Monday, 11 May 2026

Blog

తిరుపతి

శ్రీ కాళహస్తి హైవే బ్రిడ్జ్ పై ప్రమాదం

లారీ ఢీకొని వ్యక్తి కి గాయాలైన ఘటన శ్రీకాళహస్తి పట్టణం ఊరందూరు బ్రిడ్జ్ హైవే పై జరిగింది.విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన 108 సిబ్బంది ఆ వ్యక్తిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొని వచ్చారు.ఇతని డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా ఇతను సూళ్లూరుపేట వ్యక్తని ఇతని పేరు గిరీష్ అని గుర్తించడం జరిగింది.వివరాలు తెలియాల్సి ఉంది.

యాదాద్రి భువనగిరి

మారెమ్మ తల్లికి బోనం సమర్పించిన 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు పున్నమి ప్రతినిధి భువనగిరి పట్టణ 23వ వార్డు ఇందిరా నగర్ లో ఘనంగా శ్రావణమాసం చివరివారం సందర్భంగా గ్రామ దేవతలైన మారెమ్మ తల్లి పోచమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి అమ్మవార్లకు ఘనంగా బోనాల పండుగ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ 23 వ వార్డు మాజీ కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ పాల్గొని అమ్మవార్లకు బోనాలు సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ ప్రజలు రైతులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవార్లను వేడుకోవడం జరిగింది…

అన్నమయ్య

వర్షాల కారణంగా నీటి కుంటగా మారిన చిట్వేల్ బ్రాహ్మణ వీధి

చిట్వేలి ఆగస్టు ( పున్నమి ప్రతినిధి) చిట్వేల్ పట్టణంలోని బ్రాహ్మణ వీధి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపై నుంచి పారిన వర్షపు నీరు బ్రాహ్మణ వీధిలో చేరి నీటి కుంటలాగా మారింది. దాంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించడం కష్టసాధ్యమైంది. చిన్నారులు, వృద్ధులు మరింత ఇబ్బందులు పడుతున్నారు.స్థానిక ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాని పరిస్థితి నెలకొంది. రోడ్డు మరమ్మతులు, నీరు వెళ్లే డ్రైనేజీ సదుపాయం లేకపోవడంతో ఇలాంటి సమస్యలు తరచుగా ఎదురవుతున్నాయి. అందువల్ల సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, సమస్యను పరిష్కరించి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

ఉచితంగా లక్షల రూపాయల వైద్యం – కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా సేవలు

ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి : సూపర్‌ స్పెషాలిటీ సేవలను ఉచితంగా అందిస్తోన్న ప్రభుత్వాసుపత్రులు – క్యాన్సర్‌కు రోబోటిక్‌ సర్జరీలు, డయాబెటిక్‌ రెటినోపతికి ఉచిత చికిత్స తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రభుత్వాసుపత్రులు ఆధునిక పరికరాలతో, సూపర్‌ స్పెషాలిటీ సేవలతో మంచి వైద్యం అందిస్తామని భరోసా ఇస్తున్నాయి. దాదాపు ఉచితంగా అందే ఈ సేవలు. సామాన్యులకు వరంగా మారుతున్నాయి. ఎవరైనా, ఏ రాష్ట్రం వారైనా వీటిని వినియోగించుకోవచ్చు. ఏపీలో పలు జిల్లాల్లో సైతం: గుంటూరులోని జీజీహెచ్‌లో ప్లాస్టిక్‌ సర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, కార్డియాలజీ, సీటీవీఎస్ వంటి 11 సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు, ఒంగోలు జీజీహెచ్‌లో 7 విభాగాలలో వైద్యసేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ప్లాస్టిక్‌ సర్జరీ, పీడియాట్రిక్స్‌ సర్జరీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నియోనాటాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, సర్జికల్, మెడికల్‌ ఆంకాలజీ విభాగాల్లో రోగులకు పైసా ఖర్చు లేకుండా మంచి వైద్య సేవలు అందుతున్నాయి. కర్నూలు జీజీహెచ్‌లోని కార్డియో థొరాసిక్‌ విభాగంలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేస్తున్నారు. విజయవాడలోని బోధనాసుపత్రిలో ప్లాస్టిక్‌ సర్జరీ వైద్య సేవలు ప్రతి సోమ, గురువారాల్లో అందిస్తారు. న్యూరో సర్జరీ విభాగంలో నెలకు 70 నుంచి 80 వరకు సర్జరీలు జరుగుతుంటాయి. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు అనుబంధంగా ఉన్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో గత రెండేళ్లుగా క్యాన్సర్, మూత్రపిండాల శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన ములుగు ప్రభుత్వ బోధనాసుపత్రిలో ఆంకాలజీ సేవలు ప్రవేశపెట్టారు. విశాఖ, గుంటూరు, కర్నూలు, విజయవాడ, తిరుపతిలో మధుమేహానికి సమగ్ర వైద్య సదుపాయాలు ఉన్నాయి. ఖర్చు లేకుండా డయాలసిస్‌ సేవలు: కిడ్నీలు విఫలమైతే డయాలసిస్‌ తప్పనిసరిగా చేయించుకోవాలి. వారానికి 3-5 సార్లు డయాలసిస్‌ చేయించుకోవాల్సిందే. కొందరికి ప్రతి రోజూ అవసరమవుతుంది. ప్రైవేటులో ఒక్కో డయాలసిస్‌ సేవకు వేలల్లో వసూలు చేస్తారు. కానీ హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియాలో కిడ్నీ రోగులకు ఈ సేవలు పూర్తి ఉచితంగా అందిస్తుండటం గమనార్హం. ఒకవేళ ఆరోగ్యశ్రీ ఉన్నట్లయితే నిమ్స్‌లో సైతం డయాలసిస్‌ సేవలను ఉచితంగా చేస్తారు. విజయవాడలో బోధనాసుపత్రిలో కిడ్నీ, యూరాలజీ, వైద్య సేవలను సోమ, గురువారాలలో అందిస్తారు. కర్నూలులోని నెఫ్రాలజీ విభాగంలో ప్రతి నెలా 150 మందికి ఆధునిక వైద్యం ఉచితంగా అందుతోంది.

