Monday, 11 May 2026

Blog

హైదరాబాద్

బిజెపి రాష్ట్ర కమిటీ సమావేశం..

పున్నమి ప్రతినిధి హైదరాబాద్ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రాంచందర్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని, ఘన విజయం సాధించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను గురించి, అనుసరించాల్సిన వ్యూహాలను గురించి బిజెపి ముఖ్య నాయకులకు రామ చందర్ది రావు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బిజెపి సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి డా. కాసం వెంకటేశ్వర్లు , బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొల్లి మాధవి హాజరయ్యారు.

E-పేపర్

రాష్టం లో విధి కుక్కలసైర్యావిహారం చేస్తున్నాయి దీనిమీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకువాలని ముస్లిం హక్కులపోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి smd యూనుస్ డిమాండ్

రాష్టం లో విధి కుక్కలసైర్యావిహారం చేస్తున్నాయి దీనిమీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకువాలని ముస్లిం హక్కులపోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి smd యూనుస్ డిమాండ్ చెయ్యడం ఆయన మాట్లాడుతూ కుక్క ఎన్జీవోస్ కుక్కలని చెప్పడం నేరమంటున్నారు మరి అదే కుక్కలు మనుషులు మీద కరిగే మనుషుల ప్రాణాలు తీస్తుంటే కుక్కల ప్రేమికులు ఎందుకు మాట్లాడడం లేదు మనుషుల కంటే కుక్కలు ఎక్కువ పోయిన వాళ్లకి అటువంటప్పుడు కుక్కలను ఇంటికి తీసుకొని వెళ్ళి పెంచుకోవాల అవసరం ఉన్నాయి ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర సెక్రటరీ సయ్యద్ గులాబ్ మాట్లాడుతూ అధికారులు వెంటనే ద్రుష్టి సరించి కుక్కలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది కర్నూలు జిల్లా గౌరవ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ మాట్లాడుతూ ప్రజలప్రాణాలు కాపాడాలని అధికారులను కోరడమైనది ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు కరటే మాబాషా మాట్లాడుతూ నంద్యాల లో రెక్కి నిర్వహించడంతో కుక్కల బెడద ఎక్కువ ఉండటం తో రాష్ట్ర కమిటీని సంప్రదించి అధికారులకు కుక్కలబెడద పై చర్యలు తీసుకువాల్సిందిగా కోరడం జరిగింది

ఖమ్మం

రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తం

పురపాలక సంఘం కార్యాలయనికి కూత వేటు దూరంలో గల రోడ్ల పరిస్థితి గుంతల మయం పాఠశాలలకు వాహనదారులకు ఇబ్బందికరంగా మారిన రోడ్లు ఖమ్మం పురపాలక సంఘంలో 53వ డివిజన్ నిత్యం రద్దీగా ఉండే గట్టయ్య సెంటర్ నుండి కవిత కాలేజ్ వరకు అక్కడక్కడ గుంతలు పడి వాహనదారులకు ప్రమాదకరంగా మారింది అలాగే పాత వెంకటేశ్వర థియేటర్ ప్రసాద్ హైట్స్ నుండి మెయిన్ రోడ్ వరకు కృషి భవన్ వరకు రోడ్లు చెదిరిపోయి గుంతలు పడి పాఠశాలకు వాహనదారులకు ఇబ్బందికరంగా ప్రమాదకరంగా మారిందని 53వ డివిజన్ భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకుడు తొడుపునూరి రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి కార్పొరేషన్ అధికారులు వెంటనే రోడ్ల మరమ్మతు చేయాలని విజ్ఞప్తి చేశారు

తిరుపతి

కానిస్టేబుల్ గుర్రప్పకు ప్రశంస

తిరుమలలో మొన్నటి దినం నల్గొండ కు చెందిన శ్రీవారి భక్తుడికి గుండె నొప్పి రాగా అతనికి CPR చేసి కాపాడిన కానిస్టేబుల్ గుర్రప్ప ను ప్రశంసించి అభినందించిన తిరుమల అడిషనల్ ఎస్పీ.ఈ కార్యక్రమంలో తిరుమల డిఎస్పి మరియు తిరుమల వన్ టౌన్ సిఐ టూటౌన్ సిఐ సదరు సిబ్బంది హాజరైన గుర్రప్పను అభినందించారు.

