Monday, 11 May 2026

Blog

జోగులాంబ గద్వాల

తుంగభద్ర నది తీరాన ముసలి కలకలం.

అలంపూర్ : ఆగస్టు 17 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామ శివారులోని తుంగభద్ర నదిలో ఆదివారం మొసలి కలకలం రేపింది. తుంగభద్ర నది తీరాన మొసలి వ్యవసాయ పొలాల వైపు వస్తున్నట్లు స్థానికులు గమనించి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో గ్రామంలో అలజడి నెలకొన్నది. తుంగభద్రా నదికి కర్ణాటక రాష్ట్రం నుంచి కురుస్తున్న వర్షాలకు వరదనీరు రావడంతో మొసల్లు వస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అధికారులు తక్షణం స్పందించి మొసలిని పట్టుకుని గ్రామస్తుల్లో నెలకొన్న భయాన్ని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

హైదరాబాద్

బిజెపి మాజీ శాసన సభ్యులు NVSS ప్రభాకర్ ప్రెస్ మీట్

పున్నమి ప్రతినిధి హైదరాబాద్ ఆగష్టు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ మీడియా సమావేశం లో మాట్లాడారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు జాతీయ పతాక ఆవిష్కరణ తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆర్ఎస్ఎస్ సేవలను కొనియాడుతూ ప్రస్తావించారు. దీనిపై రాహుల్ గాంధీ గారు రకరకాల విమర్శలు గుప్పించారు. రకరకాల మాటలు కూడా మాట్లాడారు. ఆయన చరిత్ర తెలిసి మాట్లాడాడా? లేక చరిత్ర తెలియక మాట్లాడాడా? లేదా కాంగ్రెస్‌లో తాను కొత్త పంథాను చూపించుకోవడం కోసం మాట్లాడాడా? అన్నది అర్థం కావడం లేదు. స్వయంగా ఆయన తాత జవహర్లాల్ నెహ్రూ చైనా యుద్ధ సమయంలో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు చేసిన సేవలను గమనించి, జవాన్లకు అందించిన సహకారాన్ని గుర్తించారు. ఆ తీరును దృష్టిలో పెట్టుకొని, 1963 జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు స్వయంగా భారత ప్రధాని నెహ్రూ ఆర్ఎస్ఎస్‌ను పాల్గొనాలని కోరుతూ ఆహ్వానించారు. ఈ విషయం రాహుల్ గాంధీకి తెలియనట్టుంది. దానికి సంబంధించి దృశ్యాలు మనం చూడొచ్చు అన్నారు చైనా భారత్‌పై ఆక్రమణ చేస్తుందని పలు సార్లు హెచ్చరికలు వచ్చాయి. కానీ ప్రభుత్వం, ప్రసా మాధ్యమాలు దానిని సీరియస్‌గా తీసుకోలేదు. చివరికి 1962లో చైనా భారత్ ని ఆక్రమణ చేసింది. అలాగే భారత్–పాకిస్తాన్ యుద్ధాలలో కూడా స్వయంసేవకులు ప్రభుత్వం, సైన్యానికి అన్ని విధాలా సహకారం అందించారు. కొన్ని సంవత్సరాల తర్వాత గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనడానికి పండిట్ నెహ్రూ స్వయంగా సంఘాన్ని ఆహ్వానించారు. “సంఘంలోని వారు కూడా దేశభక్తులే” అని నెహ్రూ అన్నారు. ఇది రికార్డుల్లో ఉన్న విషయం. పార్లమెంటరీ లేదా డెమోక్రటిక్ వ్యవస్థలో ఎలాంటి రికార్డులు పరిశీలించినా ఇది స్పష్టంగా కనిపించే అంశమే. అని ప్రభాకర్ అన్నారు 1963 జనవరి 26న గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో స్వయంగా భారత ప్రధాని నెహ్రూ ఆర్ఎస్ఎస్‌ను ఆహ్వానించి, పరేడ్‌లో పాల్గొనేలా చూసిన అంశం ఇది అని నేను స్పష్టంగా చెప్పగలన అని ప్రభాకర్అ న్నారు లోకసభ రికార్డుల్లో అప్పటి భారత ప్రధానమంత్రి, ప్రజాప్రియ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి మాట్లాడిన అంశం గుర్తుచేసుకోవాలి. భారత్–పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఢిల్లీలో పరిస్థితులను నియంత్రించేందుకు శిక్షణ పొందిన వారికీ అవసరం ఏర్పడింది. అప్పుడు ఆర్ఎస్ఎస్ సేవా దళం ట్రాఫిక్ నియంత్రణలో, ఇతర అత్యవసర సహాయ చర్యల్లో పాలుపంచుకుంది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా బెంగళూరులో జరిగిన ఒక మహాసమ్మేళనంలో కూడా దీనిపై ప్రస్తావన జరిగింది. రెండో స్వాతంత్ర్య సమరమనేలా సాగిన ఆ ఉద్యమంలో దేవెగౌడ హాజరై ప్రసంగించిన సందర్భం కూడా ఉంది. ఇదంతా లోకసభలో ఒక చర్చ సందర్భంగా స్వయంగా అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రస్తావించారు. అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ ఆర్ఎస్ఎస్‌ను రిపబ్లిక్ డే పరేడ్‌కు ఆహ్వానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారత్–పాక్ యుద్ధం జరిగిన సందర్భంలో, ఆర్ఎస్ఎస్ జవాన్లకు అందించిన సహకారంతో పాటు ఢిల్లీలో ట్రాఫిక్‌ను సమన్వయం చేసి నియంత్రించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. వాజ్పేయి లోకసభలో చెప్పిన ఈ విషయాలు అసత్యమైతే లేదా అవాస్తవమైతే, ఆ సమయంలో అక్కడి సభ్యులు అభ్యంతరం చెప్పేవారు. కానీ ఎవరు కూడా తప్పు పట్టలేదు, ఎవరు కూడా కాదనలేదు. కాబట్టి ఇది రికార్డులో నిలిచిన అంశం. అయితే…… ఇటీవల ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ సేవలను ప్రస్తావించగా, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు భారతదేశాన్నే అవమానపరిచేలా ఉన్నాయి. రాజకీయంగా విమర్శించవచ్చు. రాహుల్ గాంధీకి చరిత్ర తెలియక విమర్శించినట్టు అనిపిస్తోంది. రాజకీయంగా ఆర్ఎస్ఎస్‌తో విభేదించిన పార్టీలు చాలానే ఉన్నాయి. సిద్ధాంతపరంగా కూడా విభేదించిన పార్టీలు ఉన్నాయి. కానీ దేశానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు, సమైక్యత–సమగ్రతల విషయంలో, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన దేశభక్తి సంస్థగా ఆర్ఎస్ఎస్‌ను మించిన సంస్థ లేదని అందరూ అంగీకరించక తప్పలేదు. ఇదే దానికి ఒక స్పష్టమైన ఉదాహరణ. మరొక విషయం…. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా 1940 జనవరి 2న సతారా జిల్లా కరోడు గ్రామంలో జరిగిన ఆర్ఎస్ఎస్ క్యాంపులో స్వయంగా విచ్చేశారు. అక్కడ ఆయన పరిశీలించి ప్రసంగించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న పుస్తకంలో ఆయన రాసిన అభిప్రాయంలో, ఇది దేశభక్తి ప్రేరేపితమైన సంస్థ అని స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే సామాజిక సమరసతకు ప్రతీకగా ఆర్ఎస్ఎస్ నిలుస్తుందని చెప్పారు. స్వయంసేవకులను ఏ కులం అని అడిగినా ఎవరూ చెప్పలేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తర్వాత మహాత్మా గాంధీ కూడా 1934లో వార్ధా జిల్లాలో జరిగిన ఆర్ఎస్ఎస్ సమ్మర్ క్యాంపులో పాల్గొని ప్రసంగించారు. అక్కడ ఆయన కూడా ఇదొక దేశభక్తి కలిగిన సంస్థ, సేవాభావానికి మారుపేరు, క్రమశిక్షణకు నిలయం, దేశభక్తే లక్ష్యంగా నడుస్తున్న సంస్థ అని తెలిపారు. అంతేకాక, 1947 సెప్టెంబర్ 16న ఢిల్లీలో స్వీపర్ కాలనీ శాఖలో పాల్గొని ప్రసంగించారు. అలాగే మన దేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా నాగ్ పూర్ లో సరసంఘచాలక్ మోహన్ భగవత్ గారిని కలిసిన సందర్భంగలో. ఆర్ఎస్ఎస్ గురించి ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ పరంపరలోని పెద్ద నాయకులే ఇలా ఆర్ఎస్ఎస్ గురించి ప్రశంసలు గుప్పించారు. అయితే రాహుల్ గాంధీకి రాజకీయాలపై అవగాహన లేదు. చరిత్రపై మరింత అవగాహన లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఒక అతి పెద్ద ప్రాంతీయ పార్టీయే మిగిలింది. The inefficiency leadership of Rahul Gandhi made Congress Party a major regional party in this country. అది మాత్రమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ పార్టీగా, వారసత్వ పార్టీగా, ఓడిపోయే పార్టీగా, కుంభకోణాల పార్టీగా, దోచుకున్న పార్టీగా, దాచుకున్న పార్టీగా మిగిలిపోయింది. ఒక్కో నాయకుడు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలు అందరికీ కనబడుతున్నాయి. బెయిల్ మీద తల్లి, కొడుకులు ఉన్నారు. అంటే వీళ్లు ఏ స్థాయికి దిగజారిపోయారో స్పష్టమవుతోంది. ఇలాంటి వారు రాజకీయాల్లో కొనసాగడానికి హక్కు ఎక్కడుంది అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. బెయిల్ మీద ఉన్న తల్లి–కొడుకులు ఈ దేశాన్ని ఎలా ఉద్ధరిస్తారు? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, విచారణలకు లోనవుతూ ఉన్న తల్లి–కొడుకులు దేశాన్ని ఎలా నడిపిస్తారు? అన్న ప్రశ్నకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. అదే కాక, వీళ్లు ఎవరికోసం మాట్లాడుతున్నారు అన్నది ప్రజలు గ్రహించాలి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశంలో మెజారిటీని ప్రాతినిధ్యం వహించింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మైనారిటీల కోసం మాత్రమే పనిచేస్తున్న పార్టీగా మారిపోయింది. ఆవుదూడ గుర్తుతో ఉన్నప్పుడు దేశంలో స్థిరమైన పాలన నడిచింది. చేతి గుర్తుకు వచ్చిన తర్వాత మైనారిటీ అపీజ్మెంట్‌లో పడి కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. దానికి నిదర్శనం, కాంగ్రెస్ ఇప్పుడు మూడు రాష్ట్రాలకు పరిమితమైన అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా మిగిలిపోవడం. దివాళాకోరు రాజకీయ విధానాల వల్ల కాంగ్రెస్ కనుమరుగవుతోంది. ప్రతి ఎన్నికలో, ప్రతి సందర్భంలోనూ ఇది ప్రజలకు కనబడుతోంది. అందువల్ల రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇక బెయిల్ మీద ఉన్న తల్లి–కొడుకులకు రాజకీయాలు చేసేటటువంటి అధికారం, అవకాశం లేదు. వాళ్లు.. ఇక ఇంట్లో కూర్చుంటే మంచిదని మేము సలహా ఇస్తున్నాం.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వాజ్పేయి సేవలు మహోన్నతం