ఎలూరు

ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి మండలంలో ఎరువుల దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారిని జె. భవాని హెచ్చరించారు. ఆదివారం మండలంలోని ఆగిరిపల్లి, నెక్కలం గొల్లగూడెం, కొత్త ఈదరలోని ఎరువుల దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఎరువులను విక్రయించిన వెంటనే రసీదులు ఇవ్వాలని, ఈపాస్ మిషన్ ద్వారా ఎరువులు విక్రయాలు చేపట్టాలని, స్టాక్ వివరాలు రికార్డులు పొందుపరచాలని ఆదేశించారు. ఏయ్ మండలంలో యూరియాతోపాటు అన్ని ఎరువులు అందుబాటులో ఉన్నాయని. డీలర్లు ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమెతోపాటు తనిఖీలలో వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆదూరుపల్లిలో తన్విక ఫిజియోథెరపీ సెంటర్ ప్రారంభం

చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలం ఆదురుపల్లి గ్రామంలో తన్విక ఫిజియోథెరపీ సెంటర్ ను కలువాయి వైద్యురాలు డాక్టర్ సరళ కుమారి (ఎంబీబీఎస్) ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు, నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ గిరి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సౌకర్యాలు విస్తరించడం అత్యంత అవసరమని,తన్విక ఫిజియోథెరపీ కేంద్రం ద్వారా ప్రజలు మరింత మెరుగైన వైద్యసేవలు పొందగలరని అన్నారు. ఫిజియోథెరపీ చికిత్సలు నేడు అనేక రోగాల నుండి ఉపశమనం కలిగిస్తున్నాయని,ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.గ్రామస్థులు కూడా ఈ కేంద్రం ఏర్పాటును హర్షిస్తూ, ఇంతవరకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది కానీ, ఇప్పుడు సమీపంలోనే ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందుబాటులోకి రావడం తమకు ఎంతో సౌకర్యంగా ఉందని తెలిపారు.ఈ ప్రారంభోత్సవానికి కలువాయి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఓలేటి శ్రీనివాస్ రావు, చేజర్ల సీనియర్ టిడిపి నాయకులు రావిలక్ష్మీ నర్సారెడ్డి, మోదేపల్లి పెంచలనాయుడు, రామానాయుడు,వావిలేరు సర్పంచ్ గోనుగుంట రాంబాబు,చీర్ల వెంకటేశ్వర్లు, శివ,వైసిపి నాయకులు వెంకటరత్నం తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

E-పేపర్

ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం – ముఖ్యఅతిథిగా పాల్గొన్న టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్

ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయుడబ్లుజె) వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా సర్వజన ఆసుపత్రిలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎపియుడబ్ల్యుజె గౌరవాధ్యక్షులు జనార్దన్ రెడ్డి, అధ్యక్ష, కార్యదర్సులు మధుబాబు, ఉస్మాన్ బాషా, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలంబాబు, సీనియర్ పాత్రికేయులు రమణారెడ్డిలతో పాటు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ ఏపీయుడబ్లుజె ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం అభినందనీయమని, జర్నలిస్టులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. 68 సంవత్సరాలు పూర్తి చేసుకుని 69వ ఒడిలోకి వెళుతున్న ఏపీయుడబ్లుజె సంఘానికి అభినందనలు తెలిపారు. ఎందరో సీనియర్ పాత్రికేయులు ఈ సంస్థలో ఉండడం వల్ల సంస్థ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. జర్నలిస్టులకు నంద్యాల ప్రాంతంలో ఇంటి స్థలాలిచ్చే విషయాన్ని మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఎపియుడబ్లుజె నాయకులు మధు, చలం బాబు, జనార్ధన్ రెడ్డి, ఉస్మాన్ బాషాలు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే సంస్థలో పనిచేయడం గర్వకారణమని, విలేకరుల అభివృద్ధికి తోడ్పాటు అందించే సంస్థ ఏపీడబ్ల్యూజే అని పేర్కొన్నారు. ఆగస్టు 17,1957 సంవత్సరంలో ఏపీయుడబ్లుజె ఆవిర్భవించిందని, అప్పటి నుండి ప్రతి ఏటా ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నట్లు వివరించారు. జర్నలిస్టులకు అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు, జర్నలిస్టులకు ఇంటి స్థలాలిచ్చి ఇళ్ళను నిర్మించి ఇవ్వాలని, జర్నలిస్టుల పిల్లలకు విద్యా సంస్థల్లో రాయితీలు ఇవ్వాలని తదితర సంక్షేమ పథకాల కోసం ఎపియుడబ్లుజె పోరాడుతుందని, అలాగే జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తేవాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఫిరోజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎపియుడబ్లుజె నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అన్నమయ్య

