Monday, 11 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ఈసీ విశ్వసనీయతకు పరీక్ష!

ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి: మన దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఎం. ఎస్.గిల్ ఉన్నప్పుడు విదేశీయుల నుంచి ఆయనకు ఒక ప్రశ్న ఎదురైంది. ‘మీరు ప్రకటించే ఫలితాలను పార్టీలన్నీ అంగీకరిస్తాయా?’ అని అడిగినవారికి- ‘భారత ఎన్నికల సంఘం పట్ల ఎప్పుడూ ఎవరూ ఎలాంటి విశ్వాసరాహిత్యాన్నీ ప్రదర్శించలేదు’ అని గిల్ సగర్వంగా సమాధానమిచ్చారు. ఈసీ మీద అంతటి నమ్మకం ఇప్పుడు ఉందా అంటే- రాజకీయ పార్టీలే కాదు, ప్రజల్లో కూడా చాలామంది ‘లేదు’ అనే చెబుతారు. బిహార్ లో ఓటరు జాబితాల నిశిత పరిశీలన (ఎస్ఐఆర్) ప్రహసనం ప్రారంభమయ్యాక- కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై కొన్నేళ్లుగా వ్యక్తమవుతున్న అనుమానాలు ఆందోళనలుగా పరిణమించాయి. ఆ రాష్ట్ర ముసాయిదా ఓటర్ల లిస్టులోంచి తొలగించినవారి వివరాలను ప్రత్యేకంగా వెల్లడించనక్కర్లేదని, జాబితాలో ఎవరినైనా చేర్చకపోవడానికి కారణాలేంటో కూడా చెప్పక్కర్లేదని ఈసీ వాదించడంతో సందేహాలు ఇంకా బలపడ్డాయి. ప్రజలపై ప్రభావం చూపించే నిర్ణయాలను ప్రకటించేటప్పుడు వాటికి సంబంధించిన అన్ని వాస్తవాలనూ బహిరంగపరచాలని సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(సి) నిర్దేశిస్తోంది. పాలనాపరమైన, అర్ధన్యాయ తీర్మానాలకు గల కారణాలేంటో ఆ నిర్ణయాల ప్రభావాలకు లోనయ్యే వ్యక్తులకు వివరించాలని సెక్షన్ 4(1)(డి) స్పష్టీకరిస్తోంది. ప్రజాస్వామ్యానికి ఊపిరులూదే ఇటువంటి జవాబుదారీతనాన్ని కాలదన్నిన ఈసీకి సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు కనువిప్పు కలిగించేవే! బిహార్ ముసాయిదా జాబితా నుంచి తొలగింపునకు గురైన 65 లక్షల మంది వివరాలను బయటపెట్టాలంటూ మొన్న గురువారం సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు విశేషమైనది. ఓటర్ల లిస్టులోంచి తమను ఎందుకు తీసేశారో తెలుసుకోవడం పౌరుల ప్రాథమిక హక్కు, ‘సుప్రీం’ ఉత్తర్వులు దానికి పట్టంకట్టాయి. ఓటింగ్ హక్కును అమూల్యమైనదిగా గతంలో పేర్కొన్న కేరళ హైకోర్టు- సంబంధిత వ్యక్తుల వాదనలను వినకుండా ఎవరి పేర్లనూ ఓటరు జాబితాలోంచి కత్తిరించకూడదని స్పష్టంచేసింది. వ్యక్తిగత అంతరాలకు అతీతంగా పౌరులందరూ ప్రజాస్వామ్యంలో కీలక పాత్రధారులే. కాబట్టి ప్రతి ఒక్కరి ఓటూ విలువైనదే. కండబలంతో, అధికార దుర్వినియోగంతో ఎవరూ ఎన్నికల ప్రక్రియను దారితప్పించకూడదు. ప్రజాభిప్రాయ ప్రకటనను తమకు అనుకూలంగా ప్రభావితం చేయకూడదు. ఈ మేరకు గతంలోనే ఉద్ఘాటించిన న్యాయపాలిక- ఎన్నికలు స్వేచ్చగా సక్రమంగా పూర్తికావడం ప్రజాతంత్రానికి ప్రాణావసరమని పేర్కొంది. ఎలక్షన్లు ఆ విధంగా జరగాలంటే- ముందసలు ఓటర్ల లిస్టులు సక్రమంగా ఉండాలి. వాటిని అలా రూపొందించడంలో ఈసీ ఎప్పటికప్పుడు చేతులెత్తేస్తుండటమే దేశ ప్రారబ్ధం! అన్ని పార్టీలకూ సమదూరంలో ఉంటూ పారదర్శకంగా పనిచేయడం- ఈసీ శిరసావహించాల్సిన సంవిధాన కట్టుబాటు. ఎన్నికల సంఘం చేతల్లో రాజీలేని స్వతంత్రత, నిష్పాక్షికత, నిజాయతీ ఉట్టిపడాలి. ఎన్నికల నిర్వహణకుగానూ తనకు దఖలుపడిన సర్వాధికారాల వినియోగంలో యుక్తాయుక్త విచక్షణతో వ్యవహరించాలి. దురదృష్టవశాత్తు దశాబ్దాలుగా దేశీయంగా అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఓటర్ల లిస్టులోంచి అర్హుల పేర్లు గల్లంతు కావడం, అనర్హులు వచ్చిచేరడం వంటి అక్రమాలు నిర్విఘ్నంగా సాగిపోతున్నాయి. అంగ, అర్థ బలసంపన్నుల క్రీడామైదానాలుగా మన ఎన్నికలు పరువుమాస్తున్నాయి. ఈసీ చుట్టూ ముసురుకుంటున్న వివాదాలు భారత ప్రజాస్వామ్యాన్ని ఇంకా పలుచన చేస్తున్నాయి. నైతిక నియమాలు, శాసన నిబంధనలకు కట్టుబడి విధులు నిర్వర్తించడంలో ఈసీ నిబద్ధతే ఎన్నికల ప్రక్రియ పవిత్రతను పరిరక్షిస్తుంది. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థకు రాజకీయ మకిలి అంటితే మన ప్రజాస్వామ్యం అర్థరహితమై ఆరాచకాలకు ఆలవాలమవుతుంది!

