Monday, 11 May 2026

Blog

తిరుపతి

20 కేజీ ల గంజాయి పట్టివేత

ఈరోజు శ్రీకాలహస్తిలో ని తొట్టంబేడు పోలీసులకు అందిన సమాచారం మేర తొట్టంబేడు మండలం కొత్త కండ్రిగ గ్రామ సమీపములో గల తెలుగు గంగ కాలవపైన ఇద్దరు వ్యక్తులు సలీం మరియు అల్లా బకాష్ దాదాపు 20 కేజీల గంజాయిని ప్యాకింగ్ చేస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందని,వీరిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగిందని బిఎన్ కండ్రిగ సిఐ తెలిపారు. .

శ్రీకాకుళం 

బృందావనంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

శ్రీకాకుళం పట్టణం, బృందావనం ఫంక్షన్ హాల్స్ మరియు శ్రీకాకుళం జిల్లా హోటల్స్ అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శివశ్రీ నృత్య కళానికేతన్ శ్రీ రఘుపాత్రుని శ్రీకాంత్ గారి అంతర్జాతీయ నృత్య కళాకారుల బృందం చే శ్రీకృష్ణుని కీర్తిస్తూ పలు కీర్తనలకు సుమారు 30 మంది విద్యార్థులచే ప్రదర్శించటం జరిగింది. తదనంతరం శ్రీ రఘుపాత్రుని శ్రీకాంత్ గారిని నిర్వాహకులు ఘనంగా సత్కరించడం జరిగింది

తిరుపతి

అసాంఘిక కార్యకలాపాలపై నిఘా కెమెరా

ఈరోజు శ్రీకాళహస్తి పట్టణ సబ్ డివిజనల్ అధికారి అయినటువంటి నరసింహమూర్తి ఆధ్వర్యంలో 1 టౌన్ సీఐ గోపి,2 టౌన్ సీఐ నాగార్జున రెడ్డి,బిన్ కండ్రిగ సిఐ తిమ్మయ్య,రూరల్ ఎస్సై నరసింహ,తోట్టంబేడు ఎస్సై బలరాం మరియు పిఎస్ఐలు, సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది మొత్తం విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా శ్రీకాళహస్తి బస్టాండ్ దగ్గర నుంచి వీఎంసి సర్కిల్ మొత్తం నాలుగు మాడవీధులు తిరిగి ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చేయడం జరిగింది.అలాగే డ్రోన్ కెమెరాలతో అటవీ ప్రాంతము మరియు కొండ ప్రాంతాలలో ఉన్నటువంటి అసాంఘిక శక్తులపై నిఘా ఉంచి బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది.

తిరుపతి

అసాంఘిక కార్యకలాపాలపై నిఘా కెమెరా

ఈరోజు శ్రీకాళహస్తి పట్టణ సబ్ డివిజనల్ అధికారి అయినటువంటి నరసింహమూర్తి ఆధ్వర్యంలో 1 టౌన్ సీఐ గోపి,2 టౌన్ సీఐ నాగార్జున రెడ్డి,బిన్ కండ్రిగ సిఐ తిమ్మయ్య,రూరల్ ఎస్సై నరసింహ,తోట్టంబేడు ఎస్సై బలరాం మరియు పిఎస్ఐలు, సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది మొత్తం విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా శ్రీకాళహస్తి బస్టాండ్ దగ్గర నుంచి వీఎంసి సర్కిల్ మొత్తం నాలుగు మాడవీధులు తిరిగి ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చేయడం జరిగింది.అలాగే డ్రోన్ కెమెరాలతో అటవీ ప్రాంతము మరియు కొండ ప్రాంతాలలో ఉన్నటువంటి అసాంఘిక శక్తులపై నిఘా ఉంచి బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది.