సోషల్ మీడియాలో అనుమానాస్పద లింక్స్‌ పట్ల జాగ్రత్త – చిట్వేల్ ఎస్ఐ నవీన్ హెచ్చరిక

చిట్వేల్ ఎస్ఐ నవీన్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. వాట్సాప్‌, సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్‌ చేయవద్దని సూచించారు. ఉచిత రీఛార్జ్‌, బంపర్ ఆఫర్‌, బహుమతుల పేర్లతో వచ్చే లింక్స్‌ పూర్తిగా మోసపూరితమని, వాటి ద్వారా వ్యక్తిగత డేటా, బ్యాంక్ వివరాలు దొంగిలించే అవకాశం ఉందని తెలిపారు. అలాంటి లింక్స్‌ను క్లిక్‌ చేయడం మాత్రమే కాకుండా ఇతరులకు ఫార్వార్డ్‌ చేయరాదని కూడా స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, సైబర్ మోసగాళ్లకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అన్నమయ్య

కార్యకర్తల సమస్యల పరిష్కారం నా బాధ్యత – కస్తూరి విశ్వనాథ నాయుడు హామీ

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం పెనగలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆగస్టు 17న ఆదివారం జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు కార్యకర్తల సమస్యలను విని వెంటనే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి మండలంలో వారానికి రెండు మూడు రోజులు పర్యటిస్తూ కార్యకర్తల సమస్యలను నేరుగా విని సంబంధిత అధికారులతో చర్చించి తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే కలెక్టర్‌, మంత్రివర్యులు, చివరికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అయినా పరిష్కారం సాధిస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తల కృషి వలననే తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని గుర్తుచేసిన ఆయన, కాబట్టి ఎవ్వరూ అధైర్య పడవద్దని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

E-పేపర్

విద్యార్థి మరియు ప్రజా సంఘాల హక్కులను హరించే ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి

విద్యార్థి మరియు ప్రజా సంఘాల హక్కులను హరించే ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి RC.No – 30/67/2025 Dated (01-08-2025) ఆదేశాలను ప్రభుత్వం రద్దు చేయాలి విద్యార్థుల సమస్యలు బయటకి రాకుండా ఉండేందుకే పాఠశాలల్లోకి ప్రజా సంఘాల ప్రవేశాన్ని నారా లోకేష్ నిషేధించడం యస్సీ యస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి పాఠశాల ఆవరణలోకి విద్యార్థి సంఘాలు మరియు ప్రజా సంఘాల ప్రవేశాన్ని నిషేదిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కూటమి ప్రభుత్వం రద్దు చేసుకోవాలని యస్సీ యస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా మహిళా ఐక్య వేదిక ప్రధాన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను బయటకు రాకుండా చేయాలన్నా కుట్రతోనే ప్రభుత్వం ఇలాంటి నియంతృత్వ పోకడలతో ఆదేశాలు జారీ చేసిందని ఆమె అన్నారు. ఎన్నికల ముందు నారా లోకేష్ విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతూ సమస్యలపై గట్టిగా పోరాడండి అంటూ అందరిని ప్రోత్సహించి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత నియంతృత్వ ధోరణితో హక్కులను కాలరాస్తూ జారీ చేసిన ఆదేశాలను చూస్తే కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాదిరిగా పాలనను సాగిస్తుంది అని ఆమె తెలిపారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసే జీ.వో లు తీసుకువస్తే విద్యార్థి ప్రజా సంఘాలు స్వాగతిస్తారు కానీ ఇలాంటి పనికిరాని జీ.వోలను,ఆదేశాలనుహర్షించరు పి ఆమె అన్నారు. విద్యార్థి మరియు ప్రజా సంఘాల హక్కులను హరించే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలనికూటమి ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే కూటమి ప్రభుత్వానికి కూడా పడుతుందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా ఐక్యవేదిక రాయలసీమ డివిజన్ అధ్యక్షురాలు ఈడిగ భారతమ్మ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు పాలెం రాధ ,జిల్లా ఉపాధ్యక్షురాలు హుస్సేన్ బి ఎమ్మిగనూరు నియోజకవర్గ అధ్యక్షురాలు ఎలిశమ్మ ఎమ్మిగనూరు మండల అధ్యక్షురాలు ఈరమ్మ,గోనెగండ్ల మండల అధ్యక్షురాలు ఖాసింబి పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.