Saturday, 26 September 2026
  • Home  
  • ఐదేళ్లలో మూడు కీలక పదవులు.. శకుంతల నాగేశ్వరరావు ప్రజా ప్రస్థానం
- అల్లూరి సీతారామరాజు

ఐదేళ్లలో మూడు కీలక పదవులు.. శకుంతల నాగేశ్వరరావు ప్రజా ప్రస్థానం

అనంతగిరి మండల ప్రజా జీవితంలో బాడం శకుంతల నాగేశ్వరరావు ఐదేళ్ల పదవీకాలం ప్రత్యేకంగా నిలిచింది. కివర్ల సెగ్మెంట్‌ ఎంపీటీసీ సభ్యురాలిగా తన ప్రజా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె అనంతరం అనంతగిరి మండల వైస్‌ ఎంపీపీగా,ఆ తర్వాత ఎంపీపీగా బాధ్యతలు నిర్వహించారు. ఒకే ఐదేళ్ల కాలంలో ఎంపీటీసీ, వైస్‌ ఎంపీపీ, ఎంపీపీగా మూడు కీలక ప్రజాప్రతినిధి పదవుల్లో కొనసాగడం ఆమె రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమైన అంశంగా నిలిచింది.ఆయా పదవుల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేసినట్లు ఆమె తెలిపారు. తన ప్రజా ప్రస్థానంలో మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే రేగం మత్యలింగం అందించిన ప్రోత్సాహం, సహకారం తనకు ఎంతో తోడ్పడిందని బాడం శకుంతల నాగేశ్వరరావు పేర్కొన్నారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజలతో ఏర్పడిన అనుబంధమే ముఖ్యమని ఆమె అన్నారు. అధికారిక పదవుల నుంచి విరమిస్తున్న సందర్భంగా తనకు సహకరించిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. “పదవులు మారవచ్చు.. కానీ ప్రజలతో ఏర్పడిన అనుబంధం, వారి ఆదరాభిమానాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి” అని ఆమె పేర్కొన్నారు. ఐదేళ్లలో మూడు పదవులు నిర్వహించిన బాడం శకుంతల నాగేశ్వరరావు ప్రజా ప్రస్థానం అనంతగిరి మండల రాజకీయాల్లో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది.

అనంతగిరి మండల ప్రజా జీవితంలో బాడం శకుంతల నాగేశ్వరరావు ఐదేళ్ల పదవీకాలం ప్రత్యేకంగా నిలిచింది. కివర్ల సెగ్మెంట్‌ ఎంపీటీసీ సభ్యురాలిగా తన ప్రజా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె అనంతరం అనంతగిరి మండల వైస్‌ ఎంపీపీగా,ఆ తర్వాత ఎంపీపీగా బాధ్యతలు నిర్వహించారు.
ఒకే ఐదేళ్ల కాలంలో ఎంపీటీసీ, వైస్‌ ఎంపీపీ, ఎంపీపీగా మూడు కీలక ప్రజాప్రతినిధి పదవుల్లో కొనసాగడం ఆమె రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమైన అంశంగా నిలిచింది.ఆయా పదవుల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేసినట్లు ఆమె తెలిపారు.

తన ప్రజా ప్రస్థానంలో మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే రేగం మత్యలింగం అందించిన ప్రోత్సాహం, సహకారం తనకు ఎంతో తోడ్పడిందని బాడం శకుంతల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

పదవులు శాశ్వతం కాదని, ప్రజలతో ఏర్పడిన అనుబంధమే ముఖ్యమని ఆమె అన్నారు. అధికారిక పదవుల నుంచి విరమిస్తున్న సందర్భంగా తనకు సహకరించిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

“పదవులు మారవచ్చు.. కానీ ప్రజలతో ఏర్పడిన అనుబంధం, వారి ఆదరాభిమానాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి” అని ఆమె పేర్కొన్నారు.

ఐదేళ్లలో మూడు పదవులు నిర్వహించిన బాడం శకుంతల నాగేశ్వరరావు ప్రజా ప్రస్థానం అనంతగిరి మండల రాజకీయాల్లో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.