చిత్తూరు

అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణ అష్టమి వేడుకలు

సిద్ధాంత ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక పలమనేరు కమిటీ ఆధ్వర్యంలో పలమనేరు పట్టణం మదనపల్లి రోడ్డు రఘువీర రెడ్డి కాలనీ వద్ద నిర్మించి శ్రీ కృష్ణ ప్రతిమ కొలువు తీర్చి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం పూజాది కార్యక్రమాలు అనంతరం కృష్ణ కొలువు వేదిక మదనపల్లి రోడ్ రఘువీర రెడ్డి కాలనీ నుండి జౌళి వీధి మీదుగా బజారు వీధి,ఎద్దుల సంత వీధి రంగబాబు సర్కిల్ వరకు వెళ్ళి బస్ స్టాండ్ మీదుగా తిరిగి మదనపల్లి రోడ్ లో శ్రీ కృష్ణ ప్రతిమ కొలువు వేదిక వద్దకు అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణ ప్రతిమ ఊరేగింపు జరిగింది… జయ కృష్ణ నినాదాల తో, భగవద్గీత శ్లోక ఉచ్చారణ లతో భక్తులు పరవశించి ఊరేగింపు లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో *త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక పలమనేరు కమిటీ అధ్యక్షుడు రెడ్డి భాస్కర్, జ్యోతి, సరళ, రోజా, వింధ్య, హేమంత్ , రెడ్డెమ్మ, రేఖ కళ్యాణి, గౌతమ్, హరిబాబు, రాజేంద్ర తదితరులు పాల్గొనడం జరిగినది.వి కోట అశోక్ బాబు, బంగారు పాళ్యం రేణుక దేవి, వాణీశ్రీ, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఖమ్మం

వరద ప్రాంతాల్లో అధికారుల పర్యటన

పున్నమి డైలీ న్యూస్ ప్రతినిధి ఖమ్మం T.రవీందర్ ఖమ్మం…. మున్నేరు పరివాహక ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్, కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మున్నేరు వరద ప్రవాహం పెరగడంతో లోతట్టు ప్రాంతాల పరిశీలన అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్ వరద ప్రవాహం పై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, కార్పొరేషన్ అధికారులకు కలెక్టర్ ఆదేశం

ఖమ్మం

అస్తవ్యస్యంగా మారిన డబుల్ బెడ్ రూమ్ రోడ్లు

ఖమ్మం పట్టణ కార్పొరేషన్ 59వ డివిజన్లో డబుల్ బెడ్ రూమ్ వెళ్లే దారులు అస్తవ్యస్తంగా ఉండి గుంతలు ఏర్పడి వర్షానికి బురదమయంగా మారి కాలనీవాసులకు ఇబ్బందిగా రహదారులు ఉన్నాయని 59వ డివిజన్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ఎన్నిసార్లు కార్పొరేషన్ కమిషనర్ కు చైర్మన్ కు విజ్ఞప్తులు చేసుకున్న కానీ ప్రజల యొక్క ఆందోళనను ఆవేదనను పట్టించుకోవడం లేదని 591 డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ కందుల రాజేశ్వరి తెలియజేశారు

ఖమ్మం

ఈరోజు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి

పున్నమి డైలీ న్యూస్ ప్రతినిధి ఖమ్మం T.రవీందర్ భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారి వాజ్పేయి గారి వర్ధంతి జిల్లా పార్టీ కార్యాలయంలో మండల నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులుఘనంగా నివాళులు అర్పించడం జరిగింది Ok

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఈదరాడ, సిద్ధార్థ పేట లో పాఠశాలకు టీవీ బహుకరణ

ఆగస్టు 16 పున్నమి ప్రతినిధి: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈదారాడా సిద్ధార్థ పేటలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల, సిద్ధార్థ పేట, ఈదరాడ నందు జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖలో అడిషనల్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్న ముంగండ సత్యనారాయణ తమ అత్తమామలైన కుసుమ వెంకట్రావు, లక్ష్మీకాంతంల జ్ఞాపకార్థం పాఠశాలకు స్మార్ట్ టీవీ ని బహుకరించారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ చుట్టుగుళ్ల లక్ష్మీ రమేష్ చేతుల మీదుగా ప్రధానోపాధ్యాయులు శ్రీరామకృష్ణకు అందించారు. ఈ సందర్భంగా ముంగండ సత్యనారాయణ ని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ కుసుమ ప్రసాద్, గోసంగి సత్య సునేత్ర, బత్తుల నాగరాజు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతి నిధి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో బోనగిరి సుమంగళి ఫంక్షన్ హాల్ నందు వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్ రాధాకృష్ణులని దర్శించుకుని ఎంతో సంతోషించాను రాధాకృష్ణసేవ కార్యక్రమం చాలా అమూల్యమైనది మనసులో చంచలమైన ఆలోచనలకు మనశ్శాంతి కలుగును మరియు అందరు కూడా రాధాకృష్ణుని ఆశీర్వాదంతో సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని అన్నారు కావున ఈ కార్యక్రమంలో రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి నాగభూషణం యాదాద్రి జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు సామల రవీందర్ రాష్ట్ర వైశ్య సత్రాల ట్రెజరర్ బెల్దేవెంకటేష్ జిల్లా వెంకటరమణ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్యాంసుందర్ ఘట్టాన్ని వ్యాపారవేత్త కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు దారిపల్లి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు…

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.