ఖమ్మం

పలు శుభ కార్యాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి జిల్లాలో ఆదివారం పండుగ వాతావరణం తలపించింది. తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వరుస శుభకార్యాల్లో పాల్గొని ప్రజలతో ఆత్మీయంగా మమేకమయ్యారు. కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామంలో ఆదిత్య ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం, గంగమ్మతల్లి ఆలయంలో బోనాల జాతరలో పాల్గొని భక్తులతో కలిసిపోయారు. అనంతరం మల్లేపల్లిలోని బీఆర్‌కే ఫంక్షన్ హాల్‌లో పురం ఉపేందర్ కుమారుని వివాహం, నేలకొండపల్లి ఏఎంసీ మార్కెట్‌ యార్డులో చిలకల రాములు కుమారుని వివాహం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో వరుసగా జరిగిన పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, రిసెప్షన్లకు హాజరై ఆశీర్వచనాలు అందించారు. వెంకటగిరిక్రాస్ రోడ్‌లోని శ్రీహర్ష కన్వెన్షన్‌, నాయుడుపేట పీవీఆర్ గార్డెన్స్‌, రెడ్డిపల్లి ఏఆర్ గార్డెన్స్‌, సత్యనారాయణపురం టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్‌లలో జరిగిన వివాహ వేడుకల్లో పట్టు వస్త్రాలను కానుకగా అందజేశారు. ఖమ్మం నగరంలోని రామన్నపేట, ఉషాహరి కన్వెన్షన్, సిటీ సెంట్రల్ కన్వెన్షన్, ఎస్ఆర్ కన్వెన్షన్, పుట్టకోటతో పాటు అనేక ప్రాంతాల్లో జరిగిన శుభకార్యాల్లోనూ పాల్గొన్నారు. శ్రీనగర్ కాలనీలో శెట్టిపల్లి వెంకటేశ్వర్లు మనమరాళ్ల ఓణీల అలంకరణ వేడుకలోనూ మమేకమయ్యారు. ప్రతీ చోటా పట్టు వస్త్రాలను కానుకగా అందజేస్తూ.. ఆత్మీయత నిండిన ఆశీస్సులను మంత్రి పొంగులేటి వారికి అందించారు.

ఖమ్మం

ఆర్షిక సహాయం..

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతి నిధి తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరావు క్యాంప్ కార్యాలయంలో,కాంగ్రెస్ పార్టీ కార్యలయం లో పని చేస్తున్న లింగమ్మ భర్త కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని తెలుసుకొని వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సహాయం చేసిన డాక్టర్ శ్రీ తుమ్మల యుగంధర్. వారితో పాటు పాల్గొన్న నగర మేయర్ పునకొల్లు నీరజ సాధు రమేష్ రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ యరగర్ల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు

తిరుపతి

రాష్ట్ర మహా సభల గోడ పత్రికలు ఆవిష్కరణ

ఈనెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఒంగోలు లో జరిగే సిపిఐ పార్టీ రాష్ట్రమహాసభలకు సంబంధించి గోడ పత్రికలను శ్రీకాళహస్తి సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది.అనంతరం ఆ పార్టీ నాయకుడు చందు మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అన్నమయ్య

కొడూరు: 5 వేల జనాభా.. బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు

కొడూరు, ఆగస్టు 17: రాజంపేట నియోజకవర్గంలోని ఒబులవారిపల్లి మండలం వై.కొట గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని స్థానిక కార్మిక సంఘ నేతలు డిమాండ్ చేశారు. గ్రామంలో ప్రతి ఆడివారం జరిగే మార్కెట్‌కు సుమారు 25కు పైగా గ్రామాల ప్రజలు తరలివస్తున్నారని వారు తెలిపారు. ఈ గ్రామంలో దాదాపు 5,600 కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ ఇప్పటివరకు బస్సు సౌకర్యం లభించకపోవడంతో విద్యార్థులు, రైతులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు సౌకర్యం లభించేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

అన్నమయ్య

పుల్లంపేట: విద్యార్థులకు గమనిక

హిందీ ప్రచార సభ నిర్వహించే ప్రథమ, మధ్యమ, ఉత్కృష్ట, విశారద, భూషణ్ పరీక్షలకు 6వ తరగతి నుండి 10వ తరగతి చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పుల్లంపేట హిందీ టీచర్ సమ్యక్ హ్యాండ్స్ ఫౌండేషన్ ప్రతినిధి తెలిపారు. దరఖాస్తుల చివరి తేదీ ఈ నెల 31వ తేదీగా నిర్ణయించారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు హిందీ పండిట్ ట్రైనింగ్ పూర్తి చేసి డీఎస్సీ రాసుకునే అర్హత పొందవచ్చని ఆయన వివరించారు.

అన్నమయ్య

చిట్వేల్ ఎస్సై సూచనలు..!

వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్స్‌పై క్లిక్ చేయవద్దని చిట్వేల్ ఎస్సై ప్రజలకు హెచ్చరించారు. ఉచిత రీచార్జ్, బంపర్ ఆఫర్ పేరుతో వచ్చే లింక్స్ ప్ర‌మాదకరమని చెప్పారు. అలాంటివాటికి ఎప్పటికీ విపరిణామాలు తెలియజేస్తూ ప్రజలను జాగ్రత్తగా ఉండమని సూచించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.