E-పేపర్

జిల్లాలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలినంద్యాల కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు 08514-293903 జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

జిల్లాలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఈదురు గాలులు, మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించిందన్నారు. ఈ మేరకు వర్షాల సహాయక చర్యల నిమిత్తం నంద్యాల కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబరు 08514-293903 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కంట్రోల్ రూమ్ 24-7 ప్రకారం పనిచేస్తుందన్నారు. ఏదేని అనుకోని అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే పైన తెలిపిన కంట్రోల్ రూమ్ నంబరుకు ఫోన్ చేయవచ్చునని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే ఆర్డీవో కార్యాలయాలు, తాసిల్దార్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు నదులు, వంకలు పరివాహ ప్రాంతాలు, అన్ని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, కాలువలకు గండ్లు పడే అవకాశం ఉండొచ్చు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. రైతులు వారికి సంబంధించిన పంటలు, ధాన్యము, పశు సంపదను సురక్షితంగా కాపాడుకునే చర్యలు చేపట్టాలి. ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ప్రమాదకరంగా నీరు ప్రవహించే కల్వర్టుల వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించాలన్నారు. వైద్య సేవలకు అంతరాయం కలగకుండా అన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులను సిద్దంగా ఉంచుకోవాలని వైద్యశాఖాధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఉచిత బస్సులతో ఆటో స్టాండ్లు వెలవెల…అటో డ్రైవర్ మొల్లేటి శ్రీనివాస్ ఆవేదన!

ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి ఉచిత బస్సులతో ఆటో స్టాండ్లు వెలవలాడుతుంది. ఆటో వాలలా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించడంతో ఆ ప్రభావం ఆటోలపై పడింది. ప్రయాణికులతో రద్దీగా ఉండే ఆటో స్టాండ్లు వెలవెలబోయాయి. స్త్రీ శక్తి పథకం ఆటోల యజమానులు, డ్రైవర్లను ఇరుకున పడేసింది. మామిడికుదురు మండలం అప్పనపల్లి లో ఓ ఆటో డ్రైవర్ మొల్లేటి శ్రీనివాస్ ప్రభుత్వనికి మా అటో డ్రైవర్లు కు పూర్తి సహాయం అందించండి అంటూ. ఆటోలు అద్దెకు తీసుకుని తిప్పే వారికి కనీసం అద్దె చెల్లించడానికి కూడా కిరాయి రాని పరిస్థితి నెలకొంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో తమ పరిస్థితి దారుణంగా మారే ప్రమాదం ఉందని, ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని మా పేద బ్రతుకులకు ప్రభుత్వం అండగా ఉండాలి అని మాకు తక్షణమే సహాయం చేయాలి అని అప్పనపల్లి ఆటో డ్రైవర్ మొల్లేటి శ్రీనివాస్ తన ఆవేదన వ్యక్తం చేసాడు.

ఆంధ్రప్రదేశ్

నరసన్నపేటలో సత్యసాయి సేవా సమితి నుంచి గొడుగుల పంపిణీ(నరసన్నపేట – ఆగస్టు 17)

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా సేవా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నరసన్నపేట జోన్‌లోని పిన్నింటిపేట శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం 27 మంది పేదవారికి గొడుగులు ⛱️ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సమితి కన్వీనర్ పొట్నూరు రత్నాకర్ రావు మాట్లాడుతూ – “స్వామి చూపించిన సేవా మార్గంలో మేమంతా ముందుకు సాగుతూ, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తాం” అని తెలిపారు.కార్యక్రమంలో సమితి సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

భక్తి

అమ్మవారి దేవాలయ ల కి పోటత్తిన భక్తులు

ఖమ్మం ఆగష్టు పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి స్టాఫ్ రిపోర్టర్. శ్రావణమాసపు చివరి ఆదివారం కావడం తో ఆదివారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న అమ్మవారి దేవాలయాలకి భక్తులు పోటెత్తారు. అమ్మ వారికి పొంగల్లు నైవేద్యం గా సమర్పించి అలాగే కోళ్ల ను మేకలని అమ్మ వార్లకి బలిచి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మ వారి దయతో అందరు బాగుండాలి అని ఈ సం దర్భముగా పురోహితులు పూజలు చేశారు. ప్రదానం గా ఖమ్మం నగర పరిధిలో ని మారెమ్మ గుడి ఇందిరా నగర్ లోని మైసమ్మ తల్లి గుడి లతో పాటు గా 25మండలాల్లో ఉన్నా అమ్మ వార్ల దేవాలయాలు భక్తులతో కిట కిట లాడాయి.

అన్నమయ్య

కప్పల మరియు మారేళ్ళ వారి వివాహాం కు హాజరై వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్

అన్నమయ్య జిల్లా. ఓబులవారిపల్లె మండలం, ముక్కావారిపల్లె గ్రామ వాస్తవ్యులు శ్రీ కప్పల బాబు – శ్రీమతి రాజేశ్వరి గార్ల కుమార్తె కుసుమ మరియు మారేళ్ళ చిన్నయ్య, ఈశ్వరమ్మ గారి కుమారుడు అనీల్ గారివివాహం ముక్కావారిపల్లె గ్రామం లోని T.T.D. కళ్యాణ మండపము నందు నిర్వహించడం జరిగింది.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం లొ NDA కుటమి నాయుకులు పాల్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు శుభవార్త! ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనం

ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయాలతో దూసుకుపోతుంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. అంతేకాదు సూపర్ సిక్స్ పథకం అమలులో ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు శుభవార్త అందించింది. ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలను అందించాలని నిర్ణయించింది. 70% వైకల్యం ఉన్నవారు..18-45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు.. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ పథకానికి అర్హులు. అర్హత కలిగినవారు అక్టోబర్ 31 లోపు www.apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. గతంలో దరఖాస్తు చేసుకుని ఆమోదం పొందని వారు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రభుత్వం పేర్కొంది. దివ్యాంగులకు త్రిచక్ర బైక్‌లు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలను అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్లీ గిఫ్టెడ్ అండ్ సీనియర్ సిటిజన్స్ కోఆపరేటివ్ సొసైటీ (APDASCAC) మార్గదర్శకాలను విడుదల చేసింది. అర్హత కలిగిన వారు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకానికి అర్హతలు ఇవే 1. ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత నివాసి అయి ఉండాలి. 2. 18 నుండి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులు. 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగి ఉండాలి. 3. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 4. వార్షిక ఆదాయం రూ. 3 లక్షల కంటే తక్కువగా ఉండాలి. 5. లబ్ధిదారుల ఎంపికకు 2 నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 6. సొంత వాహనం ఉన్నవారికి వర్తించదు. 7. గతంలో ఈ పథకం కంద వాహనాలు తీసుకోకూడదు. దరఖాస్తు చేసుకునేటప్పుడు కావాల్సిన అవసరమైన పత్రాలు 1. ఆధార్ కార్డు, 2. జిల్లా వైద్య బోర్డు జారీ చేసిన అర్హత ధృవీకరణ పత్రం. 3. SSC సర్టిఫికేట్ (టెన్త్ సర్టిఫికేట్), 4. SC, ST అయితే కుల ధృవీకరణ పత్రం, 5. వికలాంగుల పూర్తి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్. 6. ఆదాయ ధృవీకరణ పత్రం (01-01-2022 తర్వాత తీసుకోవాలి) 7. బోనఫైడ్ సర్టిఫికేట్ (విద్యార్థి అయితే) 8. ముందుగా వాహనం తీసుకోలేదని మరియు అన్ని వివరాలు సరిగ్గా ఇవ్వబడిందని స్వీయ ప్రకటన. రిజర్వేషన్ మహిళలు – 50% పురుషులు – 50% SC-16% ST -7% జనరల్ – 77% ప్రాధాన్యత 1. PG విద్యార్థులు 2. స్వీయ/వేతనం/జీతం డిగ్రీ హోల్డర్లు చివరి తేదీ: అక్టోబర్ 31 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు విధానం www.apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయండి. చివరి తేదీకి ముందు దరఖాస్తు చేసుకుంటే.. ప్రభుత్వం అర్హతలను తనిఖీ చేసి అర్హుల జాబితాను ప్రకటిస్తుంది.. వారికి మూడు చక్రాల మోటారు వాహనాన్ని అందిస్తారు.

అన్నమయ్య

చిట్వేల్ మండల ప్రజల నుండి పంతగాని నరసింహ ప్రసాద్‌కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

చిట్వేల్, ఆగస్టు 17 : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక అధ్యక్షులు, డైనమిక్ లీడర్, ప్రజా నాయకుడు పంతగాని నరసింహ ప్రసాద్ అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకుని చిట్వేల్ మండల ప్రజలు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కృషి, నాయకత్వం, పార్టీ పట్ల అంకితభావం ప్రజలకు ఆదర్శమని పలువురు అభిప్రాయపడ్డారు. సాంస్కృతిక రంగంలో ఆయన చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొంటూ, భవిష్యత్తులోనూ ఆయన మరింత ఉన్నత స్థాయిలోకి ఎదిగి పార్టీకి, ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. నాయకునిగా ఆయన చూపుతున్న వినయం, ప్రజలతో కలిసిమెలిసి ఉండే స్వభావం మరింత బలాన్ని ఇస్తుందని మండల ప్రజలు అభినందించారు. పంతగాని నరసింహ ప్రసాద్ గారు ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో, విజయాలతో నిండిన జీవితాన్ని గడపాలని అందరూ హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు.

