వడ్డీ పాలెంలో తాగునీటి కష్టాలు
బీఎన్ కండ్రిగ మండలం కుక్కురాజకం పరిధిలోని వడ్డీపాలెంలో రెండు వారాలుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామానికి నీరు అందించే పంచాయతీ మోటార్ కాలిపోయినా మరమ్మతులు చేపట్టలేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.
మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మోటార్ మరమ్మతులు చేసి నీటి సరఫరా పునరుద్ధరించాలని కోరారు. లేకుంటే నిరసన చేపడతామన్నారు.



