బసవరాజు పాలెం సెప్టెంబర్ 25 పున్నమి నెల్లూరు జిల్లా కో ఆర్డినేటర్ విజయ్
ఆత్మకూరు మండలం మహిమలూరు పంచాయతీ పరిధిలోని బసవరాజుపాలెం గ్రామంలో గత వారం రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా నెలకొంది. గ్రామానికి సక్రమంగా నీటి సరఫరా జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం మహిళలు, వృద్ధులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సమస్యపై సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపలేదని వారు ఆరోపిస్తున్నారు. రోజువారీ అవసరాలకు కూడా నీరు అందకపోవడంతో గ్రామంలో పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయంగా , సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వేసవి తరహాలో నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


