Monday, 28 September 2026
  • Home  
  • పాటూరు సచివాలయంలో సిబ్బంది కొరత.. ప్రజలకు, రైతులకు ఇబ్బందులు
- అన్నమయ్య

పాటూరు సచివాలయంలో సిబ్బంది కొరత.. ప్రజలకు, రైతులకు ఇబ్బందులు

పాటూరు సచివాలయంలో సిబ్బంది కొరత VRO, వ్యవసాయ అధికారి అందుబాటులో లేక ప్రజలకు ఇబ్బందులు పాటూరు: పాటూరు గ్రామ సచివాలయంలో VRO, వ్యవసాయ అధికారి అందుబాటులో లేకపోవడంతో ప్రజలు, రైతులు కొన్ని నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు. సంబంధిత సేవలు సకాలంలో అందేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. VRO అందుబాటులో లేకపోవడంతో పట్టాదారు పాస్‌బుక్, అడంగల్, 1-B తదితర రెవెన్యూ సేవలతో పాటు కులం, ఆదాయం, నివాస ధ్రువపత్రాలు, ఓటరు నమోదు వంటి పనుల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా వ్యవసాయ అధికారి అందుబాటులో లేకపోవడంతో రైతులకు ఎరువులు, విత్తనాలు, e-Crop నమోదు, పంటల సాగుకు సంబంధించిన సూచనలు, ఇతర వ్యవసాయ సేవల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు తెలిపారు. ఈ నేపథ్యంలో పాటూరు గ్రామ సచివాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలని, అప్పటివరకు ప్రత్యామ్నాయంగా ఇన్‌చార్జ్ అధికారులను ఏర్పాటు చేసి ప్రజలకు, రైతులకు సేవలు నిరంతరాయంగా అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజల తరఫున సాలిపాటి సుబ్బరాయుడు కోరారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు సమస్యను పరిశీలించి త్వరగా పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పాటూరు సచివాలయంలో సిబ్బంది కొరత

VRO, వ్యవసాయ అధికారి అందుబాటులో లేక ప్రజలకు ఇబ్బందులు

పాటూరు: పాటూరు గ్రామ సచివాలయంలో VRO, వ్యవసాయ అధికారి అందుబాటులో లేకపోవడంతో ప్రజలు, రైతులు కొన్ని నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు. సంబంధిత సేవలు సకాలంలో అందేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

VRO అందుబాటులో లేకపోవడంతో పట్టాదారు పాస్‌బుక్, అడంగల్, 1-B తదితర రెవెన్యూ సేవలతో పాటు కులం, ఆదాయం, నివాస ధ్రువపత్రాలు, ఓటరు నమోదు వంటి పనుల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా వ్యవసాయ అధికారి అందుబాటులో లేకపోవడంతో రైతులకు ఎరువులు, విత్తనాలు, e-Crop నమోదు, పంటల సాగుకు సంబంధించిన సూచనలు, ఇతర వ్యవసాయ సేవల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు తెలిపారు.

ఈ నేపథ్యంలో పాటూరు గ్రామ సచివాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలని, అప్పటివరకు ప్రత్యామ్నాయంగా ఇన్‌చార్జ్ అధికారులను ఏర్పాటు చేసి ప్రజలకు, రైతులకు సేవలు నిరంతరాయంగా అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజల తరఫున సాలిపాటి సుబ్బరాయుడు కోరారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు సమస్యను పరిశీలించి త్వరగా పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.