు! గెడ్డం చంద్రశేఖర్

ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి : రెండు,మూడు పథకాలతోనే సంబరాలొద్దు మిగిలిన వాటిిపై ప్రజలు ప్రశ్నిస్తారు జాగ్రత్త కూటమి సర్కార్ కు గెడ్డం చంద్రశేఖర్ హెచ్చరిక అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా సూపర్ సిక్స్ లో కేవలం మూడంటే మూడు హామీలను అమలు చేసి మొత్తం తన ఎన్నికల మేనిఫెస్టోనే అమలు చేసేసినట్లు కూటమి సర్కార్ సంబరాలు చేసుకొంటోందని వైసీపీ కార్యకర్త గెడ్డం చంద్రశేఖర్ విమర్శించారు. సూపర్ సిక్స్ లో ఇంకా మిగిలిన హామీలను కూటమి సర్కార్ విస్మరించినా ప్రజలు మాత్రం గుర్తుపెట్టుకొంటారని, వాటిని కూడా అమలు చేయకపోతే ఎన్నికల్లో ఓటమితో గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో రెండేళ్లు కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితి స్థంభించిపోయినా మూడేళ్లలోని చేసిన హామీలతోపాటు చేయని హామీలను కూడా వైయస్ జగన్ అమలు చేసి చూపించారని ఆయన గుర్తుచేశారు. అందుకే ఇపుడు వైయస్ జగన్ ను రాష్ట్ర ప్రజలు గుర్తుచేసుకొంటున్నారని, కూటమి సూపర్ సిక్స్ హామీలకు మోసపోయామన్న భావనతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు ఎపుడొస్తాయా కూటమి సర్కార్ ఎపుడు ఓడిస్తామా అని ప్రజలే ఇపుడు ఆత్రుత్తగా ఎదురు చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల హామీల అమలుకు వైయస్ జగన్ తరహా సంకల్పం కావాలి, ప్రజలను మభ్యపెట్టి తప్పించుకొనే తన నైజాన్ని చంద్రబాబు మరోసారి బయటపెట్టుకొన్నారని వైసీపీ కార్యకర్త గెడ్డం చంద్రశేఖర్ విమర్శించారు.

జోగులాంబ గద్వాల

నేత్రదానం చేసిన మురళీకృష్ణ.

అలంపూర్ : ఆగస్టు 17 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో రఘురామయ్య శెట్టి కొడుకు మృతి చెందడంతో అతని రెండు కళ్ళను దానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచిన కుటుంబాన్ని గ్రామస్తులు అందరూ అభినందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఉండవెల్లి మండల కేంద్రానికి చెందిన నరహరి రఘురామయ్య శెట్టి పెద్ద కుమారుడు నరహరి మురళీకృష్ణ (38) ఈ శనివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో 3 గంటలకు ఆయాసం వచ్చినట్లు కుటుంబ సభ్యులకు తెలపడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. శోక సముద్రంలో మునిగిన కుటుంబ సభ్యులందరూ కలసి మృతుడు మురళీకృష్ణ రెండు కళ్ళను దానం చేశారు. అతడు మరణించినా తన అవయవాలు ఇంకొకరికి పునర్జన్మ ఇవ్వాలని సంకల్పంతో కళ్ళను దానం చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మురళీకృష్ణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

అన్నమయ్య

నూతన వధూవరులను ఆశీర్వదించిన కస్తూరి విశ్వనాథ నాయుడు గారు

చిట్వేలి మండలం కె.కందులవారిపల్లి గ్రామ వాస్తవ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కందుల గుండయ్య నాయుడు గారి కుమార్తె వివాహం 17-08-2025 ఆదివారం నాడు లక్ష్మీపురంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన వధూవరులు హర్షవర్ధని రెడ్డమ్మ – చెన్నకేశవులు ను ఆశీర్వదించేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కస్తూరి విశ్వనాథ నాయుడు గారు ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీ నేతలు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.