తిరుపతి

గుండెపోటు వచ్చిన భక్తుడిని కాపాడిన తిరుమల వన్ టౌన్ పోలీస్ కానిస్టేబుల్

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చి అకస్మాత్తుగా గుండెపోటుతో కిందపడిన భక్తుడిని సకాలంలో కాపాడి మానవత్వం చాటుకున్నాడు ఒక పోలీస్ కానిస్టేబుల్. వివరాల్లోకెళితే ఆగస్టు 15వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, కంది మండలం, మామిడిపల్లి గ్రామస్తుడు మేడం శ్రీనివాసులు( 61) తన కుటుంబ సభ్యులతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. దర్శన అనంతరం రాత్రి 9:30 గంటలకు లడ్డు ప్రసాదాలు తీసుకొని, లడ్డు కౌంటర్ల వద్ద నుండి మ్యూజియం వైపుకు వెళుతుండగా పడమర మాడా వీధిలో అకస్మాత్తుగా సదరు శ్రీనివాసులు గుండెపోటు వచ్చి కింద పడిపోయారు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న తిరుమల వన్ టౌన్ పోలీస్ కానిస్టేబుల్ గుర్రప్ప గమనించి వెంటనే భక్తుడి వద్దకు చేరుకొని సమయస్ఫూర్తితో 90 సార్లు సిపిర్ చేసి భక్తుడు కొంచెం కోలుకోగా వెంటనే అతనిని అక్కడి నుండి అంబులెన్స్ ద్వారా తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం భక్తుడిని తిరుపతి సిమ్స్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం పంపడం జరిగినది. సిమ్స్ ఆస్పత్రిలో భక్తుడు మెరుగైన చికిత్స పొందినందున ప్రాణాలతో బ్రతికి బయట పడడం, డ్యూటీ డాక్టర్లు అతనిని డిశ్చార్జ్ చేసి వాళ్ళ ఊరికి పంపడం జరిగినది. ఈ సంఘటన పోలీస్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో భక్తుడిని కాపాడినందున భక్తులు మరియు అధికారులు సదరు కానిస్టేబుల్ గుర్రప్పను అభినందించినారు.

తిరుపతి

తిరుమల కొండపై పోటెత్తిన భక్తుల రద్దీ — కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు — శ్రీవారి దర్శనానికి 30 గంటలు

భక్తుల సౌకర్యాల కల్పనకు శ్రమిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది — వెలుపల క్యూ లైన్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుమల కొండపై భక్తుల రద్దీ పోటెత్తింది. వరుస సెలవులు రావడంతో శ్రీవారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. అధిక రద్దీ కారణంగా ఎటువంటి టోకెన్లు లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు. స్వామి వారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు సౌకర్యాలు కల్పించే పనిలో టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో భక్తులకు అవసరమైన త్రాగునీరు, మజ్జిగ, పాలు, అన్న ప్రసాదాలను నిరంతరాయంగా అందిస్తున్నారు. మరోవైపు గదులు లభించని భక్తులు ఉచిత వసతి సముదాయాలలో లాకర్లు పొంది సేద తీరుతున్నారు. ఏడుకొండలస్వామి కి తలనీలాలు సమర్పించి మొక్కలు చెల్లించుకునేందుకూ భారీగా క్యూలు ఏర్పడుతున్నాయి. — క్యూలైన్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ : భక్తుల అధిక రద్దీ దృష్ట్యా అకస్మాత్తుగా అధికారులతో కలిసి క్యూ లైన్లును తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఆక్టోపస్ సర్కిల్, నారాయణగిరి షెడ్స్, ఔటర్ రింగ్ రోడ్, శిలాతోరణం సర్కిల్ లోని క్యూ లైన్లు పరిశీలించారు. భక్తుల బందోస్తును ఏర్పాట్లును పరిశీలించి అధికారులకు పలు సూచలను చేశారు. భక్తుల రద్దీని అంచనా వేస్తూ,భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు.ఉదయం నుండి ఇప్పటి వరకు ఎంత మంది భక్తులు వచ్చారు.. రేపు, ఎల్లుండు ఎంత మంది వస్తున్నారు అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ క్యూలైన్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాలు పడుతుండటంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. అదేవిధంగా నాలుగు మాడవీధులు ను కాలినడకన తిరిగి ఏర్పాట్లు పరిశీలించారు. అలాగే ఇతర ప్రాంతాల నుండి శ్రీవారికి సేవ చేసేందుకు వచ్చిన భక్తులతో ఎస్పీ మాట్లాడుతూ క్యూలైన్ లో పరిస్థితి ఫై అడిగి తెలుసుకున్నారు.వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైనా ఎదైన సమస్యలు వస్తే… వేంటనే పోలీసు వారితోపాటు ఇతర అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. సెలవు దినాలు ఎక్కువ రావడం తో భక్తులు అధికసంఖ్యలో వస్తారని, వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట అదనపు ఎస్పీ రామకృష్ణ,తిరుమల డిఎస్పి విజయ శేఖర్, సీఐలు విజయకుమార్, శ్రీ రాముడు, హరిప్రసాద్, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.