రైతుల పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలని అడిగితే ప్రతి పక్ష నేతల రక్తం పారిస్తానని సీఎం రేవంత్రెడ్డి చేసిన వాఖ్యలపై బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఫైర్ అయ్యారు. ఈ మేరకు బెల్లంపల్లి పట్టణ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భాష , బుద్ది మారాలని కోరుతూ స్థానిక హనుమాన్ మందిర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిన్నయ్య మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిలో ఉన్న సీఎం స్థాయి వ్యక్తి ఇలా ఆటవిక వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రమాదం ఉందని, ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టుల నుంచి నీళ్లిచ్చే అవకాశం ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి రైతులను గోస పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి నీళ్లు ఇవ్వకుంటే రైతుల తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో వచ్చిన ఆరు గ్యారెంటీ ల అమలుపై దృష్టి సారించి అమలు చేయడానికి కృషి చేయాలని హితవు పలికారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆయన అనుచరుల బుద్ధి కూడా మార్చి ప్రభుత్వ భూములు కబ్జా చేయకుండా చూడాలని సైతం ప్రార్ధించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక 31వ వార్డ్ కౌన్సిలర్ బండారి స్రవంతి-ప్రవీణ్ కుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆర్ఎస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నూనేటి సత్యనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి రెవెల్లి విజయ్, పట్టణ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్రెడ్డి బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు