Monday, 11 May 2026

Blog

తిరుపతి

తిరుమల కొండపై పోటెత్తిన భక్తుల రద్దీ — కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు — శ్రీవారి దర్శనానికి 30 గంటలు

భక్తుల సౌకర్యాల కల్పనకు శ్రమిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది — వెలుపల క్యూ లైన్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుమల కొండపై భక్తుల రద్దీ పోటెత్తింది. వరుస సెలవులు రావడంతో శ్రీవారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. అధిక రద్దీ కారణంగా ఎటువంటి టోకెన్లు లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు. స్వామి వారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు సౌకర్యాలు కల్పించే పనిలో టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో భక్తులకు అవసరమైన త్రాగునీరు, మజ్జిగ, పాలు, అన్న ప్రసాదాలను నిరంతరాయంగా అందిస్తున్నారు. మరోవైపు గదులు లభించని భక్తులు ఉచిత వసతి సముదాయాలలో లాకర్లు పొంది సేద తీరుతున్నారు. ఏడుకొండలస్వామి కి తలనీలాలు సమర్పించి మొక్కలు చెల్లించుకునేందుకూ భారీగా క్యూలు ఏర్పడుతున్నాయి. — క్యూలైన్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ : భక్తుల అధిక రద్దీ దృష్ట్యా అకస్మాత్తుగా అధికారులతో కలిసి క్యూ లైన్లును తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఆక్టోపస్ సర్కిల్, నారాయణగిరి షెడ్స్, ఔటర్ రింగ్ రోడ్, శిలాతోరణం సర్కిల్ లోని క్యూ లైన్లు పరిశీలించారు. భక్తుల బందోస్తును ఏర్పాట్లును పరిశీలించి అధికారులకు పలు సూచలను చేశారు. భక్తుల రద్దీని అంచనా వేస్తూ,భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు.ఉదయం నుండి ఇప్పటి వరకు ఎంత మంది భక్తులు వచ్చారు.. రేపు, ఎల్లుండు ఎంత మంది వస్తున్నారు అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ క్యూలైన్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాలు పడుతుండటంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. అదేవిధంగా నాలుగు మాడవీధులు ను కాలినడకన తిరిగి ఏర్పాట్లు పరిశీలించారు. అలాగే ఇతర ప్రాంతాల నుండి శ్రీవారికి సేవ చేసేందుకు వచ్చిన భక్తులతో ఎస్పీ మాట్లాడుతూ క్యూలైన్ లో పరిస్థితి ఫై అడిగి తెలుసుకున్నారు.వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైనా ఎదైన సమస్యలు వస్తే… వేంటనే పోలీసు వారితోపాటు ఇతర అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. సెలవు దినాలు ఎక్కువ రావడం తో భక్తులు అధికసంఖ్యలో వస్తారని, వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట అదనపు ఎస్పీ రామకృష్ణ,తిరుమల డిఎస్పి విజయ శేఖర్, సీఐలు విజయకుమార్, శ్రీ రాముడు, హరిప్రసాద్, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.

కడప

మానవతా సంస్థ ఆత్మీయ కలయుక పలకరింపు

16.8.25 వ తేదీన కడప నగర మున మానవత సంస్థ ఆత్మీయ కలయిక పలకరింపులో భాగంగా మోకాలి ఆపరేషన్ చేయించుకున్న మానవతా సభ్యులు శ్రీ జగ్గా రామకృష్ణ గారిని కలిసి ఆయనను పరామర్శించడంజరిగినది.ఆయనకు ఏదైనా అవసరము వస్తే ఆత్మీయ సహకార కమిటీకి తెలియజేయాలని తెలియజేయాలని చెప్పడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఆత్మీయ సహకార కమిటీ సభ్యులు శ్రీ రాటాల గోపి సెంట్రల్ కమిటీ డైరెక్టర్ మరియు ప్రజా సంబంధాల చైర్మన్ పి సుబ్బరాయుడు కమిటీ డైరెక్టర్ శ్రీ సమ్మెట సత్యనారాయణ,నగర వైస్ ప్రెసిడెంట్ శ్రీ బి సుబ్బరా యు డు నగర సెక్రటరీ ఏ.సుబ్బయ్యపాల్గొన్నారు.పుట్టా.సుబ్రహ్మణ్యం,చైర్మన్,ఆత్మీయ సహకార కమిటీ, కడప నగరం.

కడప

రామచంద్రయ్యను పరామర్శించిన మానవతా సంస్థ సభ్యులు

కడప నగర మానవతా సంస్థ ఆత్మీయ కలయిక పలకరింపులో భాగంగా అనారోగ్యంగా ఉన్న శ్రీ డి రామచంద్రయ్య గారిని కలిసి పరామర్శించడం జరిగినది.ఆయన త్వరగా కోలుకోవాలని మానవతా సంస్థ అభిలాష ఆయనకు ఏదైనా అవసరం వస్తే ఆత్మీయ సహకార కమిటీకితెలియజేయాలని ఆయనకు ధైర్యం చెప్పి రావడం జరిగినది ఈ కార్యక్రమంలో ఆత్మీయ సహకార కమిటీ సభ్యులు శ్రీ సమ్మెట సత్యనారాయణ శ్రీ కె మస్తానయ్య శ్రీ పి సురేంద్రబాబు జి.వెంకటేష్.గార్లుపాల్గొన్నారు.పుట్టా సుబ్రహ్మణ్యం చైర్మన్ ఆత్మీయ సహకార కమిటీ కడప నగరం.

E-పేపర్

పంతగాని నరసింహ ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు:కందుల శివ

నరసింహ ప్రసాద్ అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకుని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయ‌న ఆయురారోగ్యాలతో, ఆనందసంతోషాలతో, విజయాలతో నిండిన దీర్ఘాయుష్షు పొందాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భగవంతుణ్ని కోరుకుంటున్నాము.

అన్నమయ్య

తిమ్మాయపాలెం క్రాస్‌ వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా

చిట్వేలు మండలంలోని రాపూర్ రోడ్‌ నందు తిమ్మాయపాలెం క్రాస్‌: శ్రీశ్రీశ్రీ దత్తగిరి నారాయణ తపోవన అభయాంజనేయ} స్వామి. ఆశ్రమంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి అర్చకులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు, ఆలయానికి తరలి వచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు. కార్యక్రమానికి కోడూరు మండలం వెంకటరెడ్డి పల్లి గ్రామానికి చెందిన శంకరయ్య స్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి భక్తులను ఆశీర్వదించారు. ఆలయ పరిసరాల్లో పిల్లలతో కలిసి భగవద్గీత 18 అధ్యాయాల పారాయణం నిర్వహించబడింది. భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం వడ్డించగా అందరూ మహానందంగా స్వీకరించారు. ఈ వేడుకల విజయవంతమైన నిర్వహణలో ఆలయ పీఠాధిపతి నాగేశ్వరమ్మ, నిర్వాహకులు చంద్రశేఖర్, ఆలయ పెద్దలు పద్నాతమ్మ, వెంకటసుబ్బయ్య, పొలంరాజు, చిన్నపరాజు, చంగల్‌రాజు, సుబ్బారెడ్డి, నాగలక్షమ్మ తదితరులు విశేష సహకారం అందించారు.

అన్నమయ్య

ఆడికృతిక వైభవం – సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఘనోత్సవాలు …..వల్లి–దేవసేన సమేత స్వామివారికి ప్రత్యేకాభిషేకం, అలంకరణ

చిట్వేల్ ఆగస్టు 16 ( పున్నమి ప్రతినిధి) శివ చిట్వేల్ గ్రామంలోని శివాలయంలో ఆడికృతిక శుభసందర్భంగా, శనివారము రోజున. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో. విశిష్టమైన ఉత్సవాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఉదయం వేదఘోషాల నడుమ, అభిషేకము, శాస్త్రోక్తంగా జరిగి, అనంతరం పుష్పాలు, పండ్లు, రత్నాభరణాలతో. అద్భుతమైన అలంకరణ చేసి. స్వామివారిని భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాకారంలో గోపూజ పంచసూక్త ప్రకారంగా స్వామి వారికి పంచామృతం అభిషేకం సకల ద్రవ్యాలతో అభిషేకం వంటి పుణ్యకార్యాలు నిర్వహించబడ్డాయి. ఉత్సవాల్లో దూరదూరాల నుండి తరలి వచ్చిన భక్తులు పాల్గొని దైవానుభూతిని పొందారు. కార్యక్రమాలను ఆలయ పూజారులు పవన్ శర్మ , మరియు సురేంద్ర శర్మ గారు శ్రద్ధాభక్తులతో నిర్వహించగా, నిర్వాహకులు భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి , హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఖమ్మం

అటల్ బిహారి వాజ్ పాయ్ కి నివాళి అర్పించిన పాలేరు బిజెపి శ్రేణులు

ఖమ్మం ఆగష్టు పున్నమి స్టాఫ్ రిపోర్టర్ భారతమాత ముద్దుబిడ్డ , అజాత శత్రువు , దర్శనికుడు భారతీయ జనతా పార్టీ తొలి జాతి అధ్యక్షులు, భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఏడవ వర్ధంతి సందర్భంగా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలో వారిని స్మరిస్తూ వారికి నివాళులర్పించి ఘనంగా వారి వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో పాలేరు శాసన సభ బిజెపి కంటెస్టడ్ అభ్యర్థి నున్నా రవికుమార్, రాష్ట్ర నాయకులు దేవకీ వాసు దేవా రావు తదితరులు పాల్గొన్నారు

ఖమ్మం

అటల్ బిహారి వాజ్ పాయ్ కి నివాళి అర్పించిన పాలేరు బిజెపి శ్రేణులు

ఖమ్మం ఆగష్టు పున్నమి స్టాఫ్ రిపోర్టర్ భారతమాత ముద్దుబిడ్డ , అజాత శత్రువు , దర్శనికుడు భారతీయ జనతా పార్టీ తొలి జాతి అధ్యక్షులు, భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఏడవ వర్ధంతి సందర్భంగా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలో వారిని స్మరిస్తూ వారికి నివాళులర్పించి ఘనంగా వారి వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో పాలేరు శాసన సభ బిజెపి కంటెస్టడ్ అభ్యర్థి నున్నా రవికుమార్, రాష్ట్ర నాయకులు దేవకీ వాసు దేవా రావు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ

శ్రీ కృష్ణాష్టమి వేడుకకు హాజరైన నకిరేకల్ ఎమ్మెల్యే

నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) నకిరేకల్ పట్టణంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా యాదవ సంఘం వారు నిర్వహించిన ఉట్లు కొట్టె కార్యక్రమంకు వచ్చిన నకిరేకల్ నియోజక వర్గం ఎమ్మెల్యే వేముల వీరేశం గారు హాజరైనారు. ఈసందర్బంగా యాదవ సంఘం నాయకులు అడిగిన యాదవ భవన నిర్మాణాన్ని పూర్తి చేయూడానికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. ఈకార్యక్రమంలో పట్టణ మునిసిపల్ చైర్మన్ గారు, సభ్యులు, యాదవ సంఘం నాయకులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

తిరుపతి

20 కేజీ ల గంజాయి పట్టివేత

ఈరోజు శ్రీకాలహస్తిలో ని తొట్టంబేడు పోలీసులకు అందిన సమాచారం మేర తొట్టంబేడు మండలం కొత్త కండ్రిగ గ్రామ సమీపములో గల తెలుగు గంగ కాలవపైన ఇద్దరు వ్యక్తులు సలీం మరియు అల్లా బకాష్ దాదాపు 20 కేజీల గంజాయిని ప్యాకింగ్ చేస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందని,వీరిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగిందని బిఎన్ కండ్రిగ సిఐ తెలిపారు. .

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.