ఆగస్టు 16 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంటరీ కాట్రేనికోన మండలం చెయ్యరు లో మండల అధ్యక్షుడు మట్ట శివకుమార్ ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కోట్లాదిమందికి మార్గదర్శి స్ఫూర్తిదాత మాజీ ప్రధానమంత్రి భారతరత్న అవార్డు గ్రహీత *శ్రీ అటల్ బిహారి వాజ్పేయి వారి వర్ధంతి* సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి పువ్వు లు సమర్పించి నివాళులు సమర్పిస్తూ ఆమహనీయుడని స్మరించుకోవడం జరిగింది… ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు. బిజెపి జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ జిల్లా డైరెక్టర్ సూరిబాబు. ఎస్.నాగేశ్వరరావు టి.నారాయణస్వామి ,కె.బలరాం, ఎన్.వెంకటేశులు, జి .చంటి,. సిహెచ్. సత్యనారయణ, పి. ముత్యాలరావు, తదితరులు పాల్గొనడం జరిగింది…

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

79వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా శక్తి స్వరూపి ణీ గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారిని భరతమాతగా ప్రత్యేక అలంకరణ చేయడం జరిగింది.

అనంతరం సాయంత్రం దేశ శాంతిభద్రతల రక్షణ కొరకు ఆలయ అర్చకులు ఆణి విళ్ళ ఫణికాంత్ శాస్త్రి అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద ఉదయం 8గంటలకు అధ్యక్షులు ఆణి విళ్ళ సాయిబాబా, రాష్ట్ర బిజెపి కోశాధికారి. గ్రంధి నానాజీ,సుంకరబుజ్జి, తాతపూడి గోపి, సంసాని పాండురంగారావు, దొమ్మేటి ఫణీంద్ర,సుంకర పవిత్ర గ్రంధి శ్రీను ఆణివిళ్ల వాసు, ఎల్లమిల్లి రమేష్,కొత్తగుండు భాస్కరరావు,గ్రంధిసత్తిబాబు,రామకృష్ణపరమహంస, తదితరులు పాల్గొని జెండా వందనం చేశారు. విద్యార్థిని విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు మరియు చాక్లెట్లు ఇవ్వడం జరిగింది. భరతమాతగా జెండా అలంకరణలో మావుళ్ళమ్మ తల్లి అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు

ఆంధ్రప్రదేశ్

ముమ్మిడివరం లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం

ముమ్మిడివరం మండలం లో ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. గ్యాప్ ఇవ్వకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తడుచుకుంటూనే తమ ప్రయాణాలు సాగిస్తున్నారు. పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు రద్దీ ఎక్కువగానే ఉంది. ఈ భారీ వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిసింది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

*ఉత్తమ ఉద్యోగిగా అవినాష్ కు ప్రశంసా పత్రం..*

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ రోజు అమలాపురంలో జరిగిన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ శ్రీ వా వి రాల మహేష్ కుమార్ మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసా పత్రం అందజేశారు. తన విధుల్లో నిబద్ధత, కృషి, ప్రతిభ ప్రదర్శనకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. ఈ సందర్భంగా కాట్రేనికోన ఎస్సై అవినాష్ సహచరులు, పోలీసు శాఖ అధికారులు, స్నేహితులు, మండల గ్రామ ప్రజలు అభినందించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కుండలేశ్వరం క్షేత్రాన్ని దర్శించుకున్న బిజెపి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు

ఆగస్టు 17 కాట్రేనికోన దక్షిణ కాశీగా పేరుపొందిన కుండలేశ్వరం పుణ్యక్షేత్రాన్ని ఏపీ బీజేపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్ర రెడ్డి కుటుంబ సభ్యులతో సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు,ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు కాళ్లకూరి కామేశ్వర శర్మ ఆలయ విశిష్టతను వివరించి వేద ఆశీర్వచనం చేసి శాలువ కప్పి సత్కారం చేశారు,డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ కోశాధికారి గ్రంధి నానాజీ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీ బీజేపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్ర రెడ్డి సూచించారు,ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు,మోదీ దేశ రక్షణ,అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు.రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు….

కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రా బీసీ సెల్ సెక్రెటరీ బాలు యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తమ ఆరాధ్య కుల దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంతో స్థానిక యువకులు రక్తదానం చేయగా, పలువురు బాలు ప్రయత్నాన్ని అభినందించారు. ఉదయం శ్రీకృష్ణ పూజతో మొదలైన వేడుకలలో చిన్నారులు ప్రదర్శించిన మురళి కోలాటం భక్తులను మంత్రముగ్దలను చేసి విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో ఈ వేడుకల్లో కాట్రేనికోన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు, చెయ్యేరు సొసైటీ అధ్యక్షులు చవటపల్లి శ్రీను, చెయ్యేరు సర్పంచ్ చెల్లి సురేష్, ఉపసర్పంచ్ నారాయణ మూర్తి (సియం), నంద్యాల వెంకన్న బాబు బిజెపి నాయకులు గ్రంధి నానాజీ మట్ట సూరిబాబు మట్ట శివకుమార్ జిల్లా యాదవ్ సంఘం గౌరవ అధ్యక్షులు కోరశిఖ సుబ్రహ్మణ్యం మాస్టారు, మట్టా రాంబాబు, జిల్లా మీడియా సెల్ అధ్యక్షులు కానుబోయిన దుర్గాప్రసాద్, కోరిశిఖ రాము తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

వివాహ వేడుకలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు గల్లా

పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఖమ్మం జిల్లా పరిధిలో ని బోనకల్ మండలం లో గల ఆళ్ళ పాడు లో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవక్ సోదరుని వివాహ కార్యక్రమం లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించారు. వీరి వెంట జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యాం సుందర్ నాయక్, టి సురేష్ , రాఘవ స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

అపార్’ తప్పనిసరి..!

