చిట్వేల్: స్థానిక జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో విద్యార్థుల భద్రత కోసం నిర్మించిన ప్రహరీ గోడలో కొంత భాగం వర్షాకాలంలో కూలిపోయి దాదాపు ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు పునర్నిర్మాణ పనులు చేపట్టకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూలిన గోడకు ఆనుకుని ఉన్న మరికొన్ని గోడలు కూడా బలహీనంగా ఉండటంతో ఎప్పుడు కూలుతాయోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే ఒక వర్షాకాలం గడిచినా సమస్య పరిష్కారం కాకపోవడం, మరోసారి వర్షాకాలం సమీపిస్తుండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. పాఠశాల ఆవరణలో ప్రతిరోజూ విద్యార్థుల రాకపోకలు ఉండటంతో ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి కూలిన ప్రహరీ గోడను పునర్నిర్మించడంతో పాటు బలహీనంగా ఉన్న గోడలను పరిశీలించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశంలో ఇకనైనా నిర్లక్ష్యం లేకుండా సంబంధిత అధికారులు తక్షణమే స్థలాన్ని పరిశీలించి, గోడ నిర్మాణ పనులకు చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

విద్యార్థుల భద్రతకు ముప్పు.. కూలిన ప్రహరీ గోడకు మోక్షమెప్పుడు?