బోర్డ్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్కు ఐడీలను సమర్పించాలి- సీబీఎస్ఈ తాజా నిర్ణయంపై వివాదం – సమాచార భద్రత, గోప్యతపై – నిపుణులు, మేధావుల ఆందోళన న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తీసుకున్న తాజా నిర్ణయం వివాదమవుతున్నది. సీబీఎస్ఈ విద్యార్థులు పది, 12వ తరగతుల బోర్డు పరీక్షలకు నమోదు చేసుకునేటప్పుడు అపార్ ఐడీలను సమర్పించటం తప్పనిసరి చేసింది. ఇప్పుడు ఈ నిర్ణయంపై అందరిలోనూ అనుమానాలు, ఆందోళనలు కలుగుతున్నాయి. ముఖ్యంగా డేటా భద్రత, వ్యక్తిగత గోప్యతకు సంబంధించి తీవ్ర చర్చ నడుస్తున్నది. *అపార్ అంటే..?* ఆధార్ తరహాలో విద్యార్థుల కోసం తీసుకొచ్చిందే అపార్. అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. దీనిని సంక్షిప్త రూపం అపార్. ఇది 12 అంకెలతో ఐడీని కలిగి ఉంటుంది. కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 ద్వారా అపార్ను ప్రవేశపెట్టారు. ఇది విద్యార్థి ఎన్రోల్మెంట్కు అనుసంధానించబడిన ఒక గుర్తింపు సంఖ్య. ఇందులో విద్యార్థికి సంబంధించిన విద్యా వివరాలు ఉంటాయి. అంటే విద్యార్థి ఎల్కేజీలో చేరినప్పటి నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు సంబంధించిన సమాచారం అందులో ఉంటుంది. అంటే ఎడ్యుకేషనల్ స్కోర్స్, విజయాలు, సంబంధిత గణాంకాలు వంటివి ఉంటాయి. ఇది ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ ప్లాట్ఫామ్ డిజిలాకర్ ద్వారా విద్యార్థుల రిపోర్ట్ కార్డులు, రికార్డులను యాక్సెస్ చేయడాన్ని సులభతరం చేస్తుంది.అపార్ ఐడీ నకిలీ విద్యా సర్టిఫికెట్లను అంతం చేస్తుందని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. సీబీఎస్ఈ చర్యపై నిపుణులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఇది గోప్యతకు భంగం కలిగించే ప్రమాదము ఉన్నదని వాదిస్తున్నారు. ఇందుకు వారు ‘ఆధార్’ను ఉదాహరణగా చూపుతున్నారు. ఆధార్ ద్వారా జరిగిన గోప్యత, వ్యక్తిగత సమాచార ఉల్లంఘనలను గుర్తు చేస్తున్నారు. అపార్ ఐడీని తప్పనిసరి చేయటం ద్వారా వ్యక్తిగత గోప్యత, సమాచార భద్రత, స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని ఆరోపిస్తున్నారు. తాజా పరిణామంపై సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ (ఎస్ఎఫ్ఎల్సీ) వ్యవస్థాపకురాలు మిషి చౌదరి స్పందించారు. భారతీయులను ప్రతీరోజూ కొత్త గుర్తింపు పత్రాలను అడుగుతున్నారని తెలిపారు. ‘మొదటగా ఆధార్ అన్నారు, ఇప్పుడు చిన్నారులను అపార్తో ముడిపెడుతున్నారు. తల్లిదండ్రులను వేధిస్తున్నారు. అపార్కు చట్టబద్ధత లేదు’ అని మిషి చౌదరి తెలిపారు. ఇటు నిపుణులు, మేధావులు, తల్లిదండ్రుల నుంచి ఆందోళనలు వెల్లువెత్తుతున్న తరుణంలో సీబీఎస్ఈ ఈ నిర్ణయంపై ఇంకా స్పందించాల్సి ఉన్నది. 2023లో కేంద్రం ప్రారంభించిన ‘వన్ నేషన్, వన్ స్టూడెంట్’ పథకం కింద పాఠశాలలు తమ వార్డుల అపార్ ఐడీలను సృష్టించడానికి తల్లిదండ్రుల సమ్మతిని తీసుకోవాలని విద్యా మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. అపార్ ఐడీని పొందటానికి ఒక విద్యార్థి పేరు, వయస్సు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, ఆధార్ నెంబర్తో సహా తన వ్యక్తిగత వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.